సాధన ఇంకా సరదా ఒకే వాక్యానికి చెందిన రెండు పదాలు అనిపించకపోవచ్చు. "ఆధ్యాత్మిక సాధన" అనే పదం తరచూ మనకి, చుట్టూ ఉన్న ప్రపంచం గురించి ఎటుంటి ఆసక్తి ఇంకా లావాదేవీలు లేకుండా, నడుము చుట్టూ ఓ అంగ వస్త్రం చుట్టుకుని, శరీరాన్ని విరిచేసే భంగిమలలో ఉండే సన్యాసుల చిత్రాలను జ్ఞాపకానికి తెస్తుంది. సాధనపాదలో దాదాపు రెండు నెలలు గడిచిన తరువాత, పాల్గొంటున్నవారు అది అపోహ అని తెలుసుకున్నారని, మనం నిస్సందేహంగా చెప్పవచ్చు.

జీవితంతో లోతైన నిమగ్నతను తీసుకురావడానికే సాధన. దీన్ని అనేక విధాలుగా పెంపొందించవచ్చు, కానీ వేడుకలు ఇంకా ఆటలు అనేవి అత్యంత సరదాతో కూడిన విధానాలు!

పండుగలలో పాల్గొనడం చాలా సులభం

“నేను ఆశ్రమంలో ఉన్న మొదటి కొన్ని వారాలు, నా దుస్తులు మాసిపోతూ ఉండేవి. ఇంక నాకు కోపమొచ్చేది, ఎందుకంటే నేను వాటిని ఉతికిన ప్రతిసారీ, రెండు గంటల తరువాత మళ్ళీ అవి మురికి అయిపోయేవి! అదలా ఉండగా మేము ఒక వేడుక కోసం ఆట స్థలాలలోకి వెళ్ళాము, యదావిధిగా నిండుగా మురికి అయ్యింది. నేను ఆ వేడుకను పూర్తిగా ఆనందించాను, ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆనందంగా పాల్గొంటున్నారు, దాంతో అందులో నిమగ్నమవ్వడం ఎంతో సులభం అయ్యింది. ఈ రోజు నిజానికి నేను నా చొక్కాను బాగా ఉతకడానికి ప్రయత్నించాను, కాని నేను దానిని చూసినప్పుడు, ఇంకా దాని నిండా మురికి ఉంది. నేను నవ్వుకుని, "ఓహ్, నువ్వేమి చేయగలవు?" అనుకున్నాను - బారన్, 35, మెల్బోర్న్, ఆస్ట్రేలియా 

నవరాత్రి - సాంస్కృతిక విందు

2010 లో సద్గురుచే ప్రతిష్ట చేయబడిన, లింగ భైరవి ఒక శక్తివంతమైన, ఇంకా ఉగ్రమైన స్త్రీ రూపం. వైభవాన్నీ, శ్రేయస్సుని ఇచ్చే వనరు. దేవి యొక్క సమక్షం ఆశ్రమ జీవితంలోని ప్రతి అంశానికి ఒక రంగుల వెదజల్లును జోడించింది.

పవిత్రమైన ఇంకా ఆధ్యాత్మికంగా ముఖ్యమైన నవరాత్రి సమయంలో, ‘లింగ భైరవి వద్ద నవరాత్రి సాధన’ అనేది ప్రత్యేకంగా రూపొందించబడిన ప్రక్రియ, ఇది ఒకరు భైరవి కృపకు పాత్రులయ్యేలా చేస్తుంది. ఈ తొమ్మిది రోజులు, సాధనపాదాలో పాల్గొంటున్న వారిలో చాలా మందికి, పెద్ద ఎత్తున జరిగే ఆశ్రమ వేడుకలలో పాల్గొనడం అనేది మొదటి సారి. పండుగతో “ప్రాణం ఉత్తేజ పరచబడింది ” అంటూ చాలా మంది తమ అనుభవాన్ని పంచుకున్నారు.

దేవి మత్తులో

“నవరాత్రి మొదటి రోజున, ఆశ్రమంలో మొత్తం అందరూ దేవి ఎర్ర శాలువాలను ధరించినట్లు అనిపించింది. ఉత్సాహం, సాధారణంగా ఈశా నిర్వహించే ఏ కార్యక్రమంలోనైనా జరిగినట్టే, విద్యుత్తులా, ఆకాశాన్ని తాకింది. సూర్యకుండంలో సుదీర్ఘంగా మునక వేసిన తరువాత, సాయంత్రం అవుతూ ఉండడంతో, మేము లింగ భైరవి వైపు త్వర త్వరగా వెళ్ళాము. ఆ ప్రదేశం, బియ్యం, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు ఇంకా అనేక ఇతర సమర్పణలతో, నేను ఊహించలేనంత వైభవంగా అలంకరించబడింది. సంగీతకారులు ఒకరినొకరు హావభావాలతో సంకేతాలు ఇస్తూ, సాయంత్రం జరిగే సమ్మేళనానికి సిద్ధమవుతూ ఉన్నారు. మేము స్థిరపడుతూ ఉండగా, గజ్జల శబ్దాలు నృత్యకారుల రాకను తెలిపాయి.

చివరికి మూయబడి ఉన్న కర్టెన్లను తెరిచారు, ఇదిగో! అన్ని వేడుకలను మించి, భైరవి దేవి తన నివాసం యొక్క ఆవలి చివరన, గొప్పగా, గంభీరంగా నిలిచి ఉంది. అనేకమైన ఆమె చేతులు, అన్ని గాజులతో అలంకరించబడ్డాయి. సాధారణంగా కటిక నీలం రంగులో ఉండే తన శరీరం ఒక ప్రకాశవంతమైన ఎరుపు రంగులో అద్దబడి ఉంది. ఆమె తన అసలు రూపాన్ని చూపినట్లు అనిపించింది. నవరాత్రి సాధన ఇంకా ఇంకా పెరుగుతూ ఉన్న తీవ్రతతో పురోగమిస్తూ, చివర్లో దేవి ఆరతితో ముగిసింది. నేను బయలుదేరడానికి లేచినప్పుడు, నేను పూర్తిగా మత్తులో మునిగిపోయి ఉన్నాను. ” - సౌరాక్, 22, మహారాష్ట్ర, భారతదేశం

గర్బా వేషంలో

నవరాత్రులలో సాంప్రదాయ గుజరాతీ నృత్యం అయిన ‘గర్బా నృత్యం’ పూర్తి ఉత్సాహంతో నిర్వహించబడింది, సాధనపాదాలో ఉన్నవారు ఈ సంబరాలలో పాలుపంచుకునే విషయంలో ఏమాత్రం సమయం వృధా చేయలేదు. అక్టోబర్ 4 న, గర్బా నృత్యంలోని స్టెప్పులను నేర్చుకొని, ఆ సాయంత్రమంతా నృత్యం చేసేందుకు, అందరూ రంగు రంగుల దుస్తులు ధరించిన, ఉప్పొంగుతున్న ఒక సమూహంలా వచ్చారు.

ఏ కార్యకలాపాలలో అయినా, ‘పరిత్యజ భావముతో పూర్తిగా నిమగ్నం అవ్వడాన్ని’ నేర్చుకోవడం అనేది ఆశ్రమ నివాసంలోని కీలక అంశం, ఇంకా ఈ విషయంలో, గర్బా నృత్యం ఆడడం అనేది మినహాయింపు కాదు. నృత్యం అనేది ఒకరికి చురుకుగా ఉండడాన్ని ఇంకా నిమగ్నమవడాన్ని నేర్పిస్తుంది, తద్వారా ఆధ్యాత్మిక ప్రక్రియలో పరిత్యజ భావముతో పయినించేలా సహాయపడుతుంది.

వేడుకలలో నాకు ఇష్టమైన భాగం

“స్వామీలు ఇక్కడ డ్రమ్స్ వాయించినప్పుడు, అవి మా ఇంటిని గుర్తు చేశాయి. అది దాదాపు ఆఫ్రికన్ బీట్’ లా ఉంటుంది. నిజానికీ వేడుకలలో, ఇది నాకు ఇష్టమైన భాగం. ప్రజలు అలా చిందులు వేయడం ప్రారంభించగానే, నేను మనసులో, 'అవును! ఇదే!' అనుకుంటాను. ఈ అంశం నాకెంతో నచ్చింది ” - సిబుసిసో, 24, దక్షిణాఫ్రికా

నాకు ఎలా నృత్యం చేయాలో కూడా తెలియదు ...

నేను తొమ్మిది రోజుల నవరాత్రిని జరుపుకోవడం ఇదే మొదటిసారి, ఇంకా ఈ వేడుకలోని ప్రతి అంశాన్ని నేను పూర్తిగా ఆనందిస్తున్నాను. మొదటి రోజున జానపద సంగీతంకి నాట్యం చేయకుండా ఉండలేకపోయాను. శాస్త్రీయ నృత్యం ఇంకా సంగీతాన్ని నేను ఆనందిస్తానని ఎప్పుడూ ఊహించలేదు. నాకు డ్యాన్స్ ఎలా చేయాలో అస్సలు తెలియదు, కానీ ప్రతి రాత్రి నేను గర్బా నృత్యంలో పాల్గొనడానికి ఆదియోగి ఆలయం వద్దకు వెళ్తాను. ” - ఎలిజా, 38, ఒడిశా, ఇండియా

నా ఉదయం సాధనలో రాజీ లేదు

“నేను అన్ని ప్రక్రియలలో పూర్తిగా పాల్గొంటూ ఉన్నాను. ప్రతి రాత్రి గర్బా నృత్యంతో సహా! ఆ అనుభవం చాలా ఆనందంగానూ, అలసటగానూ, ఒత్తిడిగానూ ఉంది, ఇంకా ఈ మొత్తం ప్రక్రియలో కొన్ని నేర్చుకున్న విషయాలు కూడా ఉన్నాయి. నేను దానిలో పూర్తిగా నిమగ్నమయ్యాను, అదే సమయంలో, రోజువారీ అలసటను, నా ఉదయం సాధన విషయంలో రాజీ పడేలా చేయడానికి, అనుమతించలేదు. ఇదొక విజయంలా అనిపిస్తుంది! ” - షీతల్, 42, ఉత్తర ప్రదేశ్, భారతదేశం

సద్గురు జయంతి

“సద్గురు జయంతి నాడు, నేను బిక్షా హాల్లో సేవ చేస్తూ ఉన్నాను, ఇంకా భోజనానికి 3000 మంది రావచ్చని ఆశిస్తున్నాము అన్న మాట విన్నప్పుడు నేను సంతోషించాను. మొదట్లో నేను కొంచెం ఆకలితో మైసూర్ పాక్ వైపు, ఇంకా వడ్డించబోయే రకరకాల వంటకాల వైపు చుస్తూ ఉన్నాను, అవి నాలో మరింత ఆకలిని కలిగించాయి! కానీ, ప్రజలు లోపలికి రావడాన్ని చూడగానే, ఇంకా సేవ చేయడం ప్రారంభించగానే, నాకు వారి ఆకలి ప్రధానం అయ్యింది, అప్పుడు నేను సంతోషంగా సేవ చేసాను. ఇది నా సొంత కుటుంబానికి, స్నేహితులకు సేవ చేయడం మాదిరిగానే అనిపించింది. నేను సేవ చేసిన ‘ట్రీ కేర్’ లోని స్త్రీలు - అందరూ చక్కని దుస్తులు ధరించి భోజాననికి రావడాన్ని చూసినప్పుడు, ఆనందంగా వారికి వడ్డించడం అనేది నేను జీవితాంతం భద్రపరుచుకునే క్షణం. ” - చైత్ర, 24, కర్ణాటక, ఇండియా

యోగా, సరదాగా

మనం సరదాగా జీవించడం మొదలు పెట్టిన మరుక్షణం, స్వయంగా సృష్టించుకున్న అడ్డు గోడలను విడిచిపెట్టడం అనేది సహజంగా, సునాయాసంగా జరుగుతుంది. సరదాగా నిమగ్నమవ్వడానికి ఒక చక్కటి నిదర్శనం కృష్ణుడు. కాబట్టి మేము అతని పుట్టినరోజును అదే ఆనందం ఇంకా చురుకుదనంతో జరుపుకోవడం అనేది సమంజసమే.  

కృష్ణుని తియ్యదనం

కృష్ణ జన్మాష్టమి నాకు ఒక ప్రత్యేకమైన రోజు, ఎందుకంటే నేను 'కృష్ణ' అనే పేరు విన్నప్పుడల్లా నాలో కలిగే ఈ తియ్యని అనుభూతి, సువాసన వెదజల్లే చల్లని గాలిలా వీచింది. నేను మరింతగా ఉల్లాసభరితమైన విధానంలో వ్యవహరించాల్సింది, మరీ ముఖ్యంగా నేను అధికంగా ప్రతిఘటించే విషయాలతో లేదా సవాలుగా భావించే విషయాలతోనే, అని గమనించాను.” - మికస్, 32, రిగా, లాట్వియా

అన్నిటినీ వదిలేసి డాన్సు చేశాను

“కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఎంతో అందంగా ఉన్నాయి. ఆటలు నా భావాలను వ్యక్తపరిచేలా చేశాయి, అవి నన్ను ఈ క్షణంలో ఉండేలా చేశాయి, చిన్న పిల్లాడిలా కడుపు చెక్కలయ్యేలా నవ్వాను. ఆ సంబరాలలో, ఆటల సమయంలో నాలోని అమాయకత్వాన్ని అనుభవించగలిగాను. నేను ఇంతకు ముందెన్నడూ చేయని విధంగా పూర్తిగా మైమరిచిపోయి నృత్యం చేయగలిగాను. ఒక చిన్న పిల్లవాడి లాంటి ఉల్లాసాన్ని నాలో తీసుకురాగలిగాను.” - టినాలి, 31, మహారాష్ట్ర, ఇండియా

ఆటలు-ఈశా సమగ్ర భాగం

సద్గురు నిర్వహించిన మొట్టమొదటి యోగా కార్యక్రమం నుండి ఇప్పటివరకు, ఈశాలో ఆటలు ఒక అంతర్భాగంగా ఉన్నాయి. అడ్డంకులను విచ్ఛిన్నం చేసి ప్రజలను ఆనందంగా కలిసిపోయేలా చేయడానికి ఇది ఒక చక్కటి మార్గం, ఒక చిన్న ఆట కూడా ఒకరిని శక్తివంతంగా ఇంకా ఉత్సాహంగా చేస్తుంది. పూర్తి నిమగ్నత లేకపోతే ఆట ఆడటం అనేది సాధ్యం కాదు!

పూర్తి నిమగ్నత నా మనసుని నిశ్చలంగా చేసింది

“నలంద మైదానంలో ఆటలు ఆడటం అనేది మనం చిన్నప్పుడు ఎలా ఆడుకునేవాళ్ళమో, చీకూ చింతా లేకుండా ఎంత హాయిగా ఉండేవాళ్ళమో అనే విషయాన్ని నాకు గుర్తు చేసింది. పరుగుల ఆటలను నేను నిజంగా ఆనందించాను - ఖో-ఖో ఇంకా చైన్-చైన్ - ఇది నన్ను తరువాతి పనికి మరింత చురుకుగా, తాజాగా చేసింది. నేను పూర్తిగా నిమగ్నమయ్యాను, నేను ఆడుతున్న సమయంలో నా మనస్సులో మరేదీ లేదు. అక్కడున్న వారిలో ఎవరూ కూడా దీనికన్నా తక్కువ నిమగ్నతతో ఉండి ఉంటారని నేను అనుకోను. కొందరు ఆడకపోయినప్పటికీ, వారు మమ్మల్ని ప్రోత్సహిస్తూ, మాతో కలిసి ఆనందించేంత ఉత్తేజంతో ఉన్నారు. ” - పూర్ణిమ, 30, కర్ణాటక, భారతదేశం 

డమరు సేవా

ప్రజలు తమ ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించడానికి ఆశ్రమానికి వస్తారు, ఇదే కలిసి పని చేయడానికి తాజాదనాన్ని కలిగించే ఒక భిన్నమైన వాతావరణాన్ని నెలకొల్పుతుంది. ఒక కార్పొరేట్ కార్యాలయాలలోలా ఒకరి విలువను వారి ఉత్పాదకత ఇంకా ఉత్పత్తి ద్వారా కొలవడం కాకుండా, ఈ స్థలంలో, ఒకరిని స్పృహతో ఉండటానికి ఇంకా ‘సేవ’ను తమను తాము అర్పించుకునేందుకు ఒక మార్గంగా ఉపయోగించుకునేందుకు ప్రోత్సహిస్తారు.

కానీ మీరు సేవలోని ఒకే పనిలో తలమునకలవుతూ ఉనప్పుడు, డ్రమ్స్ ఇంకా జింగిల్స్తో సంగీతకారుల ఉల్లాస బృందం, మిమ్మల్ని ఉత్తేజ పరచడానికి, ఇంకా మీరు చేస్తున్న పనిలో ఏదైనా ఒకే రీతిగా ఉంటూ బోర్ ని కలిగిస్తే, దాన్ని పోగొట్టడానికి - డమరు సేవ చేస్తూ – వస్తుంది.

మరొక వర్క్స్పేస్ మాత్రమే కాదు

“నేను సేవ చేసే చోటున, ప్రత్యక్షంగా వాయిస్తున్న డ్రమ్ముల శబ్దాన్ని విన్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. వారు రోజూ సరైన సమయంలో వస్తారు, నా మూడ్ ని తేలికపరుస్తారు, ఇంకా నా మధ్యాహ్న బద్ధకం నుండి నన్ను మేల్కొల్పుతారు. ఇది నాకు, ప్రతిదాన్ని చచ్చేంత తీవ్రంగా పరిగణించకూడదని గుర్తు చేస్తుంది. అలాగే, సహజంగా మా టీంలో అందరూ కూడా ఉత్తేజం పొందడాన్ని నేను గమనించాను. ఇది ప్రతి కార్యాలయంలో ఒక భాగంగా ఉండాలి.” - హర్లూవ్లీన్, 28, అంటారియో, కెనడా

విభిన్న రకమైన వేడుకలు

ఆశ్రమంలో వేడుకలు ఇంటి దగ్గర వేడుకల కంటే భిన్నంగా ఉంటాయి. సాంస్కృతిక వ్యత్యాసం అనేది ఇక్కడ ఒక పెద్ద అంశం అని నేను గుర్తించాను. పాశ్చాత్య ప్రపంచంలో ఇంటి దగ్గర, అందరూ పార్టీలో వ్యక్తిగతంగా, వేరు వేరుగా ఉండిపోతారు, ఎల్లప్పుడూ ఆహారం ఇంకా మద్యం ఉండాల్సిందే. ప్రతి ఒక్కరూ తమకు తెలిసిన ఆ కొద్ది పాటి మంది ఉన్న గుంపులోకి వెళ్తారు - 'నాకు ఈ వ్యక్తులు తెలుసు, నేను వారితో మాట్లాడతాను ఇంకా వారితో ఉంటాను, ఆ వ్యక్తులతో మాట్లాడను – ఇలా ఉంటారు.' ఇక్కడ ఆశ్రమంలో అలా కాదు, ప్రతి ఒక్కరూ కలిసి వచ్చి ఒక ఆనందకరమైన ప్రవాహంగా కలిసిపోతారు. ”- బారన్

పూర్ణిమా నైట్ మ్యూజిక్ సెషన్

ప్రతి పూర్ణిమ రాత్రి, లైట్లు ఆపివేయబడతాయి, కాబట్టి ప్రతి ఒక్కరూ బయటికి వెళ్లి పౌర్ణమి రోజు చల్లని వెన్నెలను ఆస్వాదిస్తారు. మరోవైపు ధ్యానలింగ ముందర పెద్ద ఎత్తున లింగ భైరవి మహా ఆరతి జరుగుతుంది, ఇంకొంచం రాత్రయ్యాక సౌండ్స్ ఆఫ్ ఈశా వారి సంగీత కచేరీ, పండుగ స్ఫూర్తిని మరింతగా పెంచుతుంది.

సాధనపాద 2018 లో పాల్గొన్న స్టీవెన్, ఈ నెలవారీ పండుగ గురించి తన ప్రియమైన జ్ఞాపకాలను ఇలా పంచుకుంటున్నాడు: సాధనపాదలో ఉన్నప్పుడు, నేను పూర్ణిమ రోజులను నిజంగా ఆనందించాను. ప్రతి పౌర్ణమి రోజున, అందరం కలిసి వచ్చి బయటి మైదానంలో ఆహారం తినేవాళ్ళం ఇంకా ఊరేగింపు ఉండేది, అందులో అద్భుతమైన ఫైర్ డ్యాన్స్ కూడా ఉంటుంది. అది చాలా అద్భుతంగా ఉండేది "!-Stevan, 22,జర్మనీ