లక్ష్మి మంచు: నమస్కారం సద్గురు! తల్లి తండ్రుల తోటి సంబంధం మన జీవితం మీద ఎలా ప్రభావం చూపుతుంది? అది చూపేటట్లైతే మనం దానిని ఎలా చూసుకోవాలి?

సద్గురు: నమస్కారం లక్ష్మీ, ఒక వ్యక్తి 84 ఏళ్ళు జీవిస్తే, యోగ యోగశాస్త్ర పరంగా దానిని పూర్తి జీవితంగా భావిస్తాము. ఈ జీవిత కాలంలో, 1008 చంద్ర భ్రమణాలు (పౌర్ణములు,moon cycles) ఉంటాయి. ఆ 84 ఏళ్ల మొదటి నాలుగో భాగంలో, అంటే మొదటి 21 ఏళ్లలో, శక్తి పరంగా తల్లిదండ్రుల కర్మ ప్రభావం పిల్లల మీద ఉంటుంది, ఆ తర్వాత మనం తల్లి తండ్రులచే ప్రభావితం కాకూడదు. ఆ తర్వాత వారు మనకు చేసిన వాటన్నిటికీ, మనం కృతజ్ఞతా పూర్వకంగా ఉండాలి. ఎందుకంటే మనల్ని ఈ ప్రపంచంలోకి వారే తీసుకు వచ్చారు. ఇంకా ప్రేమ, ఆదరణలతో వాళ్లు మనకు ఎన్నో చేశారు.

ఎవరైనా తల్లిదండ్రుల చేత 21 ఏళ్ల తర్వాత ప్రభావితం కాకూడదు. ఎందుకంటే పిల్లలు తమ జీవితాన్ని నూతనంగా తయారు చేసుకోవాలి, అంతేగాని ముందు తరం చేసినదానికి ఒక నకలు కాకూడదు. ప్రతి ఒక్కరి మీద ఇరవై ఒక్క ఏళ్లు వచ్చేదాకా తల్లిదండ్రుల కార్మిక ప్రభావం ఉంటుంది, కానీ ఆ తరువాత అటువంటిదేమీ ఉండదు. చాలామంది తమ తల్లిదండ్రుల మీద ఆర్థికంగా, సంఘపరంగా, మానసికంగా ఇంకా ఆధారపడి ఉండవచ్చు, కానీ 21 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల పోషణ మీద ఆధారపడి ఉండకూడదు ఆ తర్వాత అది ఒక సంబంధం ఉంటుంది. ప్రేమ కృతజ్ఞత, ద్వారా ఒక సంబంధం ఉంటుంది. అవి మాత్రం ఎప్పటికీ ఉండవచ్చు.

సంపాదకుడి సూచన: మిమ్మల్ని ఏదైనా ప్రశ్న తొలిచివేస్తుందా, ఎవ్వరినీ అడగలేని ప్రశ్న మీలో మొదలైందా? ఇదే మీకున్న అవకాశం..సద్గురుని ఇక్కడ అడగండి.UnplugWithSadhguru.org.

Youth and Truth Banner Image