ఏకాదశి అంటే పౌర్ణమి తరవాత వచ్చే 11వ రోజు, అలాగే అమావాస్య తరవాత వచ్చే 11వ రోజు. మానవ శరీరం ఒక మండల కాలాంతరాలతో లయ బద్ధంగా ఉంటుంది. మండల కాలమంటే సుమారుగా 40 నుంచి 48 రోజుల వరకూ ఉంటుంది. ఈ చక్రంలో మూడు ప్రత్యేకమైన రోజుల్లో శరీరానికి ఆహరం అవరసం ఉండదు. ఇది మనిషి మనిషికీ వేరేగా ఉండచ్చు, అలానే అది నిర్దిష్టమైన సమదూరంలో ఉండాల్సిన అవసరం లేదు. ఈ రోజులేవో మీరు తెలుసుకో గలిగి ఆ రోజుల్లో శరీరం అడగటం లేదు కనుక దానికి ఆహరం ఇవ్వవకపోతే – ఎన్నో ఆరోగ్య సమస్యలు ఈ సులువైన పద్ధతి వల్ల సర్దుకుంటాయి.

“ఇది ఇన్ని కాలరీలు, ఇది ఇంత ప్రోటీన్, ఇన్ని మినరల్స్ తినాలి” అనే లెక్కలను మానేస్తే, వ్యవస్థలోని ఈ చక్రాన్ని మనలో చాలా మంది గుర్తించవచ్చు . వాళ్ళ శరీరం ఏం చెప్తుందో వింటే చాలా మంది మనుషులు ఈ మూడు రోజుల్ని తేలికగానే గుర్తించవచ్చు. అందువల్ల 48 రోజుల్లో మూడు రోజులు తినకూడదని చెప్పారు. ఎవరో వాళ్ళ వ్యవస్థను గమనించి దాన్నుంచి ఇలా చెప్పారు. కాని జనానికి అవసరమైనంత అవగాహన లేకపోవటం వల్ల ఏకాదశి రోజున తినకూడదని నియమం విధించారు. మీరు గమనిస్తే 48 రోజుల్లో మూడు ఏకాదశులు వస్తాయి. అది సరిగ్గా సరిపోతుంది.

కాని జనానికి అవసరమైనంత అవగాహన లేకపోవటం వల్ల ఏకాదశి రోజున తినకూడదని నియమం విధించారు.  


దీనికి గల కారణం ఏమిటంటే ఈ భూమి కూడా ఈ రోజున ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉంటుంది. అందువల్ల మనం మన శరీరాన్ని తేలికగా, అనుకూలంగా ఉంచుకుంటే మన చైతన్యం అంతర్ముఖమవుతుంది. మనలో అంతర్గతంగా ఉన్న కోణాలను (తలుపును) తెరిచే అవకాశం ఈ రోజు ఎక్కువగా ఉంటుంది. మీ కడుపు నిండుగా ఉంటే మీరు అచేతనంగా, చురుకుగా లేకుండా ఉంటారు, మీరు దీన్ని గమనించలేరు. కనుక చురుకుగా ఉండటానికి, మీ శరీరం శుద్ధి అవ్వటానికి ఈ రోజు ఆహరం తినకుండా ఉండాలి – మీరు ముందు రోజు రాత్రి భోజనం చేస్తే మళ్ళీ మీరు తర్వాత రోజు రాత్రి అంటే ఏకాదశి రోజున రాత్రి భోజనం చేస్తారు.

మీ శరీరం చేసే పనుల స్థాయి అలా ఉండటం వల్లనో లేక మీకు ఏ సాధనా సహకారం లేకపోయి ఉండడంవల్లనో మీరు ఏమీ తినకుండా ఉండలేకపోతే, అప్పుడు మీరు ఫలహారం లేదా పండ్లు తినవచ్చు, ఇది మీ పోట్టను తెలికగా ఉంచి మీ అంతర్గత ద్వారాలు తెరుచుకునేలా చేస్తుంది. బలవంతంగా ఆహరం తినకుండా ఉండటంలో అర్ధం లేదు. ప్రతీది అవగాహనతో చేసే ప్రక్రియ కావాలనేదే దీని ఉద్దేశం. మనం ఇలా ఖచ్చితంగా తినాలి అని కాకుండా మనమే అవగాహనతో ఎంపిక చేసుకోవాలి.

ప్రేమాశీస్సులతో,

సద్గురు