జ్ఞాని సన్నిధి
జీవించడమే ఎంతో ప్రయాసతో కూడిన పనిగా ప్రజలు చూస్తున్న ఈ నూతన శతాబ్దంలో, మీకు కావలసిన రీతిలో, ఎంతో అతిశయంగా, ఏ బాధా లేకుండా జీవించే ఒక కొత్త అవకాశానికి సద్గురు నాంది పలుకుతున్నారు. జ్ఞాని, యోగి, మార్మికులు అయిన సద్గురు, ఈ పుస్తకంలో పాఠకునికి జీవితం గురించి హేతుబద్ధమైన వివరణ ఇస్తూనే, తమను తాము తెలుసుకోవడానికి, సృష్టి ఏకత్వాన్ని తెలుసుకోవడానికి, హేతువాద ఆలోచనలకు అతీతంగా ముందుకు పోవడానికి ప్రోత్సహిస్తారు.
‘‘జీవితం మిమ్మల్ని ఏ విధంగానూ బాధ పెట్టకుండా, మీకు ఏ విధమైన గాయాలూ మిగల్చకుండా, మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా జీవించవచ్చు. అందరూ ఈ విధంగా జీవించేలా చేయడానికే మా కృషి అంతా’’
‘‘నాతో ఓ క్షణం పాటైనా చిత్తశుద్ధితో ఎవరైనా కూర్చుంటే – వారు ప్రభావితం కాకుండా ఉండలేరు’’