నాకు నిజంగా కొండలు, పర్వతాలు అంటే చాలా ఇష్టం. ఇక మైసూరు చాముండి హిల్స్ నయితే నేను ప్రేమించాను. ఆ రోజుల్లో మైసూరు నగరంలోని యువకులకు అదొక ఆనవాయితీ గా ఉండేది, అదేమిటంటే - వారు కొత్తగా మొటార్ సైకిల్ నేర్చుకోవాలంటే చాముండి హిల్స్ కు వెళ్తారు. వారు ప్రేమలో పడితే చాముండి హిల్స్ కు వెళ్తారు. వారు ప్రేమలో విఫలమైతే చాముండి హిల్స్ కు వెళ్తారు. వారు ధ్యానం చేయాలంటే చాముండి హిల్స్ కు వెళ్తారు. మొత్తం మీద వారికేం జరిగినా చాముండి హిల్స్ కు వెళ్తారు . ఏం జరగక పోయినా వారు చాముండి హిల్స్ కు వెళ్తారు. అదొక ఆచారం అయింది.

ఆ రోజుల్లో నా జీవితంలో, నేను రకరకాల వ్యాపార కార్యక్రమాలలో పూర్తిగా మునిగి పోయి ఉన్నప్పుడు, ఒకానొక అద్భుతం నాలో సంభవించింది. ఆ రోజు నాకు ఖచ్చితంగా గుర్తుంది. అది సెప్టెంబర్ 23, 1982.

నేను ఈ ప్రాంతానికి తరచూ వెళ్ళేవాడిని. ఈ ప్రాంతంలో నేను విస్తృతంగా తిరిగాను, బసచేశాను, ధ్యానం చేశాను, యింకా చాలా చాలా కార్యక్రమాలు చేశాను. నేను నా వ్యాపార సమావేశాలను కూడా చాముండి హిల్స్  పైనే నిర్వహించే వాడిని. అందుకే ఈ స్థలం నేను ఎక్కువ సమయాన్ని వెచ్చించిన స్థలం అన్నమాట. ఆ రోజుల్లో నా జీవితంలో, నేను రకరకాల వ్యాపార కార్యక్రమాలలో పూర్తిగా మునిగి పోయి ఉన్నప్పుడు, ఒకానొక అద్భుతం నాలో సంభవించింది. ఆ రోజు నాకు ఖచ్చితంగా గుర్తుంది. అది సెప్టెంబర్ 23, 1982. ఆ రోజు నుండి నేను తిరిగి అదే వ్యక్తిగా ఎప్పుడూ లేను. ఆ రోజు మధ్యాహ్నం నాకు రెండు వ్యాపార సమావేశాల మధ్య కొంత ఖాళీ సమయం దొరికింది. అంతే, నేను నా బండిని చాముండి హిల్స్ వైపు నడిపాను. కొండపై బండి నిలిపి ఒక ప్రత్యేకమైన రాయి దగ్గరికి వెళ్ళాను. అది చాలా విశాలమైన రాయి. అదే నేను తరుచుగా కూర్చునే స్థలం. ఆ రాయి పై నేను కళ్ళు తెరుచుకునే కూర్చున్నాను. కొన్నినిమిషాల తరువాత నేనెక్కడున్నానో నాకు తెలీలేదు. ఆ క్షణం వరకూ అందరిలాగే నేను కూడా, ఈ శరీరం ‘‘నేను’’ ఆ శరీరం మరొకరు’’ అనే నమ్మేవాడిని. అయితే అకస్మాత్తుగా కొన్ని నిమిషాలలో ఏది నేనో, ఏది నేను కాదో తెలియలేదు. ‘‘నేను’’ ఏంటో అది ప్రతిచోటవుంది. నేను ఏ రాయి పై అయితే కూర్చున్నానో ఆ రాయి, నేను పీలుస్తున్న గాలి, నా చుట్టూ ఆవరించి వున్న వాతావరణం, ప్రతీదీ వూరికే అలా నేను అయిపోయింది.

నా శరీరంలోని ప్రతీ అణువు ఒక కొత్త అనిర్వచనీయమైన స్థితిలో, ఒకానొక పారవశ్యంతో ఓలలాడుతోంది. నాకు దాన్నిగురించి చెప్పడానికి వేరే పదాలే దొరకలేదు. 

దీని గురించి నేను ఏం చెప్పినా, అది అర్థం లేని విషయంగా, బుద్ది లేని తనంగా అనిపిస్తుంది. నేనా స్థితిలో 10 లేక 15 నిమిషాలు వున్నా అనుకున్నా. నేను అక్కడ మధ్యాహ్నం 3 గంటలకు కూర్చున్నాను. కాని నేను, మనం అనుకునే సాధారణ స్థితిలోకి వచ్చినప్పుడు, అప్పుడు సమయం రాత్రి 7.30 నిమిషాలు అయింది. అంటే నాలుగున్నర గంటలు గడిచిపోయాయి. సూర్యుడు అస్తమించాడు. నా కళ్ళు తెరిచే వున్నాయి. నేను పూర్తిగా మేలకువగానే వున్నాను. కానీ సమయం వూరికే జారిపోయింది. అయితే పెద్దవాడిని అయ్యాక మొట్ట మొదటిసారి నా జీవితంలో, నా కళ్ళ వెంట నీరు కారుతోంది. నా ఎనిమిది సంవత్సరాల వయస్సు నుండి, నేను కన్నీళ్ళు అంటే చాలా చిన్నతనంగా భావించే వారిలో ఒకడిని. నేను ఎప్పుడూ నా కంటి నుండి ఒక్క చిన్న నీటి చుక్కను కూడా రానీయ లేదు.

నేను అలా జీవించాను. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా నా కన్నీళ్ళు ఎంతగా వర్షించాయంటే, నా చొక్కా తడిసిపోయింది. నేను ఎప్పుడూ చాలా సంతోషంగా, శాంతిగా వుంటూ వచ్చాను. అది ఎప్పుడూ ఒక సమస్యగా లేదు. నేను చేసే ప్రతి దంట్లో విజయం సాధిస్తూ వచ్చను. ఎటువంటి సమస్యలూ లేని యువకుడిని. అయితే ప్రస్తుతం, నా శరీరంలోని ప్రతీ అణువు ఒక కొత్త అనిర్వచనీయమైన స్థితిలో, ఒకానొక పారవశ్యంతో ఓలలాడుతోంది. నాకుదాన్నిగురించి చెప్పడానికి వేరే పదాలే దొరకలేదు. నాకుఏం చెప్పాలో తెలియలేదు. నాలో ఏం జరుగుతోందో నాకే తెలియలేదు. నాకేం జరిగి వుండవచ్చు?’’ అని నన్ను నేను అడిగినప్పుడు, తర్కంలో గట్టి శిక్షణ గలిగిన నా మనస్సు చెప్పగలిగినది ఏంటంటే బహుశా నిన్ను యితరుల నుండి వేరుచేసే ఒకానొక పరికరాన్ని నీవు కోల్పోతున్నావు’’ అని. ఇదే విషయాన్ని నేను నా అత్యంత సన్నిహిత మిత్రులలో ఒకరితో పంచుకుంటే, వాళ్ళు అడిగింది అంతా ఒక్కటే అప్పుడు నీవు ఏదన్నా తాగి వున్నావా? లేక నీవు ఏదయినా మాదక పదార్ధం తీసుకున్నావా?’’ అనే.

ఇదే వాళ్ళు నన్ను అడగగలిగింది. నాకు తెలుసు దాని గురించి మాట్లాడడానికి ఏం లేదు అని. ఎందుకంటే దాన్ని నా చుట్టూ వున్న మరెవరికీ నేను అన్వయించలేక పోయాను. ఏదో అత్యంత అద్వితీయమైన సంఘటన నాలో జరుగుతోంది. అందుకే నాకు దాన్ని పోల్చేందుకు ఏదీ దొరకలేదు. నాకు తెలిసిందల్లా ఏంటి అంటే, నేను ఒక బంగారు నిక్షేపాన్ని నేను తాకాను. నాలోనే వున్న, పేరు లేని ఒక బంగారు నిక్షేపాన్ని నుండి నేను కనీసం ఒక్క క్షణం కూడా దూరం కావడానికి యిష్టపడను. నాకు తెలుసు ఏదయితే జరుగుతుందో అది పూర్తిగా పిచ్చితనం. కానీ నేను దాన్ని ఒక్క క్షణం కూడా కోల్పోవాలని అనుకోవడం లేదు. ఎందుకంటే అత్యంత అద్భుతమైనది, అనన్యసామాన్యమైనది నాలో సంభవం అవుతోంది.

నాలోనే వున్న, పేరు లేని ఒక బంగారు నిక్షేపాన్ని నుండి నేను కనీసం ఒక్క క్షణం కూడా దూరం కావడానికి యిష్టపడను. ఎందుకంటే అత్యంత అద్భుతమైనది, అనన్యసామాన్యమైనది నాలో సంభవం అవుతోంది.

ఆరు లేక ఏడు రోజుల తరువాత మరొకసారి యిలాగే జరిగింది. అప్పుడు నేను నా కుటుంబ సభ్యులతో భోజనం బల్ల దగ్గర కూర్చుని వున్నాను. అప్పుడు నేను ఆ సమయాన్ని కేవలం రెండు నిమిషాలు అనే అనుకున్నాను. అయితే 7 గంటల సమయం జరిగి పోయింది. ఆ రోజు తరువాత నేను ఈ అసాధారణమైన అనుభవానికి తరుచూ లోనవడం మొదలు అయింది. ఒక్కోసారి ఈ అనుభవం అయిన తరువాత నేను కనీసం మూడు లేదా నాలుగు రోజులు పూర్తిగా మెలకువతో వుండే వాడిని. చాలా సార్లు నేను కనీసం రెండు, మూడు రోజులు భోజనం చేసేవాడిని కాదు. 

ఒకసారి యిదే అనుభవం 13 రోజులు కొనసాగింది. అది అప్పుడు చాలా తీవ్రరూపం దాల్చింది. అప్పటికే కొంతమంది వ్యక్తులు నా చుట్టూ చేరారు. ఎవరో నన్ను పూలమాలతో అలంకరించారు. కొందరు వ్యక్తులు ఓఁ యితను సమాధిలో వున్నాడు’’ అనడం మొదలుపెట్టారు. అప్పటివరకునేను అసలు సమాధి అనే పదాన్ని వినలేదు. ఈ అనుభవం మళ్ళీ మళ్ళీ సంభవిస్తూనే వుంది. ఒక ఆరు వారాల సమయం లోపలే, అది ఒక సజీవ సత్యంగా నాలో అవిభాజ్యం అయింది. నాకుసంబంధించిన ప్రతీదీ ఆ ఆరు వారాలలో పూర్తిగా మారిపోయింది. నేను ఈ అనుభవాన్ని వూరికే అలా నిర్లక్ష్యం చేయలేక పోయాను. నా గొంతు , కనుల యొక్క ఆకరం మారిపొయయి. మీరు అప్పటి నా ఫొటోలు చుస్తే , నా శరీరంలో వచ్చిన మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. 

నేను ఏదో చేయాలని నాకు తెలుసు. అయితే ఏం చేయాలో నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే. ఏ ఆనంద పారవశ్యం అయితే నాలో నుండి వూరికే పొంగి పొరలుతూ వుందో, అది ప్రతి వ్యక్తిలోనూ సంభవించ గలదు. అది నాకు తెలుసు. ప్రతి మనిషీ అదే మూల అంశాలను కలిగి వున్నాడు. కానీ యిది వారికి సంభవించడం లేదు. అందుకే ఈ నా అనుభవాన్ని ఏదో విధంగా వారిపై కూడా రుద్దడం చాలా మంచి విషయంగా అనిపించింది. అలా చేసేందుకుసరి అయిన మార్గాల కోసం నేను చూడడం మొదలుపెట్టాను. 

నేను ఏం అనుకున్నాను అంటే, నా స్నేహితులు అందరూ నా చుట్టూ వచ్చి వాలిపోతారు అని. అప్పుడు నేను వారిని ఆనంద పరవశులుగా చేయచ్చు అని అనుకున్నా. నేను వారికి చెప్పడం మొదలు పెట్టాను. ‘‘నేను మీకు ఒక విషయాన్ని బోధించాలనుకుంటున్నాను, మీరెందుకురాకూడదు?’’ అని. కానీ ఎవరూ రాలేదు. అందరూ నన్ను తప్పించుకుతిరిగారు. ఈ ఒక్క సంవత్సరంలోనే నేను ఒక ప్రమాదకరమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాను. ఎవరయితే వూరికే కూర్చుంటారో, ఎవరయితే మంచి అభివృద్ధిలో వున్న వ్యాపారానికి మధ్యలోనే నీళ్ళొదిలేశారో, అతన్ని నేను. అది నా సొంత వ్యాపారం. నేను ఆ వ్యాపారాన్ని పునాదుల నుండి అభివృద్ధి చేశాను. అంతే కాదు, నేను ఎవరికీ ఒక్క రూపాయి కూడా అప్పు లేను. అయినా ఎవరూ నా దగ్గరకు రావాలనుకోలేదు. దీనిని నేను జీర్ణించుకోలేక పోయాను.

 లక్షలాది మంది ఈ కార్యక్రమాలలో పాలుపంచుకన్నారు. తద్వారా లక్షలాది మంది జీవితాలు మారిపోయాయి.

మొత్తానికి ఒక ఎడుగురితో నా మొదటి కార్యక్రమం మొదలైంది. నేను మొదలు పెట్టిన మొదటి కార్యక్రమం నాలుగు రోజులు, రోజుకురెండు గంటల కార్యక్రమంగా మొదలయింది. నాలుగవ రోజు వారు యిది చాలా బాగుంది, మరో రెండు రోజులు పొడిగిద్దాం’’ అన్నారు. అందుకే అది ఆరు రోజుల కార్యక్రమంగా మారి పోయింది. అప్పటి నుండి యిక నేను వెనుతిరగడం అనేదే లేకుండా పోయింది. లక్షలాది మంది ఈ కార్యక్రమాలలో పాలుపంచుకన్నారు. తద్వారా లక్షలాది మంది జీవితాలు మారిపోయాయి. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలను, ఇళ్ళలోను, వ్యాపార క్షేత్రాలలోను మేము ఎంతో మందిని తయారు చేశాము. వారి దార్శనికత, వారి జీవితానుభవం సంకుచిత ఆలోచనా పరిధికి పరిమితం కాకుండా, అపరిమితమైన దానివైపు, శాంతి సద్భావన వైపు నాటుకుని ఉన్నాయి.

ప్రేమాశీస్సులతో,
సద్గురు