సద్గురు ఇంకా మార్క్ హైమన్ మనం తినే ఆహారానికీ, ఇంకా మన భౌతిక మానసిక ఆరోగ్యానికీ మధ్య ఉన్న సంబంధం గురించీ, మన ఆహార వ్యవస్థని మార్చడానికి ఉన్న సాధ్యమయ్యే విధానాల గురించి చర్చిస్తున్నారు. మీరు వారి సంభాషణలోని గత భాగాలను ఇక్కడ పొందవచ్చు. Hand Over The Forks, Folks! ఇంకా Raise Your Food Consciousness.

మార్క్ హైమన్: ప్రేక్షకులలో నుండి వచ్చిన ప్రశ్నలలో ఒకటి ఏమిటంటే మన మనసుకి, మన మానసిక స్థితికి, మన భావోద్వేగ స్థితికి, మన మానసిక ఆరోగ్యానికి, ఇంకా మనం తినే ఆహారానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అన్న దాని గురించినది. ADD నుండి బైపోలార్ వ్యాధి వరకు, నిరాశ వరకు, ప్రతిదీ దానితో ముడిపడి ఉంటుంది. కాబట్టి, మన శరీరానికి, మన మనసుకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి?

సద్గురు: యోగ వ్యవస్థ శరీరాన్ని ఇంకా మనసుని రెండు వేర్వేరు అంశాలుగా చూడదు. మీ మెదడు మీ శరీరంలోని భాగం. సాధారణంగా మనం కొంత జ్ఞాపకశక్తిని ఇంకా మేధస్సుని కలిపి మైండ్ అంటాము. మీ మెదడునీ ఇంకా మీ శరీరంలోని తక్కిన భాగాలనీ పోల్చి చూస్తే దేనికి ఎక్కువ జ్ఞాపకశక్తి ఉంది, ఏది ఎక్కువ మేధస్సు కలిగి ఉంది? మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే, మీ శరీరానికి ఉన్న జ్ఞాపకశక్తి కొన్ని లక్షల ఏళ్ల నాటిది. అది స్పష్టంగా మీ తాత ముత్తాతలు ఎలా ఉండేవారో గుర్తు పెట్టుకుంటుంది. మెదడు అటువంటి జ్ఞాపకశక్తిని కలిగి ఉండలేదు. మేధస్సు విషయానికి వస్తే, ఒక DNA లో ఒక పరమాణువులో జరిగేది ఎంతటి సంక్లిష్టమైనదంటే మీ మొత్తం మెదడు కూడా దాన్ని అవగతం చేసుకోలేదు.

యోగ వ్యవస్థలో, భౌతిక శరీరం ఉంటుంది ఇంకా ఒక మానసిక శరీరం ఉంటుంది. మేధస్సు ఇంకా జ్ఞాపకశక్తి అనేవి ఈ శరీరం అంతా వ్యాపించి ఉన్నాయి. సాధారణంగా ప్రజలు, అంతా మెదడులోనే వుంటుందని అనుకుంటారు, ఎందుకంటే అది ఆలోచనా ప్రక్రియను నిర్వహిస్తుంది కాబట్టి. ఇక శరీరాన్ని మనసుని ఈ విధంగా వేరుగా చూడటం వల్ల, పాశ్చాత్య దేశాలలోని చాలా మంది ప్రజలు వారి జీవితంలో ఏదో ఒక దశ వద్ద యాంటీ డిప్రెసెంట్స్ తీసుకుంటున్నారు.

మనసు పై ఆహార ప్రభావం

మనం తీసుకునే ఆహారం అనేది మనసుపై ఎంతో పెద్ద ప్రభావం చూపుతుంది. సగటున ఒక అమెరికన్ వ్యక్తి, సంవత్సరానికి రెండు వందల పౌండ్ల మాంసాహారాన్ని తీసుకుంటాడు అని అంచనా. మీరు దాన్ని 50 పౌండ్లకు తగ్గిస్తే, అప్పుడు 75 శాతం ప్రజలకు యాంటీ డిప్రెసెంట్స్ ఇక ఏమాత్రం అవసరం ఉండకపోవడాన్ని మీరు చూస్తారు. మీరు ఒక ఎడారిలోనో లేదా ఒక అరణ్యంలోనో ఉంటే అప్పుడు మాంసాహారం మనుగడ సాగించేందుకు ఒక మంచి ఆహారం అవుతుంది. మీరు కనుక ఎక్కడన్నా తప్పిపోయి ఉంటే, కొద్దిగా మాంసాహారం అనేది మిమ్మల్ని నడిపిస్తుంది, ఎందుకంటే అది అధిక శాతంలో పౌష్టికతను అందిస్తుంది. కానీ మీకు ఇతర ఎంపికలు ఉన్నప్పుడు మీరు దాన్ని నిత్యాహారంగా తీసుకోకూడదు.

మీరు ఒక జంతువుని చంపినప్పుడు, ఆ ప్రతికూలమైన ఆమ్లాలు లేదా ఇతర రసాయనాలు ఆ మాంసంలో ఉండిపోతాయి.

దీన్ని ఎన్నో విధాలుగా చూడవచ్చు. ఒకటి ఏంటంటే, మీరు ఎంత గోప్యంగా, లేదా ఎంత శాస్త్రీయంగా చేసినా సరే, జంతువులకి తమ చివరి కొన్ని క్షణాల్లో, తాము చంపబడబోతున్నామని తెలుసుకునే మేధస్సు ఉంటుంది. ఏదో ఒక రకమైన భావోద్వేగాన్ని వ్యక్త పరచగల ఏ జంతువైనా సరే, దాన్ని చంపబోతున్నప్పుడు అది గ్రహిస్తుంది.

ప్రస్తుతం ఉదాహరణకి, ఈరోజు చివర్లో మీ అందర్నీ చంపబోతున్నారు అని మీకు తెలిసింది అనుకుందాం. మీరు ఎంతటి క్షోభకి లోనవుతారో ఊహించండి, ఒక్కసారిగా మీ లోపల ఎన్ని రసాయనిక చర్యలు జరుగుతాయో ఊహించండి. ఇలాగే జంతువుల్లో కూడా కొంతవరకైనా ఇటువంటిది జరుగుతుంది. అంటే మీరు ఒక జంతువుని చంపినప్పుడు, ఆ ప్రతికూలమైన ఆమ్లాలు లేదా ఇతర రసాయనాలు ఆ మాంసంలో ఉండిపోతాయి. ఇక మీరు ఆ మాంసాన్ని తిన్నప్పుడు, అది మీలో అనవసరమైన మానసిక అస్థిరతలను సృష్టిస్తుంది.

యాంటీ డిప్రెసెంట్స్ వాడుతున్నవారు, ప్రయత్నపూర్వకంగా ఒక మూడు నెలల పాటు శాకాహారాన్ని తీసుకుంటే, వారిలో చాలా మందికి ఇక ఆ మందుల అవసరం ఉండదు. ఈశా యోగా కేంద్రానికి వచ్చిన చాలామందిలో మేము ఇది జరగడాన్ని చూసాము.

మనం మన సమాజాలలో, మానసిక అనారోగ్యాన్ని అలవాటుని పెంచి పోషిస్తే తప్ప, అంత పెద్ద మొత్తంలో ప్రజలు మానసిక రోగులుగా అయ్యే అవకాశం లేదు.

మానసికంగా అనారోగ్యానికి గురయ్యిన వారిలో చాలా శాతం వరకూ, అది పెంచి పోషించబడింది - వారిలో వైద్య నిర్ధారణల ప్రకారం ఎటువంటి కారణాలు ఉండవు, అంతా బాగానే ఉంటుంది. మనం మన సమాజాలలో, మానసిక అనారోగ్యాన్నిఅలవాటు చేస్తే తప్ప, అంత పెద్ద మొత్తంలో ప్రజలు మానసికంగా అనారోగ్యంగా అయ్యే అవకాశం లేదు. మనం ఎప్పుడూ కూడా వాణిజ్య శక్తులకు, మన జీవిత నాణ్యతను నిర్ణయించే అధికారాన్ని ఇవ్వకూడదు. వాణిజ్యం ఉన్నది మానవులకు సేవ చేయడానికి. కానీ ప్రస్తుతం మనం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక యంత్రాంగాన్ని ఏ విధంగా రూపొందించామంటే, మనుషులే ఆర్థిక యంత్రాంగానికి ఇంకా వాణిజ్య ప్రక్రియకి సేవ చేయడానికి ఉన్నట్టుగా అయింది. మీరు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రస్తావన తీసుకువచ్చారు. నేను కొన్ని సంవత్సరాల క్రితం అక్కడ ఉన్నాను, అందరూ కూడా భారతదేశాన్ని ఇంకా చైనాని ఇంకా కొన్ని ఇతర దేశాలని, పైకి వస్తున్న మార్కెట్లుగా భావిస్తున్నారు.

నేను, “దయచేసి ప్రజలను మార్కెట్లు అనకండి. మీరు వారిని మనుషులుగా చూస్తే, అప్పుడు బహుశా వారితో ఏం చేయాలి అన్న విషయంలో మీకు సరైన ఆలోచన తడుతుంది. మీరు వారిని ఒక మార్కెట్ గా చూస్తే, మీరు అందుకు భిన్నమైనదేదో చేస్తారు! ఇది ఒక మార్కెట్ కాదు. వీళ్ళందరూ ప్రజలు.” అన్నాను. మీరు ప్రజలను ప్రజలుగా చూడకపోతే, జీవాన్ని జీవంగా చూడకపోతే, మీరు వారిలోకి ఏం కుక్కుతున్నారు అన్నది పట్టించుకోరు. మీరు కేవలం మీకు అధికంగా డబ్బుని సంపాదించిపెట్టే దాన్ని మాత్రమే అమ్మాలనుకుంటారు.

మార్క్ హైమన్: అవును అది వాస్తవమే. కొన్ని సంవత్సరాల క్రితం, శరీరం మనస్సు పై ఎలా ప్రభావం చూపుతుంది అన్న దాని గురించి, నేను ద అల్ట్రా మైండ్ సొల్యూషన్ అనే పుస్తకాన్ని రచించాను. ప్రజల సంపూర్ణ ఆరోగ్యానికి చికిత్స చేయటం మొదలు పెట్టినప్పుడు, చాలా మానసిక అనారోగ్యాలు ఇంకా జ్ఞాన గ్రహణ వివేచనా ప్రక్రియ సమస్యలు కుదుట పడడాన్ని నేను గమనించాను. నేను ఫంక్షనల్ మెడిసిన్ అనే దాన్ని చేస్తాను. అది ఆరోగ్యాన్ని సృష్టించే శాస్త్రం, అది అచ్చం సద్గురు చెబుతున్న విషయమే.

మనం తినే ఆహార నాణ్యత ఇంకా మనం తినే విధానం అనేవి అన్నింటికన్నా ముఖ్యమైనవి.

నేను అది చేయటం ప్రారంభించినప్పుడు, డిప్రెషన్ పోవడాన్ని నేను చూశాను. అలాగే వాళ్ళ ADD, ఇంకా బైపోలార్ వ్యాధులు, ఈ విషయంలో మెరుగవ్వడం జరిగింది. నేను దీనంతటికీ ఉన్న ప్రాథమిక కారణం ఏంటో చూసినప్పుడు, చాలాసార్లు అది వారు తింటున్న ఆహారమే. నిజానికి చాలా మంది ప్రజలు నిజమైన ఆహారాన్ని తినటం లేదు, వాళ్లు ఆహారంలా కనిపించేలా చేయబడిన ఆహారం కాని పదార్థాలను తింటున్నారు. మనం కేవలం నిజమైన ఆహారానికి కట్టుబడి ఉంటే, సద్గురు చెప్పిన విధంగా మాంసాహారాన్ని తీసుకోవడం తగ్గిస్తే, అలాగే ఎక్కువ శాతం మొక్కల నుండి లభించే ఆహారాన్ని తీసుకుంటే, అప్పుడు మనకున్న దీర్ఘకాలిక వ్యాధులు, మూడుకు సంబంధించినవి, ఇంకా న్యూరోలాజికల్ డిజార్డర్స్ కూడా, చాలావరకు పోతాయి. నేను ఇలా జరగడాన్ని మళ్లీమళ్లీ గమనించాను.

చాలాసార్లు, నేను అసలు మానసిక సమస్యలకు వైద్యమే చేయడం లేదు, అయినా సరే, అదనపు ఫలితంగా అవి పోతున్నాయి. నాకు తెలిసి మనకు ఈ అవగాహన లేకపోవటం అనేది, ఈ దేశానికి సిగ్గుచేటు, అలాగే ఇప్పటికీ, ఆహారం అనేది మనలో అధిక బరువు తేవడంతో పాటూ, మన ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది అనే విషయంపై, ఇంకా ఆహారాన్ని ఆరోగ్యాన్ని చేకూర్చే ఒక సాధనంగా ఉపయోగించవచ్చు అనే విషయంపై, డాక్టర్లు ప్రతికూలంగా వాదించటం అనేది సిగ్గుచేటు. కానీ వాస్తవానికి అది అత్యంత శక్తివంతమైన సాధనం. మనం తినే ఆహార నాణ్యత ఇంకా మనం తినే విధానం అనేవి అన్నింటికన్నా ముఖ్యమైనవి.

సరైన ఎంపిక చేసుకోవడం

సద్గురు: అమెరికాలోని ధూమపాన వ్యతిరేక ప్రచారంలా, మనకి ఆహారం గురించిన ఒక ప్రభావవంతమైన ప్రచారం అవసరం ఉంది అని నేను అనుకుంటున్నాను. 70 లలో, అమెరికాలోని ఏ బహిరంగ ప్రదేశంలో అయినా సరే, మీరు పొగలో నుంచి దాటుకుంటూ పొవలసి ఉండేది. అప్పుడు వాళ్లు ఒక ప్రభావవంతమైన ఇంకా విజయవంతమైన ప్రచారాన్ని మొదలుపెట్టారు. అది బహిరంగ ప్రదేశాల్లో పొగ లేకుండా ఉండేలా చేసింది. ఇప్పుడు మీరు ఒక రెస్టారెంట్లో కి వెళితే, పొగ ఉండదు. అయినప్పటికీ కూడా పానీయాలలో కార్బన్డయాక్సైడ్ ఇంకా ఉంది. ఒకానొక సమయంలో పొగ పీల్చడం అనేది చాలా మందికి కేవలం ఒక ఆవశ్యకత మాత్రమే కాదు, అది ఒక ఫ్యాషన్ కూడా. ఇతరుల మొహంపై పొగ ఊదడం అనేది అప్పట్లో గొప్ప విషయమే.

సరి అయిన ప్రచారంతో, ఒక్క తరంలో, పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ రోజున పొగాకు వాడకంలో ప్రపంచంలోని ఎన్నో దేశాల కంటే అమెరికాలో తక్కువ కనిపిస్తుంది. మనం ఏం తింటున్నాము ఇంకా ఏం తాగుతున్నాము అన్నదాని విషయంలో కూడా, అదే విధమైన ఒక విజయవంతమైన ప్రచారం యొక్క అవసరం ఉంది.

మార్క హైమెన్: మార్క హైమెన్: అవును. మనలోని ప్రతి ఒక్కరూ ఆ ఎంపికలు చేసుకోవడం, అలాగే ఈ విషయాన్ని మన స్థానిక రాజకీయ నాయకులతో చర్చించడం అనేది పెద్ద మార్పుని తెస్తుంది. కానీ సమస్య ఏంటంటే, ఆహార పరిశ్రమ చూపించే ప్రభావం. అది ఒక ట్రిలియన్ డాలర్లు విలువ చేసే పరిశ్రమ, అది ఎన్నో చట్టాలను నిర్ణయిస్తుంది. చాలా వరకు, ఆహార మార్గదర్శకాలు ఇంకా FDA సిఫార్సులు, ఇంకా మార్గదర్శకాలు వాస్తవానికి లాబీయింగ్ ద్వారా నిర్వహించబడతాయి. దీని అర్థం ఏంటంటే మనకి, తగినంత సమాచారం రావడం లేదు, వాస్తవం మన దాకా రావడం లేదు. నిజానికి విధాన పరమైన మార్పులు అమలు కావడం లేదు.

సద్గురు: వాస్తవానికి అది నాలుగు ట్రిలియన్ల ఇండస్ట్రీ. ఒక ట్రిలియన్ ఆహారం, ఇంకా మరో మూడు ట్రిలియన్లు మందులు.

మార్క హైమెన్: అవును సరిగ్గా అదే. అది ఎంతో పెద్దది. మైఖేల్ బ్లూమ్బెర్గ్, న్యూయార్క్ పాలసీలలో కొన్ని మార్పులు చేయడానికి ప్రయత్నించాడు. ఉదాహరణకి సోడా టాక్స్ విషయంలో - అతను దాన్ని విజయవంతం చేయలేకపోయాడు. అలాగే ఆయన సోడాలకు సంబంధించిన ఆహార స్టాంపులను ఒక పరిమితిలో ఉంచితే ఏం జరుగుతుంది అన్న అధ్యయనం చేయాలనుకున్నాడు. ఎందుకంటే అమెరికాలోని పేదలకు ప్రతి సంవత్సరం ఆహార స్టాంపులు, నాలుగు బిలియన్ డాలర్ల సోడాను చెల్లిస్తాయి. అది ఫ్రంట్ ఎండ్‌లో మాత్రమే. అలాగే బ్యాక్ ఎండ్ లో, వైద్యానికి ఇంకా మందులకు ప్రభుత్వం చెల్లిస్తూ ఉంటుంది. USDA అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్, కనీసం అతన్ని ఒక నమూనా అధ్యాయనం కూడా చేయనివ్వ లేదు.

పచ్చని లేబుల్- మంచిది; పసుపు లేబుల్- జాగ్రత్త వహించండి; ఎర్ర లేబుల్ - బహుశా అది మీకు హాని చేయవచ్చు.

కాబట్టి అతను, సోడా, షుగర్ టాక్స్, జంక్ ఫుడ్ టాక్స్, ఇంకా ఫుడ్ లేబులింగ్ వంటి కొన్ని కీలకమైన పాలసీల విషయంలో సహాయం చేసేందుకు మెక్సికో వెళ్ళాడు. తద్వారా ప్రజలు వాస్తవానికి ఏ ఆహారం తమకి మంచి చేస్తుందో, ఏ ఆహారం తమకి హాని చేస్తుందో తెలుసుకోగలుగుతారు అని. పచ్చని లేబుల్- మంచిది; పసుపు లేబుల్- జాగ్రత్త వహించండి; ఎర్ర లేబుల్ - బహుశా అది మీకు హాని చేయవచ్చు. అలాగే హాని చేసే అన్ని ఆహార పదార్థాలను పాఠశాలల నుంచి తీసేయాలని, నిజమైన ఆహారం కాని వాటి మార్కెటింగ్నునిలిపివేయాలని కృషి చేశారు.

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వివిధ రకాలుగా ఉపయోగపడగలిగే పాలసీలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ దేశంలో అటువంటి మార్పులు ఆహ్వానించబడవు, అందుకు కారణం ఫుడ్ లాబీయింగ్. అయినా సరే మనలో ప్రతి ఒక్కరూ కూడా, మన కుటుంబాలలో, మన సంఘాలలో, మన స్నేహితులలో ఈ విషయాలను తెలియజేసి మార్పులు తెస్తే, ఒక ప్రపంచ స్థాయి మార్పు మొదలవ్వడాన్ని చూడవచ్చు.

సద్గురు: అది కేవలం రాజకీయ నాయకుల చేతుల్లో మాత్రమే, లేదా పాలసీలను తయారు చేసే వారి చేతుల్లో మాత్రమే ఉండలేదు. తాము ఏమి తింటున్నాము ఇంకా ఎలా తింటున్నాము అన్నది మార్చినప్పుడు, తమ శారీరక ఇంకా మరి ముఖ్యంగా మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని ప్రతి ఒక్కరు కూడా గ్రహిస్తే, మన రాజకీయ నాయకులను కూడా మార్చవచ్చు

మార్క హైమెన్: ఖచ్చితంగా! మన ఆహార వ్యవస్థను మార్చాలి ఎందుకంటే ఆరోగ్యం విషయంలో మనకున్న పరిష్కారం, కేవలం హెల్త్ కేర్ మాత్రమే అవ్వాలనేమీ లేదు – అసలైన పరిష్కారం మన ఆహార వ్యవస్థ. నా ఉద్దేశంలో, ఒక ఆలోచనా వంతమైన దేశాన్ని తయారుచేయడం, ఇంకా ఆహార వ్యవస్థను మార్చడం, ఈ రెంటిపై దృష్టి సారించడం అనేదే పరిష్కారం.

అనారోగ్యకరమైన ఆహారాన్ని ప్రోత్సహించకుండా ఉండేందుకు, ఇంకా స్థూలకాయం యొక్క ఆర్థిక ఖర్చులను తగ్గించడానికి, శీతల పానీయాలపై వేసే పన్ను

Food Body

Editor’s Note: The book is available on a “name your price” basis. Pay as you wish or click “Claim for Free”. Food Body looks at the kind of foods the body is most comfortable with and explores the most appropriate ways of consuming such foods. The 33-page booklet is a first step to tune into your body and figure out what suits it best.

A version of this article was originally published in Isha Forest Flower July 2015. Download as PDF on a “name your price, no minimum” basis or subscribe to the print version.