గత 25-30 సంవత్సరాలుగా, కొన్ని స్వార్ధపూరిత వర్గాలు - వారి సంఖ్య తక్కువే అయినప్పటికీ, వారి గొంతు పెద్దది, వారి విషప్రచారం తీవ్రమైనది - ఎలాంటి ఆధారాలు లేకుండానే ఈశా ఫౌండేషన్‌పై విరుచుకుపడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం, ఫేక్ న్యూస్, పెయిడ్ మీడియా మరియు సోషల్ మీడియాల ద్వారా, ఈ స్వప్రయోజన పరులు క్రమపద్ధతిలో అబద్ధాల వలను అల్లుతూ, సంస్థను కించపరచడానికి కుటిల మార్గాలను అన్వేషిస్తున్నారు. ఏ ప్రభుత్వ సంస్థ కూడా ఒక్క కోర్టు కేసు కూడా దాఖలు చేయనప్పటికీ, ఈ బృందాలు అనవసరమైన వ్యాజ్యాలతో సంస్థను వివాదాస్పద పరిస్థితులలోకి, చెడు ప్రచారంలోకి లాగడానికి పదేపదే ప్రయత్నిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1 కోటి 10 లక్షలకు పైగా వాలంటీర్లు మరియు వందల కోట్ల మంది శ్రేయోభిలాషుల పట్ల మాకున్న బాధ్యతగా, వారందరి నుండి వస్తున్న విజ్ఞప్తులకు స్పందిస్తూ, సత్యాన్ని వెల్లడించవలసిన సమయం ఆసన్నమైంది. అందుకే మేము ముందుకొచ్చి, సర్వసాధారణంగా అడిగే ప్రశ్నలకు సమాధానాలను అందిస్తున్నాం.