ప్రశ్న: హిందూ సనాతన ధర్మం అంటే ఏమిటి??అది ఇప్పుడు నీరు గారిందా?

సద్గురు: ‘హిందూ సనాతన ధర్మం’ అంటూ ఏమీ లేదు. అది ‘సనాతన ధర్మం’ అంతే. ‘సనాతన’ అంటే, శాశ్వతమైనదని అర్ధం. శాశ్వతం అంటే ఎప్పటికీ ఉండే సత్యం అని అర్ధం.

ఈ ఉనికికే ఆధారమైనసనాతన ధర్మం అనేది జీవితంలోని ఎప్పటికీ మారని పార్శ్వానికి సంబంధించింది. ఒక వానపాము, కీటకం, పక్షి లేదా ఒక మొక్క, ఏదైనా సరే, అన్నిటికీకూడా ఈ ఉనికికి వర్తించే ప్రాథమికనియమాలే వర్తిస్తాయి,అదే సనాతన ధర్మం. మనిషిపై మనిషి నియంత్రణ కోసమో, సమానత్వం కోసమో సంఘంలో పెట్టుకున్న శిక్షాస్మృతులు కావు ఇవి.ఎందుకంటే, ఆ లావాదేవి చట్టాలు తర తరానికీ మారిపోవాల్సి ఉంటుంది. అది వేరే విషయం. మనం మాట్లాడేది లావాదేవిచట్టం గురించి కాదు, మనం మాట్లాడేది ఎప్పటికీ నిలిచి ఉండే ధర్మం గురించి.

మీరెక్కడున్నా భారతీయుడైనా, హిందువైనా కాకున్నా సనాతన ధర్మం అందరికీ వర్తిస్తుంది.

ముందుగా మనం ధర్మం అనే పదాన్ని అర్ధం చేసుకుందాం. ధర్మం అంటే, నియమం. ధర్మం అంటే, మతం కాదు. ఈ సంస్కృతిలో మనకి మతం అంటే ఏమిటోటో తెలియదు. మనకి తెలిసిందల్లా, మన జీవితం ఉత్తమంగా నడవటానికి అంతర్లీనంగా ఉన్న నియమాలు మాత్రమే. ఎందుకంటే, ఆ నియమాలకి కట్టుబడి ఉండకపోతే మన జీవితం సరిగ్గా సాగదని మనంఅర్థంచేసుకున్నాము.ఈనియమాలుమన మీద ఆపాదించినవి కావు, అవి మన ఉనికికి ఒక పునాది, ఒక ఆధారం. మీరు వీటిని సరిగా అర్ధం చేసుకుంటే, జీవితం హాయిగా సాగిపోతుంది ఎందుకంటే, మీకు ఎలా ఉండాలో తెలిసింది కనుక,, దానికి మీరు కట్టుబడి ఉంటారు కనుక.. మీకు అది తెలియకపోతే మాత్రం, అనవసరంగా మీరు ఇబ్బంది పడతారు.

సనాతన ధర్మం హిందువులకి సంబంధించిందా, భారతీయులకి సంబంధించిందా, లేదా ఇంకొకరికి సంబంధించిందా? - అది కాదు అసలు విషయం. మీరు ఎక్కడున్నా, మీరు భారతీయులైనా, హిందువులైనా, వేరేమతస్తులైనా, మీరుఇంకేదైనా, సనాతన ధర్మం అందరికీ వర్తిస్తుంది, ఎందుకంటే ఈ నియమాలు మన ప్రాథమిక జీవ ప్రక్రియకుమార్గదర్శకాలు. ఏ సంస్కృతీ కూడా దీనివైపు, మనం చూసినంత లోతుగా చూడలేదు. అందుకే మనం, గొప్పగా, ఇది ‘హిందూ సనాతన ధర్మం’ అని అంటూ ఉంటాము. కానీ మనం ఈ రోజున ‘హిందు’ అనే పదం వాడి సనాతన ధర్మం యొక్క విస్తృతిని తగ్గిస్తున్నాము.. హిందు అనబడేది భౌగోళిక గుర్తింపు. హిందుమహాసముద్రానికీ హిమాలయాలకీ మధ్య ఉన్న భూభాగమే ‘హిందు’. సనాతన ధర్మం ప్రతి జీవికీ వర్తిస్తుంది. సనాతన ధర్మం జీవితంలో వివిధ అంశాలను. పుట్టబోయేవారిని,పుట్టినవారిని, ఎదిగినవారిని, జీవితంలో వివిధ దశల్ని, చివరికి చనిపోయిన తరువాత కూడా ఎలా నిర్వహించుకోవలో తెలుపుతుంది .జీవితాన్ని లోతుగా చూసే విధానం ఇది.

స్మృతి ఇంకా శృతి

మీరు ఇక్కడికి ఒక వంద సంవత్సరాల క్రితంవచ్చి ఉంటే, మీరు వేరే విధంగా బట్టలు వేసుకుని ఉండుంటారు. ఇంకా వేరే ఏదో చేస్తుండేవారు. వెయ్యి సంవత్సరాల క్రితం వచ్చి ఉంటే, మీరు ఇంకేదో చేస్తుండేవారు– ఒక రైతుగానో లేదా జాలరిగానో.

ఇవాళ మనం ఏ పని చేస్తున్నామో, ఎలా బట్ట కడుతున్నమో, ఎలా మాట్లాడుతున్నామో, ఎలా ప్రవర్తిస్తున్నామో, తరాన్ని బట్టి మారుతూ ఉంటుంది. రేపటి తరం ఎలా ప్రవర్తిస్తుందో, వాళ్ళ కట్టు-బొట్టు ఎలా ఉంటుందో, వాళ్ళు ఏం చేస్తారో, అది ఇప్పుడు మనం చేసేదానికంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇది జీవితంలో ఒక పార్శ్వం - దీన్ని “స్మృతి” అని అంటాము. . స్మృతి అంటే అర్ధం ‘జ్ఞాపకం’ , లేదా “జ్ఞాపకం నించి” అని. జ్ఞాపకంనుంచిమీరు నేర్చుకున్నదే స్మృతి.

మన తల్లితండ్రులు, మన సంప్రదాయం ఏం చేసిందో, మనము అదే చేస్తున్నాము,, లేదా దానికి విరుద్ధంగా వేరుగానైనా కొనసాగుతున్నాము.. ఇది తరతరానికీ నిరంతరం మారుతూ ఉండే ప్రక్రియే కాదు, మన జీవితకాలంలోనే, ప్రతి కొన్ని సంవత్సరాల్లో మన స్మృతులు మారిపోతున్నాయి.. మన జీవితాల్లో జ్ఞ్యాపకాల వల్ల మనం ఎంతో మారుతున్నాం కదా!కానీస్మృతి అనేది ప్రతి తరం కొత్తగా, కాలానుగుణంగా మార్పులు చేర్పులతో తయారు చేసుకునేది.పరిణామం చెందటం అంటే, మనం గత తరం కన్నా గొప్పగా ఉన్నాము అని కాదు అర్ధం. పరిస్థితుల మార్పుకి అనుగుణంగా మనని మనం సర్దుకుంటున్నాము అని అర్ధం అంతే.సామాజిక లావాదేవీలు మారటమే కాకుండా, పరిణామం కూడా చెందాలి. ఇప్పుడు ఒక చర్చ పెట్టి,ఒక వంద సంవత్సరాల క్రితం మీరు ఎలా తిన్నారో, మనం ఇప్పుడు అలా తినకూడదు అని చెప్పవచ్చు, ఎందుకంటే మన పనితీరు మారింది, మీరుపొలం దున్నేటప్పుడు మీరు ఏమి తిన్నారు, ఎంత తిన్నారు అనేది వేరే విషయం. మీరుపనులు ఎలా చేస్తారనేది ఖచ్చితంగానిత్యం మారుతూ ఉండాలి.మన రాజ్యాంగంలో కూడా మనం మార్చలేని కొన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి. అవి మీరు అసలు ముట్టుకోలేరు, కానీ మిగిలినవన్నీ సవరణకి, మెరుగుదలకీ, కొట్టివేతలకీ అందుబాటులోనే ఉన్నాయి.

మీ స్మృతి నా స్మృతి వేరు అయ్యి ఉండచ్చు.ఇది కాక ‘శృతి’ అనేది ఒకటి ఉంది. దాన్ని ఎన్నో రకాలుగా అర్ధం చేసుకోవచ్చు. కానీ దాని ఒక పార్శ్వం ‘జీవన గమనం’. అది మీరు శృతి చెయ్యలేరు - అదే ‘సృష్టి’.

మీకు జీవితంలోని శృతి అర్ధమైతేనే, మీకు దాని లయ అర్ధమవుతుంది. ‘భారత’ అంటే అదే. ‘భ’ అంటే, భావం లేదా జీవితం యొక్క అనుభవం. ‘ర’ అంటే, రాగం అదే జీవిత శృతి. ‘త’ అంటే తాళం. భావం మీకు జరిగేది. అది అనుభవం. కానీ రాగం అప్పటికే అమరి ఉంది. శృతి కూడా అమరి ఉంది. ఇప్పుడు మీరు దానికి సరైన ‘లయ’ని కనుక్కోవాలి. అప్పుడు జీవితం చక్కటి సంగీతంగా మారుతుంది. మీరు ఆ లయని కనుగొనలేకపోతే, మిమ్మల్ని సరిచేసే ఆ శృతే మిమ్మల్ని నులిమేస్తుంది.

కానీ శృతి మారదు. ఎందుకంటే, అది మీరు నిర్ణయించింది కాదు. సృష్టిచే నిర్మితమైనది. సనాతన ధర్మం అంటే మీ జీవితాన్ని నడిపిస్తున్న దానిని అర్ధం చేసుకుని , మీరు ఒక అందమైన విశిష్టమైన జీవితాన్ని సాగించడమే.

నియమాలతో (ధర్మంతో) మమేకమవటం

ఈ సంస్కృతిలో ఎవరూ కూడా నీతి నియమాలు, ఆజ్ఞలు, ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, నువ్వు ఇది చేస్తే స్వర్గానికి వెళ్తావు, ఇది చేస్తే నరకం తప్పదు అని చెప్పిన దాఖలాలు లేవు. ఎందుకంటే, మనం పెంపొందించుకున్న పార్శ్వం , మీరుమీ ప్రకృతి ధర్మాలకి లోబడి ఉంటే, మీకు శిక్షలూ అక్కర్లేదు, బహుమానాలూ అక్కర్లేదు.మీరు ట్రాఫిక్ నియమాలకి కట్టుబడి బండి నడుపుతుంటే, రోడ్డు మీద ఒక్క పోలీసు కూడా అక్కర్లేదు.

సనాతన ధర్మం మీకు గానీ నాకు గానీ చెందినది కాదు - అది సృష్టి నియమించిన ధర్మం

ఈ గ్రహం మీద ప్రస్తుతం సుమారు లక్ష కోట్లకు పైగా జీవరాశులు ఉన్నాయంటారు. కానీ నా ఉద్దేశంలో మనకి తెలీనివి ఇంకా ఇంకెన్నో ఉన్నాయి. ఒక సూక్ష్మజీవి నించీ ఒక మనిషి వరకూ, ఇంకా ఆమధ్యలో ఉన్నవన్నీ అదే మట్టిలో నుండి వచ్చాయి.ఈ మట్టి నించే, ఈ చెట్టు ఎదుగుతోంది, ఈ లతలూ ఎదుగుతున్నాయి. అదే మట్టి నుండి మీరు ఆహారం తింటే, మీకుఒక లాంటిశరీరం వచ్చింది, అదే మట్టి నుండి నేను ఆహారం తింటే, నాకుఒక లాంటిశరీరం వచ్చింది.

మీరుఎంత ప్రయత్నించినా, ఒక చెట్టుగానో, పిల్లిగానో, కుక్కగానో, ఆవుగానో, ఏనుగుగానో లేదా పులిగానో మారలేరు.మూలం ఒకటే. వైవిధ్యమైన ఆ వ్యక్తీకరణ చూడండి. అంటే, ఏది ఏమైనా దానిని పరిపాలించే ఒక ధర్మం ఉందనే కదా అర్థం. అది మీరు ప్రయాణిస్తున్నఒక రైల్వే మార్గం లాంటిది. ప్రశ్న ఏమిటంటే, మీరు ఎంత వేగంగా ఎంత దూరం వెళ్ళగలరు అనేదే. ఎంత లోతుగా మనం ఆ ధర్మాలను నియమాలను అర్ధం చేసుకుని మనం దానికి ఎంత అనుగుణంగా ఉన్నాం అనేదే.

నిజానికి యోగ సంప్రదాయం పూర్తిగా దీని గరించే–మనిషి ఈ ఉనికితో అనుగుణంగా ఉండటం గురించే, ఎందుకంటే దానివల్ల మీ జీవితం ఉల్లాసంగా, బ్రహ్మానందంతో, పూర్తి సామర్ధ్యంతో గడుస్తుంది. మీ జీవితంలో తప్పుగా జరిగేది ఏదైనా ఉంటే అది ఇదొక్కటే - మీ జీవితం పూర్తిగా వ్యక్తం అవుతుందా లేదా అనేదే. ఒక చెట్టుకి జరిగే చెడు ఏముంటుంది? అది దాని పూర్తి సామర్ధ్యంతో ఎదుగుతుందా లేదా సగమే ఎదుగుతుందా అనేదే. మనుషులకి కూడా అంతే. మీరు ఆ నియమాలకి అనుగుణంగా ఉంటే, మీరు మీ పూర్తి సామర్ధ్యంతో ఎదుగుతారు. లేకపోతే, మీరు ఏదో విధంగా బతుకు ఈడుస్తారు. మనుషులకు ఇది తెలియకపోవచ్చు కానీ, నిజానికి మనకున్నచింత అల్లా ఇదొక్కటే. వాళ్ళ కోరికలూ, ఆశయాలు, అభిలాషలు, అన్నీ ఒక నిండు జీవితంగా ఎదగటానికే.. మీరొక నిండైన జీవితం అవ్వాలనుకుంటే, ఈ జీవితం ఏ నియమాలకి అనుగుణంగా నడుస్తోందో అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం.

సనాతన ధర్మం మీకు గానీ నాకు గానీ చెందినది కాదు - అది సృష్టి నియమించిన ధర్మం. మీరైనా, నేనైనాదానికి అనుగుణంగా ఉండటమే. ఇక్కడ భారతదేశంలో దానిని అర్ధం చేసుకుని క్రోడీకరించి ఒక విధంగా అమర్చాము.. దాని అర్ధం ప్రపంచంలో ఇంకెవరికీ ఇది తెలియదని కాదు. ఎందరికో ఇది తెలిసి ఉండచ్చు, కానీ వాళ్ళు దీన్ని శృతి - స్మృతి అని రాసుకుని ఉండరు. కానీ ఎందరో మనుషులు దీనికి అనుగుణంగా మెలుగుతూ ఉండి ఉంటారు. ఎందుకంటే అన్ని చోట్లా మనుషులు వికసించి హాయిగా జీవించారు.

ఇప్పుడు సనాతన ధర్మం పల్చబడిందా అంటే,అదేమీ మన చేతుల్లో ఉన్నది కాదు పల్చబడవేయటానికి. వ్యక్తిగత అవగాహన పల్చబడి ఉండవచ్చు. ఒకవ్యక్తికీమరొక వ్యక్తికీఅవగాహనలో ఎంతో వ్యత్యాసం ఉంటుంది.కానీ మీరు సనాతన ధర్మాన్ని పల్చబరచలేరు, ఎందుకంటే, అదే ఈ ఉనికికి ఆధారం. మీరు దానిని సృష్టించలేదు కాబట్టి, మీరు దానిని పల్చబరచలేరు.

ప్రేమాశీస్సులతో,

సద్గురు