చక్కటి నిద్ర కోసం 6 చిట్కాలు

సద్గురు: ఒకానొక రోజున మీరు నిద్రలేవగానే ఏ కారణం లేకుండానే మీకు చికాకుగా అనిపించడాన్ని గమనించారా ? ఇలా సంవత్సరంలో కేవలం రెండు లేదు మూడు సార్లు జరిగినా సరే, మీరు నిద్రపోయే ముందు కొన్ని పనులు తప్పకుండా చెయ్యాలి. అది చాలా ముఖ్యం.

మీరు నిద్రలో ఎరుక లేకుండానే, ఎన్నో సానుకూల అంశాలను లేదా ప్రతికూల అంశాలను పోదిగేలా చేయవచ్చు. మీరు నిద్రించేటప్పుడు, ప్రియమైన విషయాలను లేదా అప్రియమైన విషయాలను ఎటువంటి అంతరాయం లేకుండా చాలా సమర్ధవంతంగా పోదిగేలా చేయవచ్చు. మీరు వాటిని పగలు కూడా పోదిగేలా చేయవచ్చు. కానీ పగలు ఎన్ని ఎక్కువ అంతరాయాలు ఉంటాయంటే, ఇక అది సమర్ధవంతంగా జరగదు. కానీ మీకు ఒక నిర్దిష్ట విధంగా నిద్రలోకి జారుకునే అలవాటు ఉంటే, ఉదయాన్నే అసలు ఏ కారణం లేకుండానే, చెప్పలేని చిరాకుతో నిద్రలేస్తూ ఉంటే, దానర్ధం మీరు రాత్రి పూట చెడ్డ గుడ్లను చాలా సమర్ధవంతంగా పోదుగుతున్నారు అని.

ఇది కేవలం మానసిక కలత గురించి మాత్రమే కాదు, కాలక్రమంలో అది చాలా పెద్ద శారీరిక సమస్యలను కలగజేస్తుంది. వీటిని మీ జీవితం నించి తీసివేయటం ఎంతో ముఖ్యం. కాబట్టి మీరు నిద్రపోవటానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి.

చిట్కా 1: స్నానం చేయండి

ఎప్పుడూ కూడా, నిద్రపోయేముందు స్నానం చెయ్యండి. అది చాలా మార్పు తెస్తుంది. చలికాలంలో చన్నీళ్ళ స్నానం కష్టం కావచ్చు. అందుకే గోరువెచ్చని నీళ్ళతో చెయ్యండి, అంతేగానీ రాత్రుళ్ళు వేడి నీళ్ళతో స్నానం చెయ్యకండి.

చన్నీటి స్నానం మిమ్మల్ని చురుకుగా ఉంచుతుంది. మీకు ఒక పావుగంట లేదా అరగంట తరవాత నిద్రపట్టచ్చు, కానీ మీరు మరింత చక్కగా నిద్రపోతారు, ఎందుకంటే స్నానం కొన్ని విషయాలను తీసేస్తుంది. స్నానం చేసినప్పుడు, మీరు తీసేస్తుంది కేవలం మీ చర్మం పైన ఉన్న మలినాన్ని మాత్రమే కాదు. మీకు వొత్తిడిగా ఉన్నప్పుడు ఇంకా ఆందోళనగా ఉన్నప్పుడు, స్నానం చేసిన తరువాత, మీకు దాదాపు ఒక బరువు దింపేసిన భావన కలుగుతుంది, గమనించారా? ఇది కేవలం మీ చర్మాన్ని శుభ్రం చేసుకోవడం మాత్రమే కాదు. మీ శరీరం మీద నించి నీరు ప్రవహించినప్పుడు, ఎన్నో విషయాలు జరుగుతాయి. ఈ స్నానం అనేది ఒక చిన్నపాటి భూతశుద్ధి. ఎందుకంటే వాస్తవానికీ మీ శరీరంలో డబ్భై శాతం నీరే. కాబట్టీ, మీరు దానిపై నీటిని ప్రవహింపజేస్తే, చర్మం శుభ్రం అవ్వడానికి మించి, ఒక రకమైన శుద్ధి జరుగుతుంది.

చిట్కా 2: తిన్న వెంటనే పడుకోకండి

మీరు మాంసం ఇంకా ఇతర రకాల ఆహారాలు తీసుకుంటున్నట్లయితే, నిద్రపోవడానికి కనీసం మూడు నాలుగు గంటల ముందు తినడం ఉత్తమం. అప్పుడు జీర్ణం పూర్తి అవుతుంది. పడుకునే ముందు కొన్ని నీళ్ళు తాగి పడుకుంటే, మీ సమస్య తీరిపోవటం మీకే తెలుస్తుంది.

చిట్కా 3: దీపం వెలిగించండి

మీరు చేయగల మరొక విషయం ఏమిటంటే, ఒక సేంద్రియ నూనెతో దీపం వెలిగించండి. కాటన్ వొత్తు(దూదితో చేసినది)ని ఉపయోగించండి, వేరేవి వాడవద్దు. అవిశ గింజల నూనె, రైస్ బ్రాన్ నూనె, నువ్వుల నూనె, ఆలివ్ నూనె, లేదా మరేదైనా సేంద్రియ నూనెను, ఇంకా కాటన్ వొత్తిని వాడొచ్చు. మీరు పడుకునే గదిలో ఎదో ఒక చోట, ఒక చిన్న దీపం పెట్టండి. అప్పుడు ఈ నిద్ర సమస్యలు అన్నీ పూర్తిగా మాయమయిపోవడాన్ని మీరే చూస్తారు.

చిట్కా 4: సమయం తరిగిపోతుందని గుర్తుంచుకొండి

మీకు మరణం ఉంది అని గుర్తు పెట్టుకోండి. కేవలం మాటల్లో కాదు, ఇప్పటికిప్పుడు మీరు చనిపోయే అవకాశం ఉందని నిజంగా గ్రహించండి. మీకు దీర్ఘాయుశ్శు కలగాలని నేను దీవిస్తాను, కానీ ఇప్పటికిప్పుడు మీరూ, నేను చనిపోయే అవకాశం ఉంది.

మీరు నిద్రపోయే ముందు, మంచాన్ని మీ మరణ శయ్య అనుకుని, మీరు ఇంకొక్క నిమిషం మాత్రమే బతుకుతారన్న ఆలోచనతో మంచం మీద కూర్చోండి.

ఈ విషయం మీ ఎరుకలో ఉంచుకోండి. ఇదేదో భయాన్ని సృష్టించడానికో లేక మృత్యుభయం కలిగించటానికో కాదు, కేవలం సత్యాన్ని తెలుసుకోవటానికి మాత్రమే. “నాకు నిజంగా మరణం ఉంది, నాకున్న సమయం చాలా పరిమితమైనది" అన్నది మీరు గ్రహిస్తే, మీకు కోపపడడానికో, ఎవరితోనో గొడవ పడటానికో లేదా మీకు నిజంగా ముఖ్యం కాని ఇంకేదో పని చేయటానికో సమయం ఉండదు. “మీకు మరణం ఉంది" అన్న ఎరుకతో మీరు ఉంటే, మీ జీవితంలో మీకు ఏదైతే విలువైనదో, కేవలం అదే చేస్తారు.

మీరు నిద్రపోయే ముందు, మంచాన్ని మీ మరణ శయ్య అనుకుని, మీరు ఇంకొక్క నిమిషం మాత్రమే బతుకుతారన్న ఆలోచనతో మంచం మీద కూర్చోండి. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. మీరు ఇవాళ ఏమైతే చేసారో, అది విలువైనదేనా అని పరిశీలించండి. ఈ ఒక్క చిన్న పని చేసి చూడండి. ఇక ఆ సమయం నిజంగా ఆసన్నమైనప్పుడు, మీరు మరణశయ్య మీద ఉంటారో, లేక ఆస్పత్రిలో అన్ని రకాల ట్యూబులతో పడుకుని ఉంటారో, ఎవరికి తెలుసు? కాబట్టి ప్రతీరోజూ, ఇలా మరణశయ్య మీద కూర్చొని "ఈ రోజు, ఈ ఇరవైనాలుగు గంటలు నేను నిర్వహించిన విధానం, ఇప్పుడు నేను చనిపోతున్నాను కాబట్టి, అది విలువైనదేనా?" అని వెన్నక్కు చూసి పరిశీలించడాన్ని ఆనందించండి.

చిట్కా 5: విషయాలను పక్కన పెట్టండి

పడుకునే ముందు మీరందరూ ఈ పని చెయ్యాలి. మీరు నిద్రలోకి వెళ్ళే ముందు ఆఖరి మూడు నిమిషాలు, మీరు పోగు చేసుకున్నవన్నీ- ఈ శరీరం, బుర్రలో ఆలోచనలు, చిన్న విషయాలు. చిన్న విషయాలను వదిలేయకండి. చిన్న విషయాలే నిజానికి పెద్ద విషయాలు. చాలా మంది వాళ్ళ దిండుని దాచుకుని ఉంచుకోవటం నేను చూశాను. వాళ్ళకది చాలా ముఖ్యం తెలుసా మీకు! మీ దిండు, మీ చెప్పులు, మీకు బంధాలుంటే అవి, పోగుచేసుకున్న అన్నిటినీ పక్కన పెట్టండి.

మీరు ఆ స్థితిలో నిద్రపోతే, మీరు మరింత వెలుగుతో మరింత శక్తితో మీరు ఊహించినదానికంటే ఎక్కువ సంభావనలతో నిద్రలేస్తారు. కేవలం ఒక జీవంలా నిద్రపొండి. ఒక మగవాడిగానో, ఒక స్త్రీ గానో, దానిలాగో దీనిలాగో కాదు. అంతా వదిలేయండి.

చిట్కా 6: ఉత్తరానికి తల పెట్టి పడుకోకండి

రాత్రి పూట మీరు ఉత్తరానికి తల పెట్టి బల్లపరుపుగా పడుకుంటే, అప్పుడు నెమ్మదిగా రక్తం మీ మెదడు వైపుకు లాగబడుతుంది. తలలో రక్తప్రసరణ మరీ ఎక్కువగా ఉన్నప్పుడు, మీరు ప్రశాంతంగా నిద్రపోలేరు. మీ తలలో ఏదైనా సహజంగానే బలహీనంగా ఉన్న అంశాలు ఉంటే, లేదా మీరు వయసు పైబడినవారైతే, మీరు నిద్రలోనే చనిపోయే ఆస్కారం ఉంది. మీ మెదడులో రక్తనాళాలు వెంట్రుక మందంలో ఉన్నచోటికీ ఎక్కువ రక్తం ప్రవహించేలా ప్రసరణ కావడం వల్ల, తలలో రక్తస్రావం జరగచ్చు.

గ్రహం యొక్క అయస్కాంత శక్తి కారణంగా కొంత రక్తం అదనంగా నెట్టబడుతుంది. మీరు నిట్టనిలువుగా ఉన్నప్పుడు, అలా జరగదు. మీరు బల్ల పరుపుగా పడుకున్న మరు క్షణమే, ఆ శక్తి ప్రభావం తలపై తీవ్రంగా ఉంటుంది. ఇది కేవలం ఉత్తర గోళంలోనే వర్తిస్తుంది. మీరు ఆస్ట్రేలియా వెళితే, మీరు తలని దక్షిణం వైపు పెట్టకూడదు. మీరు భారతదేశంలో ఉంటే, తల ఉత్తరం వైపు పెట్టకూడదు. మరే వైపైనా పెట్టుకోవచ్చు పరవాలేదు.

ప్రశ్న: నిద్రలో నాకు చాలా దృశ్యాలు కనిపిస్తుంటాయి. మీరు దాని గురించి మాట్లాడగలరా?

\సద్గురు: ఒకసారి, ఒక దొంగ దొంగతనం చేస్తుండగా పట్టుబడ్డాడు, దానితో అతన్ని కోర్టుకు తీసుకువెళ్లారు. అతగాడు చూడటానికి బాగానే కనబడుతుండటంతో, జడ్జి "నీ దగ్గర కావలసినంత ఉంది, కానీ ఎందుకు వేరే వాళ్ళ దగ్గర దొంగతనం చేస్తున్నావు?" అని అడిగాడు. దానికి ఆ దొంగ ఇలా అన్నాడు, "సరే, మీకు తెలుసు కదా, జ్ఞానులు ఎప్పుడూ చెప్తూనే వుంటారు, "మనిషి దగ్గర ఎంత ఉన్నా, అతనికి ఇంకా కావాలి". దానికి జడ్జి దొంగ వైపు చూసి, "సరే, నీకు పదేళ్ళ జైలు శిక్ష వేస్తున్నాను, ఇంకా ఎక్కువ కావాలంటే చెప్పు" అన్నాడు.

కనీసం నిద్రలో అయినా, ఇంకా ఏదో కావాలని చూడకండి. మీరు మెలకువగా ఉన్నప్పుడు కూడా, మరింత వెతకకుండా - ఊరకే అలా ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు అది మీకు సాధ్యం కాకపోతే, కనీసం నిద్రలో అయినా, ఎక్కువ అడగవద్దు – కేవలం నిద్రపోండి. మీరు నిద్రను సార్థకమైన ప్రక్రియగా చేయవచ్చు, తద్వారా మీకు తక్కువ నిద్ర సరిపోతుంది. మీరు సంపూర్ణ విశ్రాంతితో నిద్రపోతే, శరీరంలో జన్యు వ్యక్తీకరణ ఇంకా ఇతర ప్రక్రియలు మరింత వేగంగా, మరింత సమర్థవంతంగా జరుగుతాయి. అంటే మీరు త్వరగా మేల్కొంటారు.

మీరు మెలుకువలో అసమర్థంగా ఉంటే అది మంచిది కాదు, కానీ మేము మిమ్మల్ని భరిస్తాము. కానీ మీరు నిద్రలో కూడా అసమర్థులైతే, మరణం మాత్రమే సమాధానం అవుతుంది, ఎందుకంటే మీరు అసమర్థంగా ఉండలేని ఏకైక విషయం అదే. మీరు చనిపోయినప్పుడు, చనిపోతారు. మీరు ఊరికే అలా నిద్రపోవడం నేర్చుకుంటే, మెలుకువలో “ఊరకే అలా ఉండడం” అనేది తదుపరి అడుగు అవుతుంది.

నిద్ర అనేది మీరు, శబ్ద ప్రపంచానికి ఇంకా నిశ్శబ్ద ప్రపంచానికి మధ్య ఉండే అంచున ఉండే స్థితి, కానీ మీరు ఎరుకలో ఉన్నప్పుడు మాత్రమే నిశ్శబ్ద ప్రపంచంలోకి వెళ్ళగలుగుతారు. ఎరుక లేకండా, మీరు శబ్దాలు ఇంకా రూపాల ప్రపంచం గుండా వెళ్ళవచ్చు, కానీ ఎరుక లేకుండా మీరు ఎటువంటి ప్రకంపనలు లేని, ఏ రూపాలు లేని నిశ్శబ్ద ప్రపంచంలోకి వెళ్ళలేరు.

నిద్ర నాణ్యతను ఎలా మెరుగుపరచాలి?

మనం నిద్రను, మనలోని జాగృతి మేల్కొలుపు కోసం, ఇంకా వాస్తవం అయిన అంతటితో ఒకటి కావడం కోసం, ఒక వేదికగా ఉపయోగించాలనుకుంటున్నాము – అంతేగానీ జడంగా అవడానికో, లేదా నిర్జీవంగా అవడానికో, లేక వాస్తవికతకి దూరంగా వెళ్ళాడనికో ఉపయోగించాలనుకోవడం లేదు. నిద్ర నాణ్యతను మెరుగుపరచడం అంటే రాయిలాగా నిద్రపోవడం కాదు. కానీ వాస్తవానికి, ఒక రాయి తప్పు ఉదాహరణ, ఎందుకంటే నా అనుభవంలో, రాళ్ళు చాలా సజీవంగా ఉన్నాయి - చాలా మంది మానవులకన్నా అవి చాలా సజీవంగా ఉన్నాయి. "దుంగ లాగా నిద్రపోవడం" అనేది ఇంకొంచం మంచి వ్యక్తీకరణ, ఎందుకంటే దుంగ చనిపోయింది - ఇది ఇక చెట్టు కాదు. ఇది దుంగలాగా నిద్రించడం గురించి కాదు, ఇది జీవం తరహాలో నిద్రించడం గురించి – ఒకే సమయంలో ఎరుకతో వుంటూనే నిద్రపోవడం. మీరు ఈ అంశంలో కనీసం ఒక చిన్న శాతాన్ని మీ నిద్రలోకి తీసుకువచ్చినా, మీరు సహజంగా కొంత కాలానికి ధ్యానులు అవుతారు. ధ్యానం మీ ఉనికిలో ఒక భాగం అవుతుంది -ఒక చర్యగా కాదు, మీ లక్షణంగా అవుతుంది.

శాంభవి మహాముద్ర

శాంభవి మహాముద్రతో మొదలుకొని, మేము ఈ అంశాన్ని ప్రజల జీవితంలోకి తీసుకురావడానికి చాలా విధాలుగా ప్రయత్నించాము. శాంభవి అంటే సంధ్య - మీరు పగలు ఇంకా రాత్రి, రాత్రి ఇంకా పగలు మధ్య ఉన్నారు. సంధ్యా కాలము (Twilight) అంటే మీరు నిద్రపోతున్నారు, కానీ మీరు మేల్కొనే ఉన్నారు; మీరు మేల్కొని ఉన్నారు, కానీ మీరు నిద్రపోతున్నారు అని. మనం, నిద్రా సమయాన్ని కాదు, నిద్ర నాణ్యతను మార్చాలి. ఇదే ఎవరైనా యోగిగా మారడానికి అవసరమైన పునాది. మెలుకువలో ఉన్నప్పుడు మీరు పూర్తి జాగృతిలో ఉండాలి, కానీ మీ శరీర ప్రమాణాలను పరిశీలిస్తే, శరీరం నిద్రలో ఉండాలి. నిద్రలో ఉన్నప్పుడు, మీ శరీరం నిద్రపోవాలి, మీ మనస్సు నిద్రపోవాలి, కానీ మీరు తప్పక ఎరుకలో ఉండాలి.

నిద్ర - మీ మీ నిజమైన సజీవ తత్వానికి ఒక మార్గం

సజీవత్వం తెచ్చుకోగలిగిన స్థితి కాదు - అది మీ తత్వం. ఊరికే ఉండడం అంటే సంపూర్ణమైన జీవంగా ఉండడం - ఒక ఆలోచనగా కాదు, ఒక మనసు లాగా కాదు, ఒక భావంగా కాదు, ఒక సిద్ధాంతంగా కాదు, ఒక తత్వంగా కాదు, ఒక నమ్మక వ్యవస్థగా కాదు, ఒక స్త్రీగానీ పురుషుడు గానీ కాదు, ఒక జాతిగా కాదు, ఒక కులంగా కాదు, ఒక మతంగా కాదు, కేవలం జీవంలా. మీరు జీవితాన్ని ఈ స్థాయిలో స్పృశించిగలిగితే, అప్పుడు మీకు అనుభవపూర్వకంగా జీవం ఇంకా జీవ మూలం ఒకదానిలో మరొకటి ఉన్నాయి అని అర్థమవుతుంది.

Love & Grace

 

Editor's Note:  Check out our series on sleep for tips on improving sleep quality and a lot more.