దురద్రష్ట వశాత్తు , పశ్చిమ దేశాల్లో తంత్ర మంటే , ప్రతిపాదిస్తూ అది నిస్సంకోచమయిన లైంగిక క్రియ గా అర్థం వచ్చేటట్లు చేశారు, దానిని చాల చెడ్డగా అభివర్ణించారు. దీనికి కారణం తంత్రము మీద పుస్తకాలూ వ్రాసిన వారు కేవలం వాటిని అమ్మడం కోసమే వ్రాసారు. ఏ విధం గాను వారు తాంత్రికులు కారు. " తంత్ర " అన్న శబ్దానికి నిజమైన అర్థం, సాంకేతిక పధ్ధతి లేదా సాంకేతిక విజ్ఞానం. ఇది అంతర్గత సాంకేతిక విజ్ఞానం. ఇవి వ్యక్తిగత పద్ధతులు కానీ, వస్తుగత పద్ధతులు కావు.

ప్రస్తుత సమాజం అర్థం చేసుకున్న ప్రకారం, "తంత్ర " అన్న శబ్దం సాంప్రదాయ విరుద్ధము లేదా సాంఘిక దుశ్చర్య లకు సూచన. ఇక్కడ కొన్ని అవస్థలను కొన్ని పద్ధతులతో /మార్గాలలో ఉపయోగిస్తారు. ఇది యోగా కంటే వేరు కాదు. ఇది యోగా లో తంత్ర యోగ అనబడే ఒక చిన్న అంగము.

" నాకు లైంగిక అవసరాలున్నాయి. నేను తాంత్రిక మార్గం అవలంబిస్తాను" అనే కొందరి ఆలోచనలు అర్థ రహితం. (పిచ్చి కూతలు, వెర్రి మాటలు). ఎవరయినా తంత్ర విద్యతో, వృద్ధి పొందడానికి కేవలం లైంగికత ని ఉపయోగిస్తున్నారన్నది సరి కాదు. వారు ప్రతి దృష్టిని వృద్ధి చెందడానికి వాడుతున్నారు.

దురద్రష్ట వశాత్తు, కొంత మంది అనుచిత కారణంగా ఆ మార్గం వైపు ఆకర్షింప బడి ఉండవచ్చు. తమ లైంగికత కు ఆధ్యాత్మిక సమ్మతి కోసం వారు అటు వెళ్తారు. మిమ్మల్ని ఆధ్యాత్మికతతో కెలుక్కోవడం ఎందుకు ? మీ జీవ వ్యవస్థని(అవసరాలను) , జీవ వ్యవస్థ గానే ఉంచండి. ( మీ దేహ అవసరాలను, దేహ అవసరాల లానే ఉంచండి ) దానికి మీరు ఏ పేర్లు ఈయనవసరం లేదు.

తంత్ర యోగానికి సరళమయిన మూల సూత్రం : ఏది మిమ్మల్ని అధోగతి పట్టిస్తుందో అదే మిమ్మల్ని ఊర్ధ్వ స్థితికి కూడా తీసుకు వెళ్లగలదు. ఒక మానవుడు అధోగతి పాలవడానికి మార్గాలు, తిండి, మద్య పానీయాలు, లైంగిక వాంఛలు. తంత్ర యోగంలో ఈ మూడింటినే మిమ్మల్ని ఉద్ధరించడానికి సాధనాలుగా ఉపయోగిస్తారు. కానీ, ప్రజలు కొన్ని పదార్థాలను ఉపయోగించినప్పుడు, ఒక ప్రత్యేక స్థితిలో ఉండాలి. లేనట్లయితే అవి వ్యసనాలుగా మారుతాయి. దీనికి అత్యంత క్రమ శిక్షణ అవసరం. ఎంత క్రమ శిక్షణ అంటే, చాలా మందికి దాన్ని ప్రయత్నించడం కూడా సాధ్యం కాదు. ప్రజలు ఇటువంటి మార్గంలో పయనిస్తే , వంద మందిలో, తొంభై తొమ్మిది మంది తాగు బోతులుగా తయారవుతారు.

కానీ, దీనిని ఎడమ చేయి తంత్రమంటారు. ఇది మొరటు సాంకేతిక జ్ఞానం. ఇది అనేక కర్మ కాండలతో చుట్టుకొని ఉంది. ఇది కాక, శుధ్ధి చేయ బడిన సాంకేతిక జ్ఞానం గల కుడి చేయి తంత్రం కూడా ఉన్నది.

కుడి చేయి తంత్రం

కుడి చేయి తంత్రం అనేది ఆంతరంగికమైనదీ , శక్తితో కూడినది. పూర్తిగా మీకు సంబంధించినదే. ఇందులో కర్మ కాండలు కానీ. బాహ్యమయిన క్రియలు కానీ ఉండవు. అయితే, ఇది తంత్రమేనా ? ఒక విధంగా అవును, కానీ "యోగా" అనే శబ్దంలో అన్నీ కలిసి వస్తాయి. మనం, "యోగా" అని అన్నప్పుడు ఏ అవకాశాన్ని తీసివేయడం లేదు.- అందులో అన్నీ అవకాశాలు ఉన్నాయి. కొంతమంది, వికృతమైన వ్యక్తుల దృష్టి, ఒక విధమయిన దేహాన్నిఉపయోగించే కేవలం ఎడమ చేయి తంత్రమయిన, తంత్రం మీద పడింది. వారు ఆ కొద్ది భాగాన్ని, హెచ్చు చేసి (అధికం), అనేక రకాల వికారమయిన లైంగిక చర్యలతో కూడిన పుస్తకాలను వ్రాసి ఇలా అన్నారు. " ఇదే తంత్రం " అని . కాదు, ఇది తంత్రం కానే కాదు.

తంత్ర అంటే, మీ శక్తిని మీరు ఉపయోగించ కలిగి, విషయాలను సాధించగలగడం. మీరు మీ మేధా శక్తిని పదును పరిచి, అన్నింటిని సాధించగలిగితే , అది కూడా ఒక విధమయిన తంత్రమే. మీరు మీ శక్తులను, హృదయం పై ప్రభావింపచేసి, దాన్ని ప్రేమ భరితం చేసుకోని, మీ అపార ప్రేమ తో ప్రతి వారిని ముంచివేస్తే , అది కూడా ఒక విధమైన తంత్రమే. మీ దేహాన్ని అత్యంత శక్తివంతము చేసి, దాని చేత నమ్మ శక్యం గాని విన్యాసాలు చేయిస్తే, అది కూడా తంత్రమే. లేదా, దేహము, మనస్సు, భావావేశాల ప్రమేయం లేకుండా, మీ శక్తి తనంతట తానే పనులు సాధించగలిగితే , ఇది కూడా తంత్రమే. కాబట్టి, తంత్ర అనేది ఒక వికృతమయిన సిద్ధాంతము కాదు.

తంత్ర అనేది ఒక విధమయిన సమర్థత. అది లేకుండా సాధ్యత/అవకాశం లేదు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, " నీ తంత్రము ఎంత శుద్ది చేయబడింది ?"

నీ శక్తిని చైతన్యవంతం చేయాలంటే, పది వేల కర్మ కాండలు చేయాలా లేదా ఇక్కడే కూర్చుని చేయగలరా. ఇదే పెద్ద వ్యత్యాసం. అధమమైన సాంకేతికతా లేక ఉన్నతమయిన సాంకేతికతా అన్నదే ప్రశ్న. కానీ తంత్ర శక్తి లేకుండా ఆధ్యాత్మిక ప్రక్రియ లేదు.

ప్రేమాశీస్సులతో,

సద్గురు