ప్రశ్న: నేను ధ్యానం చేస్తున్నప్పుడు అంతా శాంతంగా, నిశ్చలంగా ఉన్నట్లు, కాస్త పురోగతి చెందుతున్నట్లు ఉంటుంది. కాని ఏదైనా ప్రతికూలమైనది జరిగినప్పుడే నిజమైన సమస్య వస్తుంది, అప్పుడు నేను అంతా మరచిపోయి, నా పాత పద్ధతులలోకే వెళ్ళిపోతాను. నా సాధనలు ఏదో కొంత ప్రభావం చూపుతున్నట్లు ఉంటోంది, కాని ఏదైనా జరిగినప్పుడు మాత్రం నేను నా పాత విధానాలలోకే వెళుతున్నాను.

సద్గురు: మీరు ‘పాత విధానాలలోకే వెళుతున్నాను’ అని ఇప్పటికే రెండు సార్లు అన్నారు. దాని అర్థం ఏమిటి? మీరు ఆందోళనగా ఉండడమే మీ నిజ స్వభావమా? అవునా? మరి మీ నిజ స్వభావం అదేనా?

ప్రశ్న: అవును.

సద్గురు: మరి మీ నిజ స్వభావాన్ని మీరు ఎందుకు వదులు కోవాలనుకుంటున్నారు?

ప్రశ్న: లేదు, నా నిజ స్వభావం అన్నప్పుడు నా ఉద్దేశ్యం ఏమిటంటే, మా జీవితాలలో మేము ఇలానే వ్యవహరిస్తున్నాము.

సద్గురు: మీరు అటువంటి ఆందోళనా స్థితిలో అంతగా మమేకమైనప్పుడు ఎలా వదిలివేయగలరు? మీరు గనక ‘‘నేను సాధన చేస్తున్నప్పుడు శాంతంగానే ఉంటాను, కాని ఏదైనా ప్రతికూలత ఎదురైనప్పుడు నేను తప్పిపోతున్నాను’’ అంటే బాగుండేది. అవునా? బాగుండడమే కాదు, ‘‘నేను నా అసలు స్వభావం నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను’’ అని చూడడం చాలా ముఖ్యం. అప్పుడు మీరు సహజంగానే మీ నిజ స్థితికి తిరిగి రావాలనుకుంటారు. కాని మీరు నా అసలు స్థితి ఆందోళనే అని, నా శాంత స్థితి అనేది కేవలం యోగాతో వచ్చిన అనుభూతి అని అంటున్నారు. అందుకే సహజంగా నేను నా అసలు స్థితికి వచ్చేస్తుంటానని అంటున్నారు’’. మరి అదే మీ నిజస్థితి అయితే, దానికి తిరిగి వెళ్లాలనుకోవడం సహజమే కదా?

మీరు మీ అంతరంగంలోనే మార్పు చేసుకోవాలి. మీరు ఎలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. మీరు ఆలోచించే విధానాన్ని మార్చుకుంటే మీ బుర్రలోని చెత్తనంతా మార్చివేయవచ్చు. మీరు ‘‘నా సహజ స్వభావం ఆందోళన అన్నప్పుడు’’ అది స్థిరపడేందుకు ప్రయత్నిస్తుంది. అలాకాక, మీరు ‘‘నా సహజ స్వభావం శాంతం, కాని దానిని కోల్పోయాను’’ అన్నప్పుడు మీరు సహజంగా మీ సహజ స్థితిలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తారు.

మీ సహజ స్వభావం

మీ సహజ స్వభావం ఏమిటి? నేను చెప్పడం కాదు, మీరే చెప్పండి, మీ సహజ స్వభావం ఏమిటి? లేక మీ సహజ స్వభావం గురించి మీకు తెలియకపోతే, కనీసం మీ చిన్నతనంలో మీరు ఆందోళనగా ఉన్నారా? లేక శాంతంగా, ఆనందంగా ఉన్నారా? మీరు మీ నిజ స్థితికి చేరకపోయినా కనీసం మన మొదటి స్థితికి వెళ్ళచ్చం టారా? మనం మన ఆటను అక్కడనుంచే ప్రారంభిద్ధామా? మనం అయిదేళ్ళప్పుడు ఎలా ఉన్నామో ఆ స్థితికి వెళదామా? ఆ మాత్రం శాంతి, ఆనందాలు ఉండాలి.

అది అంత ఎక్కువ ఏమీ కాదు. చాలా మంది చిన్నపిల్లలుగా మారడమే అతిగొప్ప విషయం అనుకుంటున్నారు. అదేమీ కాదు. పెద్దవారు కావడానికి ఎంతో శ్రమ పడ్డారు. చిన్నపిల్లలు కావడం అంత గొప్ప విషయమేమీ కాదు. తమని తాము పూర్తిగా నాశనం చేసున్నవారిని, కనీసం మీ మొదటి స్థితికి చేరమని అంటాము. కనీసం అక్కడనుంచైనా ఆరంభించండి. పడిపోకండి.

అందుకే మీరు ‘‘ధ్యాన స్థితిలో పొందిన అనుభవం ఏదో క్షణకాలం అలా అనుకోకుండా సాధ్యపడింది’’ అనుకోవడం మానేయండి. అదేదో గొప్ప ఘనకార్యం కాదు. మిమ్మల్ని మీరు అస్తవ్యస్తం చేసుకోకపోతే మీ జీవితంలో ప్రతిక్షణం మీరు అలానే ఉండేవారు. అది వాస్తవమేనా? మీరు అస్తవ్యస్తం చేసుకున్న పరిస్థితి మీ అసలు పరిస్థితా, లేక మిమ్మల్ని ఏదీ అస్తవ్యస్తం చేయనప్పుడు మీరున్న స్థితి మీ నిజ స్థితా? ఈ రెంటిలో మీ నిజ స్థితికి, ఏది దగ్గరగా ఉంది? అస్తవ్యస్తం చేసుకుంది, అవునా?

మీ జీవితంలో మీరు అనుభవించిన అతి మధుర, శాంత క్షణం ఏదో ఒకసారి వెనక్కు తిరిగి చూసుకోండి. అక్కడ నుంచే మీరు మొదలెట్టండి. అదే మీ నిజ స్థితిగా చూడండి. నిజానికి అది కాదు, కాని కనీసం మానసికంగా ‘‘నా స్వభావం అదే, కాని ఏదో కారణంగా నేను అది కోల్పోయాను’’ అనుకుందాం. ఒకసారి మీరు చేజార్చుకున్నారని తెలుసుకుంటే, మీలోని ప్రతిదీ దానిని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తుంది.

సరైన ఇన్ పుట్

మీ మనసు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోండి. మీరు దానికి ఒక విషయం ఒక విధంగా చెబితే, మీరు దానికి తప్పుడు ఇన్ పుట్ ఇస్తే మనసు యొక్క శక్తి అంతా ఒక నిర్దిష్టమైన రీతిలో పనిచేస్తుంది. కేవలం ఒక తప్పుడు ఆలోచనతో తమను తాము గుర్తించుకోవడం వల్ల, తమ జీవితాలు పూర్తిగా విషమయం చేసుకున్నవారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. దాదాపు ప్రపంచం మొత్తం ఈ స్థితిలోనే ఉందని నేను చెప్పగలను. వారు తమను తాము ఒక నిర్దిష్టమైన ఆలోచనా ఒరవడిలో గుర్తించుకుంటున్నారు, ఈ గుర్తింపులు వారు చాలా చిన్నగా ఉన్నప్పుడు, కొన్ని విషయాలు చాలా ప్రబలంగా ఉన్నప్పుడు జరిగాయి, మీరు ఇక దానికి అతీతంగా ఆలోచిచంచలేరు.

మీరు ఎలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. మీరు ఆలోచించే విధానాన్ని మార్చుకుంటే మీ బుర్రలోని చెత్తనంతా మార్చివేయవచ్చు. మీరు ‘‘నా సహజ స్వభావం ఆందోళన అన్నప్పుడు’’ అది స్థిరపడేందుకు ప్రయత్నిస్తుంది.

నేను మీ శరీరంలోని స్త్రీ, పురుష హార్మోన్లను నేను తీసేశాననుకోండి. నేను శారీరకంగా తీసేయడం గురించి కాదు, మీరు జీవితాన్ని చేసే విధాన పరంగా దానిని అలా చూస్తే, మరో మూడు రోజుల్లో మీరు ఎలా తయారవుతారో మీకు తెలుసా? మీరు పూర్తిగా ఏ చింతాలేని పసివానిగా అయిపోతారు. మీ శరీరావయవాల గురించి ఎప్పుడూ ఉండే యావ మీకు ఉండదు. మీరు కూర్చోవడం, నడవడం, బ్రతకడం పూర్తిగా భిన్నంగా చేస్తారు.

ప్రకృతికి సంబంధించిన ఓ నిర్దిష్ట ప్రయోజనంకోసం, మీ శరీరంలో వచ్చిన ఓ చిన్నపాటి రసాయన పరమైన మార్పు వల్ల, జీవితం గురించిన మీ అనుభూతి, పూర్తిగా ఇలా మారిపోయింది. అదొక్కటే కాదు, ఇలాంటివి మరెన్నో లక్షల విషయాలు ఉన్నాయి. మీరు వేటి వేటితో గుర్తించుకుంటారో, అది మీ జీవితానుభూతిని పూర్తిగా వక్రీకరిస్తుంది. ఇన్నర్ ఇంజనీరింగ్ అంతా మీ మనస్సుని సరైన విధంగా తీర్చిదిద్ది, మానసికమైన మీ పరిమిత గుర్తింపులను తీసివేసి, మీ ప్రాణ శక్తిని మీ బంధాల నుండి విముక్తి చేయడమే.

 

ఈ బంధం కేవలం దీనితో విముక్తి కాదు, కాని ఆ రకంగా ఆ పరిమిత గుర్తింపుల నుంచి మిమ్మల్ని మీరు విముక్తి చేసుకోవడం అనేది ఆ దిశగా మీరు తీసుకునే మొదటి అడుగు అవుతుంది. అక్కడ ఉన్న కర్మ సంబంధమైన నిర్మాణం కరిగిపోవడానికి ఎంతో సమయం తీసుకుంటుంది, కాని మీరు ఆ విధివిధానాన్ని ప్రారంభించకపోతే మీరు మీ కర్మలను ఎప్పుడూ పెంచుకుంటూనే ఉంటారు, తగ్గించుకోలేరు. మీరు మీ చుట్టూ ఉన్న పరిమిత విషయాలతో గాఢమైన గుర్తింపును తొలగించి వేస్తే, అప్పుడు మీ కర్మను కరిగించుకునే ప్రాధమిక ప్రక్రియను మీరు సిద్ధ పరచుకున్నట్లు.

Editor’s Note: Download the ebook “Inner Management”, where Sadhguru reveals effective tools to enhance capabilities, change your life, and open up a new dimension that frees us from external influences. Set “0” in the price field or click “Claim for Free” for a free download.

Download “Inner Management”