Death-Book-Banner

 

ప్రశ్న: నాదో ప్రశ్న. నాకు చాలా ఆప్తుడైన ఒక స్నేహితుడు ఇప్పుడు క్యాన్సర్ ఫైనల్ స్టేజీలో ఉన్నాడు. తను దీన్ని తట్టుకుని మరింత మెరుగ్గా అయ్యేలా మనం చేయగలిగేది ఏమన్నా ఉందా?

సద్గురు: నేను ఇది, ఏమాత్రం కూడా మీ ఫ్రెండ్ గురించి నిర్లక్ష్యంగా అనడం లేదు, కానీ మీరు ఇది అర్థం చేసుకోవాలి, అదేంటంటే అందరూ చనిపోవాల్సిందే. ఎప్పుడు, ఇంకా ఎలా అన్నదే ప్రశ్న. మనకు మృత్యువు ఎదురైనప్పుడు, మనల్ని మనం కాపాడుకోవడానికి చేయగలిగినదంతా చేస్తాము. కానీ పరిస్థితి చేయి దాటిపోయినప్పుడు, హుందాగా చనిపోవడం ఎలాగో నేర్చుకోవాలి. దానితో అంతులేని పోరాటం అనేది - పాశ్చాత్య దేశాల్లో ప్రజలు చనిపోతున్న విధానం చూస్తే - అది మరణించేందుకు ఒక ఘోరమైన విధానం అని చెప్పవచ్చు. వాళ్లకి 85 - 90 ఏళ్లు ఉన్నాకూడా, వాళ్ళు ఒంటినిండా పైపులు, ఇంకా సూదులతో హాస్పిటల్లో ఉంటున్నారు. మీరు ఒక రెండేళ్లు ముందే చనిపోయినా పర్వాలేదు. కానీ మీరు ప్రశాంతంగా, హుందాగా చనిపోవడం ముఖ్యం. మీ జీవితంలో మీరు చేసే ఆఖరి పని చనిపోవడం, కాబట్టి మీరు దాన్ని హుందాగా చేయాలా ?లేదా?

మీ జీవితంలో మీరు చేసే ఆఖరి పని చనిపోవడం, కాబట్టి మీరు దాన్ని హుందాగా చేయాలా లేదా?

మనం, మరణాన్ని మన జీవితంలో ఒక భాగంగా అంగీకరించడం నేర్చుకోవాలి. మనం మరణాన్ని కోరుకోవడం లేదు, కానీ అది వచ్చినప్పుడు దాని గుండా హుందాగా వెళ్లడం నేర్చుకుందాం. అమెరికాలోని వృద్దాప్య గృహాలలో నేను చూస్తున్నది ఏమిటంటే, చాలామంది వాళ్ల మృత్యువును మించి, ఇంకా జీవిస్తున్నారు, కేవలం మెడికల్ సపోర్ట్ వల్ల. అది వారికీ, ఇంకా వారి చుట్టూ ఉన్నవారికీ కూడా ఎంతో చిత్ర హింస. కొన్ని కొన్ని ఇళ్లలో వాళ్లని ఏవిధంగా చూస్తారో మీరు చూడాలి- కొంతకాలం తరువాత అక్కడ పనిచేసే వారికి చిరాకు వస్తుంది, ఎందుకంటే వీళ్ళకి ఏమీ అర్థం కాదు, అన్నీ మర్చిపోయారు, ఇంకా తమ సమయానికి అతీతంగా జీవిస్తున్నారు కాబట్టి, వాళ్ళకి ఇంద్రియాలు కూడా సరిగ్గా పని చేయవు. ఇంతటి వైద్య సహాయం అందించకుండా ఉంటే, వాళ్ళు ఒకానొక సమయాన హుందాగా చనిపోయి ఉండేవాళ్ళు.

ఒకవేళ శరీరం తిరిగి బాగు చేయలేనంతగా పాడైపోతే, అప్పుడు మనం హుందాగా చనిపోవడం ఎలాగో నేర్చుకోవాలి. అది ఫర్వాలేదు, మేమందరం కూడా క్యూ లో ఉన్నాము అని ఈ వ్యక్తికి అర్థమయ్యేలా చేయాలి. నేను ఒకరి అనారోగ్యం గురించి హేళన చేయాలనుకోవడం లేదు, కానీ మనం, ఒక విషయం ఎక్కడ అంతం అవుతుందో అక్కడ , మరొకటి మొదలవుతుంది అనేది తెలుసుకోవాలి.

హుందాగా జీవించడం ఇంకా హుందాగా మరణించడం

ప్రశ్న: కానీ సద్గురు, వాళ్లు చనిపోవడాన్ని చూస్తున్న, వారికి సంబంధించిన వారి సంగతి ఏమిటి?

సద్గురు: దీన్ని చాలా తేలిగ్గా అపార్థం చేసుకునే వీలుంది, ఎందుకంటే ఎవరైనా తమకి ఇష్టమైన ఆప్తులైన వారిని కోల్పోయినప్పుడు, అది తన జీవితంలోని ఒక భాగాన్ని తీసేసినట్టుగా అనిపిస్తుంది, ఇంకా వాళ్ళు వేదన చెందటం, సర్వం కోల్పోయినట్టు బాధపడటం, ఇంకా వాళ్లతో గడిపిన మధుర జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకోవడం అనే రకరకాల ప్రక్రియల గుండా వెళతారు. మనం అదంతా మాటల్లో చెప్పలేము. కానీ అదే సమయంలో మనం, ఈ గ్రహం మీద మొట్టమొదటిగా పుట్టిన వారము కాదు, అలాగే ఈ గ్రహం మీద మొట్టమొదటిగా చనిపోతున్న వారమూ కాదు. మన జీవితంలో మనం చదువుకుంటామో లేదో, పెళ్లి చేసుకుంటామో లేదో, లేదా ప్రపంచంలో ఎన్నో పనులు చేస్తామో లేదో మనకు తెలియదు. కానీ మనకి ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా తెలుసు - మనం కూడా చనిపోతాము. ఇది సర్వసాధారణమైన విషయమే అయినప్పటికీ, మనం దానిని అంగీకరించలేక పోతున్నాం.

నన్ను ఎవరో, “సద్గురు పాములు ఎలా చనిపోతాయి - అవి ఎక్కడ చనిపోతాయి?” అని అడిగారు. ఎందుకంటే ఎవరైనా పాముని చంపితే తప్ప, మనం చనిపోయిన పాముని చూడలేం. మరీ ముఖ్యంగా నాగుపాములు, ఇక వెళ్లిపోవాలి అని వాటికి తెలిసినప్పుడు, అవి ఉపసంహరించుకుని, ఎత్తైన కొమ్మని చూసుకుని, అక్కడికి వెళ్లి కూర్చుని, పద్ధెనిమిది నుండి ఇరవై రోజుల వరకు ఏమీ తినవు. అవి అక్కడ చడి చప్పుడు లేకుండా చనిపోతాయి.

ఒక పాకే జీవికి అంతటి ఎరుక ఉంది. శరీరం ఎంత వరకు కొనసాగాలీ, శరీరాన్ని ఎప్పుడూ విడనాడాలీ అనేది దానికి తెలుసు. అదే విధంగా, మీలోని జీవానికీ ఇంకా ప్రతి ఇతర జీవానికీ కూడా, ఎప్పుడు శరీరాన్ని వదిలి వెళ్లాలి అనే ఎరుక ఉంటుంది. మనం ఏదో ఒక విధంగా శరీరాన్ని పాడుచేసినప్పుడు లేదా శరీరంలో జీవాన్ని పట్టి ఉంచడానికి అవసరమైనంత తీక్షణత లేనప్పుడు, ఆ జీవం వెళ్ళిపోతుంది. అది ఇక్కడ ఉన్నంత వరకూ, దాన్ని కాపాడటానికి మనం అన్నీ చేస్తాము. దాన్ని మనతోపాటు ఉంచే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే మనం ఆ జీవానికి విలువ ఇస్తాము. ఇంకా ఆ జీవం తో పాటు ఉండడం మనకు ఆనందం. కానీ ఒకసారి ఆ జీవం వెళ్ళిపోయిన తర్వాత, మనం ఆ నిర్ణయాన్ని గౌరవించాలి. ఎందుకంటే ఆ జీవం వెళ్ళిపోవడానికి నిశ్చయించుకుంది.

sadhguru-wisdom-article-preparing-for-death-old-man-hospital-icu.jpg

ఇప్పుడు వెళ్లిపోబోతున్న జీవాన్ని ఆపి, అన్ని రకాల లైఫ్ సపోర్ట్ లతో జీవితాన్ని మరొక మూడు నెలల పాటు కొనసాగించడం వల్ల వొరిగే ప్రయోజనం ఏమిటి?

మీ జీవితంలో మీరు చేసే ఆఖరి పని మరణించడం. కాబట్టి దాన్ని హుందాగా చేయడం అనేది ముఖ్యం కాదా? అలాగే మన చుట్టూ ఉన్న ఇతరుల విషయంలో కూడా, వారి సమయం వచ్చినప్పుడు, వారు హుందాగా వెళ్ళగలిగేలా అవసరమైన ఏర్పాట్లు చేయడం ముఖ్యం కాదంటారా? ఇప్పుడు వెళ్లిపోబోతున్న జీవాన్ని ఆపి, అన్ని రకాల లైఫ్ సపోర్ట్ లతో జీవితాన్ని మరొక మూడు నెలల పాటు కొనసాగించడం వల్ల వొరిగే ప్రయోజనం ఏమిటి? ఇలా చేయడం అంటే , మీకు జీవం యొక్క స్వభావం గురించి ఏమీ తెలియదని అర్థం. మీరు, మీకు తెలిసిన వాటికే అంటి పెట్టుకుని, మీకు తెలియని వాటి గురించి, అసలేమీ తెలుసుకోవాలని అనుకోవట్లేదు. మీకు ఈ వ్యక్తి తెలుసు, మీరు ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని ఆస్వాదించారు, కానీ మీరు వారి జీవం యొక్క స్వభావాన్ని తాకలేదు. ఎందుకంటే మీరు మీ జీవం యొక్క స్వభావాన్ని తాకితే తప్ప, మీరు మరొక జీవి యొక్క స్వభావాన్ని తాకలేరు.

కాబట్టి మనం మరణం గురించి లేదా మరణానికి సిద్ధమవడం గురించి మాట్లాడాల్సిన పని లేదు. మనంచేయాల్సిందల్లా, మీరు ఈ శరీరం, ఇంకా మనసుగా పోగు చేసుకున్న వాటికి అతీతమైన దాన్ని అనుభూతి చెందడమే. మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చుని - మీరు పోగు చేసుకున్న వాటికి అతీతంగా - మీరై ఉన్న జీవాన్ని అనుభూతి చెందితే, అప్పుడు జీవానికి సంబంధించిన ఏ అంశంతోనూ మీకు ఎటువంటి సమస్యా ఉండదు, మృత్యువుతో సహా. మరణం అనేది మన ఉనికికి సంబంధించిన ప్రాథమిక వాస్తవం అని అర్థం చేసుకోవాలి. మీరు దీన్ని అంగీకరించలేకపోతే, వాస్తవ జీవితానికి సంబంధించిన ఏ ఇతర అంశాలను కూడా తెలుసుకోలేరు. మీకు కేవలం డ్రామా మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే మన ఉనికి యొక్క ప్రాథమికమైన స్వభావమే ఇది - అదేంటంటే మనకు మరణం ఉంది. మనం పుట్టినప్పుడే మనం చనిపోతాము అని చెప్పేసినట్టే. కానీ అది ఎప్పుడు అన్నదే ప్రశ్న. నేను మీకు దీర్ఘాయుష్షు కలగాలని ఆశీర్వదిస్తున్నాను, కానీ చనిపోయేటప్పుడు, మీరు హుందాగా చనిపోవాలి.

వృద్ధాప్యం ఒక వరం కాగలదు. డెత్:ఆన్ ఇన్సైడ్ స్టోరీ అనే పుస్తకం నుంచి తీసుకోబడిన సంచిక

ఈ ప్రపంచంలో మనిషికి తప్ప, ప్రతీ ఇతర జీవికీ కూడా హుందాగా చనిపోవడం ఎలాగో తెలిసినట్లుగా ఉంది. మీరు ఒక అడవిలోకి వెళ్తే - అది వన్యప్రాణులతో నిండి ఉన్నా సరే, అందులో కూడా - వేటకు గురై చంపబడిన జంతువు అయితే తప్ప, మీరు ఊరికే అలా పడివున్న మృతదేహాన్ని చూడలేరు. అడవి దాకా ఎందుకు, పట్టణాలలో కూడా, ఈ రోజుల్లో పక్షులు అంటే చాలా వరకూ అవి కాకులే. మీరు ఒక కాకి చనిపోయి పడి ఉండడాన్ని చూసుండరు . వాటన్నిటికీ ,ఎప్పుడు మరణించాలో తెలుసు, కాబట్టే అవి ఒక ప్రశాంతమైన చోటికి వెళ్లి హుందాగా చనిపోతాయి. ఇది తెలియని వాళ్ళు కేవలం మనుషులు మాత్రమే. ప్రస్తుతం వారు చనిపోతున్న విధానం మరీ ఘోరంగా తయారవుతోంది. మరణ సమయం వచ్చినప్పుడు, బాగా జీవించడం ఎలాగో తెలియని వాళ్ళకి, ఎలా మరణించాలి అనే విషయంలో కూడా సమస్యలు తలెత్తుతాయి.

sadhguru-wisdom-preparing-for-death-old-man-smiling

ఎన్నో విధాలుగా వృద్ధాప్యం అనేది ఒక గొప్ప వరం కాగలదు, ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక పూర్తి జీవిత కాలపు అనుభవం ఉంది. మీరు మృత్యువుకి దగ్గరవుతున్నప్పుడు, అది ఒక అవకాశం. ఎందుకంటే శక్తులు బలహీనంగా అయినప్పుడు, అవి తనువుని చాలించే దిశగా వెళుతున్నప్పుడు, మీ ఉనికి యొక్క స్వభావాన్ని గమనించడం చాలా తేలిక. మీరు ఒక చిన్న పిల్లవాడిగా ఉన్నపుడు, ప్రతిదీ అందంగా ఉండేది, కానీ మీరు పెద్వ్వాలి అనే ఆతృతతో ఉంటారు, ఎందుకంటే మీరు జీవితాన్ని అనుభూతి చెందాలి అనుకుంటారు. మీరు యవ్వన వయస్సుకి వచ్చినప్పుడు, మీ మేధస్సుని మీ హార్మోన్లు హైజాక్ చేస్తాయి. తెలిసో తెలీకో, మీరు ఏం చేసినా సరే, అది మిమ్మల్ని ఆ వైపుగా నెడుతుంది. చాలా కొద్ది మంది మాత్రమే , తమ మేధస్సుని ఈ హార్మోనల్ హైజాక్ కి అతీతంగా తీసుకెళ్ళి, జీవితాన్ని స్పష్టంగా చూడగలుగుతారు. మిగతా వారందరూ ఆ ఉచ్చులో పడిపోతారు. యవ్వనంలో, శరీరం ధృడంగా ఉన్నప్పుడు, మీలో ఈ ఎరుకని తీసుకురావడం చాలా కష్టం. ఎందుకంటే మీరు శరీరంతో ఎంతగానో గుర్తింపు ఏర్పరుచుకుని ఉంటారు, మీరు దానికి మించి దేన్నీ చూడలేరు.

కానీ మీరు వేసే ప్రతి అడుగులోనూ వయసు మీకు చెబుతూ ఉంటుంది, “ఇది శాశ్వతం కాదు” అని.

అయితే, వయసు పైబడే కొద్దీ, అది తగ్గుతుంది. శరీరం దాని దృఢత్వాన్ని కోల్పోయే కొద్దీ, మీరు మరింత ఎక్కువ ఎరుకగా అవుతారు, ఎందుకంటే మీరు క్షీణిస్తున్న శరీరంతో గుర్తింపు ఏర్పరుచుకోలేరు. మీరు వృద్ధాప్యాన్ని చేరుకున్నప్పుడు, కోరికలన్నీ అయిపోయి, వెనుకకు చూసుకుంటే మీకు మొత్తం ఒక జీవిత కాలపు అనుభవం ఉంటుంది. కాబట్టి మళ్ళీ మీరు చిన్నపిల్లల్లాంటి వారు ,కానీ మీరు జ్ఞానం మరియు జీవితానుభవం కలిగి ఉన్నారు. ఇది మీ జీవితంలోని అత్యంత ఫలదాయకమైనది ఇంకా అద్భుతమైన సమయం కాగలదు. మీరు మీ పునరుజ్జీవన ప్రక్రియను సరిగ్గా నిర్వహించుకోగలిగితే, వృద్ధాప్యం అనేది మీ జీవితంలో ఒక అద్భుతమైన సమయం కాగలదు. దురదృష్టవశాత్తు, చాలామంది మనుషులు వృద్ధాప్యంలో ఇబ్బంది పడతారు, ఎందుకంటే కేవలం వాళ్ళు తమ పునరుజ్జీవన ప్రక్రియను సరిగ్గా నిర్వహించలేక పోవడం వలన. వృద్ధాప్యంలో చాలా కొద్దిమంది మాత్రమే, కనీసం నవ్వగలుగుతారు. ఇది ఎందుకంటే, వాళ్ళ జీవితంలో వాళ్లకి తెలిసిన ఏకైక విషయం వాళ్ళ శరీరం మాత్రమే. ఒకసారి శరీరం క్షీణించిపోవడం మొదలు పెడితే, వాళ్ళు నిరాశకు లోనవుతారు. అది రోగానికి గురయి ఉండక పోవచ్చు, ఏ ఘోరమైన క్యాన్సరూ రావాల్సిన అవసరం లేదు, కానీ మీరు వేసే ప్రతి అడుగులోనూ వయసు మీకు చెబుతూ ఉంటుంది “ఇది శాశ్వతం కాదు”అని. మీరు జీవితానుభవంలోని ఇతర పార్శ్వాలను కూడా అనుభూతి చెంది ఉంటే, అప్పుడు శరీరం అనేది, నిర్వహించేందుకు చాలా తేలికైన విషయం అవుతుంది. వృద్ధాప్యంతో పాటూ మరణం కూడా ఒక ఆనందమైన ప్రక్రియ కాగలదు. ఇలా జరగాలంటే, ఎప్పుడు వదిలి వెళ్ళాలో మరియు ఎంత హుందాగా నిష్క్రమించాలో మీకు తెలిసుండాలి.

Death-Book-Banner