మన శ్వాశ, తాగేనీరు, నడిచే నేల, మన కంటికి కనిపించే పచ్చదనం, తీసుకునే పండు, కాయ అన్నీ మన శరీరానికి, ఆత్మకు,
జీవితానికి bhచాలా మంచివి అంటారు సద్గురువు.
ఈ యాంత్రిక జీవితంలో భోజనం అలవాట్లు మారి ఫాస్టుఫుడ్ లోకంలో పడిపోయి, మన శరీరానికి సరిఅయిన పోషణ నివ్వడం లేదు.
సులువుగా దొరికే ఆహారం వదిలేసి, నాగరికత అనే పేరుతో
ఫాస్టుఫుడ్ కి వెళుతున్నాం.
శరీర ఆరోగ్యానికి మంచి భోజనం ఆధారం. యిందులో రెండు వందలకు పైగా వంటకాల రకాలను వివరించడం జరిగింది. ఇవి
సద్గురువు ఆలోచనలను మనకందిస్తున్నాయి. మన జీవితంలో మంచి ఆరోగ్యానికి ఇది నూటికి నూరుశాతం ఆచరణీయ విధానం.
యిక మీరు తీసుకునే ఆహారం అంతా విందు భోజనం అగుగాక. ప్రతి భోజనం అమృతతుల్యమగు గాక.