అన్ని యోగ సాధనలు గర్భవతులకు అనుకూలం కావు. కాని కాబోయే తల్లులకు గర్భధారణా సమయం, ప్రసవం, మాతృత్వానుభూతి గొప్ప ఆనందాన్ని ఇవ్వాలంటే యోగ సాధన చాలా ముఖ్యం. ఈశా వారి ప్రధాన యోగాకార్యక్రమం ఇన్నర్ ఇంజనీరింగు. ఇందులో శాంభవి మహా ముద్ర ఉంది. దాన్ని అభ్యాసం చేసేవారి శరీరం, మనసు, ఉద్వేగం, శక్తులకు మధ్య సామరస్యాన్ని కలుగుతుంది. కాబోయే తల్లుల్లో అది ప్రాణశక్తిని పెంపొందిస్తుంది, భావోద్వేగాలను సంతులనం చేస్తుంది. ఇవాళ మనం ఈశా యోగాన్ని అభ్యాసం చేసే ఇద్దరు తల్లులకు శాంభవి మహాముద్ర, గర్భసమయంలో ఎలా తోడ్పడిందో చూద్దాం. సద్గురు: మీరు బిడ్డకు కేవలం శరీరాన్ని మాత్రమే ఇవ్వటం లేదు. మీరు శిశువుపై ఎన్నో విధాలుగా మీ ముద్రను వేస్తున్నారు. అందుచేత గర్భిణిగా ఉన్నప్పుడు మీరు ఎలా ఉంటారు అనేది చాలా ముఖ్యం.

జోఅన్నా నీలె, ఆస్ట్రేలియా:

నేను గర్భంతో ఉన్నప్పుడు, సద్గురుతో ఇన్నర్ ఇంజనీరింగు కార్యక్రమంలో పాల్గొన్నాను. ఈశాలో ఉన్న వారంతా చాలా సానుకూల దృక్పథంతో సంతోషంగా, కరుణాపూరితులుగా ఉన్నారు. వారు ఎంత శక్తిమంతులుగా ఉన్నారంటే, నేను కూడా, వారిలా జీవితాన్ని ఉత్సాహంగా గడపాలనుకున్నాను. ఈశా ఆస్ట్రేలియా వారి వద్ద నేను సురక్షిత వాతావరణంలో ఉన్న అనుభూతిని పొందాను. వారికి అంతా తెలుసు. నా శరీరం నిరంతరం వేగంగా మార్పులు చెందుతున్నప్పటికి నిత్యం నేను చెయ్యవలసిన క్రియను చెయ్యటంలో వారు నాకు ఎంతో సహాయం చేశారు. రేపు ప్రసవిస్తాననగా ఇవాళ రాత్రి కూడా నేను క్రియను చేశాను. దాని ప్రభావం నామీద, నా అందమైన పాప మీద ఎంతో ఉంది.

అంత క్రితం నాకు ఉన్న ఆరోగ్య సమస్యల దృష్ట్యా నాది అధిక ప్రమాదకరమైన గర్భం. అది కాస్తా పిల్లగాలంత మృదువుగా అయిపోయింది. నన్ను చూచే ప్రసూతి వైద్యురాలు, నా కేసులో ఎటువంటి ప్రమాదకరమైన విషయాలు లేకుండా పోవటాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఈ భూమి మీదకు చార్లేట్ ఎంతో ప్రశాంతంగా మృదువుగా వచ్చేసింది. తను పుట్టినప్పటినుండి ఎంతో శాంతిగా, తృప్తిగా, చురుకుగా ఉంది. ఆమె రాత్రంతా హాయిగా నిద్రపోయి పగలు ప్రకృతిని ఎంతో ఆనందించేది.

నేను కూడా ఎంతో మారాను. నేను ఒత్తిడిని పొందటం మానేశాను. పనుల్లో పరుగెత్తడం మాని వివరంగా శాంతంగా చేసుకోవటం మొదలు పెట్టాను. నాకు గతం భవిష్యత్తు లేనట్లు ప్రతి నిముషాన్ని ఆనందినచటం మొదలు పెట్టాను. ఇది వరకు పరిస్థితి ఇలా ఉంటే నేనేమి సాధించలేను అనుకునేదాన్ని, కాని ఇప్పుడు అప్పటికంటే ఎక్కువ చేయగలుగుతున్నాను.

ఒడెస్సా, మలేషియా

నాకిప్పుడు ఏడోనెల. అయినా ఇప్పటికి ప్రతిరోజూ క్రియను చేస్తున్నాను. ఇప్పుడు నేను ఎంతో శక్తిమంతంగా ఉన్నాను. రాత్రిళ్ళు ప్రశాంతమైన, గాఢమైన నిద్రను పోతున్నాను. ఇదివరకు అది సాధ్యం అయ్యేది కాదు. రాత్రంతా నిద్రపోవటం గర్భంలోని నాబిడ్డకు మేలు చేస్తుంది.

ప్రతి ఉదయం యోగసాధన చేసిన తరువాత తేలికగా అనిపిస్తుంది. అది గొప్ప అనుభూతి. కిటికీ బయట పిట్టలు పాడతానని గమనించి ఇదివరకంటే కంటే ఎక్కువగా ఆనందాన్ని పొందుతున్నాను. నావృత్తిలో, తలమునకలై పోయి, అంతులేని ఒత్తిడిని ఎదుర్కొంటున్నానని నా భర్త ఇన్నర్ ఇంజనీరింగులో చేర్చారు.

ఇప్పుడు, నేను ప్రశాంతంగా ప్రతిక్షణాన్ని ఆనందిస్తున్నాను. ఇప్పుడు నా నిగ్రహశక్తి పెరిగింది. అది నా భర్తకు, నా శిశువుకు ఎంతో మంచిది.ఇది చూసి నాభార్తకూడా ఈ సంవత్సరం మేలో మలేసియాలో ఇన్నర్ ఇంజనీరింగులో చేరుతున్నారు. మన చుట్టూ ఉన్నవారిని మనం ప్రేమించాలంటే ముందుగా మనలను మనం ప్రేమించుకోవటం నేర్చుకోవాలి.

ప్రేమాశీస్సులతో,

సద్గురు