ప్రసూన్ జోషి:సద్గురూ! నాకు ఎప్పుడూ ఉండే ప్రశ్న ఏంటంటే, మన జీవితంలో అంకెలు లేకపోతే, ఈ సంఖ్యలన్నవే లేకపోతే  నేను ఈ ప్రకృతితో మరింతగా మమేక మవ్వగలిగేవాడినేమో కదా?

సద్గురునమస్కారం ప్రసూన్. మీరు మాటల మాంత్రికులని నాకు తెలుసు-మీకు అంకెలు గిట్టవా? సరే, ‘నేను’.. ‘మీరు’ అంటే రెండు ఉన్నాయనే కదా. లేదా మీరు, “ నేనే” అన్నా  ఒక్కటి ఉన్నట్టు. ఒక్కసారి ఆ ‘ఒక్కటి’ అంటూ ఉన్నాక, అదే పదులు, వందలు, వేలు, లక్షలు కావడం సహజం. సంఖ్య అనేది కేవలం వయసుకీ, సమయానికీ, నిద్రకీ, ఇతర పనులకీ పరిమితం కాదు. మీరు, నేను అంటేనే రెండు సంఖ్యలు. 

సంఖ్య అనేది కేవలం వయసుకీ, సమయానికీ, నిద్రకీ, ఇతర పనులకీ పరిమితం కాదు. మీరు, నేను అంటేనే రెండు సంఖ్యలు. 

మీరొకసారి ‘నేను’ అన్నారంటే, మీరు ఒక సంఖ్యను సృష్టించారనే. అంటే నేను అనేది కూడా ఒక సంఖ్యేగా! సంఖ్యలకు అతీతంగా ఉండటానికి ఉన్న ఒకే ఒక మార్గం, “శూన్యం”. మీరు యోగాలో ఉంటే, మీరు ‘శి-వ’ లాగా ఉన్నారని, దానర్థం ‘లేనిది’ అని. లేక మీరు ‘శూన్య’  అంటే మీరు లేననే కదా! 

యోగా అన్న పదానికి అర్ధమే ఐక్యం, అంటే. ఇది మీ వ్యక్తిత్వానికున్న హద్దుల్ని చెరిపేసే ఒక శాస్త్రం. మీకున్న వ్యక్తిత్వమనే హద్దుల్ని చెరిపెయ్యటమంటే, ముందుగా ఆ మొదటి సంఖ్య-“నేను” అనేదాన్ని చెరిపేయడం. ఒకసారి ఆ ఒకటిని తీసేస్తే, ఇక వేలు, లక్షలు, లక్షల కోట్లు కూడా ఉండవు. అంతా శూన్యమే. యోగా అంటే, ఈ సంఖ్యలను చెరిపివేయడం. యోగ అంటే ఐక్యం. ఐక్యమంటే ఏంటి, “నువ్వు-నేను”అన్నది లేదు, ”ఎన్నో” అన్నవి లేవు. ఉన్నది ఒక్కటే. . . కానీ ఆ ఒక్కటి కూడా లేదు కాబట్టీ అది శూన్యం. దీన్నే ఎన్నో రకాలుగా చెప్పారు. దీన్ని” శూన్యం” అంటారు దీన్నీ “శివ” అని కూడా అంటారు. నిజానికి దీనర్ధం “ఏదైతే లేదో- అది” అని అర్ధం. ”ఏదైతేలేదో” దానికి సంఖ్య ఎలా ఉంటుంది? - ఉన్నవాటికే కదా సంఖ్య ఉండేది.

భౌతిక ఉనికి ఉండడం వల్లనే సంఖ్యలనేవి ఉన్నాయి. భౌతిక అస్తిత్వానికి అతీతంగా వెళ్ళగలిగితేనే, సంఖ్యలు లేని అస్థిత్వం సాధ్యపడేది. మనం దేన్నైనా అపరిమితం   అన్నప్పుడు దానికి అర్ధం అది సంఖ్యలు లేనిది అని. మనం దేన్నైనా అనంతం   అంటున్నామంటే, అది హద్దులు లేనిదని అర్ధం. హద్దులు లేవంటే ఇక ఒకటి రెండూ ఏవీ లేవని అర్ధం. సంఖ్యలు లేని స్థితి సాధ్యపడేది మనం యోగంలో లేదా ఐక్య స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే.

మా ప్రయత్నం అదే. నా జీవితంలో నేను చేస్తున్న కృషి అంతా... అందరినీ ఆ సంఖ్యారహిత స్థితి అనుభవం వైపుకు తీసుకువెళ్ళాలనే. కానీ... మీరు మీ మాటల గారడీని కొనసాగించండి ప్రసూన్. సంఖ్యల గారడీ కూడా గణితంలో ఎంతో అందంగా ఉంటుంది, మాటల గారడీ లాగానే.

సంఖ్యలు లేని స్థితి సాధ్యపడేది మనం యోగంలో లేదా ఐక్య స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే. మా ప్రయత్నం అదే. అందరినీ ఆ సంఖ్యారహిత స్థితి అనుభవం వైపుకు తీసుకువెళ్ళాలనే

అందుకే ఈ సంఖ్యలూ, మాటలూ రెండు వేరు విషయాలు కాదు. ఒక మాట ఉంటే ఎన్నో మాటలు ఉంటాయి-ఒక సంఖ్య ఉంటే ఎన్నో సంఖ్యలు ఉంటాయి. ఇదంతా భౌతిక ఉనికి ప్రతిఫలమే. మనం గనుక ఈ భౌతికాన్ని దాట గలిగితే అప్పుడు ఆ స్థితికే... మనం ఎంతో కలుషితం చేసేసిన “ఆధ్యాత్మికం” అనే పదం వాడతాం. ఆధ్యాత్మికం అంటే “సంఖ్యలు లేని ఉనికి” అని అర్థం. 

సంపాదకుడి సూచన: మిమ్మల్ని ఏదైనా ప్రశ్న తొలిచివేస్తుందా, ఎవ్వరినీ అడగలేని ప్రశ్న మీలో మొదలైందా? ఇదే మీకున్న అవకాశం..సద్గురుని ఇక్కడ అడగండి..UnplugWithSadhguru.org.

Youth and Truth Banner Image