ఈశా సంఘమిత్ర

చైతన్యవంతమైన ప్రపంచాన్ని సృష్టిద్దాం

“అందమైన విషయాలు జరిగేది వాటిని కోరుకోవడం వల్ల కాదు, అందమైన విషయాలు జరుగుతున్నది ఎవరో ఒకరు వాటిని జరిగేలా చేస్తున్నారు కాబట్టి. మీరు ఆ ఒకరా ?...” – సద్గురు

 

ఈశా సంఘమిత్ర

చైతన్యవంతమైన ప్రపంచాన్ని సృష్టిద్దాం

“అందమైన విషయాలు జరిగేది వాటిని కోరుకోవడం వల్ల కాదు, అందమైన విషయాలు జరుగుతున్నది ఎవరో ఒకరు వాటిని జరిగేలా చేస్తున్నారు కాబట్టి. మీరు ఆ ఒకరా ?...” – సద్గురు

 

ఈశా సంఘమిత్ర అంటే ఏమిటి?

seperator
 
 

 

యోగ సాంప్రదాయంలో, సంఘ అంటే, ఆధ్యాత్మిక సమూహం అని ఇంకా మిత్ర అంటే స్నేహితుడు అని అర్థం. సంఘమిత్ర అంటే, ఆధ్యాత్మిక సమూహానికి స్నేహితుడు అని అర్థం.

ఈ భూమి మీద ఉన్న ప్రతీ మనిషికీ, కనీసం ఒక చుక్క ఆధ్యాత్మికతను అందించి, తద్వారా మరింత చైతన్యవంతమైన మానవాళిని సృష్టించడం అనే సద్గురు సంకల్పంలో ఒక భాగం అయ్యేందుకు, ఈశా సంఘమిత్ర అనేది నిబద్ధతతో కూడిన ఒక చక్కని అవకాశం.

సంఘమిత్రలో భాగం కావడం ద్వారా, మీకు వీలైనంత కాలం, నెలవారీ విరాళాలను అందించవచ్చు. విరాళం ఎంతైనా, పెద్దది, చిన్నది అనేది ఉండదు. మీకు సాధ్యమైన రీతిలో మాకు సహాయం అందించండి.

ఇప్పుడే విరాళం అందించండి

 
అనుభవాలు
 

తరచుగా అడిగే ప్రశ్నలు

seperator

ప్రతినెలా, నెలవారీ విరాళంగా రూ. 511, రూ. 1,011, రూ. 10,111 లేదా మీకు తోచిన మొత్తాన్ని అయినా విరాళంగా సమర్పించవచ్చు.

మీరు ఆన్లైన్ లో నెట్ బ్యాంకింగ్, డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా విరాళం అందించవచ్చు.

ఈ భూమి మీద ఉన్న ప్రతీ మనిషికీ, కనీసం ఒక చుక్క ఆధ్యాత్మికతను అందించడం అనే సద్గురు సంకల్పంలో భాగం పంచుకుంటూ, ప్రతీ స్థాయిలో మానవ శ్రేయస్సును కాంక్షిస్తూ, మరింత సచేతనమైన, సంఘటితమైన మరియు జాగృతమైన ప్రపంచాన్ని సృష్టించడం కోసం ఈశా ఫౌండేషన్ చేస్తున్న కృషికి మద్దత్తుగా, మీ విరాళం వినియోగించబడుతుంది.

ఈశా సంఘమిత్ర అనేది మీరు ఎంచుకున్నంత కాలం పాటు మీరు పాటించవలసిన ఓ నిబద్ధత. ఒకవేళ, ఏదైనా నెలలో మీరు విరాళమివ్వడం కుదరకపోతే, కనీసం పదిరోజుల ముందే isha.sanghamitra@ishafoundation.org కు మెయిల్ రాయగలరు.

భారత పన్ను చెల్లింపుదారులకు, సెక్షన్ 80 G ప్రకారం, ఈశా ఫౌండేషన్ కు అందించే విరాళాలకు ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది.

 

అవును. మీరు ఈశా సంఘమిత్రకు విడిగా రిజిస్టర్ అవ్వగలరు.

ఈశా సంఘమిత్ర, మరింత జాగృతమైన ప్రపంచాన్ని సృష్టించడంలో ఈశాకు మద్దతుగా నిలిచేందుకు గల ఒక అందమైన అవకాశం. సంఘమిత్రలో భాగం కావడం ద్వారా, ఈశా ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలకు మద్దతుగా నెలవారీ విరాళాలను అందించవచ్చు. ఎంత విరాళం అందించాలి ఇంకా ఎంతకాలం పాటు అందించాలి అనేది పూర్తిగా, వ్యక్తిగత ఎంపికకు వదిలివేయడం జరుగుతుంది. ఒకసారి నిర్దేశిత కాలం పూర్తి అయినప్పుడు, వారి మద్దతును పొడిగించుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఈశాంగా 7% అనేది జీవితకాలం పాటు, సద్గురుతో సాగించే, పవిత్రమైన భాగస్వామ్యం. ఈశాంగాలా మారడం అంటే, మీరు మీ ఆదాయంలో 7% లేదా అంతకంటే ఎక్కువ ఈశా ఫౌండేషన్‌కు క్రమం తప్పకుండా అందించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అని అర్ధం. ఈశాంగా 7% భాగం అయిన వారు, సద్గురుచే ఒక శక్తివంతమైన ప్రక్రియలోకి దీక్షను స్వీకరిస్తారు. దీనిని ప్రతిరోజూ సాధన చేయవలసి ఉంటుంది.

మీరు ఈ క్రింద ఇవ్వబడిన సులభమైన, శక్తివంతమైన సాధనను ప్రతిరోజూ చేయవచ్చు:

  • నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి.
  • అర్ధ సిద్దాసనం లేదా బాసిపీట వేసుకుని కూర్చోండి. మీ అరచేతులు పైకి ఉంచి, చేతులను తొడలపై ఉంచి, కళ్ళు మూసి ఉంచండి.
  • 12 సార్లు “యోగ యోగ యోగేశ్వరాయ” స్తుతిని చేయండి.
  • కళ్ళను మూసి ఉంచి, ముఖాన్ని కొద్దిగా పైకి లేపి ఉంచిన భంగిమలో 5 నిమిషాల పాటు కొనసాగండి.

మీరు +91 844 844 7707 లేదాisha.sanghamitra@ishafoundation.org ద్వారా టీంను సంప్రదించవచ్చు.