సెప్టెంబర్ 2023లో నేపాల్లో సద్గురుతో కలిసి కైలాస దర్శనం చేసుకునే అరుదైన భాగ్యం పొందిన "శివపాదం" యాత్రికుల అనుభవం నుండి పవిత్ర కైలాస పర్వతపు వైభవాన్ని అనుభూతి చెందండి. గురువు అడుగుజాడలలో నేపాల్లోని మనసును రంజింపజేసే భూభాగాలు, పర్వతాలు, నదుల గుండా ప్రయాణించండి, మరెక్కడా లేని ఒక పరివర్తనాత్మక తీర్థయాత్రను ప్రారంభించండి. శివపాదం – సద్గురుతో కైలాస మానససరోవర యాత్ర ఈశా సేక్రేడ్ వాక్స్ అందించే శివపాదం, సద్గురు సాన్నిధ్యంలో కైలాస పర్వతం ఇంకా మానససరోవరం యొక్క గాఢమైన కృపను, శక్తిని అనుభూతి చెందడానికి జన్మలో ఒక్కసారే లభించే అవకాశం. ఈశా సేక్రేడ్ వాక్స్తో కైలాస మానససరోవర విహార యాత్ర ఈశా సేక్రేడ్ వాక్స్ ప్రతి ఒక్కరికీ కైలాస మానససరోవర విహార యాత్రను చేపట్టే అవకాశాన్ని కూడా అందిస్తుంది, ఇక్కడ, సద్గురు భౌతికంగా ప్రతి బృందంతో పాటు ప్రయాణించనప్పటికీ, ఆయన కృప ప్రతి యాత్రికుడితో తోడుగా ఉండి, మార్గంలోని ప్రతి అడుగులోనూ వెలుగునిస్తుంది.