ప్రశ్న: ఎవరైనా ఒకసారి మిమల్ని అనుభూతి చెందితే, ఇదే వారి ఆఖరి జీవితం అని అర్థమా?

సద్గురు: కొంతకాలం క్రితం ఎవరో నన్ను ఇలా అడిగారు, “కేవలం బ్రహ్మచారులే మీ శిష్యులా?” అని. అవును, వాళ్లు మాత్రమే నా శిష్యులు. నేను బ్రహ్మచారులు అన్నప్పుడు, సాంప్రదాయ పద్ధతిలో ఉపదేశం పొందిన వారి గురించి మాత్రమే మాట్లాడట్లేదు. ఇలా ఒక క్రమబద్ధమైన ప్రక్రియ ఉన్నదా, లేదా అన్నది కాదు విషయం. ఏదో ఒక విధంగా వారు ఆ మార్గంలో ఉన్నారు.

కేవలం బ్రహ్మచారులే నా శిష్యులు. ఒకవేళ వాళ్ళు బ్రహ్మచారులు కాకపోతే ఎలా అయినా నా శిష్యులు కారు. వారికి మరి దేనిలోనో కుతూహలం ఉన్నట్లయితే అసలు శిష్యరికం అన్న ప్రశ్నే లేదు. వీళ్ళు ఎవరి శిష్యులూ కాలేరు. ఒక శిష్యుడిగా ఉండడం అన్నది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. మీరు వీరి శిష్యులో లేదా వారి శిష్యులోఅవలేరు. మీరు శిష్యులు కాగలిగితే మీరు శిష్యులు అవుతారు, అంతే. అలాగే మీరు భక్తులు కాగలిగితే మీరు భక్తులు అవుతారు. మీరు ఈ దేవుడి భక్తుడు లేదా ఆ దేవుడి భక్తుడు అనడం కేవలం మూర్ఖత్వం. మీరు భక్తులు, అంతే..! అది ఒక స్వభావం.

అంధకారమై పోవడం

ఇక్కడ నన్ను చూసిన ఎంతో మంది, నన్ను గురువుగా స్వీకరించలేదు. వాళ్ళు వచ్చే జన్మలో కూడా ఇక్కడే వేళ్ళాడుతూ ఉండొచ్చు. నేను ఇక్కడ ఉండకపోవచ్చు కానీ వాళ్లు వేళ్ళాడుతూనే ఉంటారు. ఎందుకంటే వారు దీని వాసన చూసారు కాబట్టి తినాలనుకుంటారు. “గురు” అంటే అంధకారాన్ని పారద్రోలే వారు. “గు” అంటే అంధకారం “రు” అంటే తొలగించడం. మీరు “గురు “ అంటే మీ అంధకారం తొలగిపోయినట్లే. అప్పుడు మీరు మళ్ళీ ఇక్కడికి రావలసిన పని ఏమి ఉంది? మీరు “ఏమీ లేనిదిగా” మారడం వల్ల మీ అంధకారం తొలగిపోయింది, మీరే అంధకారంగా  మారిపోయారు, ఇక దానిని పారద్రోలవలసిన పనిలేదు. మీరు చీకటి నుండి దూరంగా ఉంటే అది మీకో ఘోరమైన విషయం. కానీ మీరే అంధకారంగా మారినప్పుడు అది అపరిమితమైనది.

మీరు “గురు “ అంటే మీ అంధకారం తొలగిపోయినట్లే. అప్పుడు మీరు మళ్ళీ ఇక్కడికి రావలసిన పని ఏమి ఉంది?

అంధకారం ఒక ఘోరమైన విషయంగా మీకు ఎందుకు అనిపిస్తుంది అంటే, మీరు ఇక్కడ ఎదో ఒక చిన్న తునకగా ఉన్నారు. మీరే అంధకారమయిపోతే అది అనంతమైనది. నేను మిమ్మల్ని, “ మీరు అపరిమితమవ్వాలని” దీవిస్తే, అది మీకు గొప్పగా అనిపిస్తుంది. కానీ నేను మిమ్మల్ని “అంధకారం అవ్వండి” అని దీవిస్తే మీరు అది ఓ శాపం అనుకుంటారు. అంధకారం అనంతమైనది, అపరిమితత్వమే అంధకారం. 

అంధకారాన్ని పారద్రోలే వారంటే మీలో ఒక లైట్ బల్బు పెట్టేవారని కాదు అర్థం. పండితులు, ఉపాధ్యాయులు మీలో ఈ లైట్ బల్బ్ పెట్టాలని ప్రయత్నం చేశారు, మీరు దేనినో చూడగలుగుతారని. గురువు మీలో ఒక లైట్ బల్బు పెట్టాలని ప్రయత్నం చేయడం లేదు, ఆయన మిమ్మల్ని తొలగించాలని చూస్తున్నారు. మీకు ఒక గురువు దొరికితే, మీ అంధకారం తొలగినట్లే. ఎందుకంటే మీరు దానిలో ఒక భాగమై పోతారు. ఇక మీకు చీకటి అనేది లేదు. మీకు ఉన్నది అపరిమితమైనది మాత్రమే.

వాసన చూస్తూనే ఉండిపోకండి

ఒకవేళ మీరు మీ గురువుని కలిసినట్లయితే, మీరు మళ్లీ ఇక్కడికి రావడం అన్న ప్రశ్నే లేదు. కానీ మీరు ఆయన్ని ఒక గురువుగా కలిసి ఉండకపోతే, మీరు కేవలం వాసన మాత్రమే చూసి ఉంటే ఆయనలోకి అడుగు పెట్టలేకపోతే, అప్పుడు అది వేరే విషయం. మీకు గులాబీల వాసన నచ్చిందనుకోండి, మీరు గులాబీ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తారు. ఎప్పటికీ అలా చూస్తూ ఉండకండి, మీరు అందులోకి ప్రవేశించాలి. ఎందుకంటే మీరు ఆ పని చేయకపోతే అది ఏ ఉద్దేశంతో నిర్మించబడిందో అందుకు దాన్ని ఉపయోగించుకోలేక పోయినట్లే.

ఒకవేళ మీరు మీ గురువుని కలిసినట్లయితే, మీరు మళ్లీ ఇక్కడికి రావడం అన్న ప్రశ్నే లేదు. కానీ మీరు ఆయన్ని ఒక గురువుగా కలిసి ఉండకపోతే, మీరు కేవలం వాసన మాత్రమే చూసి ఉంటే ఆయన లోకి అడుగు పెట్టలేకపోతే, అప్పుడు అది వేరే విషయం.

మీకు ఎగర గలిగిన విమానం ఉన్నప్పటికీ, మీరు దాన్ని ఓ బస్సులా నడిపారనుకోండి... అందులో తప్పేంటి అంటే, అందులో తప్పేమీ లేదు, కానీ చాలా ఘోరం. ఒక విమానాన్ని ఒక కారులా నడపడం అనేది ఘోరమైన పని. ఘోరంగా, మూర్ఖంగా ఉండటం తప్పా...? లేదు. ఘోరం, మూర్ఖం ఈ రెండు చెడ్డవే...తప్పు అవవలసిన అవసరం లేదు. ఏదైతే మిమల్ని ఎంతో ఎత్తుకు తీసుకు వెళ్ళగలదో, దాన్ని సామాన్యంగా వాడుకుంటే అది మూర్ఖమైన ఇంకా ఘోరమైన విషయం.

ఇది ఎల్లప్పటికీ నిలిచి ఉండే బంధం కాదు. మీరు ఇటువంటి అనుబంధాన్ని ఏర్పరచుకుంటే, ప్రతిదీ అంతమైపోతుంది. ప్రతిదీ అంతమైపోయినప్పుడు, అన్ని విషయాలు అయిపోయినప్పుడు, “ఏదీ కాని” ఒక పార్శ్వం మీకు తెరుచుకుంటుంది. మీలోని జీవం ఆకాంక్షిస్తుంది, అనంతమైనదిగా ఎదగాలనుకుంటున్నప్పుడు ఆకాంక్షిస్తున్నది అదే. ఇది సహజమైన లక్ష్యం. కాకపోతే మీకు ఎన్నో మళ్లింపులు కనిపిస్తున్నాయి. ఇలా మళ్లింపు తీసుకున్నపుడల్లా, ఏ విధంగా అది సరైన మళ్లింపో చెప్పడానికి ప్రజలు సిద్ధాంతాలను ప్రభోదించడం మొదలు పెడతారు.

గురువు ఒక కాళీ రంగస్థలం లాంటివారు. మీరు అక్కడికి ప్రవేశిస్తే, ఆ రోజుకి ఎటువంటి నాటకం అవసరమో దానిని సిద్ధం చేస్తారు. ఎందుకంటే ఆయన ఒక ఖాళీ రంగస్థలం, నాలుగు గోడలు లోపల ఏమీ లేదు.

మీరు ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నప్పుడు, మీరు ఎప్పుడూ తీసుకునే దోవలో ఏవైనా అడ్డంకులు వచ్చి మళ్లింపు తీసుకోవాలనుకుంటే, కారులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తలో దిక్కు చూపిస్తారు. వాదించుకోవడం మొదలుపెడతారు. ఇది జరుగుతుంది కదా...! ఒకసారి మనకి సరైన మార్గం లేనప్పుడు వాళ్లకు నచ్చిన దాన్ని చెబుతారు. అదే సరైనదని వాదించడం మొదలు పెడతారు. ధూమపానం చేసేవారు అదే జీవితం అంటారు. మద్యపానం చేసేవారు అదే జీవితం అని అంటారు. ఇంకొకరు ఏదైనా విలాసాలకు అలవాటు పడ్డవాళ్లు, అదే జీవితం అంటారు. మత్తుపదార్ధాలు తీసుకునే వాళ్ళు అదే జీవితం అనుకుంటారు. ఎవరైతే అతిగా తింటారో వారు అదే జీవితం అనుకుంటారు. వాళ్ళందరూ ఇదే జీవితం అంటారు. అందుకే మళ్ళింపులు జరుగుతాయి.

ఏదైనా సరే, అదే జీవితం అయినప్పుడు మీరు దాన్ని మరింతగా చేస్తే అది ఇంకా మెరుగు పడాలి. కానీ అలా జరగడం లేదు. మీరు ఎక్కువ తింటే లేదా ఎక్కువ తాగితే, ధూమపానం చేస్తే లేదా శారీరక వాంఛను తీర్చు కోవడం ద్వారా జీవితం ఏమి మెరుగుపడదు. ప్రజలు ఇవన్నీ ప్రయత్నం చేసి చూశారు కానీ అవి పని చేయలేదు. మీరు ఆపకుండా చేయగలిగిందల్లా, ఏమీ చేయక పోవడమే. గురువు అంటే ఇదే. ఎందుకంటే, గురువు అంటే ఒక ఖాళీ ప్రదేశం. ఖాళీ ప్రదేశం మాత్రమే అంధకారాన్ని పారద్రోయ గలదు. ఎందుకంటే అదే అంధకారం - ఏమీ జరగదు ఇక్కడ. ఎక్కడైతే ఏమీ జరగదో, అక్కడ మీకు ఏది కావాలంటే అది జరిగేలా చేసుకోవచ్చు

గురువు ఒక కాళీ రంగస్థలం లాంటివారు. మీరు అక్కడికి ప్రవేశిస్తే, ఆ రోజుకి ఎటువంటి నాటకం అవసరమో దానిని సిద్ధం చేస్తారు. ఎందుకంటే ఆయన ఒక ఖాళీ రంగస్థలం, నాలుగు గోడలు లోపల ఏమీ లేదు. మీరు అందులోకి ఒక అడుగు వేస్తే, మీరు కూడా ఏది లేనిదిగా మారతారు. మరో దారి లేదు. మీరు ఆయనని చూడడం, ఆయన చెప్పింది వినడం మాత్రమే చాలదు. మీరు ఆయన లోపలికి అడుగు తీసుకోవాలి. అప్పుడే ఆయన మీ గురువు. అప్పటి వరకు ఆయన మీకు వినోదాన్ని అందిస్తారు, ఎందుకంటే ఆ రోజుకి అవసరమైన నాటకాన్ని ఆయన సిద్ధం చేస్తున్నారు కాబట్టి.

ఒకసారి మీరు అందు లోపలికి అడుగు పెడితే, ఇక మళ్ళీ ఇక్కడ మరోసారి కూర్చోవడం అన్నది లేదు. అటువంటి విషయం ఉండదు. మీరు అలా చేయకుండా, కేవలం దూరం నుంచి దాని వాసన చూసినట్లయితే బహుశా మీకు గురువులు ఓ వ్యసనంగా మారి ఉండొచ్చు. అందుకే మీరు వాళ్ళని వెంబడిస్తున్నారు. మీ శరీరం, మనసు కంటే లోతైనది ఏదో మీకు జరిగినప్పుడు ఇక మళ్ళీ ఇక్కడ కూర్చోవడం అన్నది లేదు.