కీర్తి వంతమైన బ్భిక్షకుడు : బ్రహ్మచారి గా ఉన్న కృష్ణుడు
కంసుడు మరణించిన తర్వాత, బ్రహ్మచర్య దీక్ష తీసుకున్న కృష్ణుని జీవితంలోని ఆ ఘట్టం గురించి సద్గురు వివరిస్తున్నారు.
సద్గురు: కంస సంహారం చేసిన తరువాత, దాదాపు 16 సంవత్సరాల వయసున్న కృష్ణుని అందరూ నాయకుడిగా చూడడం ప్రారంభించారు. కృష్ణుడి గురువైన గర్గా చార్యుల వారు కృష్ణుడితో, " నువ్వు ఎలా అయితే రూపుదిద్దుకోవా లో, అందుకు నీకు విద్యాభ్యాసం అవసరం. నీకు అవసరమైన లక్షణాలు అన్నీ ఉన్నాయి. కానీ నువ్వు క్రమశిక్షణ నేర్చుకోవలసి ఉంది. నువ్వు సాందీపని కి శిష్యుడుగా ఉండు." అని చెప్పాడు. కృష్ణుడు ఆ విధంగానే చేశాడు.
కృష్ణుడు బ్రహ్మచర్య దీక్ష తీసుకునే ముందు బలరాముడు ఇంకా కొంతమంది రాజకుమారులు వచ్చి కృష్ణుని గేలి చేశారు. వారు అతన్ని చూసి నవ్వి, " నువ్వు ఇంత కాలం ఎంతో అల్లరిగా గడిపావు. ఇప్పుడు బ్రహ్మచర్య దీక్షను ఎలా తీసుకోగలవు?" అన్నారు. అందుకు కృష్ణుడు," చూడండి కొన్ని సందర్భాలలో ఏమి చేయవలసి వస్తే నేను అది చేశాను. కానీ నేను ఎల్లప్పుడూ బ్రహ్మచర్యం పాటిస్తూ నే ఉన్నాను. నేను ఈ దీక్షను స్వీకరించి సంపూర్ణంగా దానిని నిర్వహించడం మీరే చూస్తారు."అన్నాడు.
ఆరు సంవత్సరాల పాటు , కృష్ణుడు ఒక బ్రహ్మచారిగా సాందీపని యొక్క మార్గదర్శకత్వంలో ఇంకా అనుగ్రహం లో ఉన్నాడు. సాందీపని ఆయనకు ఎన్నో రకాల కళలను ఇంకా విద్యలను బోధించారు. కృష్ణుడు అన్ని రకాల ఆయుధాలను ప్రయోగించడం నేర్చుకున్నాడు .చక్రాయుధాన్ని ఉపయోగించడంలో విశేషమైన ప్రజ్ఞ సాధించాడు.దానిని సరైన రీతిలో ఉపయోగిస్తే చక్రాయుధాన్ని మారణాయుధంగా ఉపయోగించవచ్చు .కృష్ణుడు దీనిని ఉపయోగించడంలో ఒక కొత్త పార్శ్వానికి చేరుకున్నాడు.
ఆ కాలంలో ఇతర బ్రహ్మచారులకు మల్లేనే , కృష్ణుడు కూడా వీధుల్లో ఆహారం కోసం బిక్షాటన చేసేవాడు. బిక్షాటన చేస్తున్నప్పుడు మనకు ఎటువంటి ఆహారం కావాలో ఎంచుకునే అవకాశం ఉండదు, ఎటువంటి ఆహారం వస్తే అటువంటి ఆహారం స్వీకరించాలి - అది మంచిగా ఉన్నా సరే , పాచిపోయినా సరే. ఒక బ్రహ్మచారి ఎప్పుడు తనకి ఎటువంటి ఆహారం పెడుతున్నారో చూడకూడదు , ఎటువంటిది ఆహారం కావాలో తాను ఎంపిక చేసుకునే అవకాశం తనకు ఉండదు. బ్రహ్మచర్యం లో ఉండడం అంటే దివ్యమైన పధం లో ఉండటం అని అర్థం. ఆహారం కావాలి కానీ మీరు పౌష్టికత పొందుతున్నది ఆహారం నుండి మాత్రమే కాకూడదు.
కృష్ణుడు ఎంతో సంపూర్ణమైన బ్రహ్మచారి గా ఉండేవాడు.
ఎల్లప్పుడూ పట్టుపీతాంబరాలతో నెమలి పించాన్ని ధరించి ఎంతో అందంగా ఉండే కృష్ణుడు, ఇప్పుడు జింక చర్మాన్ని మాత్రమే ధరించి నూటికి నూరు శాతం తన కొత్త సాధనకే అంకితమయ్యాడు. ఇంతటి కీర్తి వంతమైన బ్భిక్షకుడిని ఈ ప్రపంచం అంతకు ముందు చూడలేదు. ఆయన సౌందర్యాన్ని, ఆహార్యాన్ని , ఆయనలో ఉన్న హుందాతనాన్ని , ఆయన అంకితభావాన్ని, ఆయన ఏకాగ్ర చిత్తం ని ఇంకా కేవలం కొద్దిపాటి ఆహారం కోసం ఆయన వీధుల్లో నడిచే తీరును చూసి ప్రజలు అబ్బుర పోయారు. ఆయన ఏ క్షణం లో కావాలనుకుంటే ఆ క్షణంలో రాజు కావచ్చు , అయినప్పటికీ ఆయన ఆరు సంవత్సరాల పాటు బ్రహ్మచర్య దీక్షలో భిక్షాటన చేస్తూ ఆహారం కోసం విధుల్లో సంచరించారు
కృష్ణ ద్వైపాయనుడు
ఇలాంటి సౌందర్యాన్ని ఒలికిస్తూ ఉన్న మరొక బ్రహ్మచారి'ని కృష్ణ ద్వైపాయనుడు అనేవారు. కృష్ణద్వైపాయనుడిని తదుపరి కాలంలో వ్యాసుడు అని పిలిచారు. ఈయన 6 సంవత్సరాల వయస్సులో బ్రహ్మచర్య దీక్షను స్వీకరించారు.
అతను బ్రహ్మచర్య దీక్ష తీసుకున్న తొలినాడు , ఈ చిన్ని బ్రహ్మచారి తన శిరోముండనం తో, నారబట్టలతో వెళ్లి భిక్షాటన చేస్తూ "భవతి భిక్షాం దేహి" అని అతని ముద్దు మాటలతో పలికాడు.ఈ ముద్దులోలుకుతూ ఉన్న పిల్లవాడు బిక్షాటన చేస్తున్నప్పుడు , ప్రజలు అతనికి, వారికి ఉన్నంతలో ఉత్తమమైన ఆహారాన్ని సమర్పించారు.
ఆ పిల్లవాడు నడిచే విధానం, అతనికి ఇంకా అతని గురువు కోసం, అతను భిక్షాటన చేయడంలో ఉన్న హుందాతనం, అతని నడక లో ఉన్న శక్తిని ప్రజలు గుర్తించి అతనికి ఎంతో ఆహారాన్ని సమర్పించారు. అతను మోయగలిన దానికంటే ఎక్కువ ఆహారం అతనికి లభించింది. అతను వీధుల్లో నడుస్తూ వెళుతున్నప్పుడు, అతనికి సరిగ్గా భోజనం చేయని పిల్లలు కనిపించారు. వారి ముఖాలను బట్టి, వారు సరిగ్గా తినలేదని అతను తెలుసుకోని, అతను చేసిన భిక్షాటన వల్ల వచ్చిన ఆహారం మొత్తాన్నీ వారికి పంచి పెట్టి, ఖాళీ పాత్ర తో తిరిగి వచ్చాడు.
అతని గురువు ఇంకా తండ్రి అయిన పరాశరుడు ఇది చూసి, " ఏం జరిగింది? నీవు భిక్షాటనకు వెళ్లలేదా? లేదా ఎవరూ నీకు ఆహారాన్ని సమర్పించ లేదా?" అని అడిగాడు. అందుకు కృష్ణద్వైపాయనుడు," లేదు, వారు నాకు ఆహారాన్ని ఇచ్చారు. కానీ నాకు వీధుల్లో సరిగ్గా ఆహారం లేని పిల్లలు కనిపించారు. నేను ఆహారాన్ని వారికి ఇచ్చేశాను" అన్నాడు. పరాశరుడు "సరే " అన్నాడు. అంటే ఇక వారికి ఆ రోజు కు భోజనం లేనట్టే.
ఒక రోజు తర్వాత మరొక రోజు ఇలానే జరుగుతూ ఉండేది. ఈ పిల్లవాడు అసలు భోజనమే చేసేవాడు కాదు.ఈ పిల్లవాడు ఈ విధంగా మూడు నాలుగు రోజుల పాటు ఆహారం లేకపోయినప్పటికీ, తాను నిర్వహించవలసిన విధులను సక్రమంగా నిర్వహిస్తూ విద్యాభ్యాసం చేస్తూ ఉండటాన్ని చూసిన పరాశరుడు ఇతనికి అఖండమైన సంభావ్యత ఉందని గ్రహించాడు. ఆయనకు తెలిసింది అంతా ఆ పిల్లవాడికి ధారపోసాడు. ఏదైతే ఇతరులకు నేర్పాలంటే ఒక వంద సంవత్సరాలు ఆయనకు పట్టేదో, దానిని అతి తక్కువ కాలంలో వ్యాసుడికి ధారపోసాడు.
లీల
ఎన్నో సాంప్రదాయాలు ఇంకా వ్యవస్థలు, మానవులను ఉన్నత ప్రమాణాలకు సంసిద్ధం చేసేందుకు ఎన్నో మార్గాలను రూపొందించాయి. అందులో బ్రహ్మచర్యం ఒక మార్గం. లీల మరొక మార్గం.
లీల అంటే ప్రతి అంశాన్నీ కూడా, మీరు మీ మనః శరీరాల నుండి ఇంకా 'నేను' అని మీరు అనుకునే అన్నింటి నుండి మైమరచి పోయేలా చేసేందుకు, ఉపయోగించడం అనమాట. మీరు ఏదైనా పఠించినా, నాట్యం చేసినా, గానం చేసినా, భోజనం చేసినా, ఏం చేసినా సరే మీరు దానికి పూర్తిగా అంకితమై చేయడమే. అందుకు మీరు స్త్రీత్వం లో ఉండాలి.
అన్నింటి తో ఒక్కటై , అంకితమై, గ్రహించగల స్వభావం కలిగినది స్త్రీత్వం.
అన్నింటి తో ఒక్కటై , అంకితమై, గ్రహించగల స్వభావం కలిగినది స్త్రీత్వం. చంద్రుడికి తనదైన స్వభావం అంటూ ఉండదు. అది కేవలం సూర్యుని ప్రతిబింబిస్తుంది, కానీ అది ఎంత సుందరంగా ఉందో చూడండి. తనకు నచ్చింది ఏదో తను చేసుకుందామని చంద్రుడు అనుకుంటే ఇంత అందంగా ఉండేవాడు కాదేమో. సూర్యుడు ప్రాణశక్తిని అందిస్తాడు - అది వేరే విషయం. కానీ అభౌతికమైన పార్శ్వాలకు మిమ్మల్ని సంసిద్ధం చేయడంలో, మీలో కొంత ప్రేమని ఇంకా కవిత్వ ప్రేరణ నీ కలిగించడంలో చంద్రుడి పాత్ర, సూర్యుడి కంటే ఎంతో పెద్దది. అవునా? ఎందుకంటే తనదైన స్వభావం చంద్రుడికి లేదు, తను కేవలం ప్రతిబింబిస్తూ ఉన్నాడు కాబట్టి.
మీరు దివ్యత్వాన్ని తెలుసుకోవాలంటే ఉన్న ఒకే మార్గం ఏమిటంటే మీదైన స్వభావం అంటూ ఉండకూడదు. మీరు ప్రతిబింబించాలి. మీరు ఒక ప్రతిబింబం అయితే దేనిని ప్రతిబింబిస్తారు? అనంత తత్వా న్నే….
ప్రేమాశీస్సులతో,