సద్గురు జ్ఞానోదయం పొందిన రోజు

ప్రత్యక్షంగా పాల్గొనండి - సాయంత్రం 6 గంటలకు
seperator
 

సెప్టెంబర్ 23, సద్గురు జ్ఞానోదయం పొందిన రోజు. ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం ఇదే రోజు, మైసూరులోని చాముండీ కొండపై, మాటల్లో చెప్పలేని ఓ అనిర్వచనీయమైన అనుభూతి సద్గురులో వెల్లివిరిసింది. అత్యంత రమ్యమైన ఇంకా పారవశ్యంతో కూడిన ఆ అనుభూతిని మానవాళి అంతటికీ అందించేందుకు ఆయన ఒక ప్రణాళికను రూపొందించేలా చేసింది.

సద్గురు జీవితంలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ సంఘటన, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి, వారిలో ఒక ఆధ్యాతిక సంభావ్యతకు మార్గం చూపింది.

ప్రతీ మనిషికీ కనీసం “ఒక బొట్టు ఆధ్యాతికత” ను అందించాలనే సంకల్పంతో చేస్తున్న ఈ కృషి, 38 సంవత్సరాలుగా ప్రజ్జ్వలిస్తూనే ఉంది.

 
 
ఈవెంట్ వివరాలు
seperator
 
 

సద్గురుతో శక్తివంతమైన ధ్యానం

Powerful Meditation with Sadhguru

సద్గురు దర్శనం ఇంకా ప్రశ్నోత్తరాలు

Sadhguru Darshan with Q&A

ప్రత్యేక సంగీత ప్రదర్శనలు

Special Musical Performances

సద్గురు ఎక్స్‌క్లూజివ్ ప్రారంభం

Sadhguru Exclusive
 
 

సన్నాహక ముసుగు

seperator

సద్గురు అందించే ధ్యాన ప్రక్రియకు సన్నద్ధం కావడానికి సాధన

సద్గురు మనకు శక్తివంతమైన ధ్యాన ప్రక్రియలను అందిస్తారు. దీనిని సాధ్యమైనంత ఉత్తమ విధంగా స్వీకరించేందుకు గానూ మిమ్మల్ని మీరు సన్నద్ధం చేసుకోవడానికి ఈ క్రింది సాధనను సద్వినియోగ పరచుకోగలరు:

 
 

భక్తి సాధన అనేది తరించేందుకు అతి సులువైన ఇంకా అత్యద్భుతమైన విధానం. భక్తి అంటే అచ్చంగా మిమ్మల్ని మీరు అర్పించుకోవడం అని అర్థం. భక్తి - మేధస్సు తాలూకు పూర్తి విభిన్నమైన పార్శ్వం. భక్తి అనేది ఒక చర్య కాదు; భక్తి అనేది దాని గురించో లేదా దీని గురించో కాదు, మీరు లయం అయిపోవడం భక్తి. అప్పుడు దివ్యత్వం అనేది మీ శ్వాసగా మారుతుంది.

 

 

విధానం:మీరు మీ చుట్టూ ఉన్న ప్రతీదానిని మీకంటే మరింత గొప్పవిగా, వాటి పట్ల భక్తి భావంతో చూడండి. మనం పీల్చే గాలి, మనం తాగే నీరు, తినే ఆహారం, చెట్లు, సూర్యుడు, క్రిమి కీటకాదులను సైతం – మీరు భక్తి భావంతో చూడండి.

 

మీరు దీనిని ప్రతిరోజూ 12 నిమిషాలు లేదా 20 నిమిషాలు లేదా 40 నిమిషాల పాటు చేయవచ్చు.

 
 

సద్గురు అందించిన యోగ యోగ యోగేశ్వరాయ స్తుతి అనేది ఆదియోగి అయిన శివుడు మానవాళికి చేసిన అసమాన మహోపకారానికి ఒక నీరాజనం.

 

విధానం: మీరు కళ్ళు మూసుకొని, తలను కొద్దిగా పైకి ఎత్తి కనీసం 12 లేదా 21 సార్లు (లేదా మీకు వీలైనంత సమయం పాటు) స్తుతించాలి.

 

 
 

ఎవరైతే ఏ ఇతర ఈశా కార్యక్రామాలు పూర్తి చేయలేదో, వారు పై వాటితో పాటు, ఈ క్రింద ఇవ్వబడిన సాధనలను వరుస క్రమంలో చేయవచ్చు:

 
 

యోగ నమస్కారం అనేది ఒక సరళమైన, శక్తివంతమైన పద్ధతి. ఇది వెన్నెముకలోని లంబార్ రీజియన్(నడుం దగ్గర వెనక్కి వంగి ఉండే వెన్ను భాగం)ను పునరుత్తేజితం చేసి, వెన్నుతో పాటు కండరాలను బలోపేతం చేసి, వయసు పై బడడం ద్వారా వచ్చే వెన్ను వంగిపోవడాన్ని దూరం చేస్తుంది. అంతేకాకుండా యోగనమస్కారం వలన పూర్తి శరీరానికి కూడా అన్ని విధాలుగా కలిగే ప్రయోజనాలు అనేకం.

 

మీరు ప్రతిరోజూ కనీసం 3 పర్యాయాలు యోగ నమస్కారం చేయగలరు.

 

 
 

నాడులు అనేవి శరీరంలో శక్తి ప్రవహించే మార్గాలు. నాడీ శుద్ధి ప్రక్రియ, నాడులను శుద్ధి చేయడం ద్వారా సమతుల్యమైన వ్యవస్థను ఇంకా మానసిక శ్రేయస్సును కలిగిస్తుంది.

 

వ్యవధి : కనీసం 4 నిమిషాల పాటు చేయండి

 

 
 

నాద యోగా – శబ్దం లేదా ప్రకంపన ద్వారా యోగ - కొన్ని శబ్దాలను మీరు పలకడం ద్వారా మీలో ఆనందంతో కూడిన వాతావరణం కలిగించి, దానిని జీవించేందుకు సహజమైన విధానంగా మలచుకునేలా చేస్తుంది.

 

 
 

శాంభవీ ముద్ర ఒక సులభమైన, సునాయాసమైన ప్రక్రియ. ఇది మీ అవగాహనను పెంపొందించి, మిమ్మల్ని జీవితపు అనుగ్రహ పార్శ్వానికి మరింత చేరువ చేస్తుంది.