Life in Sadhanapada - All Articles

 

Sadhguru: సద్గురు: ఈ శరీరం అనేది మన్ను తప్ప ఇంకేమీ కాదు, కాబట్టి, ఈ భూమి ఏ రకమైన స్థితులకు, మార్పులకు గురవుతుందో, మానవ వ్యవస్థ కూడా ఆ రకమైన మార్పులకే గురవుతుంది. యోగ సంప్రదాయంలో దక్షిణాయన కాలాన్ని (వేసవి కాల అయనాంతానికి (summer solstice) ఇంకా శీతాకాల అయనాంతానికి (winter solstice) మధ్య ఉన్న సమయాన్ని సాధారణంగా సాధనపాద అని అంటారు. మరీ ముఖ్యంగా, దక్షిణాయనం వచ్చిన తర్వాత మొదటి పౌర్ణమి అయిన గురు పౌర్ణమి మొదలుకొని, శీతాకాల అయనాంతానికి (winter solstice) తరువాతి ఇంకొన్ని రోజుల వరకు - అంటే సుమారు జనవరి 4 లేదా 5వ తారీఖు వరకు ఉండే సమయాన్ని సాధన చేయటానికి తగిన సమయంగా భావిస్తారు. ఈ సమయంలో సాధన మంచి ఫలితాలను ఇస్తుంది, మరీ ముఖ్యంగా భూమి ఉత్తరార్ధగోళంలో ఉన్నవారికి అది ఫలప్రదం.

ఆదియోగి బోధన ఆరంభం:

భూమి ఉత్తరార్ధ గోళంలోని వారికి, ఆకాశంలో సూర్యుడు దక్షిణ దిశలో కదలడం ప్రారంభించినప్పుడు దాన్ని దక్షిణాయనం అంటారు. మొదటి ఆదియోగి బోధన ఈ కాలంలో జరిగిన కారణంగా, సూర్యుడు దక్షిణ దిశలో కదిలే ఈ సమయం ముఖ్యమైనది అయింది. ఆయన దక్షిణం వైపుకి తిరిగినందున దక్షిణమూర్తి అయ్యాడు. ఆయన ఇది ఎదో యధాలాపంగా చేయలేదు, ఆయన ఇలా చేయడానికి కారణం, సూర్యుడు దక్షిణ దిశగా తిరగడం, అందుకే అది సరైన విధానం.

ఏ విధమైన యోగా చేస్తున్నా, ఈ సాధనపాద అనేది వారి జీవితంలో చాలా ముఖ్యమైనది. ఏదైనా సాధించడానికి ముఖ్యం ఏమిటంటే, మన చేతుల్లో ఉన్నదానిని సరిగ్గా చేయడం. మన చేతిలో లేకపోతే, మనం చేయగలిగినది కేవలం వేచి చూడటమే. సాధన అన్నప్పుడు, మనం మన చేతుల్లో ఉన్న వాటి గురించి మాట్లాడుతున్నాము. కాబట్టి, మనం అది సాధ్యపడేలా చేయగలము.

మీ వేళ్ళు బాగా ఊనుకునేలా చేయడం

సాధనపాద అచ్చం ఇలాంటిదే - ఈ ఆరు నెలలు ముఖ్యమైనవి, ఎందుకంటే ఈ సమయంలో మీరు చేయవలసిన పనులు సరైన రీతిలో చేయవచ్చు. మీరు సరైన పనులు చేస్తే, కోత సమయం వచ్చినప్పుడు మంచి పంట చేతికి వస్తుంది. ఉదాహరణకి ఒక పువ్వు విరబూస్తే, అది మీరు చేసిన పని కాదు. చెట్టుకి నీళ్లు పోయడం ఇంకా ఎరువు వేయడం చేస్తే, దానికి పర్యవసానంగా పువ్వు విరబూస్తుంది. ఇది కూడా అచ్చం అలాంటిదే.

నేను ఒక ఎరువు లాంటి వాడిని. మీరు నాలోకి మీ వేళ్ళను ఊనుకోనిస్తే, కచ్చితంగా మీరు వికసిస్తారు. ఎరువును పూజించేందుకు ప్రయత్నించకండి. మీరు చేయాల్సిందల్లా మీ వేళ్లు అందులోకి బాగా ఊనుకునేలా చేయడమే. చూడడానికి ఎరువు పువ్వులాగా కనిపించదు, ఎరువు వాసన పువ్వులాగా ఉండదు, కానీ ఆ చెట్టు ఖచ్చితంగా పూలు కాస్తుంది. మీరు చేయాల్సిందల్లా అదే.

సాధనపాద చేస్తున్నప్పుడు వాలంటీరింగ్ చేయడంలోని ప్రాముఖ్యత ఏమిటి ?

ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సాధన అంటే కేవలం మీ కళ్ళు మూసుకోవడం మాత్రమే కాదు. మీరు స్వతహాగా ధ్యానపరులుగా కావాలి అనుకుంటే, కొన్నింటిని మీరు ఖర్చు చేయాలి. కొన్ని కర్మ సంబంధమైన వ్యవస్థలను మీరు కూల్చేయకుంటే, మీ జీవితంలో మీరు ధ్యానం చేయలేరు. అది జరగాలి అంటే, మీరు ఒక ప్రత్యేమైన పరిస్థితిని సృష్టించాలి. అడ్డుగోడలు అన్నీ కూలదోయబడాలి, దానికి పని చేయటం ఉత్తమమైన మార్గం. కళ్ళు మూసుకొని ప్రయత్నం చేసినప్పటి కంటే కూడా, చాలా తీక్షణమైన ఏకాగ్రతతో పని చేయడం అనేది ఈ కర్మ సంబంధమైన అడ్డుగోడలను ఎంతో సులభంగా కూల్చేస్తుంది.

ఆశ్రమములో సాధన ఎందుకు చేయాలి ?

ఎక్కడైనా పురోభివృద్ధి సాధించగల ప్రజలు కొంత మంది ఉంటారు, కానీ చాలామందికి, సరైన వాతావరణం అవసరమౌతుంది. మీరు దాన్ని మీ ఇంట్లోనే సృష్టించగలిగితే, అది చాలా గొప్ప విషయం, కానీ ఎక్కువ మంది ప్రజలు అలా చేయగలరని నేను అనుకోవడం లేదు. ఒకసారి సాంబార్ వాసన తగలగానే, ఇక సాధన గురించి మర్చిపోతారు! మేము ఆశ్రమంలో ఇటువంటి వాతావరణం, ఇన్ని సదుపాయాలు ఎందుకు నిర్మిస్తున్నాము అంటే, మీరు వచ్చి వాటిని ఉపయోగించుకుంటారు అని.

మీరు మేల్కొని ఉన్నా, నిద్రలో ఉన్నా, మీరు భోజనం చేస్తున్నా లేదా టాయిలెట్ లో ఉన్నా, మీరు ఏం చేస్తున్నా సరే ఆధ్యాత్మిక ప్రక్రియ కొనసాగుతూనే ఉండేలా చూడడం కోసమే ప్రతిష్టీకరించబడిన ప్రదేశాలు సృష్టింపబడ్డాయి. ఆ ఆధ్యాత్మిక ప్రక్రియ ఆగ కూడదు. విశ్రాంతి కేవలం శరీరానికి మాత్రమే, మిగతా విషయాలు ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉండాలి.

Editor’s Note: Find out more about Sadhanapada and pre-register for the upcoming batch here.