సింహ క్రియ గురించి తరచుగా వచ్చే సందేహాలు
6 సంవత్సరాలు.
70 సంవత్సరాలు 6 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారు మరియు 70 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వారు కూడా ఈ సాధన చేయవచ్చు. కానీ వారు శ్వాసక్రియను కేవలం 12 సార్లు మాత్రమే జరుపవలసి ఉంటుంది.(21 సార్లు కాదు).
గర్భిణీ స్త్రీలు, నెలసరిలో ఉన్న మహిళలు, దీర్ఘకాలిక వ్యాధులతో(ఆస్థమా, మైగ్రేన్,మదుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, గ్లూకోమా, శుక్లాలు, రెటీనా విడివడడం, హెర్నియా మొదలైనవి ) ఇబ్బందిపడుతున్న వారితో సహా ఈ సాధనను ఎవరైనా చేయవచ్చు. మెదడులో రక్తస్రావం కానీ మెదడులో కణితి కానీ ఉన్న వారు కూడా ఈ సాధనను చేయవచ్చు. అయితే వారు శ్వాసక్రియను కేవలం 12 సార్లు మాత్రమే జరుపవలసి ఉంటుంది.(21 సార్లు కాదు).
పెద్ద శస్త్ర చికిత్స – 6 నెలలు వేచి ఉండాలి చిన్న శస్త్ర చికిత్స – 6 వారాలు వేచి ఉండాలి
నేలపై కూర్చొని సాధన చేయడం ఉత్తమం. మీరు కావాలనుకుంటే కింద కూర్చోవడానికి అనువుగా ఉండేలా చిన్న దిండు లేదా పాడింగ్ సహాయం తీసుకోవచ్చు. ఒకవేళ మీకు నేలపై కూర్చోవడం కుదరకపోతే, మీరు కుర్చీలో కూర్చోవచ్చు. మీ చీలమండల వద్ద మీ కాళ్ళు కలుసుకునేలా ఒకదాని కొకటి పరస్పరం అడ్డంగా పెట్టి ఉన్న భంగిమలో మీ సాధనను కొనసాగించవచ్చు. కానీ, సాధన చేయడానికి అది ఉత్తమమైన విధానం కాదు. మీరు నేలపై కూర్చున్నప్పుడు మీ సాధన మరింత బాగా సాగుతుంది.
తిన్న వెంటనే సాధన చేయకూడదు. భోజనం తరువాత కనీసం 2.5 గంటల వ్యవధి ఉండాలి.
తినవచ్చు. సాధన ముగిసిన వెంటనే, మీరు తినడం లేదా సాధారణ ఉష్ణోగ్రతలో ఉన్న పానీయాలను త్రాగడం చేయవచ్చు. రిఫ్రిజిరేటర్లో ఉంచిన ఆహారాన్ని తినడానికి 10-15 వేచి ఉండండి.
లేదు. క్రియ అనేది ఒక సూక్ష్మమైన విజ్ఞానం. ఈ విజ్ఞానం - కష్ట కాలంలో మీకు అందించడం జరిగింది. సక్రమంగా ఆచరిస్తే, ఈ యోగ సాధనలకు మీ జీవితాన్ని రూపాంతరం చెందించే శక్తి ఉంటుంది. సాధారణంగా, వాటిని సరైన రీతిలో అందించడానికి ఏళ్ల తరబడిన శిక్షణ అవసరముంటుంది. మీరు ఇతరులకు ఈ క్రియను అందించడానికి, ఈ వీడియోను (ఒక పరికరంలా) వాడుకోవచ్చు. ఈ క్రియను మరియు ఇతర సాధనలను భోదించడంలో మీకు ఆసక్తి ఉంటే, ‘టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాం’ ను గురించిన మరిన్ని వివరాలకోసం మమ్మల్ని సంప్రదించగలరు.
సాధన చేసిన తరువాత, వేడి నీళ్ళ స్నానం కోసం 15-20 నిమిషాలు వేచి ఉండాలి. చన్నీటి స్నానం కోసం 25-౩౦ నిమిషాలు వేచి ఉండాలి.
వీడియోలో సూచించినట్టుగా, రోజుకి రెండు నుండి మూడు సార్లు ఈ సాధన చేయవచ్చు.
రెండు సాధనల మధ్య కనీసం నాలుగు గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి.
లేదు. సాధనకు అందించబడిన సూచనలను తూచాతప్పకుండా పాటించడం అతి ముఖ్యమైన అంశం. సద్గురు చెప్పినట్టుగా, మీరు లెక్కకు మించి చేసినప్పుడు, అది మీ వ్యవస్థకు తీవ్ర హానికలిగించే అవకాశముంది.
లేదు.
అవును. మీరు 12 సార్లు శ్వాసక్రియ చేయవచ్చు.
అవును. మీ తలను కాస్తంత పైకి లేపి ఉంచాలి.
అవును.
ప్రయత్నించ వచ్చు.
నిర్ధిష్టమైన క్రమం ఏమీ లేదు.
ప్రత్యేక జాగ్రత్తలు లేవు. స్వ్వచ్చమైన గాలి తగిలేలా చూసుకోండి. పరిసరాలు పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా, గాలి - వెలుతురు బాగుండేలా చూసుకోవాలి.
లేదు. అలా చేయకూడదు.