హిమాలయ రహస్యాలు
ప్రతి సంవత్సరం ఈశా మెడిటేటర్సు కొందరు హిమాలయ యాత్రకు బయలుదేరతారు. సమకాలీన ప్రపంచంలో అతి ప్రముఖ గురువుగా అనేక
మందిచే కొనియాడ బడుచున్న జ్ఞాని, సద్గురు జగ్గి వాసుదేవ్ వారితో ప్రయాణం చేసేవారు.
వారితో ప్రయాణం చేయలేకపోయిన వారికి ఈ పుస్తకం. ఆశ్చర్యకరమైన, అద్భుతమైన ఆ ప్రయాణాన్ని సద్గురు మాటల ద్వారా ప్రయాణం
చేయడానికే ఆ పుస్తకం. ఆయన బోధనలు, సంబాషణల కలబోత ఈ పుస్తకం.
ఈ పుస్తకం కేవలం హిమాలయాల గురించే కాదు, అదే సమయంలో హిమాలయాలు లేకుండా ఈ పుస్తకం ఉండేది కాదు. ఈ పర్వతాలు ఒక
అంశంగా, ఒక విషయంగా, ఈ పుస్తకంలో ఎంతో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అవి లేకుండా ఈ పుస్తకంలోని కొన్ని ప్రశ్నలు అసలు అడగబడేవి
కావు. ప్రశ్నలకు కొన్ని సార్లు అవే కారణం అనిపించక పోయినా, వాటి ఉనికిని చూపుతూనే ఉంటాయి, ఈ పుస్తకానికి తామే ఆధారం
అవుతాయి.