ప్రశ్న: సద్గురు, నిద్రపోతూ ఎలా ధ్యానంలో ఉండగలం?

సద్గురు: ఓఁ, మీరు ధ్యానాన్ని మల్టీ టాస్కింగ్ (వివిధ పనులు ఒకటేసారి చేయగలగడం) చేయదలిచారా? అయితే మీరు ధ్యానాన్ని నిద్రపోవడానికి ఉపయోగిస్తారా? లేక నిద్రని ధ్యానంచేయడానికి ఉపయోగిస్తారా? ఏ విధంగా మీరు కోరుకుంటున్నారు - నిద్రపోతూ ఎలా ధ్యానం చేయడమనా? లేక ధ్యానం చేస్తూ ఎలా నిద్రపోవడమనా?

అర్థ రహితమైన ప్రశ్న

ఇబ్రహీం అనే సూఫీ గురువుకి జరిగిన సంఘటన గురించి, అందమైన కథ ఒకటుంది. ఆయన ఎందరో శిష్యులను చేర్చుకున్నారు, ఒకరోజు అయన దగ్గర ఇద్దరు యువకులు కలిశారు. అద్భుతంగా సూర్యాస్తమయం అవుతోంది, వీరిద్దరూ మాత్రం విచారంగా కూర్చున్నారు.

వారి తమ ధూమపానం అలవాటుతో సతమతమవుతున్నారు. ఇద్దరూ "మనిద్దరం గురువుగారి దగ్గరికి వెళ్లి ధూమపానం చేయడానికి అనుమతిని కోరుకుందాము, ఏమో, ఎవరికి తెలుసు, అయన చేతలు అర్థంకావు, బహుశా ఒప్పుకుంటారేమో, లేదా పొగాకుకు బదులు ఇంకేదన్నా మన అవసరాలకు సరఫరా చేయగలరేమో" అని ఆలోచించారు.

ఇద్దరూ వేర్వేరుగా గురువుగారి అనుమతి కోరాలని నిర్ణయించుకున్నారు. మరునాడు సాయంకాలం వేళ మళ్ళీ అద్భుతమైన సూర్యాస్తమయం అవుతోంది. వారిద్దరిలో ఒకరు విచారంగా కూర్చున్నాడు, ఇంకొకరు ధూమ పానం చేస్తూ ప్రవేశించాడు. విచారంగా ఉన్న యువకుడు " ధూమపానం ఎలా చేస్తున్నావు, గురువు మాట తప్పుతున్నావా?" అని మందలించాడు.

"లేదు" అని అతను జవాబు చెప్పాడు.

విచ్చారంగా ఉన్నతను ‘ "నేను నిన్న వెళ్లి అడిగాను. "లేదు, ధూమపానం చేయడానికి అనుమతిలేదని" గురువుగారు జవాబు చెప్పారు’ అన్నాడు.

"ఏమని అడిగావు" అని ప్రశ్నించాడు.

నేను "ధ్యానంచేస్తూ పొగ త్రాగవచ్చా" అని అడిగాను. ఆయన "లేదు" అన్నారు. రెండో అతను "నీవు చేసిన తప్పు అదే, నేను "పొగతాగుతూ ధ్యానం చేసుకోవచ్చా?" అని అడిగాను, ఆయన "సరే చేయవచ్చ" అని సమాధానం ఇచ్చారు.

హాయిగా నిద్రపోండి!

"నేను నిద్రపోతూ ధ్యానం చేయవచ్చా?" అని. ఇప్పుడు మీరు అడుగుతున్నారు. మెలుకువగా ఉండి ధ్యానం చేయలేక ఎంతో మంది సతమత మవుతున్నారు. తమ మీద ఎంతో కృషిచేస్తే గాని చాలా మంది, ధ్యానం చేయలేరు. ఒక గంటసేపు కూర్చుంటే బహుశా అందులో ఒక మూడు నిమిషాల పాటు ధ్యానంలో ఉండగలరేమో. అక్కడకీ, ఇక్కడకీ క్షణం క్షణం అలా వస్తూ పోతూనే ఉంటుంది, మరో క్షణం మరెక్కడికో పోతుంటుంది..

ఆధ్యాత్మికతను మీ నిద్రలోకి తీసుకురాకండి. నిద్రపోతే చచ్చిన వానిలా హాయిగా నిద్రపోండి. మీరు ధ్యానం చేసే సమయం ఎంతైనా, ఆ సమయంలో ధ్యానం బాగా జరిగేలాగా సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, ధ్యానాన్ని మీ నిద్రలోకి కూడా తీసుకు వెళ్ళే ప్రయత్నం చేయకండి. కనీసం, నిద్రలోనన్నా, మీ కలుషిత ఆలోచనలకు దూరంగా ఉండండి. నిశ్చింతగా నిద్రపోండి. ' మొద్దులా' నిద్రపోండి అని అంటారు కదా, అలా కుదరకపోతే కనీసం పిల్లి లాగా నైనా, కుక్క మాదిరిగా నైనా నిద్రపోండి. ఆధ్యాత్మికతను మీ నిద్రలోకి చొరవనివ్వకండి, చచ్చిన వానిలా నిద్రపోండి.

నిశ్చింతగా నిద్రపోండి

ప్రాణంలేని దేహం మొద్దులాగా, బిగువుగా మారుతుంది, ఆ మనిషి ఒక పూర్తిగా పరిత్యజించిన స్థితిలోకి చేరుతాడు. వారు ఎలా ఉన్నారన్న విషయం వారు పట్టించుకోరు. అలాగే మీరు నిద్రపోయినప్పుడు మీరు నిశ్చింతగా అన్నిటినీ త్యజించాలి. అమెరికాలో ఒకటి గమనించా, ప్రొద్దున మీరెవరినైనా కలవగానే, మిమ్మల్ని "మీరు హాయిగా నిద్రపోయారా?" అని ప్రశ్నిస్తారు. ఈ ప్రశ్న నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకంటే అది సమస్యే కాదు. కానీ నిశితంగా చూస్తే, ఎంతోమందికి ఇది ఒక పెద్ద సమస్య. మీరు నిద్రలో ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తే, తప్పకుండా మీకు కూడా అది సమస్యగానే మారుతుంది. అందువల్ల అన్నిటినీ వదిలి హాయిగా నిద్రపోండి. చచ్చిన వానిలా నిద్రపోవడం మీకు నచ్చక పొతే కనీసం పసిపాప లాగా నైనా నిద్రపోండి. అమెరికాలో రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్షపదవికి పోటీ చేస్తున్న అభ్యర్థి జాన్ మాకెయిన్ ఈ విషయం గురించి అందంగా చెప్పారు. తాను ఒబామాతో ఓడిన తరువాత అతనిని"ఎలా ఉన్నారు"? అని అడిగారు. అతను"నేను పసిపాపలా నిద్రపోతున్నాను, ప్రతి రెండు గంటలకి మేల్కొని, భోరున ఏడ్చి, తిరిగి నిద్రపోతాను" అని సమాధానం ఇచ్చాడు. అద్భుతమైన వ్యక్తి. ఓటమిలో కూడా హాస్యం చూడగలగడం, అది మీకు మంచిది.

ధ్యాన లక్షణం

మీరు ధ్యానలు కాగలరు, లేదా మీరే ధ్యానం కాగలరు అంతే కానీ, మీరు ధ్యానం చేయలేరు. ధ్యానం ఒక క్రియ కాదు; అది ఒక లక్షణం. అది మీరు అందుకుని, మీ జీవన విధానంలో వెదజల్లగల సౌరభం, మీరు ఏదో చేసినందువల్ల ఇది జరగదు - మీరు మీ శరీరాన్ని, బుద్ధిని, శక్తులని మరియు భావాలను ఒక పరిణతిలోకి తెచ్చుకోగలిగితే మీరు ధ్యానులు కాగలరు. , లేదా మీరే ధ్యానం కాగలరు అంతే కానీ, మీరు ధ్యానం చేయలేరు. ఈ లక్షణాన్ని మీరు మీలోకి తీసుకువస్తే మీరు నిద్రపోతున్న సమయంలో కూడా అది మిమ్మల్ని వీడదు. ఇది మీ లక్షణంగా, మీలోని జీవ ప్రక్రియగా ఉన్నప్పుడు, మీరు శారీరకంగా మెలకువగా ఉన్నా, నిద్రపోతున్నా, ధ్యాన ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. కానీ మీరు నిద్ర పోతున్నప్పుడు ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తే, జరిగేది మీరు నిద్రకు దూరంకావడం మాత్రమే.

ప్రేమాశీస్సులతో,

సద్గురు