మన సంస్కృతిలో పాములు పూజింపబడుతున్నాయి. అలాగే యోగాలో కూడా ఇవి ఎంతో ముఖ్యమైన భూమిక పోషిస్తున్నాయి. కాని పశ్చిమ దేశాల సంస్కృతిలో పాముల్ని దెయ్యాలుగా, దైవ విరుద్ధమైన వాటిగా పరిగణిస్తారు. మరి అలాంటప్పుడు పాము దేనికి ప్రతినిధి? దైవానికా, దయ్యానికా? ఇది తెలుసుకోవాలంటే ఈ వ్యాసం తప్పక చదవండి!


ఒక విధంగా చూస్తే, పాము ‘కుండలినికి’ సంకేతం. స్వభావం, కదలిక, నిశ్చలత్వం వంటి విషయాల్లో కుండలినికి పాములతో ఉండే పోలిక వల్ల, పామును కుండలినికి సంకేతంగా చూస్తారు. ఇంకో అంశం ఏమిటంటే పాము జీవ పరిణామక్రమంలో చాలా ముఖ్యమయిన మలుపు. జీవపరిణామ క్రమంలో ‘శరీరం పరంగా కోతి ప్రముఖ స్థానంలో ఉంటుంది, అలాగే ‘శక్తి’ పరంగా పాము విశిష్ట స్థానంలో ఉంటుంది. మరో అంశం ఏమిటంటే పాములు కొన్ని రకాల శక్తులకు ఎంతో స్పందిస్తాయి. ఎక్కడ ధ్యానానికి అనుకూలంగా ఉంటుందో లేక యజ్ఞయాగాదులు నిర్వహింపబడుతుంటాయో అక్కడికి పాములు ఆకర్షింపబడతాయి. అలాగే పాములు గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి.

స్వభావం, కదలిక, నిశ్చలత్వం వంటి విషయాల్లో కుండలినికి పాములతో ఉండే పోలిక వల్ల, పామును కుండలినికి సంకేతంగా చూస్తారు

అందుకే ఈ సంస్కృతిలో మీరు పాముని చంపడం నిషిద్ధం. భారతదేశంలో ఒక పాముని చంపినా, ఒక పాము మృతదేహాన్ని చూసినా దానికి అంతిమ సంస్కారం చేయడం ఆనవాయితీ. జీవపరంగా మనిషికి పాముకి ఎంతో దగ్గర సంబంధం ఉండటం వల్ల, ఈ సంస్కృతిలో పాము కూడా మనిషిలాగే ఎప్పుడూ సరైన అంతిమ సంస్కారాన్ని పొందుతూ ఉంది. అందువల్ల ఒక పాముని చంపడం అంటే అది హత్యతో సమానమే.

పాశ్యాత్యదేశాల్లో పాముల గురించి వ్యతిరేక భావం ఉండడానికి ప్రధాన కారణం క్రైస్తవ మతంలోని కొన్ని అంశాలలో పాముల గురించి చాలా అవాస్తవంగా వివరించటమే. పాముని దెయ్యానికి ప్రతినిధిగా, అదొక వ్యతిరేక శక్తిగా వారు భావిండానికి ఒక కారణం, పాము ఈవ్ను యాపిల్ పండు తినేందుకు ప్రోత్సహించడం అయివుండవచ్చు. ఈ భూమి మీద Snake n Sadhguruఇద్దరు మూర్ఖులు ఆడం ఈవ్  లు ఉండేవారు. వాళ్ళకి కనీసం తమతో తాము ఏమి చేసుకోవాలో కూడా తెలియలేదు. చూడండి, ఒక యువకుడు గానీ, ఒక యువతి గానీ ఎరుకతో, మనఃపూర్వకంగా తమ లైంగికతను అధిగమించగలిగినట్లైతే, అదొక అద్భుత విషయం, కాని, కనీసం వారి లైంగికత కూడా వారికి తెలియకుండా ఉండటం మూర్ఖత్వానికి ప్రతీక. వారు ఆత్మజ్ఞానం పొందిన స్వేచ్ఛాజీవులు కారు. వారు మూర్ఖులు. ఎంత మూర్ఖులంటే వాళ్ళకు అసలు ఆత్మజ్ఞానం, స్వేచ్చ అంటే ఏమిటో కూడా తెలియదు. అట్టి పరిస్థితులలో జీవం కొనసాగే అవకాశమే లేదు. అప్పుడు పాము అక్కడ ప్రవేశించి ఈవ్ ని ప్రలోభపరచింది. అది ఈవ్ ని ప్రలోభపరచి యాపిల్ తినేలా చేసి ఈ భూమి మీద జీవం కొనసాగేలా చేసింది.

ఈ భూమి మీద జీవరాశి మొదలయ్యేలా ప్రేరేపింప చేసిన పాము ఖచ్చితంగా దేవుడి ప్రతినిధే

మీరు ఈ భూమి మీద జీవరాశి అంతా దేవుని సృష్టి అని నమ్ముతున్నట్లైతే, అలాగే ఈ భూమి మీద జీవరాశి మొదలయ్యేలా ప్రేరేపింప చేసింది పాము అయితే, అప్పుడు పాము దేవుని ప్రతినిధా లేక దెయ్యం ప్రతినిధా చెప్పండి? అది తప్పక దేవుడి ప్రతినిధే! అవునా, కాదా? ఈ భూమి మీద జీవరాశి మొదలయ్యేలా ప్రేరేపింప చేసిన పాము ఖచ్చితంగా దేవుడి ప్రతినిధే. జీవ ప్రక్రియకు పూర్తిగా వ్యతిరేకులు, జీవ ప్రక్రియ గురించి కనీస అవగాహన కూడా లేని మూర్ఖులు, ప్రాథమిక శరీర నిర్మాణం గురించి కూడా తెలియని వారు మాత్రమే భూమి మీద జీవరాశి మొదలయ్యేలా ప్రేరేపింప చేసిన పాముని దెయ్యం ప్రతినిధి అంటారు. జీవ ప్రక్రియ తెలిసినవారెవరైనా ఖచ్చితంగా పాముని దేవుడి ప్రతినిధిగానే చూస్తారు.

Snakes-Intertwined-LB

ఇక్కడ ఈ సంస్కృతిలో పాముని మనం దేవుని ప్రతినిధిగానే చూస్తాం. శివుడంతటి వాడే పాముల్ని ధరించాడు. అదీ పాదాల వద్ద కాదు తన తలపై. జీవపరిణామ ప్రక్రియలో మానవ జన్మ వైపు పడిన అడుగులలో పాము జన్మ ఒక ముఖ్యమైన అడుగుగా చూడబడుతున్నది. అందుకే ఈ సంస్కృతిలో మీరు ఏ గుడికి వెళ్ళినా అక్కడ పాములు ఉంటాయి.

నాకు తెలిసినంత వరకూ పాము లేని గుడి అంటూ ఉండదు. ప్రతి గుడిలో ఎక్కడో ఒక చోట ఒక చిన్న పాము విగ్రహమైనా ఉంటుంది. అన్ని ప్రాచీన దేవాలయాల్లో పాములన్నాయి. క్రొత్తగా, షాపింగు కాంప్లెక్సులలా కట్టిన కొన్ని దేవాలయాల్లో పాములు ఉండకపోవచ్చు. కాని మీరు ఏ పురాతన దేవాలయాన్ని సందర్శించినా అక్కడ పాముల కోసం ప్రత్యేకంగా ఓ స్థానం ఉంటుంది. ఎందుకంటే అది జీవ పరిణామక్రమంలో చాలా ముఖ్యమయిన మలుపు. అంతేకాకుండా, ఎన్నో విధాలుగా జీవ ప్రేరేపణకు కారణం అదే.

శివుడంతటి వాడే పాముల్ని ధరించాడు. అదీ పాదాల వద్ద కాదు, తన తలపై 

పాముని దెయ్యం ప్రతినిధిగా భావించడం ఎంతో బాధాకరమైన విషయం. అది అజ్ఞానం వల్ల ఏర్పడిన భావన. పాము ఈవ్ యాపిల్ని తినేలా ప్రోత్సహించిందని ప్రపంచంలో సగంమంది పాముని దెయ్యం ప్రతినిధిగా భావిస్తున్నారు. అసలు యాపిల్ తినటం అనేది చెడ్డ పని కాదు. ఒకవేళ భగవంతుడు మానవ సృష్టిని కొనసాగించదలచుకోకపోతే అసలా సంఘటన జరిగేదే కాదు. అలా ఆ యాపిల్ తినటమే ఈ భూమిపై జీవరాశి ఉద్భవానికి కారణమయింది. అదే జీవానికి మూలం. జీవం దేవుని సృష్టి అయితే, పాము ఖచ్చితంగా దేవుడి ప్రతినిధే. జీవ వ్యతిరేకులు మాత్రమే పాముని దెయ్యం ప్రతినిధి అని అంటారు. ఎవరు జీవాన్ని నమ్ముతారో, జీవానుకూలంగా ఉంటారో, వారు సహజంగానే పాముని జీవప్రేరణ శక్తిగా చూస్తారు. అందుకని ఏది జీవితాన్ని ప్రేరేపిస్తుందో, అది ఖచ్చితంగా దేవుడి ప్రతినిధే అయివుండాలి, దెయ్యం ప్రతినిధి కానే కాదు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు