పూలు పరచిన బాట
పూలు పరచిన బాట ఓ పుష్ప గుచ్ఛం. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో స్పీకింగ్ ట్రీ శీర్షికలో వచ్చిన వ్యాసాల సమాహారమే ఇది. స్తబ్దుగా, అస్తవ్యస్తంగా ఉండే జీవితంలోకి వివేకం, హాస్యం, అందం, ఆనందం ఈ వ్యాసాలు తీసుకు వచ్చాయి. వాతావరణం, స్టాక్ మార్కెట్, జాతీయ, అంతర్జాతీయ వార్తలతో నిండిపోయే వార్తా పత్రికలో ఈ వ్యాసాలు సద్గురు యొక్క ఆలోచనల ద్వారా పాఠకులకు కొత్తరకమైన భావాలను తీసుకు వచ్చాయి. సమకాలీన అంశాల మీద సద్గురు యొక్క ఆలోచనలు, ఆయన చేసే వ్యాఖ్యానాలు కొన్నిసార్లు దుమారం లేపాయి. కాని చర్చలను రసవత్తరం చేశాయి, వాటికి బలాన్ని చేకూర్చాయి. ఉదయకాల పుష్పాలలానే ఈ వ్యాసాలు కొన్నిసార్లు పాఠకులను ఉత్తేజపరచాయి, మరికొన్ని సార్లు పాతకాలపు ఆలోచనలకు స్వస్తి చెప్పి నూతన ఆలోచనలకు దారితీసేలా చేశాయి.