karma-book-banner-top

కర్మ అంటే మీ జీవిత నిర్మాత మీరేనని అర్థం.

 

మీ జీవితంలో అనుక్షణం - భౌతికంగా, మానసికంగా, భావపరంగా లేదా శక్తి పరంగా - మీరు ఎదో ఒక రకమైన చర్య చేస్తూనే ఉంటారు. ప్రతి చర్య ఒక విధమైన స్మృతిని కలుగజేస్తుంది. దానినే కర్మ అంటారు.

sadhguru-quotes-on-karma-isha-illustration-2

భక్తి కర్మను ధ్వంసం చేసి విముక్తి వైపుకి తీసుకెళుతుంది.

 

కర్మ అంటే ‘కార్యాచరణ’, ‘స్మృతి’ రెండూనూ. కార్యాచరణ లేకుండా స్మృతి ఉండదు, అలాగే స్మృతి లేకుండా కార్యాచరణా ఉండదు.

sadhguru-quotes-on-karma-isha-illustration-4

మీరు కొత్త కర్మల జిగురు చేరుస్తూ ఉంటేనే పాత కర్మలు మీకు అంటుకుని ఉంటాయి.

కర్మ మీరు చేసే పనుల్లో లేదు - అది మీ ఉద్దేశంలో ఉంది. అది మీ జీవిత విషయాలలో లేదు, కానీ వాటి సందర్భం కర్మను సృష్టిస్తుంది.

sadhguru-quotes-on-karma-isha-illustration-6

కర్మ అనేది కొన్ని ధోరణుల ద్వారా పనిచేస్తుంది. కాని కొంత స్పృహతో, ధ్యాసతో దానిని మీరు కావలసిన దిశలోకి తీసుకు వెళ్ళవచ్చు.

 

తమ బాగు కోసం లేదా మరొకరి హాని కోసం క్షుద్ర శక్తులను ఉపయోగిస్తే, దానివల్ల ఎదురయ్యే పర్యవసానాలు, ఇతర కర్మఫలాల కంటే కూడా ఎంతో తీవ్రంగా ఉంటాయి.

కర్మ అనేది మళ్ళీ, మళ్ళీ పాడే పాత రికార్డు లాంటిది. యోగా అంటే జీవితాన్ని కేవలం పునరావృతంగా కాక, ఎంతో గొప్ప అవకాశం, అనుభవంగా చేసేది.

 

ఎరుకతో చేసే పని కర్మను ఉత్పన్నం చేయదు – ప్రతిక్రియ చేస్తుంది.

శారీరకంగా మీరు చేసే కార్యకలాపాలు ఎటువంటివైనా సరే - వాటిని మీరు పూర్తి నిమగ్నతతో, ఆనందంతో చేస్తే, మీరొక కర్మ యోగి అవుతారు

sadhguru-quotes-on-karma-isha-illustration-11

ఇక్కడ ఏదీ యాదృచ్ఛికమైనది కాదు. మొత్తం భౌతికమైనదంతా కార్య కారణాల మధ్యనే జరుగుతున్నది.

కర్మ అంటే మీ జీవితం మీరు చేసుకునేదే అని. కర్మరాశి అనేది మీకు అనుకూలంగానూ లేక ప్రతికూలంగానూ ఉండవచ్చు - అది ఎలా చేసుకుంటారన్నది మీ ఇష్టం.

sadhguru-quotes-on-karma-isha-illustration-13

గతంలో మీరు పోగుచేసుకున్నది ఎటువంటి కర్మ అయినా కూడా, ఈ క్షణం ఏ కర్మ పోగు చేసుకుంటారన్నది మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది.

sadhguru-quotes-on-karma-isha-illustration-14

మీరేమి చేస్తున్నా సరే, అదంతా మీ కోసమా లేక అందరి శ్రేయస్సు కోసమా అని గమనించండి. చేసేది మంచి కర్మా, చెడ్డ కర్మా అనే సందిగ్ధం ఏమన్నా ఉంటే ఇది తొలగిస్తుంది.

GoodNBad_02

 

మీ అవగాహన మీ జ్ఞాపకాల వల్ల కలుషితమైతే అది కర్మ. మీ పక్షపాతాలకు మూలం మీ స్మృతే.

sadhguru-quotes-on-karma-isha-illustration-16

కర్మే మీ మనుగడ ఇంకా మీ బంధనం. మీరు కర్మను సరిగ్గా నిర్వహించుకోగలిగితే అది మీకు విముక్తి కూడా కాగలదు.

 

కర్మయోగా అంటే సేవ చేయడం కాదు, కర్మ చేయడమనే నిర్భంధత నుండి విముక్తమవ్వడం.

sadhguru-quotes-on-karma-isha-illustration-19

కర్మ అంటే పూర్తి బాధ్యత. అంటే మీ జన్యువులకు కూడా మీరే బాధ్యత తీసుకుంటారు!

sadhguru-quotes-on-karma-isha-illustration-18

మీరు నిజంగా ధ్యానపరులైతే, మీరు కర్మకు అతీతంగా ఉంటారు.

sadhguru-quotes-on-karma-isha-illustration-20

karma-book-banner-top