2016లో ఇద్దరు సన్యాసులను బంధించారనే వార్తలు నిజమేనా?
ఈశా యోగా కేంద్రంలో ఎవరినీ బలవంతంగా నిర్బంధించలేదు. 39, 42 సంవత్సరాల వయసున్న ఆ ఇద్దరు సన్యాసులతో సహా, ప్రతి ఒక్కరూ తమ ఇష్టం ప్రకారమే ఉంటున్నారు. 2024 అక్టోబర్‌లో, సుప్రీంకోర్టు ఈశా ఫౌండేషన్‌పై వచ్చిన ఈ ఆరోపణలను పూర్తిగా కొట్టివేసింది. అంతేకాక, ఈ ఆరోపణల వెనుక దురుద్దేశాలు ఉన్నట్లు కోర్టు గమనించింది.
విచిత్రమేమిటంటే, ఇదే విషయంపై 2016లో కూడా ఆ ఇద్దరు సన్యాసుల తల్లిదండ్రులు ఇదే తరహా కేసు వేశారు. విస్తృత దర్యాప్తు అనంతరం హైకోర్టు ఆ ఆరోపణలను కొట్టివేసి, "ఈ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు, వారంతా తమ ఇష్టపూర్వకంగానే ఫౌండేషన్‌లో ఉంటున్నారని" స్పష్టం చేసింది.
ఈశా ఫౌండేషన్ నుంచి చాలామంది అదృశ్యమవుతున్నారా?
లేదు. తమిళనాడు పోలీసుల నివేదిక ప్రకారం, గత 15 సంవత్సరాల్లో ఈశా యోగ కేంద్రానికి వచ్చిన 7.5 కోట్ల మంది సందర్శకుల్లో, కేవలం 6 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 5 కేసులు ఆ వ్యక్తులు సురక్షితంగా ఉన్నట్లు తెలిసిన తర్వాత మూసివేయబడ్డాయి. ఈ ఘటనలు ఎక్కువగా సందర్శకులు ఇంటికి వెళ్తున్నప్పుడు దారి తప్పడం, సరైన కమ్యూనికేషన్ లేకపోవడం లేదా ఫోన్లు పని చేయకపోవడం వంటి కారణాల వల్ల జరిగాయి. ఒకే ఒక్క కేసు మాత్రమే పరిష్కారం కాలేదు - అది కూడా యోగ కేంద్రం నుంచి బయటకు వెళ్లి, కొన్ని గంటల తర్వాత అందుబాటులో లేని ఒక వ్యక్తి కోసం స్వయంగా ఫౌండేషన్ వేసిన ఫిర్యాదే. ఆ వ్యక్తి త్వరగా కనిపించాలని ఫౌండేషన్ పోలీసులతో కలిసి చురుగ్గా ప్రయత్నిస్తోంది.
ఈశా యోగా కేంద్రంలో అక్రమ శ్మశానవాటిక నడుస్తోందా?
ఈశా యోగా కేంద్రంలో ఎలాంటి శ్మశానవాటిక లేదు. 2010 నుంచి, తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలోని 14 ప్రభుత్వ శ్మశానవాటికల నిర్వహణ బాధ్యతను ఈశాకు అప్పగించింది. ఈ శ్మశానవాటికలన్నీ చట్టబద్ధంగా నిర్వహించబడుతున్నాయి.
అంతేకాకుండా, 2020లో కోవిడ్-19 సంక్షోభ సమయంలో, ఈశా "డిగ్నిటీ ఇన్ డెత్” అనే కార్యక్రమాన్ని ప్రారంభించి, ఈ శ్మశానవాటికలలో ఉచిత అంత్యక్రియల సేవలను అందించింది. తద్వారా, కుటుంబాలు తమ ప్రియమైన వారికి గౌరవప్రదమైన వీడ్కోలు ఇవ్వడానికి సహాయపడింది. ఈ కష్ట సమయంలో వాలంటీర్లు మరియు సన్యాసులు ఈ శ్మశానవాటికలు నిరంతరం పనిచేసేలా అహర్నిశలూ శ్రమించి, ప్రజల మన్ననలు పొందారు.
ఈశా యోగా కేంద్రంలో మహిళలను వేధించడం, అపహరించడం లాంటివి జరుగుతున్నాయా?
లేదు, ఈశా యోగ కేంద్రంలో మహిళలను వేధించడం గానీ, కిడ్నాప్ చేయడం గానీ జరగడం లేదు. మహిళా వాలంటీర్లు, స్టాఫ్, సందర్శకులు మరియు సన్యాసినులందరికీ సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించడానికి ఈశా ప్రాధాన్యత ఇస్తుంది. గత 15 సంవత్సరాల్లో కేంద్రానికి వచ్చిన 7.5 కోట్ల మంది సందర్శకుల్లో 3 కోట్ల మందికి పైగా మహిళలే. ఇన్ని ఏళ్లలో ఎలాంటి వేధింపులు లేదా కిడ్నాప్ కేసులు నమోదు కాలేదు. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ మార్గదర్శకాల ప్రకారం, ఫౌండేషన్‌కు అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఉంది మరియు POSH (కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నిరోధక) చట్టానికి పూర్తిగా కట్టుబడి ఉంది.
"ఈశా కేంద్రం" లో ఒక వేధింపు కేసు జరిగిందనే తప్పుడు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. పోలీసులు నమోదు చేసిన కేసు వివరాల ప్రకారం, ఉచిత వైద్య శిబిరంలో భాగంగా వైద్య పరీక్ష నిర్వహించడానికి నియమించబడిన ఒక డాక్టర్‌పై వేధింపుల ఆరోపణలు ఉన్నాయి. ఈ శిబిరం ఈశా యోగా కేంద్రంలో నిర్వహించబడలేదు. ఈ కేసు దర్యాప్తులో ఉంది, దీనిపై పూర్తి విచారణకు సంస్థ సహకరిస్తోంది.
ఈశా ఫౌండేషన్ ఈశా యోగ కేంద్రాన్ని నిర్మించడానికి అటవీ భూములను ఆక్రమించిందా?
లేదు, ఈశా ఫౌండేషన్ ఎలాంటి అటవీ భూములను ఆక్రమించలేదు. దీనిని మద్రాస్ హైకోర్టు మరియు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో తమిళనాడు అటవీశాఖ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ CFCIT/07/2013 స్పష్టం చేసింది. అంతేకాకుండా, కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్‌లో ఈ విషయాన్ని ధృవీకరించింది.
ఈశా యోగ కేంద్రం ఏనుగుల కారిడార్‌లో నిర్మించబడిందా?
లేదు, ఈశా యోగ కేంద్రం ఏనుగుల కారిడార్‌లో నిర్మించబడలేదు. ఈ ఆరోపణలకు సంబంధించి తమిళనాడు అటవీ శాఖ, డాక్యుమెంట్ నంబర్ CFCIT/07/2013లోనూ, అలాగే 2021లో RTIకి ఇచ్చిన సమాధానంలోనూ స్పష్టంగా వీటిని ఖండించింది.
వాస్తవానికి, ఈశా యోగా కేంద్రం ఉన్న జిల్లా (కోయంబత్తూరు జిల్లా) మొత్తంలో ఎలాంటి ఏనుగుల కారిడార్లు లేవని తమిళనాడు అటవీ శాఖ స్పష్టంగా తెలిపింది. 2010లో కేంద్ర పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ విభాగానికి చెందిన ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్ విడుదల చేసిన ‘గజ నివేదిక’లో గుర్తించబడిన అనేక ఏనుగుల కారిడార్లలో కూడా ఈశా యోగా కేంద్రం లేదు. అలాగే, భారత వన్యప్రాణి సంస్థ (WTI) 2005లో గుర్తించిన 88 ఏనుగుల మార్గాల్లో గానీ, 2017లో గుర్తించిన 101 మార్గాల్లో గానీ ఈశా కేంద్రం లేదు.
యోగా కేంద్రంలో అక్రమ నిర్మాణాలు ఉన్నాయా? ఈశా యోగ కేంద్రంలోని అన్ని భవనాలకు అవసరమైన అనుమతులు ఉన్నాయా?
ఈశా యోగ కేంద్రంలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు లేవు. అన్ని భవనాలకు అవసరమైన అనుమతులు పొందబడ్డాయి. 2021లో సమాచార హక్కు చట్టం కింద వచ్చిన ప్రశ్నకు తమిళనాడు ప్రభుత్వం ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
ఈశా యోగ కేంద్రం నిర్మాణానికి గిరిజన భూములను బలవంతంగా స్వాధీనం చేసుకున్నారా?
లేదు. ఈశా ఎలాంటి భూములనూ బలవంతంగా గానీ, నిర్బంధపూర్వకంగా గానీ స్వాధీనం చేసుకోలేదు.
ఈశా అన్ని చట్టాలను, ముఖ్యంగా పర్యావరణ నిబంధనలను పాటిస్తోందా?
అవును, ఈశా పర్యావరణ నిబంధనలతో సహా రాజ్యాంగ చట్టాలన్నింటినీ పాటిస్తుంది.
ఈశా యోగ కేంద్రం అడవికి దగ్గరగా ఉండటం వల్ల, ఇది ఏదైనా మానవ-జంతు సంఘర్షణకు లేదా వన్యప్రాణుల ఇబ్బందికి దారి తీసిందా?
ఈశా యోగ కేంద్రంలో ఎలాంటి మానవ-జంతు సంఘర్షణ లేదు. ఈశా వన్యప్రాణులను ఇబ్బంది పెట్టదు, మేము ఎప్పటికీ అలా చేయాలనుకోము. మేము ప్రకృతితో సామరస్యంగా జీవిస్తున్నాము.
2017 CAG నివేదికలో ఈశాపై వచ్చిన ఆరోపణల్లో నిజమెంత?
ఈ ఆరోపణలలో ఎలాంటి నిజం లేదు. వాటన్నింటినీ మేము ఖండించి, వివరణలు ఇచ్చాము. తర్వాత ఆ నివేదికను CAG మూసివేయడమే కాక ఉపసంహరించుకుంది కూడా. మరిన్ని వివరాలకు దయచేసి
ఇది చదవండి.
సద్గురు భార్య, శ్రీమతి విజయకుమారి మరణం గురించి అనేక అపోహలు ఉన్నాయి. వాస్తవం ఏమిటి?
శ్రీమతి విజయకుమారి వందలాది మంది సమక్షంలో మహాసమాధి చెందారు. మహాసమాధి అనేది ఆధ్యాత్మిక సాధకుల పరమోన్నత లక్ష్యం. ఈ లక్ష్యాన్ని చేరుకున్న ఎంతోమంది యోగుల ఉదంతాలతో భారతదేశ సంస్కృతి నిండి ఉంది. మరింత తెలుసుకోవడానికి
దీన్ని చదవండి.
ఆదియోగిని ఇంత భారీగా ప్రదర్శించడం ఎందుకు? ఇది అవసరమా?
ఆదియోగి విషయంలో ఉన్న ఏకైక అత్యాడంబరం- అందులో పాల్గొన్న వారందరి కష్టం మాత్రమే. ఇది పూర్తిగా వాలంటీర్ల కృషి.
ప్రతిష్టాత్మక ఆదియోగి మానవులకు వారి అంతిమ శ్రేయస్సు కోసం ప్రేరణగా నిలుస్తుంది.
ఆదియోగి విగ్రహ నిర్మాణానికి అడవులు నరికివేయబడ్డాయా?
ఆదియోగి విగ్రహ నిర్మాణానికి ఎలాంటి అడవులు నరికివేయబడలేదు. 2017లో సమాచార హక్కు చట్టం కింద వచ్చిన ప్రశ్నకు తమిళనాడు ప్రభుత్వమే స్పష్టంగా - ఈశా యోగ కేంద్రం ఎక్కడా అటవీ భూమిని ఆక్రమించలేదని తేల్చి చెప్పింది.
మరిన్ని వివరాలకు దయచేసి
ఇది చదవండి.
ఆదియోగి విగ్రహానికి అవసరమైన ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా?
అన్ని అనుమతులూ ఉన్నాయి. కోయంబత్తూరు జిల్లా కలెక్టర్, జిల్లా అటవీ అధికారి సహా సంబంధిత అధికారులందరి నుండి ఆదియోగి విగ్రహ నిర్మాణానికి అవసరమైన అనుమతులు పొందబడ్డాయి.
మరిన్ని వివరాలకు దయచేసి
ఇది చదవండి.
సద్గురు ఎందుకు సాధారణ సాంప్రదాయ గురువుల్లా ఉండటం లేదు? ఆయన అత్యాడంబరంగా, ఖరీదైన శాలువలు, కళ్ళజోళ్ళు ధరిస్తారు, ఖరీదైన కార్లు, బైక్‌లు నడుపుతారు ఇంకా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.
'సాధారణ సాంప్రదాయ గురువు' అంటే ఏమిటి? నిస్సందేహంగా, ఆయన అందరిలా ఉండరు.
ఆధ్యాత్మిక గురువుగా, సద్గురు ఒక వేషం ధరిస్తారు. గోల్ఫర్‌గా, మరో వేషం ధరిస్తారు. బైకర్‌గా, మరో వేషం ధరిస్తారు. ప్రపంచ ఆర్థిక సదస్సు లేదా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు, భిన్నంగా ధరిస్తారు. యువతతో ఉన్నప్పుడు, పరిస్థితికి తగినట్లుగా భిన్నంగా ఉంటారు.
సద్గురు బైక్‌లు మరియు కార్లను ఇష్టపడతారు, కానీ ఆయన నడిపే వాటిలో ఏదీ ఆయన సొంతం కాదు.
ఈశా ఉన్నతశ్రేణి వర్గాలకు చెందిన సంస్థగా కనిపిస్తుంది. సద్గురును ఎల్లప్పుడూ సెలబ్రిటీలతోనే ఎందుకు చూస్తాము?
మీడియా వాటినే హైలైట్ చేస్తుంది కాబట్టి మీరు సద్గురును సెలబ్రిటీలతో మాత్రమే చూస్తారు. సద్గురు కలుసుకునే ప్రతి సెలబ్రిటీకి, లక్షలాది మంది సాధారణ ప్రజలను కలుస్తారు. ఈశా చేసే పనులలో ఎక్కువ భాగం - ఆధ్యాత్మిక మరియు సామాజిక కార్యక్రమాలు రెండూ - గ్రామీణ ప్రాంతాలలో జరుగుతాయి, కానీ అవి వార్తల్లోకి రావు. మా సామాజిక కార్యక్రమాల గురించి మరింత తెలుసుకోవడానికి
ఇక్కడ క్లిక్ చేయండి.
మహాశివరాత్రి ఎందుకంతగా వాణిజ్యీకరించబడింది? ఈశా మహాశివరాత్రి వేడుకకు హాజరు కావడానికి ఎందుకు డబ్బు చెల్లించాలి? ఉచితంగా హాజరు కావచ్చా?
లక్షలాది మందికి మహాశివరాత్రిని ఉచితంగా అందించడానికి చాలా నిర్వహణ మరియు వనరులు అవసరం. రాత్రి పొడుగునా జరిగే ఈ అద్భుతమైన వేడుకలను నిర్వహించడానికి అయ్యే ఖర్చులను భరించడానికి కొన్ని వందల మంది చెల్లిస్తారు.
పోల్‌స్టార్ నివేదిక ప్రకారం, 2021లో, గ్రామీ అవార్డుల కంటే ఎక్కువ మంది మహాశివరాత్రి వేడుకలను ఆన్‌లైన్ ఛానెళ్ల ద్వారా వీక్షించారు.
ఈశా కార్యక్రమాలు ఎందుకింత ఖరీదు? ఆధ్యాత్మిక ప్రక్రియను ఇంత వాణిజ్యీకరణ చేయాల్సిన అవసరం ఉందా?
ఆధ్యాత్మిక ప్రక్రియ ఎల్లప్పుడూ ఉచితంగానే అందించబడుతుంది. ఈ కార్యక్రమాల నిర్వహణకు ఖర్చు అవుతుంది, దానికి పాల్గొనేవారు చెల్లిస్తారు.
సద్గురు బీజేపీ మద్దతుదారా?
సద్గురు ప్రజాస్వామ్యానికి మరియు ప్రజల ఆదేశానికి మద్దతుదారు. ఆయన అన్ని రాజకీయ పార్టీల నాయకులతో విజయవంతంగా పనిచేశారు. ఆయన చాలాసార్లు స్పష్టంగా చెప్పినట్లుగా, ప్రజాస్వామ్యం అంటే మీరు ఎవరు అనేది కాదు, మీరు ఏమి చేస్తారనేది ముఖ్యం.
పన్ను ఎగవేత కోసం ఈశా ‘డొనేషన్’ రసీదులు జారీ చేస్తుందా?
ఈశా ఎన్నడూ పన్నులను ఎగవేయదు. ప్రస్తుతం యోగాపై ఎలాంటి పన్నూ లేదు.
ప్రజలను సంతోషంగా ఉంచడానికి ఈశా లాఫింగ్ గ్యాస్ వాడుతుందనేది నిజమేనా?
హహహహ (మేము నిజంగా నవ్వుతున్నాం). మేము సాధారణంగా వేరే మూడ్ ఎన్హాన్సర్‌పై ఉంటాం. దానిని యోగా అంటారు.
ఈశా ప్రజలను కోమాలో ఉంచి, వారి కిడ్నీలను దొంగిలిస్తుందని విన్నాము. మీరు ఏమంటారు?
నిజంగానా? దొంగిలించిన కిడ్నీలతో ఏం చేస్తారు? వాటిని మా వెబ్‌సైట్‌లో మార్కెటింగ్ చేయాలా? వాస్తవికంగా ఆలోచించండి.
సద్గురు చెప్పే చాలా విషయాలు శాస్త్రీయ నియమాలకు విరుద్ధంగా ఉంటాయి. ఆయన సూడోసైన్సుని ఎందుకు ప్రచారం చేస్తారు?
సద్గురు చాలా విషయాలను తన ఆంతరంగిక అనుభూతి నుంచి వచ్చిన జ్ఞానం ద్వారా మాట్లాడతారు. ప్రముఖ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు కూడా సైన్సు అవగాహనకు మించిన అంశాలు ఉన్నాయని అంగీకరిస్తున్నారు. చాలా మంది శాస్త్రవేత్తలు అలాంటి అనేక అంశాలపై సద్గురు దృక్పథాన్ని తెలుసుకోవాలనుకుంటారు.
సద్గురు ఇస్లామోఫోబియా వాతావరణాన్ని సృష్టిస్తున్నారా?
కచ్చితంగా కాదు. సద్గురు ఆశయం, మానవ శ్రేయస్సును పెంపొందించడం. ఆయన మతం, కులం, వర్గం, లింగం ఇంకా జాతి అనే అడ్డంకులకు అతీతంగా అందరినీ కలుపుకుని వెళ్ళే గురువు.
సద్గురు స్త్రీలకు వ్యతిరేకమా?
సద్గురు చేసే పని పట్ల అలాగే చెప్పే మాటలతో పరిచయం ఉన్న ఎవరైనా, ఆయన స్త్రీలకు వ్యతిరేకం కాదని నిస్సందేహంగా తెలుస్తుంది. ఆయన ఆశయం మానవాళి మొత్తానికి సమైక్య భావనను తీసుకురావడం, కాబట్టి స్త్రీలకు వ్యతిరేకం అన్న ప్రశ్నే తలెత్తదు.