జ్ఞానతృష్ణ ఉన్నవారికోసమేఈ ‘మర్మజ్ఞ విలాసం’. ఇది ‘మిస్టిక్ మ్యూజింగ్స్’ అనే
ఆంగ్ల పుస్తక అనువాదం. ఓ పది సంవత్సరాల పాటు తమ సన్నిహిత శిష్యులతో వివిధ
సందర్భాలలో, వివిధ పరిస్థితులలో సద్గురు మాట్లాడిన జ్ఞాన పద సమాహారమే ఈ
సంకలనం. ఈ పదాలు సాధారణంగా బహిరంగంగా మాట్లాడని అంశాలను వివరిస్తూ, చాలా
కాలంగా తనతో ఉండే అదృష్టం కలిగిన వారి అభివృద్ధి కోసం మాట్లాడినవి.
ఇది సాధారణ పాఠకులను నిర్ఘాంత పరచవచ్చు. వారికి వినోదాన్ని, చమత్కారాన్ని,
సంతోషాన్ని, ఉత్తేజాన్నికలిగించవచ్చు. కానీ జిఙ్ఞాసులుకుండే సుముఖతతో,
నిష్కపటత్వంతో దీనిని స్వీకరిస్తే, మీలోపల ఇది ఒక శక్తివంతమైన ప్రక్రియను –
అస్థిత్వం మధ్యలోకి ఒక ప్రయాణాన్ని, ఒక తీర్థయాత్రను – ప్రారంభించవచ్చు.