మనం యోగా చేసేటప్పుడు సరైన శరీరక పరిస్థితును ఉంచుకోవడంలోని ప్రధాన్యతను, అలాగే మనం సాధన చేసేటప్పుడు నీరు ఎందుకు త్రాగకూడదు అనే విషయాలపై సద్గురు మాట్లాడుతున్నారు.

Read in Hindi: योग करते समय पानी क्यों नहीं पीना चाहिए?

ప్రశ్న: నమస్కారం సద్గురూ! మనం యోగ సాధన చేసేటప్పుడు నీళ్లు తాగకూడదని, బాత్రూంకి వెళ్ళ కూడదని అన్నారు, ఎందుకని?

సద్గురు: మనం యోగ సాధన చేసేటప్పుడు మీరు శరీరంలో ఉష్ణాన్ని క్రమంగా పెంచుతున్నాము. అటువంటప్పుడు మీరు చల్లని నీరు తాగితే, ఉష్ణం హటాత్తుగా పడిపోతుంది, దీనివల్ల అనేక ఇతర ప్రతిక్రియలు జరుగుతాయి. మీరు అలర్జీకి,  శ్లేష్మం, కఫం వంటి వాటికి త్వరగా లోనవుతారు. మీరు తీవ్రంగా యోగాసనాలు చేస్తున్నప్పుడు నీరు తాగితే, మీకు వెంటనే జలుబు చేయవచ్చు. అందువల్ల ఆసనాలు చేసేటప్పుడు మీరు నీరు తాగవద్దు, అలాగే సాధన సమయంలో బాత్ రూమ్ కూడా వెళ్ళవద్దు, ఎందుకంటే మీరు శరీరంలోని నీటిని చెమట ద్వారా బయటికి పంపాలి.

మన ప్రయత్నం ఏమిటంటే, ఈ నిర్బంధ తలను మెల్లగా తగ్గించడం, ఎంతవరకంటే మీరు ఒక రోజు అలా కూర్చుని ఉంటే మీరే యోగా అయిపోతారు, అదేదో యోగ సాధన చేయటం కాదు.

మీరు సాధన చేస్తున్నకొద్దీ, అది ఒక నిర్ణీత స్థాయికి వస్తే, మీరు ఒక ఆసనం చేస్తున్నప్పుడు మీలో చెమట మీ తల పైభాగం నుంచి బయటకు రావాలి. అంతేగాని శరీరం నుంచి కాదు. వాతావరణ పరిస్థితులను బట్టి మీ శరీరానికి కొంత చెమట పట్టవచ్చు, కానీ ఎక్కువ చెమట మీ తలపై నుంచి రావాలి, అలా ఉంటే శక్తులను మీరు సరైన దిశలో పంపుతున్నారని. ఆసనాలు సహజంగానే అలా చేస్తాయి. ఏదో ఒకదానికి మీరు ఓ ఫౌంటెన్ హెడ్ కావాలి, దానికి మీరు వ్యర్థ నీటితో సాధన చేస్తున్నారని. మీరు మీలోని ఉష్ణాన్ని పెంచుకుంటూ పోతే, అది సహజంగానే వ్యర్ధ జలాన్ని పైకి పంపుతుంది. ఒకవేళ మీ శారీరక వ్యవస్థ మరీ వేడెక్కితే, మీరు శవాసనం వేసి వేడిని కాస్త తగ్గించండి, అంతేగాని చల్లని నీరు తాగటం ద్వారా వేడిని తగ్గించవద్దు. మీరు బాత్రూమ్ కి వెళ్లవద్దు, ఎందుకంటే చెమట ద్వారా వ్యర్ధ జలం బయటకు  వెళ్ళితే, శరీర ప్రక్షాలనం బాగా జరుగుతుంది. 

సాధన సమయంలో మీకు ఎక్కువ చెమట పడితే సామాన్యంగా మీరు ధరించిన వస్త్రాలు అ చెమటను పీల్చుకుంటాయి. మీరు శరీరంపై ఎక్కువ బట్టలు లేకుండా సాధన చేస్తుంటే, ఆ వచ్చిన చెమటను మళ్లీ శరీరంలోకి రుద్దండి, ఎందుకంటే ఆ చెమటలో ఒక రకమైన ప్రాణశక్తి ఉంటుంది. దానిని మనం వ్యర్ధం చేయకూడదు. అలా చెమటను శరీరంలోకి రుద్దుకోవడం ద్వారా ఒక రకమైన శక్తి వస్తుంది, దానిద్వారా ఒక రకమైన కవచం ఏర్పడుతుంది. మనం దీనిని వ్యర్థం చేసుకోకూడదు. యోగా అంటే మీ శరీరాన్నుంచి అత్యుత్తమ ఫలితం సాధించడం. మీరు రోజూ సాధన చేస్తూ, చెమటను శరీరంలోకి రుద్ది వేస్తుంటే, మీరు ఒక రకమైన ఉష్ణాన్ని, ప్రాణ శక్తిని తయారు చేస్తారు. వాతావరణం వేడిగా ఉండడం, చల్లగా ఉండటం, ఆకలి, దాహం అనేవి, పూర్తిగా పోతాయి అని కాదు కానీ, అవి మిమ్మల్ని అంత ఎక్కువగా బాధించవు. 

అసలు మన ఆలోచన ఏమిటంటే మెల్ల మెల్లగా మనం ఈ శారీరక నిర్బందతల నుంచి బయట పడడం. ఆహారమైనా, పానీయమైనా, బాత్ రూమ్, ఏదైనా కానీ, వాటి నిర్బంధతలు ప్రతీ మనిషికి మారుతుంటాయి. మన ప్రయత్నం ఏమిటంటే ఈ నిర్బంధతలను తగ్గించడం, ఎంతవరకంటే మీరు ఒక రోజు అలా కూర్చుని ఉంటే మీరే ‘యోగా’ అయిపోతారు, అదేదో యోగ సాధన చేయటం కాదు. మీరే యోగా అవుతారు. అంటే మీ అనుభూతి ఎలా ఉంటుందంటే మీకు, మిగతా సృష్టికీ మధ్య తేడా మీకు తెలియదు. మీరు మీ శరీరాన్ని అటువంటి పరిస్థితిని అనుభూతి చెందేలాగా నిర్మించుకోవాలి. అలాకాక,  ఏదో కారణంగా ఎవరైనా, చాలా ఉన్నతమైన అనుభూతి చెందితే, వారి శారీరక వ్యవస్థ దానికి తయారుగా లేకపోతే, ఇక వారి ఫ్యూజ్ ఎగిరిపోతుంది. ఏదో పిచ్చి పిచ్చి పుస్తకాలు చదవడం ద్వారా, ఇంకా పిచ్చిపిచ్చిగా ఏదో చేసి ఎందరో తమ బుర్రలను పోకొట్టుకున్నారు. మీరు మీ వ్యవస్థను ఎలా చేసుకోవాలంటే ఉన్నత జీవనం, ఉన్నత పనులు సహజంగా మీకు రావాలి. అలా జరగాలంటే మీరు ఎంతో ఉన్నతంగా ఎదగాలి. అలా కాక ఇక్కడ కూర్చుని ఉన్నత ప్రమాణాలు మీ దగ్గరకు వచ్చి చేరాలంటే, అలా అవే మీ దగ్గరికి వస్తే, అది మీకు మంచిది కాదు. మీరే పైకి వెళ్లి, ఉన్నత ప్రమాణాలు మీ దగ్గరకే వచ్చే ఉన్నత స్థాయికి మీరు ఎదగాలి.

ప్రేమాశిస్సులతో,
సద్గురు