బిల్వపత్ర విశిష్ట ధర్మాలను ఇంకా దానిపై శివుడి ప్రేమను ప్రసిద్ధమైన బిల్వాష్టకం స్తుతిస్తుంది. సౌండ్స్ ఆఫ్ ఈశా ద్వారా ఈ బిల్వష్టకం అందించబడుతుంది.

Bilvashtakam Telugu lyrics - పదబంధాలు &అర్థం:

త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం

నేను శివునికి బిల్వపత్రం సమర్పిస్తాను. ఈ పత్రంలో త్రిగుణాలు అనగా సత్వ, తామస, రజో గుణాలు మూర్తీభవిస్తాయి. ఈ పత్రం మూడు నేత్రాలు వంటిది. అలాగే సూర్యుడు, చంద్రుడు, అగ్ని వంటిది. ఈ పత్రం మూడు ఆయుధాలు వంటిది. గత మూడు జన్మల్లో చేసిన పాపాలను బిల్వపత్రం నాశనం చేస్తుంది. బిల్వపత్రంతో నేను శివున్ని పూజిస్తాను.

అఖండ బిల్వపత్రేణ పూజితే నందికేశ్వరే శుధ్యన్తి సర్వ పాపేభ్యో ఏకబిల్వం శివార్పణం

నేను శివునికి బిల్వపత్రం సమర్పిస్తాను. నేను నందికేశ్వరునికి బిల్వపత్రంతో పూజ చేయగా, అది పాపాల నుండి విముక్తి కలిగిస్తుంది.

శాలిగ్రాం శిలామేకాం విప్రాణం జాతు చర్పయేత్ సోమయద్న్య మహాపుణ్యం ఏకబిల్వం శివార్పణం

నేను శివునికి బిల్వపత్రం సమర్పిస్తాను. ఈ పత్రం మృదువైనది మరియు నిష్కల్మషమైనది. ఈ పత్రం స్వయంగా సంపూర్ణమైనది. ఇది మూడు శాఖలు కలది. నేను బిల్వపత్రంతో శివున్ని ఆరాధిస్తాను.

దంతికోటి సహస్రాని వాజపే శతనిచా కోటికన్యా మహాధానం ఏకబిల్వం శివార్పణం

యజ్ఞాలు, త్యాగాలు కంటే బిల్వపత్ర సమర్పణ ఎంతో శక్తివంతమైనది.

లక్ష్మ్యా స్త్నం ఉన్పన్నం మహాదేవస్య చా ప్రియం బిల్వ వృక్షం ప్రయచ్చామి ఏకబిల్వం శివార్పణం

బిల్వపత్రం లక్ష్మీదేవి చేత సృష్టించబడింది. బిల్వవృక్షంపై శివునికి ఎంతో అభిమానం. నేను బిల్వపత్రంతో శివున్ని ఆరాధిస్తాను.

దర్శనం బిల్వ వృక్షస్య స్పర్శణం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం

బిల్వపత్ర దర్శనం మరియు బిల్వపత్ర స్పర్శ పాపాలను హరించును. నేను బిల్వపత్రంతో శివునికి పూజ చేస్తాను

కాశిక్షేత్ర నివాసం చా కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం

కాశి క్షేత్రం వెళ్లి, కాల భైరవున్ని దర్శించుకుని మరియు మాధవాలయం సందర్శించుకున్న తర్వాత బిల్వపత్రాన్ని శివునికి సమర్పిస్తాను.

మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణే అగ్రతః శివ రూపాయ ఏకబిల్వం శివార్పణం

బిల్వపత్రం క్రింది భాగం బ్రహ్మ, మధ్య భాగం విష్ణు మరియు అగ్ర భాగంలో శివుడు కొలువై ఉంటారు. బిల్వపత్రంతో నేను శివున్ని పూజిస్తాను.

Editor’s Note: Bilvashtakam is part of the album Trigun, available for purchase and download at Isha Downloads.