రోగనిరోధక వ్యవస్థను బలపరిచే 4 పానీయాలు
రోగనిరోధక వ్యవస్థను బలపరిచే 4 పానీయాలు - వైరస్ ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించేందుకు సహకరించే నాలుగు రకాల పానీయాలు
![Sadhguru Wisdom Article | 4 Immunity-Boosting Drinks to Help Prevent Viral Infections Sadhguru Wisdom Article | 4 Immunity-Boosting Drinks to Help Prevent Viral Infections](https://static.sadhguru.org/d/46272/1633509125-1633509123524.jpg)
#1 రోగనిరోధక శక్తిని పెంచే పానీయం – నాలుగు మూలికల సమ్మేళనం (తరతరాలుగా వాడుకలో ఉన్న సద్గురు అమ్మమ్మ గారు చెప్పిన పానీయం!)
‘‘నాకు తెలుసు, ఇది పనిచేస్తుందని ఏ రకమైన శాస్త్రీయ ఆధారాలు లేవు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు అని. కానీ, ఇది మా ముత్తవ్వకు అద్భుతంగా పని చేసింది, మా అమ్మమ్మకు పని చేసింది, ఇంకా నాకు కూడా. ఈ రుజువులు చాలు నాకు. ఇది తరతరాల వారికి అద్భుతంగా పని చేసింది."
ఈ పానీయాన్ని తయారు చేసే విధానం ఇది-
వేడి నీళ్లకు - కొద్దిగా తేనె, పసుపు, కొంచెం కొత్తిమీర లేక పుదీనా కలపండి.
#2 రోగనిరోధక శక్తిని పెంచే పానీయం – నీలవెంబు కషాయం- ఒక సిద్ధ ఔషధం
సద్గురు:: “ప్రస్తుతం, మన యోగ సెంటర్ చుట్టుపక్కల పని చేస్తున్న పోలీసు, వైద్య సిబ్బందికి మేము నీలవెంబు కషాయం అనే పానీయాన్ని ఇస్తున్నాము. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఒకప్పుడు తమిళనాడులో డెంగ్యూ జ్వరం ఎక్కువగా వ్యాపించి ఉన్న సమయములో మేము ఈ కషాయాన్ని తమిళనాడు అంతా పంచి పెట్టాము. అప్పుడు అది చాలా ఉపయోగకారి అయింది. ”
శక్తివంతమైన మూలికల మిశ్రమంతో తయారుచేసిన ఈ నీలవెంబుకషాయం, రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, శారీరక ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. సాంప్రదాయికంగా సిద్ధ వైద్యంలో జ్వరాలకు, వైరల్ ఇన్ఫెక్షన్లను సమర్థవంతంగా నిరోధించడానికి ఉపాయంగా నీలవెంబు కషాయాన్నివాడేవారు. ఒళ్ళు నొప్పులు, అలసట ఇంకా తలనొప్పి -వీటికి ఉపశమనంగా కూడా దీన్ని వాడుకోవచ్చు.
ఈ మూలికల మిశ్రమం, ప్రకృతిలో సహజంగా దొరికే, ఔషధ గుణాలు గల మూలికలు- నీలవేము, మిరియాలు, తెల్ల చందనం, శొంఠి, వట్టివేరు, పొట్లకాయ, తుంగ గడ్డి, Vilamichai ver (root) and parpat,- వీటితో తయారవుతుంది.
అంటువ్యాధులను నయం చేసేందుకు వాడే ఈ ప్రాచీన సిద్ధ ఔషధం ఇప్పుడు ఆధునిక కాలంలో జరుగుతున్న పరిశోధనలలో కూడా చోటు చేసుకుంది.
గ్రామీణ ప్రాంతాల్లో COVID-19ని ఎదుర్కోడానికి ఈశా ఫౌండేషన్ చేసే సహాయ కార్యక్రమాల్లో భాగంగా, నీలవెంబు కషాయాన్ని తయారుచేసి, దగ్గర్లో ఉన్న అన్ని పల్లెటూళ్ళు, చిన్న చిన్న పట్టణాల్లో పంచి పెట్టడం జరిగింది. ఈ ప్రయత్నానికి ప్రజల ప్రతిస్పందన ఎలా ఉందో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నీలవెంబు కషాయం, ఈశా యోగ కేంద్రంలో రోజువారీ ఆహారంలో అంతర్భాగం. ఇక్కడ ప్రతి భోజనానికి ముందర అంటే రోజుకు రెండుసార్లు, నీలవెంబు కషాయాన్ని తీసుకుంటారు.ఈ పానీయాన్ని ఆన్ లైన్ లో ఆర్డర్ చేసి,ఈశా లైఫ్ ద్వారా పొందవచ్చు. మీకు దగ్గర్లో ఉన్న సిద్ధ లేదా ఆయుర్వేద ఔషధ శాలలో కూడా తప్పకుండా దొరుకుతుంది.
ఈ పానీయాన్ని తయారు చేసే విధానం:
200 మి.లీ నీళ్లలో 5 గ్రాముల(ఒక టేబుల్ స్పూన్) పొడిని వేసి, ఆ మిశ్రమం 50ml పరిమాణం వరకు చిక్కబడే దాకా మరిగించండి. ఈ డికాక్షన్ చేదుగా ఉంటుంది కాబట్టి దానికి కొంచెం తేనె లేదా తాటిబెల్లం లేక బెల్లం కలుపుకోవచ్చు.
#3 రోగనిరోధక శక్తిని పెంచే పానీయం – సుక్కు కాఫీ
ఉదయాన్నే ఆహ్లాదం కలిగించే, హానికరమైన కెఫిన్ ఏ మాత్రములేని, ఈ పానీయాన్ని ఆస్వాదించండి. సుక్కు కాఫీ ఎన్నో రకాల ఆరోగ్య లాభాలను కలిగించే ఒక కెఫిన్- రహిత వేడి పానీయం, ఆహారం జీర్ణం అవ్వడానికి సహకరించడం ఇంకా గొంతు గరగర తగ్గించడం దగ్గర్నుంచి, వాంతి వికారాల నుంచి ఉపశమనం, కడుపుబ్బరం ఇంకా మామూలుగా వచ్చే ఎన్నో అనారోగ్యాల వరకు..
తయారీ- 4 కప్పులు ( చిన్న టీ కప్పులు)
పదార్థాలు:
అల్లం కొద్దిగా చితక్కొట్టినది 2- అంగుళాల పొడవు ముక్క
ధనియాలు- నాలుగు టీస్పూన్లు
తాటి బెల్లం - రుచి కోసం
తయారు చేసే విధానం:
నాలుగు కప్పుల నీళ్లను గిన్నెలో వేసి మరిగించండి. దానికి అల్లం, ధనియాలు కలపండి. పొయ్యి మంట తగ్గించి, 3-4 నిమిషాల పాటు ఉడకనివ్వండి. మంట నుంచి కిందకు దింపి, వడగట్టండి.
దానికి తాటి బెల్లం కలిపి, అది పూర్తిగా కరిగి పోయేవరకు తిప్పండి. వేడిగా అందించండి!
#4 రోగనిరోధక శక్తిని పెంచే పానీయం – వేడి నిమ్మరసం
తయారు చేయడం అతి సులభం ఇంకా చాలా లాభకరం, ఈ 3 పదార్థాల పానీయం చల్లబరిచేది ఇంకా ఆరోగ్యాన్నిచ్చేది కూడా.. దీని తయారీ, తరతరాల నుంచి వాడుకలో ఉన్నది. చాలా ప్రాచుర్యంలో ఉన్న సాంప్రదాయకమైన అమృతం ఇది. తేనెని తీసుకోవడం వల్ల, శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్స్ ఉన్న చిన్నపిల్లల్లో తరచుగా వచ్చే దగ్గు తీవ్రతను తగ్గిస్తుందని, నివారిస్తుందని కూడా పరిశోధనల్లో తేలింది. ఇక నిమ్మరసం విటమిన్ సి అపారంగా కలిగి ఉండే గొప్ప వనరు. ప్రామాణికమైన పరిశోధన ప్రకారం, విటమిన్ సి మన శరీరంలో ఉన్న ఇన్ఫెక్షన్తో పోరాడడానికి అవసరమైన తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి కావాల్సిన ప్రేరణను అందించడంలో సహాయపడుతుంది.
ఈ పానీయాన్ని తయారు చేసే విధానం:
250ml వేడి నీళ్లకి, నిమ్మరసం (ఒక నిమ్మకాయది), ఒక టీస్పూన్ తేనె ఇంకా రెండు టేబుల్ స్పూన్ బెల్లం/ తాటి బెల్లం/ కొబ్బరి పంచదార కలపండి.
ఈ మిశ్రమాన్ని బాగా కరిగాక, వేడిగా ఉండగానే తాగేయండి. రోజుకి మూడు నుంచి ఐదు సార్లు ఈ పానీయాన్ని తీసుకోవడం శ్రేష్టమైన పద్ధతి.
ప్రస్తుతమున్న క్లిష్ట పరిస్థితుల్లో ఒక చిన్న సూక్ష్మక్రిమి ద్వారా వచ్చే మామూలు అంటువ్యాధి కూడా ప్రాణాంతకం కావచ్చు. ఈ నాలుగు(రకాల) ఆరోగ్యకరమైన పానీయాలు, మీ వ్యాధి నిరోధక శక్తి పెంచడం. ద్వారా, మీకు covid-19 అంటు వ్యాధి నుంచి అదనపు రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తాయని ఆశిస్తున్నాము. ఈ పానీయాలను తాగడంతో పాటు, ఆరోగ్యంగా ఉండటం ఇంకా వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవడం గురించి ఒక ఆసక్తికరమైన దృష్టికోణాన్ని సద్గురు మనతో పంచుకుంటున్నారు
సద్గురు: : “అల్లోపతి వైద్య విధానం దీన్ని ఎలా చూస్తుందో నాకు తెలియదు కానీ, యోగా వ్యవస్థ మాత్రం, ఆరోగ్యంగా ఉండడానికి ముఖ్యంగా కావలసినది మీరు ఎప్పుడూ ఉత్సాహంగా ఇంకా ఆనందంగా ఉండడం అని భావిస్తుంది. మన వ్యవస్థలో ఒక సమతుల్యత ఇంకా ఉత్సాహం తీసుకురావడం అనేది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేయడంలో చాలా కీలకమైనది.”
Editor’s Note: Inner Engineering Online is available free of cost for COVID Warriors and at half the cost for everyone else.