సద్గురు:: మానవ శరీరమైనా, విశ్వమైనా అవి పంచభూతాలైన – భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము – వీటి తోనే నిర్మించబడ్డాయి.

#1. నీరు

నీటికి అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉన్నదని నిరూపించడానికి ఇప్పుడు కావలసినంత శాస్త్రీయ నిదర్శనం ఉన్నది. మీరు నీటివంక చూస్తూ ఒక ఆలోచన చేస్తే ఆ నీటి కణనిర్మాణం మారిపోతుంది. మీరు నీటిని తాకినా అది మారుతుంది. అందుకే మీరు నీటితో ఎలా వ్యవహరిస్తారన్నది ఎంతో ముఖ్యం.

Watch the full video

#2. భూమి

మిగతా పంచ భూతాలకు, మన భౌతిక శరీర నిర్మాణానికి భూమి మూలాధారము. మన చుట్టూ ఉన్న భౌతిక పదార్ధానికి మూలము భూమే అయినా, దానిని మన జీవితాలకు మూలాధారంగా గ్రహించడం అవసరం, ఎందుకంటే చాలామంది తమ శరీరం, మనస్సులనే అనుభూతి చెందగలరు కాబట్టి. మన అంతరాల్లోంచి మూలభూతమైన భూమిని తెలుసుకోవడం, అనుభూతి చెందడం యోగ ప్రక్రియలో ఒక భాగం.

Read the full article 

#3. గాలి 

యోగ సంప్రదాయంలో గాలిని మనం ‘వాయువు’ అంటాము. అంటే దీనిని కేవలం నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైయాక్సైడ్ల మిశ్రమంగా కాక, అసలు చలనానికి ప్రతీకగా పరిగణిస్తారు. పంచ భూతాలలో ఈ వాయువే తేలికగా అందేది, నియంత్రణ చేయడానికి సాధ్యపడేది. అందుకే చాలా యోగ సాధనలు ఈ వాయువు ఆధారంగానే తయారయ్యాయి.

Read the full article 

#4.అగ్ని   

భారతీయ సంస్కృతిలో దీనిని అగ్ని దేవునిగా, రెండు ముఖాలు ఉన్నవానిగా, గొర్రెను స్వారీ చేసేవానిగా వ్యక్తీకరిస్తారు. అగ్ని రెండు ముఖాలు ప్రాణ ప్రదాతకు, ప్రాణ ఉపసంహారకునికి, ప్రతీకలు. మనలో అగ్ని లేకపోతే జీవ (ప్రాణ)మే లేదు. కాని, దానితో మనం జాగ్రత్తగా వ్యవహరించక పోతే, అగ్ని అదుపు తప్పి, వేగంగా అన్నింటినీ దహించి వేస్తుంది.

Read the full article 

#5.ఆకాశం 

ఆకాశాన్ని శూన్యంగా అర్థం చేసుకోవద్దు. అది ఈథర్. అసలు 'ఈథర్' కూడా సరైన పదం కాదు కానీ, అతి దగ్గరగా ఉన్న పదం. ఈథర్ అంటే అంతరిక్షం (ఖాళీ ప్రదేశం) కాదు, అది ఉనికి సూక్ష్మతర కోణం. అంతరిక్షం అంటే ‘కాలుడు’ లేక ‘లేనిది’. శి-వ అంటే ‘ఏది లేదో అది’. ఆకాశం అంటే ‘ఉన్నది ఏదో అది.’

ఈ పంచభూతాల సహకారం ఎవరికైనా ఎందుకు అవసరం?

ఈ పంచ భూతాలు సహకరించకపోతే, మీరెంత ప్రయత్నించినా ఏమీ జరగదు. వాటి సహకారంతోనే, అతి ప్రాధమిక అంశాల నుంచి, పరమోన్నత అంశం దాకా, మీ జీవితం ఒక సంభవమౌతుంది. ఈ పంచభూతాల మీద పట్టు సంపాదించడం లేక ఈ పంచభూతాలు మీకు సహకరించే విధంగా శుద్ధి చేయడం కోసం చేసే ప్రాధమిక యోగ సాధననే భూతశుద్ధి అంటారు.

మానవ వ్యవస్థ ఒక ద్వారం వంటిది. ఒక ద్వారాన్ని మీరు రెండు రకాలుగా చూడవచ్చు – మీకెప్పుడూ మూసిన ద్వారమే ఎదురౌతుంటే, మీకు ద్వారమంటే మిమ్మల్ని నిలిపివేసేది అని అనిపిస్తుంది. మీకు ద్వారాలు తెరుచుకుంటుంటే, అప్పుడు మీకు ద్వారమంటే మరో దానిలోకి వెళ్ళేందుకు అవకాశం అని అనిపిస్తుంది. ఏది ఏమైనా ద్వారం అదే, కాని మీరు దానికి ఎటు వైపున ఉన్నారు అన్నదే మీ జీవితంలోని ప్రతి దానినీ నిర్ణయిస్తుంది. చివరకు దేశ కాలాలను సహితం. మీరు ఈ శరీరాన్ని ఒక అవకాశంగా అనుభూతి చెందుతున్నారా లేక ప్రతి బంధనంగానా అనేది కూడా ఈ పంచ భూతాలు ఎంత వరకు మీకు సహకరిస్తున్నాయి అన్నదాని మీదనే ఆధారపడి ఉంటుంది.

ఈశా యోగాలోని ప్రతి సాధన కూడా - వ్యక్తిగతంగానూ, విశ్వపరంగానూ - పరమోన్నతమైన దానిని మీరు అందుకునే విధంగా, ఈ పంచభూతాలను మీరు వ్యవస్థీకరించుకునేందుకే. ఎందుకంటే ఈ రెండూ ఈ పంచభూతాల ఆట మాత్రమే కాబట్టి. మీ పరమోన్నత సంభావ్యతకు, వ్యక్తి భౌతికత అనేది మీకు ఆధారభూతమైన మెట్టా లేక అడ్డంకా అనేది, మీరు ఈ పంచభూతాలతో ఎలా వ్యవహరిస్తున్నారు అనేదాని మీదే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మీరుగా ఉన్నది - కొంత భూమి, నీరు, గాలి ఇంకా వేడిమి. ఈ అంశాలు అన్నీ మీ తోటలో ఉన్నాయి, కాని ఈ నాలుగింటినీ ఒక మానవునిగా చేయడానికి కావలసిందల్లా కాస్తంత దైవ స్పర్శ మాత్రమే.

ఇక్కడే కూర్చుని మీ శరీరంలో ఉన్న ఈ భూమి, నీరు, గాలి, అగ్ని ఎలా పనిచేస్తున్నాయో అనే విషయం పట్ల మీరు స్పృహతో ఉంటే, మీరు మీ జీవితాన్ని ఎంతో సునాయాసంగా జీవించగలరు. ఎంతవరకు అంటే, మిగతా వారందరూ మీరేదో 'సూపర్ మాన్' అనుకునే విధంగా. ఇదేదో సూపర్ మాన్ కావడం గురించి కాదు, మానవునిగా ఉండడమే ఎంతో గొప్ప (సూపర్) అని తెలుసుకోవడం. మీ మానవతనూ, ఈ మానవ (జీవ)వ్యవస్థనూ ఒక అడ్డంకిగా కాక, ఒక అవకాశంగా మీరు ఉపయోగించుకోవడం నేర్చుకోగలిగితే, మానవునిగా ఉండడమే గొప్ప విషయం.

మీ మానవ శరీరంలో ఈ పంచభూతాలు ఎంతెంత స్ధాయిలో ఉన్నాయి 

మార్మిక కోణాలు తెలుసుకునే ఉద్దేశం మీకు లేకపోతే, ఈ పంచభూతాలలో మీరు 'ఆకాశం' గురించి పట్టించుకోవలసిన పనిలేదు. మిగతా నాలుగింటిలో, మీ శరీరంలో 72 శాతం నీరే. మరో 12 శాతం భూమి, మరో 6 శాతం గాలి, అది చాలా సులువుగా స్వాధీనంలోకి తెచ్చుకోగలిగేది, ఎందుకంటే శ్వాస ఉంది కాబట్టి, దానిని ఒక నిర్ణీత పద్ధతిలో మీరు మీ స్వాధీనంలోకి తెచ్చుకునే వీలుంది. మరో 4 శాతం అగ్ని. ఈ అగ్నిని స్వాధీనంలోకి తెచ్చుకోవడం ద్వారా కూడా మీరు ఎన్నో చేయవచ్చు కాని మీరు గృహస్థాశ్రమంలో ఉన్నారు కాబట్టి, మీరు దానిని స్వాధీనంలోకి తీసుకోకూడదు. మిగిలినది ఆకాశం. మీకు ఉనికి యొక్క మార్మిక కోణాలు తెలుసుకోవాలన్న ఉద్దేశం లేకపోతే, దానిని గురించి పట్టించుకోనవసరం లేదు. హాయిగా బతకడానికి ఈ మిగిలిన నాలుగు చాలు. కేవలం సంతోషంగా బతికితే చాలు అనుకునేవారు అయిదో దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

పంచభూత దేవాలయాలు 

ఈ పంచభూతాలకు, ఐదు దేవాలయాలు ఉన్న దేశం భరత ఖండం. ఇవి భౌగోళికంగా డక్కన్ పీఠభూమిలో ఉన్నాయి. నాలుగు తమిళనాడులో, ఒకటి ఆంధ్ర ప్రదేశ్ లో. ఈ దేవాలయాలు అర్చనకు కాకుండా, సాధన కోసం నిర్దేశింపబడ్డాయి. ఈ పంచభూతాల మీదా సాధన చేయడానికి ప్రజలు ఒక దేవాలయం నుంచి మరో దేవాయానికి వెళ్ళేవారు.

ఒక దేవాలయంలో భూమి మూలకం పై సాధన చేసేవారు. నీటి మూలకం పై సాధన చేయడానికి తరువాతి దేవాలయానికి.. అలా ఒకదాని తర్వాత ఒకటిగా వెళ్ళేవారు. దురదృష్టవశాత్తూ, సాధన చేసే వాతావరణం కరువై పోవడం వల్ల ఈ దేవాలయాల మధ్య సమన్వయం లోపించింది. ఇప్పుడు ఇంకా ఆ దేవాలయాలు ఉన్నాయి కానీ వాటిలోని పరమార్ధం, సాధన కనుమరుగైపోయాయి. కొన్ని దేవాలయాలలో ఇంకా ఆ స్పందన, మూల భూత లక్షణం మిగిలి ఉన్నది, మరికొన్నింటిలో అది బలహీనమై పోయింది.

పంచ భూత దేవతలు 

ఈ పంచభూతాలను మనం ప్రతిష్టీకరణ చేయవచ్చు. ఉదాహరణకు మనం గాలి దేవుణ్ణి ప్రతిష్ఠ చేద్దామనుకుంటే, దానికి మనం ఒక శక్తి రూపాన్ని సృష్టించవచ్చు. యోగా సంప్రదాయంలో ఉన్నాం కాబట్టి, మనం సామాన్యంగా మానవ ఆకృతిని తయారు చేసుకోము. మనం ఒక దీర్ఘ వృత్తాభాస (ellipsoid)లింగ ఆకారం ఎంచుకుంటాము. ఎందుకంటే అతి తక్కువ సంరక్షణ ద్వారా కూడా అది ఎంతో కాలం నిలిచి పోతుంది.

Read the full article 

ఆదియోగి పంచభూతాల రహస్యాన్ని ఛేదించడం.  

sadhguru-wisdom-article-five-cornered-game-physicality-pancha-bhutas

15,000 సంవత్సరాలకు పూర్వం, ఆదియోగి ఈ పంచభూతాల గురించి మాట్లాడారు. ఆయన తన మొదటి ఏడుగురు శిష్యులకు, ఈ విశ్వమంతా ఈ పంచభూతాల కేళి అని పేర్కొన్నారు. అవి మీ శరీరంలో ఎంత మోతాదులో ఉన్నాయో, వాటి మీద ఎవరైనా నియంత్రణ సాధిస్తే, ఒక విధంగా మీరు ఈ సృష్టిమీదే నియంత్రణ సాధించినట్టే అని తెలియజేశారు.

మీకు సృష్టి మీద కొంత నియంత్రణ వచ్చినా, మీకు - సృష్టికర్తకు సరాసరి సంబంధం ఏర్సడుతుంది. ఈ శాస్త్రాన్ని, దాని వివిధ వ్యక్తీకరణలనూ శివుడు విపులంగా బోధించినప్పుడు, అక్కడ శిష్యులుగా కూర్చుని ఉన్న సప్తర్షులు, అదంతా చూస్తున్న ఆయన భార్య పార్వతి, ఆశ్చర్యపోయారు. వారికి నమ్మశక్యం కాలేదు. మొత్తం విశ్వం అంతా కేవలం పంచ భూతాలు అని – అందులో కూడా ఒకటి ఏమీ లేనిది, అంటే కేవలం నాలుగే నాలుగు వస్తువులు.

సృష్టి మూలాన్ని అందుకోవడానికి ఆదియోగి రెండు మార్గాలు చూపించారు 

వీటి వెనుకనున్న జ్ఞానాన్ని ఆదియోగి వివరించారు: కేవలం నాలుగు పదార్ధాలతో మీరు ఈ విశ్వాన్ని తయారు చేయవచ్చు.భౌతికంగా ఉన్నదంతా కేవలం చాలావరకు ఈ నాలుగు మూలకాలే. ఇక ఐదవ దానిని మీరు ఎక్కువ అనుభూతి చెందరు. మీకు కేవలం నాలుగు పదార్ధాలు ఇస్తే, మీరు సాంబారునన్నా తయారు చేయగలరా? సాంబారు చేయడానికి కూడా మీకు 25 వస్తువులు కావాలి.

కేవలం ఐదే ఐదు వస్తువులతో మీరు మొత్తం విశ్వాన్ని తయారు చేయగలరంటే, అది అద్భుతమైన తెలివి. ఈ పంచ భూతాల మీద పట్టు సాధించడానికి కావలసిన శాస్త్ర సాంకేతికతలను ఆదియోగి వివరిస్తూ వచ్చారు. ఇది వింటున్న ఈ ఏడున్నొక్కరు ఆయన చేస్తున్న ఈ ప్రదర్శనను చూస్తూ విస్తుపోయారు. ‘‘మీరు వీటన్నిటినీ మీ అధీనంలోకి అయినా తెచ్చుకోవచ్చు, లేక మీరు ఈ విజ్ఞానానికి పాదాక్రాంతమైనా అది మీకు లభిస్తుంది’’ అన్నారు ఆయన. ఆ ఏడుగురు పురుషులు దానిపై నియంత్రణ తెచ్చుకోవాలని ఉత్సాహ పడ్డారు. స్త్రీ అయిన పార్వతి, దానికి లొంగిపోయి దానిని తనలో భాగం చేసుకునేందుకు నిశ్చయించుకుంది.

అందువల్ల సాధన చేయడానికి ఆ ఏడుగురు పంపివేయబడ్డారు. పార్వతి ఆ జ్ఞానానికి తల ఒగ్గి, దానిలో భాగం అయినందున, ఆమె అక్కడే ఉండి పోయింది. ఆ ఏడుగురిని ఋషులు అన్నారు. ఆమె దేవత అయ్యింది. మిమ్మల్ని మీరు ఉచ్ఛ స్థానానికి ఎలా తీసుకు వెళ్ళవచ్చో చెబుతున్నాను! ప్రతిదీ ఎలా ప్రకటమౌతుందో తెలుసుకునే సంకటంలోకి మీరు వెళితే, మీరు ఓ పది లక్షల సంవత్సరాలు అధ్యయనం చేసినా అది అంతంలేని ప్రక్రియగానే మిగిలి పోతుంది.

లేక, మీరు ఈ అంతులేని ప్రక్రియను పక్కకుబెట్టి, వీటన్నింటికీ మూలమైన పార్శ్వాన్ని స్పృశించండి. మీరు ఈ ఆట ఆడాలనుకుంటే సృష్టి యొక్క మూలకాలతో నిమగ్నం కండి. ఈ ఆట ఆడడం ఇష్టం లేకపోతే, మీరు కేవలం గెలవాలనే అనుకుంటే – మీకు ఆటలో మక్కువ లేదు, మీకు కేవలం ఉత్తీర్ణులై ముందుకు పోవాలనుకుంటే – అప్పుడు మీరు సృష్టికి మూలమైనదానిని స్పృశించండి. మీరు ఈ పంచ భూతాలతో తికమక పడనవసరం లేదు.

మీరు ఆడండి, లేకపోతే, ఆ ఆటే మీతో ఆడుకుంటుంది. మీకు ఆట ఆడడం ఇష్టం లేకపోతే, ఆటే మిమ్మల్ని ఆడుకుంటుంది. ఈ జీవితపు ఆటను ప్రక్కనబెట్టి, సృష్టికి మూలమైన దానితో మమేకమై పోవడంపై దృష్టి పెట్టడం సులభమైన పనిలా కనబడుతోంది. మీకు ‘మీ’ గురించిన ధ్యాసే లేకపోతే, మీకు మీ - శరీరం, మనస్సు, ఆలోచనలు, మనోభావాలపై - అంత మక్కువ లేకుండా ఉంటే, అది సహజంగానే వచ్చేస్తుంది.

లేకపోతే, అది చాలా కఠినం. మీ జీవితానికి మీరే కధానాయకులు అయినప్పుడు ‘మిమ్మల్ని’ మీరు ప్రక్కనబెట్టడం సాధ్యమా? మీదే ముఖ్యపాత్ర అయినప్పుడు ‘మిమ్మల్ని’ ప్రక్కనబెట్టడం అంత తేలికగా జరగదు. కాని అదే అతి సులువైన, గొప్ప మార్గం. లేకపోతే, ఈ ఆట ఆడడం సుదీర్ఘం, అంతంలేని ఆట. ఒకవేళ మీరు ఈ ఆట ఆడాలనుకుంటే చాకచక్యంగా ఆడండి. చేతగాని క్రీడాకారుణ్ని అందరూ అసహ్యించుకుంటారు.

పంచభూతాల మీద నియంత్రణ తెచ్చుకోవడం అంత ప్రధానమైనది ఎందుకు? 

మీరు ఆట ఆడాలని ఒకసారి నిర్ణయించుకుంటే, పంచభూతాల పై కొంత నియంత్రణ తెచ్చుకోవడం అవసరం. లేకపోతే, జీవితంలో మీరు చేతగాని ఆటగాడు అయిపోతారు. జీవితం ఏ రంగంలోనైనా ప్రజలు విజయులు అయ్యారంటే, తెలిసో తెలియకో, వారికి అందులో కొంత నైపుణ్యము ఉందని అర్థం. లేకపోతే దేనిలోనూ విజయం ఉండదు. ఆ నైపుణ్యం కోసం వారు మరో చోట (జన్మ) పనిచేసి ఉండవచ్చు, లేక ఇక్కడే చేసి ఉండవచ్చు, కాని ఆ రకమైన జ్ఞానం లేకుండా, జీవితంలో ఏ రకమైన విజయమూ లభించదు..

మీరు పని చేయడానికి నిర్ణయించుకుంటే మానవ జీవితంలో విజయం అన్నది అతి తీయనైనది. ‘‘మీరు గెలిచినా, ఓడినా ఫరవాలేదు’’ అంటూ కొందరు, పనికిరాని వేదాంతాలు చెప్పవచ్చు. జీవితంలో అటువంటిది ఏమీలేదు. మీరు ఏ ఆట ఆడినా మీరు గెలవాలనే అనుకుంటారు. ఆట అయ్యాక మీరు ఓడిపోతే ఫరవాలేదు. కాని, ఆట ఆడకముందే, ఓడిపోయినా ఫరవాలేదు అనుకుంటే, అసలు ఆట అంటే మీకేమీ తెలియదు అన్నమాట.

మీరొకసారి ఆట ఆడదామని నిర్ణయించుకున్నాక – అది వ్యాపారం అయినా, వివాహం అయినా, జీవితం లేక ఆధ్యాత్మిక ప్రక్రియ అయినా – మీరు గెలవాల్సిందే. చాలా సార్లు అది ఒక జట్టుగా ఆడే ఆట కావచ్చు. మీరు గెలవడం అంటే మీతో పాటు ఉండేవారు కూడా గెలవాలని మీరు మరచిపోవచ్చు. మీకు వివాహం అయి కూడా, మీరు నేనే గెలవాలని అనుకుంటుంటే, మీ భర్త లేక భార్య దానిని మీకు బాధాకరంగా చేస్తారు.

భూత శుద్ధి – పంచభూతాలను స్వాధీనం చేసుకోవడానికి చేసే యోగ ప్రక్రియ. 

భూతశుద్ధి అంటే ఎరుకతో గెలిచే మార్గం, ఎందుకంటే మీరు చేసే పనిలో నైపుణ్యం లేనప్పుడు, విజయం అనేది కాకతాళీయం అవుతుంది. మీ ప్రత్యర్థులు చేతకాని వారు కావడం వల్ల మీరు గెలవవచ్చు. అది పనికి రానిది. మీరు మీకు చేతనైనంత, ఇంకా అంతకుమించి ఆడాలి. హఠయోగాకు మేము సూచనలు ఇచ్చేటప్పుడు, ‘‘మీరు వీలైనంత ఎక్కువ సాగదీయండి , ఆపై మరి ఇంకాస్త చాచండి’’ అంటాము. ఇక్కడ ఇంకాస్త అనేది ఎంతో ముఖ్యమైన పదం. దానిలోనే అసలు విషయం ఉంది. గెలుపు ఓటముల మధ్య భేదం అక్కడే ఉంది – ఒకరు ఆ ‘మరికాస్త’ అనేది చేస్తున్నారు, అవతలి వారు అది చేయడం లేదు.

1970వ దశకంలో, ప్రపంచ మోటార్ సైకిల్ ఛాంపియన్ షిప్ను కెన్నీ రాబర్ట్స్ మూడుసార్లు వరుసగా గెలిచాడు. అది అంత సులువుకాదు. ఎందుకంటే, అవి అతి శక్తివంతమైన మోటారు సైకిళ్ళు. పాల్గొనే వారు ప్రపంచంలో అత్యుత్తమ క్రీడాకారులు. అందువల్ల, గెలుపు ఓటములు సెకన్ లో వందోవంతు తేడాతో ఉంటాయి. ఛాంపియన్ షిప్ గెలవాలంటే ఒక సీజన్ లో దాదాపు 12, 15 రేసులు గెలవాలి. అలా మూడు సంవత్సరాలు వరుసగా గెలవడం దాదాపు అసాధ్యం. అందుకే ‘‘మీరు దీనిని ఎలా సాధించారు?’’ అని ఆయనను అడిగినప్పుడు. ‘‘నేను కంట్రోల్ తో కంట్రోల్ కోల్పోతాను’’ అన్నాడు. పరిధిని(కంట్రోల్) దాటే ధైర్యం ఉండడం, అదే సమయంలో మరీ అంత ఎక్కువ పరిధిని దాటకూడదన్న ఎరుకతో ఉండడం.

ఏదైనా చేసే ధైర్యం మీకు ఉండాలంటే, మీకు కొంత సామర్థ్యం ఉండాలి. లేకపోతే ఆ ధైర్యం ప్రమాదానికి దారితీస్తుంది. మీరు దానిని విజయవంతంగా చేస్తే, ప్రజలు మీరు ధైర్యవంతులు అంటారు. మీరు దెబ్బతింటే, ప్రజలు మిమ్మల్ని మూర్ఖులు అంటారు. ఆ రేఖ చాలా సన్ననిది. మీకు మీ అస్తిత్వ మూలాల మీద ఎంత ఎక్కువ పట్టు ఉంటే, అంతగా మీకు ఆ రేఖ మీద ప్రయాణించడం, దాటే సామర్ధ్యం మెరుగ్గా ఉంటుంది.

దీని కోసం ఎలాంటి సాధన చేయడానికి సిద్ధంగా లేనివారి కోసం, మేము ధ్యాన లింగ ఆలయంలో పంచభూతారాధన ప్రక్రియ నిర్వహిస్తాము, మీరు కనీసం దాని నుంచి లబ్ధి పొందవచ్చు. ఆ ప్రక్రియ యొక్క గొప్పతనం ఇది. ఈ ఆధ్యాత్మిక ప్రక్రియ తమంత తాము చేసుకోలేని వారి కోసం జరిపే, సార్వజనిక సాధన. ఓ వెయ్యి మందైనా ఈ ప్రక్రియ నుంచి లబ్ధి పొందవచ్చు. మీరు సాధన చేస్తే అది మీ ఒక్కరి కొసమే. సాధన కచ్చితంగా ఉన్నత పార్శ్వానికి సంబంధించినదే కాని, ప్రక్రియ చాలామందికి ఉపయోగపడేది.

మీకు పంచభూతాలమీద నియంత్రణ లభిస్తే వచ్చే లాభం ఏమిటి?  

మీకు ఒకసారి పంచభూతాల మీర నియంత్రణ వస్తే, అప్పుడిక - లోపల, బయట - అంటూ ఏమీ ఉండదు ఎందువల్లనంటే ఈ పంచభూతాలు మీ హద్దులను గుర్తించవు. తేలిక భాషలో చెప్పాలంటే, మీరిక్కడ కూర్చుని శ్వాస తీసుకుంటుంటే, గాలి మీ హద్దులను గుర్తించదు. అది బయటకు వస్తూ పోతూనే ఉంటుంది. గాలితోనే కాదు అన్నింటితోనూ ఇదే జరుగుతుంది. మీరు తీసుకునే ఆహారం, బయటకు వదిలే దానికి, మిగతా అన్నిటికీ కూడా ఎప్పుడూ ఇచ్చి పుచ్చుకోవడాలు జరుగుతూనే ఉంటాయి.

మీ శారీరిక సరిహద్దులు మీ మానసిక సౌలభ్యం కోసమే. కాని పంచభూతాలు వాటిని గౌరవించవు, మీ ఆమోదం లేకుండానే అవి లావాదేవీలు జరుపుతూనే ఉంటాయి. మీకు ఈ పంచభూతల తత్వాన్ని అనుభూతి చెందే అవకాశం ఉంటే, అప్పుడు ఈ శారీరక హద్దులను కూడా మీరు కోల్పోతారు. ఇంకోరకంగా చెప్పాలంటే, మీరు మీ గోప్యతను పోగొట్టుకున్నారు, ఎందుకంటే అన్నీ మీ లోపలికి బయటకు ఎప్పుడూ వచ్చి పోతూనే ఉన్నాయి.

ఈ పంచభూతాల మీద పట్టు సాధించడం ఎలా? 

#1 నాగాబాబాలు అనుసరించే పద్ధతి 

వాటి మీద పట్టు సాధించాలంటే మీరు చేయవలసింది మిమ్మల్ని మీరు వాటికి బహిర్గతం చేసుకోవడం. గతంలో నాగాలు, గోరక్ నాథ్ సంప్రదాయానికి చెందిన వారు లేక జైనులు చేసిన ప్రాథమిక ఆధ్యాత్మిక సాధనలు ఏమిటంటే వారు తమకు తాము ఈ పంచభూతాలకు బహిర్గతం చేసుకున్నారు. ఎందుకంటే వారు ఈ లావాదేవీలు సులభంగా జరిగిపోవాలని తలచారు. భారత దేశంలో ఇంకా ఇలాంటి సాధనలు జరుగుతున్నప్పటికీ, ఈనాడు ప్రపంచంలో నగ్నంగా తిరగడం సాధ్యం కాదు. అలా వేలాది మంది, సాంఘిక కట్టుబాట్లు పట్టించుకోకుండా, బట్టలు లేకుండా నడవడం భారత దేశంలో మీరు చూసి ఉంటారు. కాని అది మీకు సాధ్యం కాదు.

ప్రశ్న: : పొలం లాంటి ఆరు బయట ప్రదేశాలలో, కేవలం ఆకాశం వంకనో, సముద్రం వంకనో, దిగంతాల వైపు చూస్తూనో, కొంత కాలం ఉండడం ద్వారా మరింత ఎరుకతో ఉండడం సాధ్యమా?

సద్గురు: అది ఉపయోగకరంగా ఉండవచ్చు, కాని ఆరుబయట ఉన్నప్పుడు సామాన్యంగా ప్రజలు, బయటి ఉష్ణోగ్రతలను బట్టి, తమను తాము కప్పేసుకుని, రక్షించుకునే ప్రయత్నం చేస్తారు. అయినా, అది కాస్త సాధ్యమే, అంతేకాని కచ్చితంగా జరుగుతుందని కాదు. మీరు ఆరుబయట కూర్చుంటే, అలా ప్రయత్నం చేయవచ్చు.

#2 వదులు దుస్తులను ధరించడం. 

మీరు చేయగలిగిన పని, మీరు వదులు వస్త్రాలకు మారిపోవడం. మీరు కంటికి అందంగా, ఒక చక్కని ఆకృతిలో కనబడక పోవచ్చు, పంచభూతాల తీరులో చూస్తే, మీకు ఏ ఆకృతీ లేదు. అది ఎప్పుడూ లావాదేవీలతోనే ఉంటుంది. ఇలా జరగడానికి, దీనిని అనుభూతి చెందడానికి, మీ శరీరానికి మీ బట్టలకు మధ్య కొంత ఖాళీ ఉండేలా చూడడం. మీరు బిగుతు బట్టలు వేసుకోకుండా ఉండడం. ఈ పని మీరు చేయవచ్చు.

#3 మీ శ్వాస మీద ధ్యాస పెట్టడం 

మీరు సరైన ధ్యాస పెడితే, మీ శ్వాసకు అతీతంగా, మీ శరీరం అంతటా, ఎంతో లావాదేవీ జరుగుతూ ఉండడం చూస్తారు. మీరు ఈ లావాదేవీల దిశగా కాస్త దృష్టిపెడితే, మీరు మెల్ల మెల్లగా మీలోనే ఉన్న ఈ పంచభూతాల స్వభావం, వాటి కూర్పుల గురించి మీకు అర్థమవుతుంది.అప్పుడు మీలోని ఒక పార్శ్వాన్ని పెంచడం లేక సరైన సాధనల ద్వారా మీలోని ఆకాశ తత్వాన్ని పెంచడం సాధ్యమౌతుంది. మీ తెలివితేటల ద్వారా, కాకుండా, దృష్టి పెట్టడం ద్వారా, సహజంగానే అక్కడ ఒక లావాదేవీ జరుగుతోందని గ్రహిస్తే, దాన్నిమనకు అనుకూలంగా మార్చుకోవడం ఎలాగో మీరు తెలసుకోవచ్చు.

#4ఆహార పానీయాలపై శ్రద్ధ పెట్టడం 

మీరు ఇచ్చిపుచ్చుకునే వాటిపట్ల శ్రద్ధ పెట్టడం. మీరు తప్పనిసరిగా చేసేవి శ్వాస తీసుకోవడం, ఆహారం, నీరు తీసుకోవడం; ఇంకా మీ శరీరానికి, బయటి వాతావరణ ఉష్ణోగ్రతకు ఉన్న వ్యత్యాసం వల్ల జరిగే లావాదేవీలు. ఇవే ముఖ్యమైనవి. వీటి పట్ల మరింత శ్రధ్ధ తీసుకోండి.

అసలు ప్రజలు తమ శ్వాసను గమనించడక పోవడం నన్ను ఆశ్చర్యపరుస్తుంది, ఇది ఎంతో బాగా తెలిసే లావాదేవీ, అది నిశ్శబ్దంగా జరిగిపోదు, శరీరం మొత్తం కదులుతుంది. మీరు శ్వాసనే గమనించక పోతే దానికన్నా సున్నితంగా జరిగేవి మీకెలా తెలుస్తాయి? మీరు ఎలా తింటారో, తాగుతారో, శ్వాస తీసుకుంటారో, ఏవి తాకుతారో, అన్నవాటిపై మరింత శ్రద్ధపెడితే, మీ జీవితం పూర్తిగా మరో స్ధాయికి చేరుకుంటుంది.

చాలా మంది ఈ చిన్న చిన్న పనులు కూడా చేయడం లేదు. వారు తాము తినేది, తాగేదీ ఒక్కసారిగా గుటుక్కున మింగేస్తున్నారు. వాళ్ళు ఎరుక లేకుండానే శ్వాస తీసుకుంటున్నారు. వారు ఏమి తాకుతున్నారో తెలియకుండా, అనుభూతి చెందకుండా దేనిని పడితే దాన్నితాకేస్తున్నారు. మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడు, అది గమనించాలంటే, మీరు వేరే పనులు ఏమీ చేయకూడదనుకుంటున్నారు. మన మెదడు గొప్పతనం ఎలాంటిదంటే, అది ఎన్నో సంక్లిష్టమైన పనులు చేస్తూ కూడా ఇంకా తన దృష్టి కావలసిన చోట పెట్టగలదు. అది ఎలాగంటే మీరు డ్రైవంగ్ చేస్తూ కూడా ప్రక్కవారితో మాట్లాడగలరు. అంటే తేలిగ్గా రెండు చోట్ల మనం దృష్టి పెట్టగలుగుతున్నాము. అలాగే మీరు ఏమి చేస్తున్నా మీ శ్వాస మీద దృష్టి పెట్టగలరు. శ్వాస అనేది ఎప్పుడూ జరిగేది, మీరు దానిపై దృష్టి పెట్టగలరు.

మీరు తినే ఆహారం మీద, తాగే వాటి మీద కూడా దృష్టి పెట్టగలరు. మీకు అతీతమైన పార్శ్వాలను తెలుసుకోవడం, ఈ ఉనికి మార్మిక స్వభావం తెలుసుకోవడం అనేది మన పంచభూతాల కూర్పు మీద ఆధారపడింది. దీనిలో పరిణితి తీసుకురావడం మీకు అద్భుతాలను చేస్తుంది.

Editor's Note: Find out more about Bhuta shuddhi practices and Pancha Bhuta Kriya (online).