ఆషాఢ మాసంలో (జూలై-ఆగస్టు) ఉత్తరాయనం తర్వాత వచ్చే మొదటి పౌర్ణమిని గురు పూర్ణిమ అంటారు. ఆదియోగి లేదా మొదటి యోగి అయిన శివుడు, ప్రసిద్ధ సప్త ఋషులైన తన మొదటి ఏడుగురు శిష్యులకు మొట్టమొదటి సారి యోగ శాస్త్రాలను అందించడాన్ని, ఈ పవిత్రమైన రోజు సూచిస్తుంది. ఆ విధంగా, ఆదియోగి ఈ రోజున ఆది గురువు లేదా మొదటి గురువు అయ్యాడు. సప్తఋషులు ఈ జ్ఞానాన్ని ప్రపంచమంతటా తీసుకువెళ్లారు; నేటికీ, ఈ గ్రహం మీద ప్రతి ఆధ్యాత్మిక ప్రక్రియ ఆదియోగి సృష్టించిన జ్ఞానమూలాల నుండి తీసుకోబడిందే.
సంస్కృతంలోని "గురు" అనే పదాన్ని "చీకటిని తొలగించేవాడు" అని అనువదించవచ్చు. ఒక గురువు సాధకుడి అజ్ఞానాన్ని పోగొట్టి, అతనిలోని సృష్టి మూలాన్ని అతను అనుభూతి చెందేలా చేస్తాడు. గురు పూర్ణిమ రోజు సాంప్రదాయకంగా సాధకులు గురువుకు తమ కృతజ్ఞతలు సమర్పించి, ఆయన ఆశీర్వాదాలను పొందే సమయం. గురు పూర్ణిమ యోగ సాధన మరియు ధ్యాన సాధనకు కూడా ప్రత్యేకించి ప్రయోజనకరమైన రోజుగా పరిగణించబడుతుంది.
మొదటి గురువు ఆవిర్భవించిన రోజు మరియు కాలాతీతమైన యోగ శాస్త్రం యొక్క ప్రసారం ప్రారంభమైన రోజును, భారతదేశంలో ఎల్లప్పుడూ గురుపూర్ణిమగా జరుపుకుంటారు. మానవ చరిత్రలో మొట్టమొదటిసారిగా, ఈ రోజున, ఆదియోగి అయిన శివుడు - మానవ జాతికి, ప్రకృతి నిర్దేశించిన పరిమితులను అధిగమించే అవకాశాన్ని తెరిచాడు. సద్గురు మాటల్లో, “మానవాళి చరిత్రలో మొట్టమొదటిసారిగా, ఈ రోజున, మానవులకు - తాము పరిమితమైన జీవం కాదని, తాము కృషి చేసేందుకు సిద్ధంగా ఉంటే, ఉనికిలోని ప్రతి తలుపూ తెరుచుకుంటుందని గుర్తు చేయడం జరిగింది.” మరింత తెలుసుకోండి
ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొనండి
మా లైవ్ వెబ్‌స్ట్రీమ్ ద్వారా గురు పూర్ణిమ వేడుకలకు మాతో చేరండి మరియు సద్గురుతో సత్సంగంలో పాల్గొనండి.
గురు పూర్ణిమ రోజున నేను నా వ్యవస్థలో ఒక రకమైన సమన్వయం అనుభూతి చెందుతాను, అది నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది.
గురు పూర్ణిమ నా సాధనపై దృష్టి కేంద్రీకరించడానికి ఇంకా సద్గురు మార్గదర్శకత్వంలో నా ఉనికి మూలాలను కొంచెం లోతుగా తెలుసుకోవడానికి ఒక శక్తిమంతమైన అవకాశంగా నిలిచింది.
గురు పూర్ణిమ తర్వాత, నేను ప్రతిదాని పట్ల మరియు ప్రతి ఒక్కరి పట్ల చాలా సన్నిహిత భావాన్ని అనుభూతి చెందాను, ఇంకా మాటల్లో చెప్పలేని ఆనందాన్ని అనుభూతి చెందాను!