ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా జీవించడం
ఈరోజు వ్యాసంలో, ఒక వ్యక్తి కేవలం రోగాలకి దూరంగా ఉండడం మాత్రమే కాకుండా, జీవితంలోని ప్రతి అంశంలోనూ నిజంగా ఆరోగ్యంగా ఉండటం ఎలానో సద్గురు వివరిస్తున్నారు. “Health అనే పదం “whole” అనే పదం నుండి వస్తుంది. మీ శరీరం, మనస్సు, భావోద్వేగాలు ఇంకా శక్తులు అన్నీ ఒకదానితో ఒకటి సమవ్యయంలో ఉండి మీరు ఒక సంపూర్ణ అనుభూతిని పొందుతున్నప్పుడు మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు.”
సద్గురు ఒక వ్యక్తి కేవలం రోగాలకి దూరంగా ఉండడం మాత్రమే కాకుండా, జీవితంలోని ప్రతి అంశంలోనూ నిజంగా ఆరోగ్యంగా ఉండటం ఎలానో వివరిస్తున్నారు.
సద్గురు:: Health అనే పదం whole అనే పదం నుండి వస్తుంది. మీ శరీరం, మనస్సు, భావోద్వేగాలు ఇంకా శక్తులు అన్నీ ఒకదానితో ఒకటి సమవ్యయంలో ఉండి మీరు ఒక సంపూర్ణ అనుభూతిని పొందుతున్నప్పుడు మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు. ప్రపంచంలోని చాలా మంది ప్రజలు, వైద్యపరంగా ఆరోగ్యంగా ఉన్నవారిగా భావించే వారితో సహా, అనారోగ్యంతో ఉన్నారు. వారికి ఎటువంటి వైద్యం అవసరం ఉండకపోవచ్చు, కానీ వారి వ్యవస్థలో ఎటువంటి సంపూర్ణతా ఉండదు. వారిలో ఎటువంటి ప్రశాంతత లేదా ఆనందము ఉండవు. మీరు ఒక నిర్దిష్ట స్థాయిని దాటి నిస్పృహకి లోనైతే అప్పుడు అనారోగ్యంతో ఉన్నామని భావిస్తారు, కానీ మీరు ఆనందంతో ఉప్పొంగుతూ ఉండకపోతే మీరు అనారోగ్యంతో ఉన్నట్టే. మీలోని అంతర్గత పరంగా ఒక సంపూర్ణత అనేది లేదు.ఇలా ఎందుకు జరిగిందంటే మీరు ఎప్పుడూ కూడా దానిపై ధ్యాస పెట్టలేదు. ప్రతి దాన్నీ కూడా బయట నుండి సరి చేయాలీ అనే ఈ మొత్తం వైఖరి పోవాలి. ఏ వైద్యుడు లేదా ఔషధము కూడా మీకు ఎప్పుడూ ఆరోగ్యాన్ని ఇవ్వలేదు. అవి మీరు అనారోగ్యం బారిన పడినప్పుడు కొద్దిగా సాయం చేయవచ్చు, ఇంకా దాన్నుంచి కొద్దిగా బయటపడేయవచ్చు, కాని ఆరోగ్యం అనేది మీ లోపలే కలగాలి.
ఆరోగ్యం అనేది భౌతిక అంశం కాదు. నేటి ఆధునిక వైద్యం - మనిషి మానసిక వ్యక్తి అని చెబుతుంది. మనసులో ఏం జరిగినా అది సహజంగానే శరీరంలో కూడా జరుగుతుంది. అలాగే శరీరంలో జరిగేది మనసులో కూడా జరుగుతుంది. కాబట్టి మనం ఇక్కడ జీవిస్తున్న విధానం, మన వైఖరి, మన భావోద్వేగం, మన మానసిక స్థితి, మన శారీరక శ్రమ, మన మెదడు ఎంత క్రమబద్ధంగా ఉంది, ఇవన్నీ కూడా కచ్చితంగా మన ఆరోగ్యంలో ఒక భాగమే.
ఆరోగ్యం లోపలి నుండే కలగాలి అంటే, మనం ఖచ్చితంగా కొంత ఇన్నర్ ఇంజినీరింగ్ చేయాలి. మనం కచ్చితంగా మన శరీరం, మనస్సు, భావోద్వేగాలు, ఇంకా శక్తులు ఒక చక్కటి సమన్వయంలో ఉండేటువంటి వాతావరణాన్ని సృష్టించాలి.
ప్రజలు తమ అంతర్గత శ్రేయస్సు కోసం, తమ శరీరాన్ని ఇంకా మనసుని పూర్తి ఆరోగ్యాన్నీ ఇంకా శ్రేయస్సునీ అనుభూతి చెందే విధంగా రూపొందించు కోవడంలో ఉపయోగపడే సరళమైన ప్రక్రియలు చేయడం కోసం, రోజులో ఉదయాన్నే ఒక 25 నుండి 30 నిమిషాలు కేటాయిస్తే, అప్పుడు ప్రతి మనిషి కూడా ఆరోగ్యంగా ఇంకా చక్కగా జీవించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు.
Editor’s Note: Get the latest updates from the Isha Blog. Twitter, facebook, rss or browser extensions, take your pick.