సచేతనత్వమంటే స్వీయ చేతనత్వంఅందుకోవడం కాదు. స్వీయ చేతనత్వం ఒక రోగం, అచేతనత్వం అంటే మరణం. సచేతనంగా ఉండడమంటే, మీరు అసలు ఎవరో దాని మూలంతో స్పర్శలో ఉండడం. మీరు సచేతనత్వం అనేది ఒక చర్యో, ఒక అభిప్రాయమో, ఒక గుణమో కాదు- అది ఈ సృష్టికే మూలం. మీ సచేతనత్వం పెరిగిందంటే అర్థం మీరు మీ కుక్క కన్నా ఎక్కువ అప్రమత్తంగా ఉన్నారని కాదు. అప్రమత్తత అనేది మానసిక మైనది. సచేతనత్వం మానసికమైనది కాదు, నిజానికి సచేతనత్వం బాగా ఉంటే అది మనస్సును నిర్మలం చేస్తుంది. అది మనస్సు, శరీరం, ఇంకా చెప్పాలంటే మీ జీవంలోని ప్రతికణం నుంచీ వ్యక్తమౌతుంది.

మీరేదో చేయడం వల్ల సచేతనత్వం రాదు, మీరు కేవలం దానిని అనుమ తించడం వల్లనే అది సంభవిస్తుంది. జీవం మీకు జరిగేది మీరేదో చేయడం వల్ల కాదు. సచేతనత్వం అనేది మీ జీవానికి, మీ ఉనికికి మూలం. అది, మీరు ఫలానా సమయంలో చేయగలిగిందో లేక చేయలేక పోయిందో కాదు. చైతన్యం అనేది మీరు సశరీరులుగా ఉన్నా విగత శరీరులుగా ఉన్నా ఉండేదే. ఉన్న ప్రశ్నంతా అది మీకు అందుబాటులో ఉన్నదా లేదా అన్నదే? మీరు ఎప్పుడూ చైతన్యానికి అందుబాటులోనే ఉన్నారు, మీరు దానినుంచి తప్పించుకోలేరు, కాని అది మీకు అందుబాటులో ఉన్నదా?

మీరు సచేతనత్వం అనేది ఒక చర్యో, ఒక అభిప్రాయమో, ఒక గుణమో కాదు- అది ఈ సృష్టికే మూలం.

మీ జీవంపై సచేతనత్వం ఎప్పుడూ ప్రభావం చూపుతూనే ఉంటుంది. అది మీరు అందుకుంటున్నారా లేదా అన్నదే ప్రశ్న. మీరు దానిని అందుకోకుండా తప్పించుకు తిరిగేది ఎందువల్లనంటే, మీరు దానిని అందుకుంటే ‘మీరు’ అంతమొందుతారు, మీరిక ఉండరు. మీకు గౌరవం - అగౌరవం, బాధ - సౌఖ్యం అనేవి ఉండవు, మీరు చేద్దామనుకున్న వన్నీ చేయవచ్చు. కావాలంటే చూడండి, నేను చేయదలచుకున్నవన్నీ చేస్తున్నాను, కానీ నిజానికి ఏమీ చేయడం లేదు. మీరు జీవితంలో సాధించిన ఘనకార్యలంటూ ఏమీ ఉండవు. మీ అంతరంగంలో, మీరు మరొకరి కన్నా ఎక్కువా కాదు తక్కువా కాదు. మీరు కావాలనుకున్నవన్నీ చేయవచ్చు కానీ వాటి వల్ల మీరు పురోగమించరు, తిరోగమించరు. ఈ జీవితాన్ని ఏది కావాలంటే దానిని అనుభూతి చెందేలా మీరు చేయగలరు.

స్వేచ్ఛే మీకు పరమోత్తమ లక్ష్యమైతే, మీరు కేవలం పరిత్యాగ స్థితి వైపుకి కదలాలి.

జీవితాన్ని ఏ విధంగా నైనా మరల్చుకోగల స్వేచ్ఛ ఉంటుంది.

కావాలంటే నన్ను నేను క్షణాల్లో బాధా, కన్నీళ్ళతో పరమ దౌర్భాగ్యునిగా చేసుకోగలను లేక ఎంతో బ్రహ్మానంద పూరితుణ్ని చేసుకోగలను. రెండు స్థితులూ నా చేతలవల్లనే జరిగాయని గ్రహించగలను. మీరు జీవిత నాటకం అనుకునేవేమీ అక్కడ లేవు, స్వేచ్ఛే ఉన్నది. మీరు దానినుంచి ఏదైనా చేసుకోవచ్చు. స్వేచ్ఛే మీకు పరమోత్తమ లక్ష్యమైతే, మీరు కేవలంపరిత్యాగ స్థితి వైపుకి కదలాలి. అంటే మీరేదో మీ బాధ్యతలను పరిత్యజించడం కాదు. ప్రజలు పరిత్యజించాలనుకునే మొదటి విషయం అదే. ఎందుకంటే తమకు ఇబ్బందిగా ఉన్న కుటుంబం ఇంకా అలాటి వన్నీ వారు వదిలించుకోవాలను కుంటారు. కానీ వారు తమ అభిప్రాయాలూ, ఉద్దేశ్యాలూ, సిద్ధాంతాలూ, అహంకారభావంతో బ్రతకడం లాంటివి పరిత్యజించరు.

పరిత్యజించడమంటే దీనినో దానినో పరిత్యజించడం కాదు, మిమ్మల్నమీరుపరిత్యిజించడం.. మీరు కాక మీరు విలువైనవనుకున్నవన్నీ. మీరలా చేస్తే జీవితం మంచిగానో, చెడుగానో కాదు, అందంగానో, అందవిహీనంగానో కాదు, అది మీరు వివరించలేని విధంగా మారుతుంది. ఇది అందరికీ తెలిసిన జీవితం కాదు. అది ఎలా ఉంటుందంటే మీరు మొదటి తరగతి పూర్తిచేసారు , మరిక తరువాతి క్లాసుకు వెళ్ళాలి అన్నట్లుగా ఉంటుంది.

ప్రేమాశీస్సులతో,

సద్గురు