“ముక్కు మూసుకుంటే ముక్తి లభిస్తుంది "" ,
“ కళ్ళు మూసుకుంటే కైవల్యం సిద్ధిస్తుంది ” ,
ఇలాంటి మాటలు వినడానికి బానే ఉన్నా, నమ్మడానికి కష్టంగానూ, ఆచరించడానికి అసాధ్యంగానూ అనిపిస్తాయి. సద్గురు ' ఇన్నర్ ఇంజినీరింగ్, అలాంటి అర్థంకాని ఆధ్యాత్మికతని బోధించదు. ఉన్నచోటనే ఉండి ఉన్నత స్థానానికి చేరుకోగలిగే జ్ఞానాన్ని అందిస్తుంది. సవివరంగా – సశాస్త్రీయంగా - సోదాహరణంగా, ఆచరణ యోగ్యమైన యోగ సాంకేతికతని, అరటిపండు వలిచి చేతికిచ్చిన చందంగా మన ముందుంచుతుంది. ఆనందాన్ని కొనుక్కునే స్థితిలో ఉన్న మా తరాన్ని ఆనందాన్ని కనుక్కునే స్థితికి తీసుకు వెళుతుంది. - శ్రీ అనంత శ్రీరామ్ గారు ప్రముఖ కవి & గేయ రచయిత.
యోగి, ఆత్మజ్ఞాని, దార్శనికుడు, ఈ తరం గురువు అయిన, సద్గురు, విప్లవాత్మకమైన ఈ పుస్తకంలో ఆధ్యాత్మికత, యోగాలతో తన అనుభవాన్ని జోడించి ' ఇన్నర్ ఇంజనీరింగ్ ' అనే సరికొత్త పరిణామాత్మకమైన భావనను తీసుకు వచ్చారు. అనేక సంవత్సరాల కృషితో ఆయన రూపకల్పన చేసిన ఈ శక్తిమంతమైన సాధన - శరీరం , మనస్సు, బాహ్య అంతర్గత శక్తులను ఒకే దిశలోకి తీసుకు రావడం ద్వారా - అంతులేని శక్తిని, అవకాశాలను అందిస్తుంది.
'ఇన్నర్ ఇంజనీరింగ్' సుఖ, సంతోషాలను చేకూర్చుకోవడానికి మీదైన సాఫ్ట్ వేర్.