చాలా సమాజాలలో మరణం అనేది (చర్చలకు) నిషిద్ధ విషయం. మరణం గురించి మన అవగాహన అంతా తప్పుడు అవగాహనే అనుకోండి, అప్పుడేమవుతుంది? మరణమనేది మనమనుకొన్నట్లు ఘోరవిప్పత్తేమీ కాదనుకోండి. అది కూడా జీవితంలో ముఖ్యభాగమే అనుకోండి ... అంతేకాదు, మరణమనే క్రియలో మనం ఈ ప్రాపంచిక చక్రభ్రమణానికి అతీతులమయ్యేందుకు అవలంబించదగిన కిటుకులెన్నో ఉన్నాయి అనుకోండి, అప్పుడేమవుతుంది? మొట్టమొదటిసారిగా, ఒకాయన సరిగ్గా ఈ మాటే చెప్తున్నారు!
అసదృశమైన ఈ శాస్త్ర తుల్యమైన పుస్తకంలో, సద్గురు మరణం గురించి సాధారణంగా ఎవరూ మాట్లాడని లోతైన అంశాల గురించి విడమర్చి చెప్తున్నారు. ఆ వివరణలలో ఆయన తన ఆధ్యాత్మిక అనుభవాలను కూడా విస్తృతంగా ఉటంకిస్తున్నారు. ఒక వ్యక్తి తన మృత్యువు కోసం తనే చేసుకోగల సన్నాహాలను గురించీ, ఒక వ్యక్తి మరణ ఘడియలలో అతడికి మనం చేయగల సహాయం గురించీ, మరణించిన వాళ్ళకు వాళ్ళ మరణానంతర ప్రస్థానంలో కూడా మనం అందించగల తోడ్పాటు గురించి ఆయన ఆచరణీయమైన విషయాలనెన్నింటినో విశద పరుస్తున్నారు.
ఆస్తికులు గానీ నాస్తికులు గానీ, భక్తులుగానీ అజ్ఞేయులు గానీ, పరిణతి చెందిన సాధకులు గానీ బహు సామాన్యులు గానీ ఒక్క మాటలో చెప్పాలంటే చావును తప్పించుకోలేని వారందరూ చదవవలసిన పుస్తకం ఇది.
‘మరణం’ పుస్తకం గురించి సద్గురు మరింత వెల్లడిస్తున్నారు. ఆ పుస్తకంలో ముక్కుసూటిగా మాట్లాడే విధానం ఎంతో కలత కలిగించి తీరుతుందని కూడా వివరిస్తున్నారు