మీరు ఉష్ణ మండల లేదా ఉప ఉష్ణమండల ప్రదేశాల్లో నివసిస్తున్నట్లయితే, ఉష్ణోగ్రతల్లో పెరుగుదల మీకు తెలిసే ఉంటుంది! సంవత్సరంలో ఈ సమయాన్ని, అగ్ని నక్షత్రం అంటారు. ప్రపంచంలోని ఈ ప్రాంతాలలో (దక్షిణ భారతం, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో) సంవత్సరంలో అత్యధిక ఉష్ణోగ్రత ఉండే కాలం అది. ‘సూర్య’ లేదా సూర్యుడు ‘కృత్తికా’ నక్షత్రం గుండా ప్రయాణించే కాలాన్ని ‘అగ్ని నక్షత్రం’ అంటారు. నడి వేసవి ప్రారంభం కావడం, (సూర్యుడు మరికాస్త ఉత్తరానికి వస్తే ఆంధ్ర, తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాల్లో మనకు కృత్తికా నక్షత్రం తరువాత వచ్చే రోహిణీ నక్షత్రంతో వచ్చే రోహిణీ కార్తె అగ్నినక్షత్రానికి సూచిక). ఇంగ్లీష్ (గ్రెగేరియన్) కాలెండర్ ప్రకారం ఇది మే-జూన్ మాసాల్లో వస్తుంది.

మీ ఆహారంలో బూడిదగుమ్మడి కాయ లేదా తెల్ల గుమ్మడికాయను చేర్చుకోవడం వల్ల వేడిని సునాయాసంగా అధిగమించవచ్చు. శక్తిని పెంపొందించడంలో సమర్థవంతమైన ఈ ఆహారాన్ని ఆస్వాదించడంతో పాటు సలాడ్స్, జ్యూసులు, అల్పాహారం ఇంకా స్వీట్లలో మరో కొత్త రుచిని చేర్చండి. ఈ అమోఘమైన కాయగూర ఆరోగ్యానికి, శ్రేయస్సుకు సంబంధించి లెక్కలేనన్ని ప్రయోజనాలను కలిగి ఉంది. బూడిదగుమ్మడితో మరిన్ని మధురమైన వంటకాల సేకరణ కింద ఇవ్వబడింది.

బూడిదగుమ్మడికాయ అంటే ఏమిటి?

బూడిదగుమ్మడి కాయ (Benincasa hispida) పుచ్చ జాతికి చెందిన ఒక ప్రత్యేకమైన కాయ. భారతదేశం ఇంకా చైనాల్లో దీనిని ఎక్కువగా వాడుతారు. ఆసియాలోని వంటకాల్లో, దీనిని ముక్కలుగా తరిగి సూపుల్లో వేస్తారు. ఏదేమైనా, భారతదేశంలోని యోగులు దీనిని ఇష్టపడడానికి కారణం ఏంటంటే, యోగ శాస్త్రాల్లో పేర్కొన్న ‘ప్రాణ’ - ప్రాణ శక్తి అధిక మొత్తాల్లో ఉండడం వల్ల అది సహాజంగా శక్తిని పెంపొందించే ఆహారం కావడమే.

బూడిదగుమ్మడి కాయని వాడుకలో అనేక ప్రాంతీయ పేర్లతో పిలుస్తారు:

వైట్ గార్డ్

వింటర్ మెలన్

వాక్స్ గార్డ్ (బూడిదగుమ్మడిలో ఉపరకానికి చెందినది)

కూష్మాండ, బృహత్ ఫలం, ఘ్రీనావాస, గ్రమ్య కార్కతి, కర్కరు (సంస్కృతం)

పెఠా, పెఠాఖద్దు (హిందీ)

టోరోబోట్(మణిపూర్)

కోహ్లా(మరాఠీ)

నీర్ పూసానికాయ్ (తమిళ్)

కుంబలంగా(మలయాళం)

బూడిద గుమ్మడి కాయ(తెలుగు)

బూడేకుంబళకాయ్, బూడు గుంబళ(కన్నడ)

కుమ్ర, చల్కుమ్ర (బెంగాలీ)

కొమోర(అస్సామీస్)

రూపం (ఆనవాళ్ళు)

పచ్చి బూడిదగుమ్మడి కాయపై నూగులాంటి చిన్న పీచులు ఉంటాయి, కాయ పక్వానికి వస్తున్న కొద్దీ అవి మటుమాయం అవుతాయి. పై రంగు ముదురు ఆకుపచ్చ రంగులో కానీ, లేత బూడిద రంగులో కానీ ఉండవచ్చు. పక్వానికి వచ్చిన కాయలపై తెల్లటి సున్నం పూతలా ఏర్పడుతుంది. ఈ బూడిద పూత వల్లనే ఈ గుమ్మడికాయకి వాడుకలో బూడిద గుమ్మడి కాయ అనే పేరు వచ్చింది. కాయ ఆకారం కూడా గుండ్రంగా కానీ దీర్ఘచతురస్రాకారంలో గానీ ఉంటుంది.

రుచి – ఉపయోగాలు

బూడిదగుమ్మడి కాయ రుచి, దోస కాయ లాగా చాలా చప్పగా ఉంటుది, దానికంటూ ఒక రుచి ఏమీ ఉండదు, కాబట్టి, వేడి ఎక్కువ ఉన్న రోజుల్లో, దానిని సులభంగా అన్ని రకాల సలాడ్స్ లోకి, స్మూథీల్లోకి, ఇంకా జ్యూసుల్లోనూ వాడవచ్చు. చల్లగా ఉన్న రోజుల్లో ఐతే, మీరు తేనే గానీ లేదా నల్ల మిరియాలు గానీ కలిపి తీసుకోవడం వల్ల బూడిద గుమ్మడి కాయలోని సహజసిద్ధమైన శక్తిని పెంచే గుణాన్ని నిలిపి ఉంచుతూనే, చలువ చేసే గుణాన్ని తగ్గించవచ్చు. జీవ శక్తి మరింతగా పెంపొందించుకునేందుకు, బూడిదగుమ్మడి కాయ పచ్చిగానే తినాలి.

 

లభించే ప్రదేశాలు – ఎంచుకోవడం

బూడిదగుమ్మడి భారతదేశం, బంగ్లాదేశ్, దక్షిణ చెన్నై ఇంకా ఆగ్నేయ ఆసియాలోని ఇతర ప్రాంతాలలో విరివిగా పండించబడుతుంది. ఆసియాలో, బూడిదగుమ్మడికాయ మీ స్థానిక మార్కెట్లలో దొరక్క పోవచ్చు, చాలా వరకు నగరాల్లో, చైనీస్ మార్కెట్లలో, భారతీయ మార్కెట్లలో లేదా అంతర్జాతీయ రైతు మార్కెట్లలో అవి

దొరుకుతాయి.

బూడిదగుమ్మడి కాయను కొనేటప్పుడు, కమిలి పోయిన మచ్చలు, గాట్లు లేకుండా ఉన్న కాయలను ఎంచుకోండి. కాయ పరిమాణం కంటే బరువు ఎక్కువ ఉన్నట్టు  అనిపించాలి, పైన ఉపరితలం, తెల్లని బూడిద పూతతో ఉంటుంది. ఈ పొడి హానికరమైనది కాదు, కానీ తడిగా ఉన్నప్పుడు, జిగట స్వభావం పొందుతుంది. కాయని కోసే ముందు ఆ పై పూతని కడిగేయాలి. కాయ లోపలి భాగం  తెల్లగా, బరకగా, చదునుగా ఉండే నిర్మాణంతో ఉంటుంది. కాయని కోయ్యకుండా చల్లని, పొడి ప్రదేశంలో ఉంచితే, నెల లేదా అంతకన్నా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.

బూడిద గుమ్మడి కాయ చరిత్ర

బూడిదగుమ్మడి జపాన్, ఇండోనేషియా, చైనా లేదా ఇండో-మలేషియాలలో పుట్టింది అని వృక్షశాస్త్ర నిపుణులు చూచాయగా చెబుతున్నా, దాని  చారిత్రక మూలాలు, దాని ఖచ్చితమైన మూలాన్ని ఆరా తీయడం కష్టతరం చేశాయి. ఈ ప్రాంతాలన్నిటిలో, బూడిదగుమ్మడి, వేల సంవత్సరాలుగా వినియోగంలో ఉంది.  క్రీ.శ. 5 – 6 శతాబ్దాలకి చెందిన చైనీస్ గ్రంథాల్లో బూడిదగుమ్మడికి ఉండే ఔషధ గుణాల ప్రస్తావన చూడవచ్చు.

భారతీయ సంస్కృతిలో బూడిదగుమ్మడి కాయ యొక్క లక్షణాలు ఇంకా ఉపయోగాలు గురించి సాంప్రదాయ విజ్ఞానం ఏమంటుందో సద్గురు వివరిస్తున్నారు.

సద్గురు: సాంప్రదాయల్లో వారు దీనిని ఎంతో విశిష్టమైన కాయగూరగా చెప్పారు. మీరు కొత్తగా ఇల్లు కట్టుకున్నట్లయితే, మీరు దాన్ని ఇంటి ముందు వ్రేలాడదీస్తారు. మీరు ఏమైనా వేడుక చేయాలన్నా, దానిని ఇంటికి తెచ్చుకుంటారు. సాంప్రదాయకంగా, ఇదెలా పాతుకుపోయింది అంటే, ఒకవేళ మీరు గనుక మీ సొంత ఇంట్లో బూడిదగుమ్మడిని కాయిస్తున్నా, దాన్ని మీరు తినకూడదు. మీరు దానిని ఒక బ్రాహ్మణుడికి దానం చేయాలి. మీరు దానిని బ్రాహ్మణుడికి ఇస్తే, మీకు ఎప్పటికో పుణ్యం వస్తుంది, కానీ ఆయన మాత్రం ఇప్పుడే మంచి ఆహారం తీసుకుంటున్నాడు.

ఒక శూద్రుడైన వాడు బూడిదగుమ్మడిని తినకూడదు. శూద్రుడు బూడిదగుమ్మడి తింటూ కనిపించాడంటే, అతడ్ని చంపేస్తారు, ఎందుకంటే ఒక వ్యక్తి బూడిదగుమ్మడి కాయని తింటే, ఆ వ్యక్తి మెదడు చురుకుగా మారే సామర్థ్యం పెరుగుతుంది. కాబట్టి ఒక శూద్రుడు బూడిద గుమ్మడి కాయను తినేందుకు అనుమతించ కూడదు అనే ఉద్దేశంతో అలా చేశారు. ఈరోజు మీకు అటువంటి సమస్యలు లేవు. ప్రతి ఒక్కరూ తమకి ఏది కావాలంటే అది ఎంచుకుని తినే అవకాశం ఉంది.

సాంప్రదాయంగా, ఈ కాయగూరను అనేక పద్ధతుల్లో వినియోగించేవారు. కొత్తగా కట్టిన ఇళ్ళ ముందు దానిని వ్రేలాడదీయడానికి ఒక కారణం ఏంటంటే, మీరు కొత్తగా కట్టిన భవనంలోకి ప్రవేశించినప్పుడు, కొన్నిసార్లు కొన్ని ప్రతికూల శక్తులు ఆవహించి ఉంటాయి. కాబట్టి బూడిదగుమ్మడి కాయను వేలాడ కట్ట మని వాళ్ళు ప్రజలకి సలహా ఇచ్చారు. ఎందుకంటే అది ఎంతో సానుకూలమైన ప్రకంపనతో ఉండడం వలన, అది ప్రతికూలతను తొలగిస్తుంది. దానిని మీరు మీ లోపలికి తీసుకుంటే మేలు అని నా ఆలోచన. ఇప్పుడు, దానిని ఇంటి ముందర వ్రేలాడ కట్టడానికి బదులు, మీరు దానిని పొట్టలోకి పంపితే, మీ నుండే మంచి ప్రకంపనలు ఉత్పత్తి అయ్యేలా మీరు మారతారు. మీరు ఎక్కడికివెళ్లినా, మీకు అంతా బాగానే ఉంటుంది.

బూడిదగుమ్మడిలోని పోషక విలువలు

బూడిదగుమ్మడిలో 96% ప్రధానంగా నీటితో నిండి ఉంటుంది. అంతేకాకుండా, విటమిన్ C ఇంకా నియాసిన్, థయామిన్, రిబోఫ్లావిన్ వంటి B-కాంప్లెక్స్ విటమిన్లతో సహా వివిధ రకాల ప్రయోజనాలను అందించే విటమిన్స్ ఇంకా మినరల్స్ ను కలిగి ఉంటుంది. ఐరన్, పొటాషియం, జింక్, కాల్షియం మరియు మెగ్నీషియం వంటి మినరల్స్ కూడా బూడిదగుమ్మడిలో విరివిగా లభ్యం అవుతాయి. ఇందులో మంచి మోతాదులో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ ఇంకా పీచు పదార్ధం ఉంటాయి.

బూడిదగుమ్మడి లోని పోషకాల గురించి పూర్తి సమాచారం ఇక్కడ చదవండి.

బూడిదగుమ్మడి ప్రయోజనాలు

నిశితమైన బుద్ధి

సద్గురు: పొద్దున్నే ఒక గ్లాసు బూడిదగుమ్మడి రసం తాగండి. మీరు శరీరంలో ఎంతో చల్లదనాన్ని గమనిస్తారు, అదే సమయంలో అది మీలో చురుకుదనాన్ని తీసుకువస్తుంది. బూడిదగుమ్మడిని రోజూ తీసుకోవడం వలన, అది మీ బుద్ధిపరమైన సామర్థ్యాలను గణనీయంగా మెరుగుపరుస్తుంది. ప్రత్యేకించి పిల్లలు బూడిదగుమ్మడి రసాన్ని తప్పక తాగాలి. మీరు దానిని ఒక వారంరోజుల పాటు తాగితే, మీ మెదడు చురుకుదనంలో స్పష్టమైన మార్పును చూస్తారు. ఇందులో ప్రాణశక్తి అధికంగా ఉంటుంది. ప్రతిరోజూ, పొద్దున్నే మీరు ఒక గ్లాసుడు బూడిదగుమ్మడి రసం తాగితే, అది మీ బుద్ధికి సంబంధించి అద్భుతాలు చేయడం చూస్తారు. మీ బుద్ధి నిశితంగా అవుతుంది ఇంకా వ్యవస్థలో ఏ అలజడి లేకుండా శక్తిని కలిగిస్తుంది. బూడిదగుమ్మడిని రోజూ తాగితే అది మీకు అద్భుతాలను చేస్తుంది.

శక్తిని పెంపొందిస్తుంది

సద్గురు: బూడిద గుమ్మడిని ఆహారంగా తీసుకోవడం వల్ల అపారమైన శక్తిని కలిగిస్తుంది, అదే సమయంలో అది మీ నరాలను శాంత పరుస్తుంది. మీరు కాఫీ తాగితే గనుక, అది మీకు శక్తిని ఇస్తుంది కానీ అలజడిని కలిగిస్తుంది. మీరు ఒక గ్లాసు బూడిదగుమ్మడి కాయ జ్యూస్ తాగితే, అది మీకు అపారమైన శక్తిని ఇస్తుంది, అదే సమయంలో మిమ్మల్ని శాంత పరుస్తుంది.

మలబద్ధకం, మొలలు, వేడి పొక్కులు

 సద్గురు: మీరు కాస్తంత బూడిదగుమ్మడి రసం తీసుకుంటే, అది మీ వ్యవస్థను చల్లబరుస్తుంది. శరీరంలో అధిక వేడి ఉండడం వలన వేడి పొక్కులు, మొలలు(హెమరాయిడ్స్) ఇంకా మలబద్ధకం సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అటువంటి వారికి ఇది మేలు చేస్తుంది.

చల్లదనం విషయంలో జాగ్రత్త

సద్గురు: జలుబు, ఆస్తమా ఇంకా సైనసైటిస్ వంటి సమస్యలకు లోనయ్యే అవకాశం ఉన్నవారు బూడిదగుమ్మడి విషయంలో కాస్తంత జాగ్రత్త వహించాలి. ఎందుకంటే అది వ్యవస్థలో చాలా అధికంగా శీతా లేదా చల్లదననం కలిగిస్తుంది. అటువంటి వారు దానిని తేనె లేదా మిరియాలతో కలిపి తాగాలి. అందువల్ల చల్లదనం ప్రభావం కొంతవరకూ తటస్థీకరించవచ్చు.

శాస్త్రీయ అధ్యయనాలు కూడా బూడిదగుమ్మడి వల్ల అదనంగా కలిగే ఆరోగ్యం ప్రయోజనాలను కూడా శాస్త్రీయ  అధ్యయనాలు వెల్లడించాయి

జాబితా

 • 2001 లో ‘జర్నల్ ఆఫ్ ఇథనో ఫార్మకాలజీ’ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, బూడిదగుమ్మడి సారాన్ని ఎలుకలపై పరీక్షించగా, అది అల్సర్లు(కడుపులో పుండ్లు) ఏర్పడడాన్ని నిరోధిస్తుంది అని, ఆ సారం విషపూరితం కాదని కూడా తెలిసింది.
 • 2005 లో కూడా ‘జర్నల్ ఆఫ్ ఇథనో ఫార్మకాలజీ’ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, బూడిదగుమ్మడి విత్తనాల సారం, యాంటీ- యాంజియోజెనిక్ (రక్తనాళాలు అదనంగా పెరగడాన్ని నిర్మూలించడం) లక్షణాలను కనబరుస్తుంది. సులభంగా చెప్పాలంటే, వాటిని లోపలికి తీసుకోవడం వల్ల, అవి కాన్సర్ గడ్డలకు అవసరమైన రక్త సరఫరాను నిరోధించాయి.
 • ఫిటోతెరపియ 2000లో ప్రచురించిన ప్రాధమిక అధ్యయనం ప్రకారం, బూడిదగుమ్మడి రసం, ఎలుకల్లో మార్ఫీను విత్డ్రా సింప్టమ్స్ ను గణనీయంగా తగ్గించింది. అందువల్ల ఓపియాయిడ్ వ్యసనం(opioid addiction) ఉన్న రోగులకు చికిత్స చేసే సామర్థ్యాన్ని ఈ జ్యూస్ కలిగి ఉంది.
 • 1995లో జియాంగ్సు జర్నల్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ ప్రచురించిన అధ్యయనంలో, మూత్రపిండాలు దెబ్బతిన్న ఎలుకల పై పరీక్షించగా, బూడిద గుమ్మడిలోని పదార్థాలను, మూత్ర పిండాలకు గొప్ప సంరక్షణగా వివరించినట్టు కనుగొనబడింది.
 • ఇరానియన్ జర్నల్ ఆఫ్ ఫార్మకాలజీ అండ్ థెరాపాటిక్స్ 2005లో జరిపిన అధ్యయనాన్ని ప్రచురించగా,  అందులో బూడిద గుమ్మడి సాంప్రదాయకమైన యాంటీ-డయేరియల్ ఏజెంట్ గా ధృవీకరించింది.
 • ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫార్మకాలజీ 2010 లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, బూడిద గుమ్మడి విత్తనాల నుండి తీసిన మెథనోలిక్ సారానికి వాపులు, నొప్పులను నివారించే సామర్థ్యం ఉందని తెలిసింది.
 • 2003లో కొరియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ వెల్లడించిన అధ్యయనం, సాంప్రదాయక యాంటీ –డయాబెటిక్ (మధుమేహ నివారిణి) ఏజెంట్ గా బూడిద గుమ్మడి ఉపయోగాలను నిర్ధారించింది: ఎలుకలపై ప్రయోగించగా, బూడిద గుమ్మడి పొడి, గ్లూకోజ్, ఇన్సులిన్, కొలెస్ట్రాల్, ఫ్రీ – ఫాటీ యాసిడ్ ఇంకా HDL – కొలెస్టరాల్ స్థాయిలపై సానుకూల ప్రభావం చూపింది.
 • ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫార్మకాలజీ 2003 లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, బూడిద గుమ్మడి సారం, ఎలుకల్లో యాంటీ-డిప్రెసెంట్ చర్యలను వెల్లడించింది.

బూడిద గుమ్మడితో వంటకాలు

బూడిద గుమ్మడి రసం

https://www.youtube.com/watch?v=2CHtmprcnPc

కావలసిన పదార్థాలు

 • బూడిద గుమ్మడి కాయ, 4-5 అంగుళాల పరిమాణం ఉన్నది -1
 • నిమ్మరసం – 6 టీ స్పూన్లు
 • నల్ల మిరియాల పొడి – 3 టీ స్పూన్లు
 • ఉప్పు – 3 టీ స్పూన్లు

తయారు చేసే విధానం

 • బూడిద గుమ్మడి కాయని కోసి, చెక్కు, గింజలు తీసేయాలి
 • మిక్సర్ లో వేసి మెత్తని పేస్ట్ లా చేయాలి
 • రసాన్ని వడగట్టుకోవాలి
 • అందులో నిమ్మరసం, నల్ల మిరియాల పొడి ఇంకా ఉప్పు కలపాలి

బూడిద గుమ్మడి – పుచ్చకాయ స్మూథీ

బూడిద గుమ్మడి కాయని, పుచ్చకాయని సమ పాళ్ళలో తీసుకుని మిక్సర్ లో వేసి, దానికి నీరు లేదా పెరుగు ఇంకా రుచి కోసం తేనె లేదా అగావే సిరప్ (కిత్తలి మకరందం) కలిపి గ్రైండ్ చేసుకోవాలి.

బూడిద గుమ్మడి రైతా (పెరుగు పచ్చడి)

బూడిద గుమ్మడిని తురుము పట్టుకోని, దానితో పెరుగును కలుపుకోవాలి. అందులో నిమ్మరసం, ఉప్పు, నల్ల మిరియాలు  కలిపి, దానిపై వేయించిన జీలకర్రను చల్లుకోవాలి. (ఈ రైతా ఘాటుగా ఉండే ఏ భారతదేశపు వంటకం లేదా మెక్సికన్ వంటకంతోనైనా వడ్డించుకోవడానికి బాగుటుంది)

చలువ చేసే నిమ్మ – బూడిద గుమ్మడి రసం

2-3 కప్పుల బూడిద గుమ్మడిని మిక్సీలో వేసి రసం తీసుకోవాలి. దానికి తాజా నిమ్మరసం ఇంకా రుచి కోసం ఉప్పు కలపాలి. తాజా సువాసన కోసం పుదీనా లేదా కొత్తిమీర కలపాలి.

బూడిద గుమ్మడి హల్వా

బూడిదగుమ్మడి రసంతో ఆరోగ్యాన్ని ఇంకా శక్తిని పెంపొందించుకున్న ‘ఎమర్జన్సీ రూమ్’ లో పనిచేసే నర్స్ కథ.

లాస్ ఏంజిల్స్ లో నివాసం ఉంటున్న జెన్నిఫర్ కార్ల్సన్, ఇన్నర్ ఇంజినీరింగ్ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల, ఏ ఉత్ప్రేరకాలు లేకుండానే, ఆరోగ్యకరమైన పద్ధతిలో తన శక్తిని పెంపొందించే కొన్ని అరుదైన యోగిక వంటకాలను నేర్చుకున్నారు. కార్యక్రమంలో ఆమె నేర్చుకున్న శాంభవీ మహా ముద్ర క్రియను రోజువారీ సాధన చేయడంతో పాటుగా, ఈ సులభమైన వంటకాలు ఆమె ఆరోగ్యాన్ని హరించి వేస్తూ తీవ్ర సమస్యగా  మారిన కెఫీన్-డిపెండెన్సీ (కెఫీన్ పై ఆధారపడవలసి రావడం)ని దూరం చేయడంలో సహాయపడ్డ్డాయి.  ధ్యానంతో పాటు ఆహారంలో వీటిని భాగం చేసుకోవడం వల్ల, రోజంతా గొప్ప శక్తితో కొనసాగేందుకు ప్రత్యామ్నాయాన్ని ఏర్పరచగలవు.

“నా రోజువారీ ధ్యానంతో పాటు, ఈ ఒక్క దానిని ఆహారంలో చేర్చుకోవడం, నా ఒడుదుడుకుల అనారోగ్య వలయాన్ని ఛేదించేలా నాకు ఊతాన్ని ఇచ్చింది.”

“నేను రాత్రి వేళలో పనిచేసే ఒక నర్స్ ను, అంటే నేను రాత్రి పొడవునా 12 గంటల పాటు పనిచేస్తాను. అత్యవసర గది పరిస్థితిలో, ప్రతీ క్షణం ఎవరిదో జీవితం నా చురుకుదనంపై ఆధారపడి ఉంటుంది.” అని జెన్నిఫర్ నొక్కి చెప్పారు. “ప్రభావవంతంగా పని చేయడానికి నేను నా పని సమయమంతా కూడా కాఫీ ఇంకా సోడా తాగేదానిని. నేను ఇంటికి చేరేసరికి, పూర్తి అలసటగా, నిస్సత్తువగా ఇంకా ఆందోళనగా ఉండేది. నేను    కడుపు నిండేట్లుగా ఏదైనా సులువుగా అరగని వాటిని తిని కొన్ని గంటల పాటు నిద్రించే దాన్ని. రోజూ ఇదే చట్రంలో కొనసాగించేదాన్ని. రాత్రి సమయాల్లో పని వల్ల నా శరీరంపై అంతటి భారం పడుతుంది. మానసికంగా కూడా, నేను నిరుత్సాహ భావనతో ఉండేదానిని. నాకు తెలుసు, ఇలా నేను ఎక్కువ కాలం కొనసాగలేనని. కానీ నేను నా పనికి విలువ ఇస్తాను.”

అప్పుడు, జెన్నిఫర్, ఇన్నర్ ఇంజినీరింగ్ కార్యక్రమంలో నేర్చుకున్న ఒక ఆహార చిట్కాను గుర్తు చేసుకుంది. “బూడిద గుమ్మడికాయ శరీర వ్యవస్థను సహజంగానే చల్లబరిచి, కెఫీన్ లేదా ఇతర ఉత్ప్రేరకాలు అవసరం లేకుండానే సహజ శక్తిని అందిస్తుంది అని సద్గురు చెప్పారు”. కాఫీకి ఏదైనా వేరే ప్రత్యామ్నాయం కోసం ఆశగా ప్రయత్నిస్తున్న ఆమె, దీనిని ప్రయత్నించింది. “అది బ్రహ్మాండంగా పనిచేసింది. నాకు గొప్ప శక్తి, చురుకుదనం కలిగినట్టు అనుభూతి చెందాను. కెఫీన్ మాదిరిగా ఆందోళన, గాబరా లేదా కలత ఏ మాత్రమూ లేదు. ఆ తరువాత ‘కూల బడడం’ అనేది లేదు. అది నాకు నిజంగా ఆరోగ్యం చేకూరిన భావనను కలిగించిందే తప్ప పేగుల్లో గడబిడను కాదు.”

“నా రోజువారీ ధ్యానంతో పాటు, ఈ ఒక్క దానిని ఆహారంలో చేర్చుకోవడం అనేది నా ఒడుదుడుకులతో కూడిన అనారోగ్య వలయాన్ని ఛేదించేలా నాకు ఊతాన్ని ఇచ్చింది. నేను పని చేస్తున్నప్పుడు, రాత్రంతా శక్తి నిలిచి ఉండేందుకు నిత్యం 2-3 గ్లాసులు బూడిద గుమ్మడి రసాన్ని తాగుతాను, నా పని సమయం ముగియగానే, విశ్రాంతి కోసం ఇంకా నా వ్యవస్థను పునరుత్తేజితం చేసుకునేందుకు 20 నిమిషాలు ధ్యానానికి కూర్చుంటాను.” అని జెన్నిఫర్ వివరించారు. “నా శాంభవీ మహాముద్ర సాధన కూడా నా నిద్ర మోతాదును బాగా తగ్గించింది. అందువల్ల నేను ఇప్పుడు ఇంటికి చేరుకున్నాక, ఆరోగ్యకరమైన ఆహారం తిని, 5-6 గంటలు నిద్రిస్తాను.” ఒక్క మాటలో, జీవన విధానానికి సంబంధించిన ఈ సులభమైన చిట్కాలు, తన పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక వారితో సమయం గడపటంతో పాటు, ఆమె మళ్ళీ పనికి వెళ్ళే ముందే వాళ్లకి డిన్నర్ (రాత్రి భోజనం) తయారుచేసే అవకాశాన్ని కల్పించాయి.