#1 ఎవరికైనా మీరు అందించగల ఉత్తమ జీవిన పరిష్కారం యోగ

4reasons-why-everyone-must-become-a-yoga-veera-reason-1

మీ జీవితంలో మీరు నిజంగా సమాజానికి ఏదైనా తిరిగి ఇవ్వాలనుకున్న క్షణాలను గాఢంగా అనుభవించారా? దీనికోసం, మనం వృత్తులను ఎంచుకుంటాము, స్వచ్ఛందంగా సేవ చేస్తాం, దాతృత్వానికి విరాళం ఇస్తాము - ఇవన్నీ వాటి మార్గంలో అవి సంతృప్తిని అందిస్తాయి. కానీ, సద్గురు తరచూ వ్యాఖ్యానించినట్లుగా, మన గ్రహం మీద ప్రస్తుతం ఎంతో అవసరమైనది ఏమిటంటే మానవ చైతన్యాన్ని పెంపొందించడం.

"మానవ చరిత్రలో మొట్టమొదటిసారిగా, భూమిమీద దాదాపు ప్రతి ప్రాథమిక సమస్యను పరిష్కరించడానికి అవసరమైన సామర్ధ్యం, సాంకేతికత ఇంకా వనరులు మనకు ఉన్నాయి - పోషణ, ఆరోగ్యం, విద్య ఇంకా పర్యావరణంతో సహా అన్ని సమస్యలకి. ఇది జరగడానికి లోపించిన ఏకైక కారణం ఇందుకు కావాల్సిన మానవ సుముఖత. ఇది జరగడానికి, చైతన్యంతో కూడిన ఏకాత్మతా భావన అవసరం ” - సద్గురు

ఇది జరగడానికి, చిన్నదైనా, మీరు ఒక ముఖ్యమైన పాత్ర పోషించగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది?

ఇందుకు యోగానే మార్గం, ఇంకా మీరు కూడా యోగ వీర అవ్వడమనే సరళమైన అడుగు వేయడం ద్వారా చాలా మంది జీవితాలలోకి యోగాను తీసుకురావచ్చు.

Take the Pledge Now!

ప్రతిజ్ఞ తీసుకోవడానికి మరిన్ని కారణాలు కావాలా? ఇంకా చదవండి…

#2 మీరు మార్గం చూపించినప్పుడు, మీరు మీ మార్గాన్ని కనుగొంటారు…

4reasons-why-everyone-must-become-a-yoga-veera-reason4

మీరు ఈ జీవితాన్ని మార్చే శాస్త్రాన్ని ఇతరులకు అందిస్తున్నప్పుడు, మీ జీవితం ఎంతో మెరుగ్గా ఇంకా ఎంతో అందంగా రూపాంతరం చెందటం గమనిస్తారు.

> "జీవితాలను స్పృశించి, వాటిని మార్చగల వాటిని అందించే ఆనందం ఇంకా సంతృప్తిని మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను" -సద్గురు

చాలా లోతుగా ఇంకా ప్రాథమికంగా రూపాంతరం చెందడాన్ని వివరించడానికి పదాలు సరిపోవు.. ఇది తెలుసుకోవాలంటే మీరు దాన్ని అనుభవించాలి…

Take the Pledge Now!

#3 మీ ప్రియమైనవారికి యోగా వల్ల కలిగే ప్రయోజనాలను అందించండి

4 reasons why everyone must become a yoga veera reason 3

మీ కుటుంబం లేదా ఫ్రెండ్స్ యోగాను ప్రయత్నించడానికి కూడా తీరిక లేకుండా ఉన్నారా? వారి రోజులో కొద్ది నిమిషాలు మాత్రమే తీసుకునే ఈ సరళమైన, సాధికారిక అభ్యాసాన్ని అందించడం ద్వారా మీరు వారికి యోగానుభూతిని కలిగించవచ్చు.

వారు ఒకసారి ఈ ప్రయోజనాలను రుచి చూడడం ప్రారంభిస్తే, వారు ఖచ్చితంగా మరింత కావాలనుకుంటారు! కాబట్టి ప్రయత్నించండి!

Take the Pledge Now!

#4 అంకిత భావంలోని తీక్షణతను అనుభవించండి

4reasons-why-everyone-must-become-a-yoga-veera-reason-4

యోగ వీర కావడం అనేది అంకిత భావంలోని తీక్షణతను అనుభవించే అవకాశం. లోతుగా ఏదైనా అనుభవించడం అంటే ఏమిటో మీకు తెలియకపోతే, ఎవరికైనా ఒకరికి సరళమైన యోగ అభ్యాసాన్ని అందించడానికి ప్రయత్నించండి.

సద్గురు యోగ వీరగా మారే ప్రక్రియను చాలా సరళంగా ఇంకా అందరికీ అందుబాటులో ఉంచారు. దానికి కావలసిందల్లా సుముఖత. మీరు కూడా యోగ వీర కావచ్చు!

మీరు చేయవలసిందల్లా సరళమైనదే అయినా విశిష్టమైన ఈ అభ్యాసాన్ని నెలకు ఒక వ్యక్తికి అందించడం.

Take the Pledge Now!