ఈశా యోగా కేంద్రం – కరోనా నుండి పూర్తి సురక్షితం
మార్చి 31 2020, కోయంబత్తూరు: కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రంలో కరోనావైరస్ బారిన పడ్డ కేసులేవీ నమోదుకాలేదు.
అంతర్జాతీయ సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉండే యోగా కేంద్ర్రం, ప్రపంచ ఆరోగ్య సంస్థ COVID-19 ను మహమ్మారిగా ప్రకటించక మునుపే, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు మూసివేతను ప్రకటించి, ప్రయాణాలపై ఆంక్షలు విధించడానికి చాలా ముందుగానే అప్రమత్తమై త్వరితగతిన తగునిర్దేశకాలను జారీచేసింది. ప్రయాణీకుల మరియు భారీ జన సందోహ సంరక్షణార్ధం తీసుకున్న ముందుజాగ్రత్త ప్రమాణాలననుసరించి, చైనా, జపాన్, సింగపూర్ తో సహా ఇతర COIVID-19 ప్రభావిత దేశాలనుండి వచ్చే సందర్శకులకు, యోగా కేంద్ర పర్యటనను రద్దు చేసుకోవలసిందిగా విజ్ఞప్తి చేసింది. COIVID-19 ప్రభావిత దేశాలను పర్యటించిన వారితో సహా రవాణా మరియు విమానాశ్రయంలో తాత్కాలిక బస చేసిన ప్రయాణీకులను కూడా యోగా కేంద్ర పర్యటనను రద్దుచేసుకోవలసిందిగా విన్నవించింది.
అప్పటినుంచే ఈశా తప్పనిసరి తనికీ మరియు వ్యక్తిగత దూరం పాటించే నియమాలను అవలంభిస్తూ వచ్చింది. యోగా కేంద్రాన్ని సందర్శించిన ఇతర విదేశీయులను తప్పనిసరిగా 28- రోజుల దిగ్బంధన కాలాన్ని పాటించవలసిందిగా కోరింది.
ఈశా సూచించే ఆరోగ్య మరియు శుభ్రత నియమాలను సాధారణ పరిస్థితులలో కూడా తూచా తప్పకుండా పాటించే ఆశ్రమవాసులు మరియు వాలంటీర్లకు ప్రస్తుతం ప్రతీ రెండు రోజులకు తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహించబడుతున్నాయి. ఈశా యోగా కేంద్రంలో నివసించే భద్రతా సిబ్బంది, పారిశుధ్య సిబ్బందితో పాటు యోగా కేంద్రంలో ఇతర సిబ్బందికూడా ఈ నియమాలు వర్తిస్తాయి. యోగా కేంద్ర ప్రాంగణలోని పలుచోట్ల, చేతులను శుభ్రపరుచుకోవడానికి శానిటైజెర్లు అందుబాటులో ఉంచింది.
వైద్య పరీక్షల నిమిత్తం ఫిబ్రవరి నుండి యోగా కేంద్రాన్ని సందర్శిస్తున్న రాష్ట్ర ఆరోగ్య అధికారులు COVID-19 కేసులేవీ నమోదు కాలేదని తెలిపారు. ఇటీవల, మహమ్మారి వ్యాప్తిని అదుపు చేసి, నియంత్రించడంలో భాగంగా,తమ ప్రాంగణాలను వాడుకోవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. యోగా కేంద్రం పరీక్షల నిమిత్తం అవసరమయ్యే సామాగ్రిని పుష్కలంగా కలిగి ఉండడమే కాకుండా, వ్యక్తిగత దూరం మరియు స్వీయ దిగ్బంధన నియమాలను ముందు నుంచే అమలు చేస్తూ వచ్చింది.