ప్రశ్న: ప్రారంభ స్థాయి యోగాసనాల ప్రోగ్రాంకి మీరు, మొత్తం ఉన్న 84 సాంప్రదాయ ఆసనాలలో నుండి 21 ఆసనాలను ఎంచుకున్నారు. ఈ 21 ఆసనాలనే ఎంచుకోవడం వెనుక ఉన్న కారణం ఏమిటి?

సద్గురు: మొత్తం 84 ఆసనాలతో మొదలుపెట్టడం అనేది మరీ ఎక్కువ అవుతుంది. ఆసనాలలో, కొన్ని మిమ్మల్ని తయారు చేసే స్వభావాన్ని కలిగినవి ఉన్నాయి, అంటే అవి సాధన పాద లో ఒక భాగం. అలాగే పరివర్తన సాధనాలు అయిన ఆసనాలు వేరేవి ఉన్నాయి. అవి కైవల్య పాదలో ఒక భాగం. ఈ రెండు పాదాలకీ సంవత్సరంలో వేర్వేరు కాలాలు ఉన్నాయి. ఆసనాలలో మొదటి పావు, వ్యవస్థని సిద్ధం చేసేవిగా ఉంటాయి. ఒకవేళ మేము మీలోకి అమితమైన శక్తిని నింపాలి అనుకుంటే, అప్పుడు అందుకు మీ వ్యవస్థ సిద్ధమై ఉండాలి.

శక్తి శరీరాన్ని బలోపేతం చేయడం

దీన్ని చూసేందుకు ఒక సరళమైన విధానం ఏమిటంటే - ఒక భౌతిక శరీరం ఉంటుంది, ఒక కార్మిక లేదా మానసిక శరీరం ఉంటుంది, ఇంకా ఒక శక్తి శరీరం ఉంటుంది. ఉపమానం చెప్పాలంటే, ఇది పూర్తిగా ఖచ్చితమైనది కాకపోయినా, ఈ మూడింటినీ ఒకదానిపై ఒకటి ఉన్న పొరలుగా చూడొచ్చు. ఒకవేళ మేము మీ శక్తి శరీరాన్ని గొప్పగా ఉద్దీపనం చేస్తే - మనం ప్రయత్నిస్తున్నది కూడా అది చేయడానికే, అందుకు మిగతా రెండు శరీరాలూ మార్గాన్ని ఇవ్వక పోతే, ఏదో ఒకటి విరుగుతుంది. కాబట్టి మొదటి అడుగు, శరీరాన్ని అనుకూలంగా తయారు చేయడం. ఇది ఎన్నో విధాలుగా చేయవచ్చు. ఒక సరళమైన విధానం ఏమిటంటే భూత శుద్ధి సాధన చేయడం. ఈ ఐదు మూలకాలూ ఎప్పుడూ కూడా శరీర పరిమితులకి అతీతంగా లావాదేవీలు జరుపుతూనే ఉంటాయి. కనీసం మీరు పీల్చే గాలి విషయంలో మీరది గమనించవచ్చు.

మొదటి అడుగు శరీరాన్ని అనుకూలంగా తయారు చేయడం. ఇది ఎన్నో విధాలుగా చేయవచ్చు. ఒక సరళమైన విధానం ఏమిటంటే భూత శుద్ధి సాధన చేయడం..

అన్ని స్థాయిల్లో నిరంతర లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. మీరు ఈ విషయాన్ని, బయటి ఉష్ణోగ్రత మీ శరీర ఉష్ణోగ్రతని మార్చడంలో గమనించవచ్చు. దానర్థం అగ్ని మూలకపు స్థాయిలో లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి అని. మీరు తీసుకునే ఆహారం ఇంకా నీటి విషయానికి వస్తే..భూమీ ఇంకా నీటి మూలకాల స్థాయిలో లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. ఈ లావాదేవీలు మీరు గమనించగలిగిన స్థాయిలో మాత్రమే జరగడం లేదు. అవి ఇంకా ఎంతో ప్రాధమికమైన విధానాలలో జరుగుతున్నాయి. మీ లోని మూలకాలు అనే అంశానికి వస్తే, అవి మీరు గీసుకున్న హద్దుల్ని గౌరవించవు.

“మీరు” అని మీరు అనుకునే దాని హద్దులు, పూర్తిగా మానసికమైనవి ఇంకా భౌతికమైనవి. మూలకాల స్థాయిలో ఏ హద్దులూ ఉండవు. యోగ అంటే మీ వ్యక్తిగత హద్దులను చేరిపివేయడం. ఎందుకంటే ఐఖ్యత అనేదే జీవం ఉన్న విధానం. అలాగే మనం జీవాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవాలనుకుంటున్నాము. మీకూ ఇంకా నాకూ మధ్య ఉన్న భేదము అనేది కేవలం ఊహాత్మకమే. గాలి అంతటా తిరుగుతున్నట్టే, మిగతా అంతా కూడా విభిన్న విధానాలలో అలానే చేస్తున్నది. మీలో ఉన్న మూలకాల పరిమాణం రోజు రోజుకీ మారుతూ ఉంటుంది. నిరంతరం లావాదేవీ జరుగుతూనే ఉంటుంది.

84 ఆసనాల సమూహం మీ శక్తులను మెరుగు పరచడం కోసం నిర్దేశించబడ్డాయి. మీ శక్తిని గొప్పగా ఉద్దీపనం చేసే ముందు, శరీరం ఇంకా మనస్సు దాన్ని తట్టుకోవడం కోసం కొంత సన్నద్ధం, వ్యాకోచం, ఇంకా పారదర్శకత తీసుకురావడం ముఖ్యం. మీ శరీరాన్ని ఇంకా మనస్సుని సిద్దం చేయకుండా, మీ శక్తులను పెంచడం అంటే, ఒక బూరలోకి అది తట్టుకోలేనంత గాలిని ఊదడం లాంటిది.

ఆసనాలలో మొదటి వరుస, మీ శరీరం ఇంకా మనస్సు యొక్క హద్దులను పలచ పరుచుతుంది, తద్వారా మీరు, “ఇది నేను - అది నువ్వు “ అనే భావన కేవలం లౌకిక పరమైన ప్రయోజనాల కోసం మాత్రమే ఉందన్న ఎరుక మరింతగా మీ స్పృహలోకి వస్తుంది. మరింత ప్రాధమిక స్థాయిలో చూస్తే, “దీనికీ” ఇంకా “దానికీ” మధ్య ఖచ్చితమైన హద్దు ఏదీ లేదు.

Editor’s Note: Isha Hatha Yoga programs are an extensive exploration of classical hatha yoga, which revive various dimensions of this ancient science that are largely absent in the world today. These programs offer an unparalleled opportunity to explore Upa-yoga, Angamardana, Surya Kriya, Surya Shakti, Yogasanas and Bhuta Shuddhi, among other potent yogic practices.

Find Hatha Yoga Program Near You