ప్రశ్న: అలారం శబ్దానికి నిద్రలేవడం రోజును మొదలు పెట్టడానికి మంచి పధ్ధతి కాదని విన్నాను. నిద్ర లేవడానికి ఫలానా మ్యూజిక్ అంటూ ఏమైనా ఉందా? మనం రోజును మొదలు పెట్టే ముందు అది మనలో మంచి వాతావరణాన్ని ఏర్పరచగలదా?

సద్గురు: అలారంతో నిద్రలేవడమనేది కేవలం శబ్దం గురించే కాదు. మీరు ఘాడ నిద్రలో ఉన్నప్పుడు హఠాత్తుగా పెద్ద శబ్దం మోగుతుంది. అదృష్టవశాత్తు, , చాలా మంది వారి ఫోనుల్లో తమకు నచ్చిన సంగీతం పెట్టుకునే అవకాశం ఉపయోగించుకుని దానినే పెట్టుకుంటున్నారు. భారతదేశంలో, సుప్రభాతం అని ఒకటి ఉండేది. “ప్రభఅంటే ఉదయం లేదా కిరణం. అదే ఇంగ్లీషులో సుప్రభాత్అంటేగుడ్ మార్నింగ్ “.“గుడ్ మార్నింగ్ అని పదాల్లో కాదు నిర్దిష్ట శబ్దాలతో చెప్పడం.

దేశంలో వివిధ దేవతల కోసం వీటిని మార్చారు. ఈ రోజుల్లో చాలా వరకు ఇవి వినిపించడం లేదు కానీ, కానీసం పల్లెటూర్లలో, చిన్న పట్టణాలలో మీరు ఉదయాన్నే వినే మొదటిది ఇదే అయ్యి ఉంటుంది. ఈ సుప్రభాతంతోనే అందరు నిద్రలేచేవారు. ముఖ్యంగా సరైన శబ్దాలకు మేల్కోవాలన్నదే అసలు ఉద్దేశ్యం.

నిద్ర మేల్కోవడం పునర్జన్మే....

మీకు ఎలాక్ట్రోడ్లు తగిలించి..మీరు ఘాడ నిద్రలో ఉన్నప్పుడు, మాములు నిద్రలో ఉన్నప్పుడు, మీరు ఒక రకమైన కలలు కంటున్నప్పుడు, సహజంగా నిద్ర మేల్కున్నప్పుడు మీలో చోటుచేసుకునే ప్రకంపనలను కొలిచే సాధనం ఏదైనా ఉందేమో నాకు తెలీదు. ఒకవేళ అలా కొలవగలిగితే సుప్రభాతాలు లేదా మంత్రాలు మేల్కొల్పడంలో, ఏ విధమైన ప్రభావం చూపుతాయో పరీక్షించవచ్చు.

అకస్మాత్తుగా అలారం మోతకు నిద్రలేవడం మంచి పధ్ధతి కాదు.

చాలా రకాలుగా, నిద్ర మేల్కోవడం పునర్జన్మ లాంటిది. మీరు నిద్రలో ఉన్నప్పుడు ఈ ప్రపంచానికి చనిపోయి మళ్ళి తిరిగి వస్తున్నారు. మీరు తిరిగి వస్తున్నప్పుడు ఎలా వస్తున్నారు అనేది, ఏ విధంగా మేల్కుంటున్నారనేది మీ రోజును నిర్ణయిస్తుంది. మీరు ఏ రోజును ఎలా గడపబోతున్నారో మీరు నిద్రలేచే విధానం నిర్ణయిస్తుంది. మన ముందు తరాల వాళ్ళు ఇది గమనించి ఉంటారు . నేను కచ్చితంగా చెప్పగలను.- అమ్మమ్మలూ, అమ్మలు నిద్రలేచేటప్పుడు శివ శివ అనో శంభో అనో లేదా హరా, హరి అనో వారికున్న అలవాటుతో అనుకుంటూ నిద్రలేవడం కానీ ఈ ప్రతిధ్వనిలో నిద్రపోయే మార్గం కుడా ఉంది.

నిజమైన పరివర్తనకు పరీక్ష

1800ల మధ్యకాలంలో జరిగిన ఒక అందమైన సంఘటన ఉంది. ప్రస్తుతం ఉన్న మధ్యప్రదేశ్ లో, ‘మహిమఅనే ఒక ఆధ్యాత్మిక ఉద్యమం జరిగింది. ఇప్పుడు, మేము తెన్నేస్సిలో ఉన్న ధ్యానమందిరానికి మహిమ అని పేరు పెట్టాము. “మహిమఅంటే అనుగ్రహమని అర్థం. ఆ రోజుల్లో అదొక పెద్ద ఆధ్యాత్మిక ఉద్యమం. అక్కడ ఉన్న వాళ్ళ ఆశ్రమాలను నేను సందర్శించాను. ఆ ఆశ్రమాలు సులభంగా మూడు వేల నుండి నలుగు వేల మందికి ఆశ్రయం కల్పించగలవు, కాని ఇప్పుడు అక్కడ ఐదుగురో ఆరుగురో సన్యాసులు ఉంటున్నారు. కాని ఆ రోజుల్లో చాలా బాగా నడిచేది. వారు శక్తివంతమైన శాఖగా ఎదిగారు. ఆ ఉద్యమానికి అక్కడి రాజు మద్దతు ఇచ్చాడు. ఎందుకంటే అప్పట్లో ఆధ్యత్మికతే అన్నిటి కంటే ఉత్తమమైనదిగా పరిగణింపబడేది.

మీరు మీ జీవితం మొత్తం నటిస్తూ గడిపెయ్యోచ్చు, కానీ నిద్రపోయేటప్పుడు నటించలేరు. చాలా మందికి ఉన్న ఏకైక అదృష్టం ఇదే.

అదే సమయంలో ఏ సంస్థైనా లేదా ఎవరైన దేని గురించైనా పోషక బాధ్యత వహిస్తే వారు దాని నుండి కొంత లాభం పొందాలని ఆశించేవారు. ఈశ లో, ఎక్కడా ఏ పవిత్ర స్థలాల్లోనూ విరాళం ఇచ్చిన వారి పేర్లు రాయబడవని నేను దిశని నిర్దేశించాను. అలాగే, మహిమ ప్రజలు కూడా సామజిక ఒత్తిడిని పొందేవారు కాదు. వారు వారి ఆధ్యాత్మికత మీదే దృష్టి పెట్టేవారు. ఇంకా అక్కడ యోగులు చాలా వినయంతో ఇంకా అహంకారంతో పెరుగుతారు. అదొక అరుదైన కలయిక.

రాజు దీనికి మద్దతిస్తున్నా, కాని అతని చుట్టూ ఉన్న వాళ్ళు ఈ యోగులు వారికి ఏమి చెయ్యనందుకు అసంతృప్తిగా ఉండేవారు. వారు పిల్లల బరసలకో, గృహప్రవేశానికో, పెళ్ళిళ్ళకో, తద్దినాలకో, దేనికీ వెళ్ళేవారు కాదు.

దానితో ఈ సభలో ఉన్న వ్యక్తులు అడిగారు, “మనం వీరికి అసలు ఎందుకు మద్దతివ్వాలి? ఉపయోగమేముంది? డబ్బంతా వృధా చేస్తున్నారు ఎందుకంటే మీరు వారిని చుస్తే కనీసం బక్కచిక్కి కూడా ఉండరు. వారు బాగా తిని దృడంగా ఉంటారు, కనీసం రాజు అయిన మీకు నమస్కారం కుడా చెయ్యకుండా గర్వంగా నడుస్తూ ఉంటారు. మనం ఎవరికైనా డబ్బు ఇస్తే వారు మనకు లోబడి ఉండాలి. కానీ వీళ్ళు వీళ్ళ సొంత జీవితాన్ని గడిపేస్తున్నారు.”

వారు ఈ ఆలోచనను రాజు మనసులో పడేలా చేసి, ఖజానా వారిపై డబ్బు వృధా చేస్తుందని ఒత్తిడి తీసుకొచ్చారు. ఒకరోజు రాజు ఆ శాఖ గురువును పిలిపించి, “మా మంత్రులు, మరికొందరు మేము మీపై డబ్బు వృధా చేస్తున్నామని, మీరు ఆధ్యాత్మిక సాధన చేస్తున్న వారి లాగ కూడా కనిపించరని, డబ్బు ఇవ్వడం ఆపేయాలని ఒత్తిడి చేస్తున్నార నాకు మీపై చాలా గౌరవముంది. మీరు మాకు లోబడి ఉండాలన్నది మాకు ఆధ్యాత్మికత పట్ల ఉన్న ఆలోచన కానీ మీరు దాన్ని నెరవేర్చడం లేదు.”

దానికి గురువు, “అలానాఆలనా? ఐతే మనం ఒక పని చేద్దాం. మీరు ఒక రాత్రి నాతో రండి నేను మీకు తెలియజేస్తాను. ఆ తరువాత మీరు మీ తీర్పునివ్వండి అన్నాడు. రాత్రి బాగా పొద్దుపోయాక, గురువు ఇంకా రాజు కోట నుండి మారువేషము వేసుకొని  బైటకొచ్చారు.

గురువు రాజును మొదట ఆధ్యాత్మిక ఉద్యమానికి వ్యతిరేకంగా ఈ ప్రచారానికి

నాయకత్వం వహిస్తున్నారో ఆ మంత్రి ఇంటికి తీసుకెళ్ళాడు. వేసవికాలం కావడాన మంత్రి ఆరుబైట నిద్రపోతున్నాడు. గురువు ఒక ముంతడు నీళ్ళు తీసుకుని పొద వెనుక దాక్కుని ఆ మంత్రి మీదకు చల్లాడు. చల్లటి నీరు అతనిపై పడగానే, ఆ మంత్రి అశ్లీలమైన మాటలు మాట్లాడుతూ హఠాత్తుగా నిద్ర మేల్కున్నాడు.

గురువు ఇంకా రాజు నెమ్మదిగా అక్కడ నుండి బైలుదేరి, ఈ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తున్న మరొకరి ఇంటి వద్దకు వెళ్లారు. సన్యాసులు స్వయంగా వారే ఒక సైన్యంలాగా ఉండడం వల్ల అతను బెదిరిపోయాడు. అక్కడ కూడా అదే పని చేసారు. ఇతను మరింత అశ్లీలంగా మాట్లాడుతూ నిద్రలేచాడు.

అప్పుడు ఆ గురువు రాజును సన్యాసులు నిద్రపోయే ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఒక సన్యాసిపై నీళ్ళు పోయగానే అతను, “శివాఅనుకుంటూ, మరొకరు శంభోఅంటూ నిద్రలేచారు. “ ఇంతే. మేము సాధించిన పరివర్తన ఇదే. లోతుగా చూస్తే వారు ఇలా అయ్యారు.” మీ జీవితం మొత్తం నటించగలరేమో కాని నిద్రలో నటించలేరు. ఇది చాలా మందికి ఉన్న ఏకైక అదృష్టం. కనీసం నిద్రలోనైన వారి నాటకానికి తెర దించుతారు. మీరు మెలుకువతో ఉన్నప్పుడు ప్రపంచాన్ని పిచ్చిదాన్ని చెయ్యచ్చు, కానీ నిద్రలో మీరు మీలానే ఉంటారు.

 

అవగాహనతో మసలుకోవడం...

మీరు ఎటువంటి శబ్దాలతో నిద్రలేస్తున్నారన్నది మీ రోజును ఎలా గడపబోతున్నారో ఇంకా మీ భవిష్యత్తును ఎలా మలచుకోబోతున్నారో నిర్దేశిస్తుంది. నేను మీకు ఇది చాలా సార్లే చెప్పి ఉంటాను- రాత్రి నిద్రలోకి వెళ్ళే సమయంలో మీరు మెలకువ నుండి నిద్రలోకి అవగాహనతో వెళ్ళగలిగితే మీ జీవితమంతా రూపాంతరం చెందుతుంది. మంత్రాన్ని మననం చేసుకుంటూ నిద్రపోయే ఒక సంప్రదాయం ఉంది. కాని మొదట్లో మీరు మంత్రం చదువుతూ నిద్రపోతారు. ఎప్పుడూ నిద్రపోయారో మీకు గుర్తుండదు. ఈ స్థితికి రావడానికి కొంత అవగాహన అవసరం.

 

నిశ్శబ్దంలోకి మేల్కోవడం అసలైన గొప్పతనం...

యోగులు ఈ అవగాహనను పొందడానికి మెరుగైన పద్ధతులలో ప్రయత్నించే వారు-చాలా మెరుగైన పద్ధతులలో-అవి చాలా రకాలుగా సోధింపబడ్డాయి. కానీ ఎక్కువ మంది వాటిని ఉపయోగించుకోలేకపోయారు.

కానీ నిద్ర మేల్కునేటప్పుడు అవగాహనతో మేల్కోవడం చాలా సులువుగా చేయగలిగే పని. నిద్రపోయేటప్పుడు అంత ప్రభావితంగా ఉండకపోవచ్చు కానీ నిద్రలేవడం సులువుగా చెయ్యగలిగే పని ఎందుకంటే అది ఒక క్రమం లో జరుగుతుంది కాబట్టి.

 

నిద్ర మేల్కోవడానికి ఉత్తమమైన మార్గం...

ఉన్నట్లుండి అలారం మోతకు నిద్రలేవడమనేది మంచి పధ్ధతి కాదు. మీరు ఎటువంటి ఆహారం తింటున్నారో, ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారో, ఎటువంటి భావోద్వేగాలు కలిగి ఉన్నారో, అనే విషయాలు మీకు ఎంత నిద్ర అవసరమో నిర్ణయిస్తాయి. మీకు ఎంత నిద్ర కావాలో మీకు తెలుస్తుంది. మీరు త్వరగా నిద్రపొండి తద్వారా మీకు సహజంగానే మెలుకువ వచ్చేస్తుంది. మీకు ఒకవేళ సందేహంగా ఉంటే, మీ దగ్గర ఏదైనా శ్లోకం ఉంటే, ఏదైనా వైరాగ్య శ్లోకం మీకు నాదిగా అనిపించినట్టు గుర్తిస్తే మీరు దాన్ని ఉపయోగించుకోవచ్చు.

 

ఈ రోజు మన దగ్గర ఎన్నో ఉపకరణాలు ఉన్నప్పటికీ శరీరానికి ఎంత నిద్ర అవసరమో అంత ఉండాలని నేను అంటాను. నిజానికి నిశ్శబ్దంగా నిద్రలేవడం ఉత్తమమైనది కానీ మీకు సరైన సమయానికి లేస్తారో లేదో అని అనుమానముంటే, కనీసం సరైన శబ్దాలను వింటూ నిద్రలేవండి. మిమ్మల్ని భయపెట్టి హఠాత్తుగా నిద్రలేపే రింగ్ టోన్లకు కాకుండా మిమ్మల్ని నిదానంగా నిద్రలేపే శబ్దాలను ఉపయోగించుకోండి.

ప్రేమాశీస్సులతో,

సద్గురు