స్వామి నిర్విచార - తర్కానికి అతీతం

స్వామి నిర్విచార: మళ్లీ సోమవారం వచ్చేసింది. ఇది నా సెలవు రోజు. నా జీవితం నన్ను ఎటు తీసుకు వెళుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఆలోచనలను, భావాలను గంటల తరబడి పేనుతున్నాను. కానీ నాకు ఏ సమాధానం దొరకలేదు. నాకు ఇప్పటికీ గుర్తు ఉంది, ఇది 1990 లో జరిగింది. జీవితం చాలా సజావుగా సాగుతోంది - మంచి భోజనం, సినిమాలు, సాహస కృత్యాలు - కానీ నాలో ఏదో భరించలేని అసంతృప్తి. నేను విచిత్రమైన వాటినెన్నిటినో ప్రయత్నించేవాడిని, నన్ను సంతృప్తి పరచుకోవడానికి. ఒకరోజున ఏ కారణం లేకుండానే, నేను నా ఉద్యోగానికి రాజీనామా చేశాను. కానీ ఉద్యోగాన్ని వదిలేయడ మన్నది నా పరిస్థితిలో ఎటువంటి మార్పు తీసుకొని రాలేదు. మరో రెండు ఉద్యోగాలు వదిలేయడం, మా నాన్నగారితో కొన్నికొట్లాటలు, ఇంకా నాలో ఎన్నో భావావేశాలు. మా అమ్మ నన్ను ఈశా యోగ కార్యక్రమం చేయమని ఏప్రిల్ 1994లో బలవంతం చేయడానికి ముందు వీటన్నిటినీ ఎదుర్కోవలసి వచ్చింది. ఆ తరువాత నుంచి, ఇక అన్ని సద్దుమణిగి పోయాయి - లేదా ఎప్పటికీ సద్దుమణగలేదనవచ్చు.

ఆ క్లాసు అయిపోయిన తరువాతి నుండి నేను ప్రతి ఆదివారం తమిళనాడు లో జరుగుతున్న క్లాసులకు వాలంటీరింగ్ చేయడం మొదలు పెట్టాను. నేను 90 రోజులు జరిగిన హోల్ నెస్ ప్రోగ్రాం కు వాలంటీరింగ్ చేద్దామని వచ్చాను, ఒక వారం రోజులు ఉందామన్న ఉద్దేశంతో - కానీ నేను దాదాపుగా ఆ ప్రోగ్రామ్ ముగిసే వరకు ఉన్నాను. ఆ సమయంలో సద్గురు చూపించిన ఆధ్యాత్మిక కోణాలు, ఒక సాధారణమైన వ్యక్తి నిర్వికల్ప సమాధి స్థితికి చేరుకోవడం,(మహాసమాధి చెరుకోవడానికి ముందుగా చేరుకోగల అత్యుత్తమ సమాధి స్థాయి ) ఆశ్రమంలో ఉన్న తీక్ష్ణమైన ఏకాంతం ఈనాటికీ నాకున్న జ్ఞాపకాల్లోకెల్లా ఉత్తమమైనవి.

సద్గురుతో ఉండాలన్న రగులుతున్న కోరికతోనే, హోల్ నెస్ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత నేను ఆశ్రమం వదిలాను.. డిసెంబర్ 1994లో సద్గురు బ్రహ్మచర్యానికి అప్లికేషన్లు ఆహ్వానించారని విన్నాను. ఆ మార్గం గురించి నాకు అప్పుడు ఏమీ తెలియదు, కానీ సద్గురు పక్కన ఉండవచ్చనని నేను దానికి నమోదు చేశాను. మరొక ఏడుగురితో పాటుగా 27 ఫిబ్రవరి 1995 మహాశివరాత్రి రోజున నాకు బ్రహ్మచర్య దీక్ష ఇచ్చారు. ఆనాటి నుండి ఈశాలో మహోన్నతమైన సాంప్రదాయపరమైన బ్రహ్మచర్య మార్గం మొదలైంది.

కష్టమైన పనులు తో సరదాగా గడిచిన రోజులు

ఆశ్రమంలో ఉన్న జీవనశైలి అనుసరించడం నాకు ఏ మాత్రం కష్టంగా అనిపించలేదు - ఆ రోజుల్లో మాకు ఎటువంటి వసతులు లేక పోయినా మేము ఎంతో సరదాగా గడిపాము. మేము కొద్దిమందిమీ, పాటి అద్భుతంగా వంట చేసేవారు, ఖచ్చితంగా చేయవలసిన పనులు ఉండేవి కాదు, రోజు సెలయేటిలో మట్టితో స్నానం, అడవిలో నడవడం, బావిలో ఈత కొట్టడం, ఆదివారం నాడు క్రికెట్ ఆడడం, చెట్లకూ, మొక్కలకు నీళ్లు పోయడం, మరి కొందరితో కలిసి సాధనకు ఒక చిన్న స్థలం నిర్మించడం, సాధనలు, ఎప్పుడైనా ఆశ్రమానికి వచ్చే సందర్శకులు - జీవితం ఎంతో అద్భుతంగా సులువుగా ఉండేది.

ఆ తర్వాత మొట్టమొదటి సమ్యమా కార్యక్రమం 1995 మే నెలలో ఆశ్రమంలో జరిగింది . ఇక ఆ తర్వాత ధ్యానలింగ ప్రతిష్ఠాపన కు సంబంధించిన పని వేగవంతం అయ్యింది. ఆశ్రమం కొద్దిగా ఒక సంస్థ మాదిరిగా మారడం మొదలయింది- ఇప్పుడు ఉన్న స్థాయితో కానీ, విస్తీర్ణత లో గాని మనం ఏ మాత్రం పోల్చలేము. నా బాధ్యతల్లో మూడు నెలలపాటు సంజీవని గంజి తయారుచేయడం, ఇంకా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఎలక్ట్రికల్, ప్లంబింగ్, ఫ్లోరింగ్ పనులు చూసుకోవడం ఉండేవి. ఇవన్నీ ఎటువంటి శిక్షణా , పూర్వ అనుభవం లేకుండానే అని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

ఆ రోజుల్లో మేము చేసే పనుల్లో ముఖ్యంగా చేసింది ధ్యానలింగ నిర్మాణానికి సామాగ్రిని తీసుకువచ్చే లారీలకు, ట్రక్కులకు సహాయపడడం. ఎన్నోసార్లు బురద రోడ్లలో తన్నీర్ పండ ల్ నుండి ఆశ్రమం వరకు ఈ లారీలను తోయవలసి వచ్చేది. మేము తోస్తున్నప్పుడు ఎన్నోసార్లు ట్రక్కులోని హెల్పెర్లు క్రిందకు దిగినా ఆ బురదలో ఆశ్రమం వరకు నడిచి రావడానికి కూడా నిరాకరించేవారు. అందుకని ఆ లారీల్లోని సామాగ్రిని మేమే దింపుకో వలసి వచ్చేది. ఒకసారి జరిగిన సంఘటన నాకు బాగా గుర్తుంది. ట్రక్కులో పూర్తిగా నిండి ఉన్న పది కేజీల బరువు తూగే కడప రాళ్లను ఒక్కొక్కటిగా మాలో ముగ్గురము కలిసి ట్రక్కు నుండి దింపుకోవల సి వచ్చింది. 

మరొకసారి సిమెంట్ బస్తాలను తీసుకుని ఓ లారీ వచ్చినప్పుడు, అందులోని సహాయకులు ఒక్కో బస్తా దింపడానికి రెండు రూపాయలు అడిగారు. మేము రూ 1. 75 పైసలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాము. కానీ వారు అందుకు ఒప్పుకోలేదు. ఇంతమారుమూల లోపలికి ఉన్న ప్రదేశం కావడంతో మేము ఒప్పుకుని తీరాల్సిందే అనుకున్నారు వాళ్ళు. మా గురించి వాళ్లకు సరిగ్గా తెలీదు. మరో ఇద్దరు బ్రహ్మచారులు, నేను ఇంకా దానికండి నుంచి ఒక సహాయకుడు కలిసి 200 బస్తాలను ఎంతో త్వరగా దింపేసాము. వాళ్లకూ, మాకూ కూడా ఎంతో ఆశ్చర్యం కలిగింది.

లింగానికి వెంట్రుకవాసి బీటు వారడం

జూన్ 1996లో ధ్యాన లింగానికి అవసరమైన రాయి ఆశ్రమానికి చేరుకుంది. ఒకటి రెండు నెలల తర్వాత ఆశ్రమంలో ఉన్న వారందరినీ ఒక రోజు రాత్రి సద్గురు ఒక ప్రక్రియకు పిలిచారు. లింగానికి సహస్రారం దక్షిణముఖంగా ఉండేలా పెట్టి, లింగాన్నిఇసుక పాన్పు మీద పడుకోపెట్టారు. సద్గురు లింగానికి విభూతి రాసి, సహస్రారం చుట్టూరా విభూతి తో ఒక పెద్ద వృత్తాన్ని గీశారు. మేమందరము కళ్లుమూసుకుని ‘ఆఉమ్ నమశ్శివాయ’ ఉ చ్ఛ రిస్తున్నాము. సద్గురు కొంతసేపటికి చప్పట్లు కొట్టారు. మా శక్తి స్థాయిని పెంచడానికి ఆయన ఇలా చేస్తూ ఉండేవారు.

ఆ తర్వాత ఉదయం నేను లింగం దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక వెంట్రుకవాసిలో ఉన్న ఒక చిన్న బీటను గమనించాను. ఇది సద్గురు ఆ మునుపటి రాత్రి తీసిన విభూది వృత్తం గుండా వెళుతోంది. నేను బాగా దగ్గరగా చూసి, అది పక్కకు కూడా పొడిగిస్తూ ఉందని గమనించాను. ఈ విషయాన్ని సద్గురుకు తెలియజేశాము. ఆయన వెంటనే నాతోపాటు అక్కడికి వచ్చారు, దాన్ని పరిశీలించడానికి. ఆ తర్వాత ఆ బీటు ను మరింత పరిశీలించడానికి ఎవరినైనా పంపమని చెప్పేందుకు పురమాయించమని శ్రీనివాసన్ అన్నకు చెప్పారు. రెండు రోజుల తర్వాత, కొంతమంది నిపుణులు చెన్నై నుండి వచ్చారు. వాళ్లు దాన్ని పరిశీలించి, అది రాతిని ఏ విధంగానూ పాడు చేయలేదని, ఆ బీటు మరింత లోతుగా వెళ్లదని తెలియజేశారు. లింగాన్ని తెల్ల గుడ్డ తో కప్పి ఉంచమని మమ్మల్ని ఆదేశించి, సద్గురు అక్కడి నుండి వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత మేము లింగానికి అచ్చేదనగా తడికెలతో పైకప్పు వేసాము. 

ధ్యానలింగ ప్రతి ష్ఠాపన అయిన రెండు సంవత్సరాల తరువాత, ఒక సత్సంగంలో సద్గురు ఈ విషయం గురించి మాట్లాడారు. ప్రాణ ప్రతి ష్ఠ సమయంలో లింగం బీటు వారడాన్ని నివారించడానికి ఆయన ముందుగానే లింగానికి ఒక బీటు కలిగించారని చెప్పారు. ఇది ఆ రోజున ప్రక్రియలో ఆయన చప్పట్లతో నే జరిగింది. లింగాన్ని నిలబెట్టినప్పుడు ఆ బీటు లింగానికి వెనక భాగంలో వస్తుంది. ఇప్పుడు అది అక్కడే , అలానే ఉంది.

సంచారం

24 సెప్టెంబర్ 2001న 7 గంటలకు సద్గురుని ఆలయంలో కలవమని చెప్పారు. దాని అర్థం ఏమై ఉంటుందో నాకు తెలుసు. నేను అలానే లోపలికి రాగానే సద్గురు ఆయన వాడిన శాలువాను ఒకదానిని ఇచ్చి, నాకు ఒక నోటును ఇచ్చారు. దానిమీద, “ఒక ఏడాది వారణాసి ఇంకా కేదార్” అని రాసి ఉంది. ఆ తర్వాతి రోజు 5:40 కి మా గంభీరీ, స్వామినిసర్గ నాకోసం ఒక సంచి తో ఎదురుచూస్తున్నారు. ఆ సంచిలో ఒక శాలువా, భిక్షాటనకు ఒక పాత్ర, నా మొదటి బిక్ష అంటే నా తరువాతి భోజనం. సద్గురు ఇచ్చిన శాలువాను మూడు ముక్కలుగా చేశాను - ఒకటి తుడుచుకునేందుకు తువ్వాల గా మరొక దాన్ని ధోతిగా ఇంకోదాన్ని గోచిగుడ్డగా వాడుకున్నాను. నేను పరివ్రాజక సాధనకు మళ్ళీ తిరిగి వెళుతున్నాను. అంతకుముందు సంవత్సరం డిసెంబర్ నెలలో సద్గురు ఈ సాధన లో నన్ను ఒక నెలరోజుల పాటు పంపించారు.

ధ్యాన లింగం దర్శనం చేసుకున్న తర్వాత నేను బయల్దేరాను. ఒక క్షణంపాటు ఆశ్రమాన్ని ఒక సంవత్సరం పాటు వదిలిపెట్టి వెళుతున్నందుకు ఎంతో బాధ కలిగింది. ఆశ్రమం నుండి బయటికి రాగానే నాకు ఊపిరి ఆడ నట్టు ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఆ తరువాత ఈ భావన నన్ను వెంటనే విడిచి పెట్టి, ఎన్నో ప్రశ్నలు నిండుకున్నాయి - “ నేను ఏం చేస్తాను?”, “నేను ఏమి తింటాను ?”, “ఎక్కడ పడుకుంటాను ?” , “ఎక్కడికి వెళ్ళాలి ? “ ఈ ఆలోచనలు ఒక రోజు పాటు నన్ను వేధించాయి. సాధన పూర్తి చేయకుండా తిరిగి వళ్ళే అవకాశం లేదని నాకు తెలుసు. ఒక ప్రయోజనం అంటూ ఏమీ లేకుండా దేశాన్ని మొత్తం సంచరించాను. అన్ని రకాల ప్రాంతాల్లో నడిచాను అన్ని రకాల ప్రజలను కలుసుకుని వాళ్ళు ఏది ఇస్తే అది తిన్నాను, ఎన్నో రకాల సమస్యలు దుఃఖాలు చూశాను. నేను తిరిగి ఆశ్రమానికి వచ్చిన తర్వాత కూడా జీవితం ఎంతగానో మారిపోయింది.

మొట్టమొదట నేను వారణాసి కి వెళ్ళాను. ఆ తరువాత భూపాల్ దగ్గర ఉన్న భోజ్ పూర్ లింగాన్ని దర్శించుకున్నాను. అక్కడనా ధోతి చిరిగిపోయింది. దాని కుట్టించుకునేందుకు ఒక చోటకు వెళ్ళాను. అక్కడ నాకు జ్యోతిర్లింగాలున్న పోస్టర్ ఒకటి కనిపించింది. అందులో ఒకటి ఎంతో దగ్గరలో ఉందని చూసి నాకు చాలా ఉత్సాహం కలిగింది. నేను ఉజ్జయినిలోని మహాకాలుని దర్శించుకున్నాను. ఒక జ్యోతిర్లింగం నుండి మరొక జ్యోతిర్లింగాళ్ళానికి వెళుతూ, వేసవి కాలానికి కేదారకు చేరుకున్నాను. తాజ్ మహల్ ను చూడాలని నాకు చిన్నతనం నుండి ఉన్న కోరిక తీర్చుకునేందుకు ఆగ్రా కు వెళ్ళాను. సంచరించే సాధువుగా ఉండడం అంటే ఏమిటో నాకు నిజమైన అనుభూతి కలిగింది. వాటిలో కొన్ని సందర్భాలు నాకు ఎంతో బాగా గుర్తున్నాయి.

గురుపూజ జాలువారని రోజు..

ఒక ఉదయం హిమాలయాల్లో నేను నడుస్తున్నప్పుడు, ఏదో కారణం చేత నేను గురుపూజను పూర్తిగా చదవలేకపోయాను. నేను ఎంత ప్రయత్నం చేసినా సరే, కొన్ని శ్లోకాల తర్వాత గురుపూజ ఆగిపోయేది. గురుపూజ నాలో ప్రవహించని రోజు నేను ఈ లోయలోకి దూకేయడం మంచిది అని నిర్ణయించుకొని అలా రోడ్డు చివరికి వచ్చాను, లోయలోకి దూకేయడానికి. వెంటనే నాలో గురుపూజ లోని అన్ని శ్లోకాలు నిండిపోయాయి. నాలో ఇది ఎంతో సునాయాసంగా జరిగింది . ఆ సంవత్సర కాలంలో, సద్గురు ఎప్పుడూ నాలోను, నాతోనే ఉన్నారని నేను మొట్టమొదటిసారి తెలుసుకున్న సమయం ఇది.

ఊహించని హస్తం సహాయం చేసినప్పుడు

నేను హేమకుండ్ సాహిబ్ వరకు వెళ్తున్నాను. మంచుతో కప్పబడిన ఈ మార్గం కేవలం 1.5 అడుగుల వెడల్పుతో ఉంది. అంతేకాక దీనిని యాత్రికులు ఇంకా కూలీలు కూడా ఉపయోగిస్తున్నారు. నేను పర్వతం పైకి వెళ్తున్నాను. అకస్మాత్తుగా, మరొక వ్యక్తి ఆతురుతలో వచ్చాడు. నేను ఒక లోయ వైపుగా ఉన్న మార్గం అంచున ఉన్నాను. అతను దాటుతున్నప్పుడు, నా పాదం అంచుపైకి జారిపోయింది. లోయ నిజంగా ఎంత లోతుగా ఉందో ఆ క్షణంలోనే చూశాను నేను. నేను కిందకు జారిపోకుండా తప్పించుకునే మార్గం లేదు, కానీ అది జరగలేదు. ఒక చేయి నన్ను పట్టుకు ఆపివేసినట్లుగా ఉంది. ఎలా? అన్నది, నాకు తెలియదు.

ప్రజలు రాళ్ళు విసిరినప్పుడు

నేను హైదరాబాద్ చేరుకోవడానికి ముందే, నేను 10 కి.మీ.లకు పైగా వర్షంలో నడిచాను . తీవ్రమైన జలుబు , జ్వరం వచ్చింది. అది దసరా పండుగ సమయం. నగరంలో వేడుకలు జరుగుతున్నాయి. నేను హుస్సేన్ సాగర్ సరస్సు దాటుతున్నప్పుడు, కొంతమంది కుర్రాళ్ళు నా వెంటపడి నన్ను బాధించటం ప్రారంభించారు. దానితో, తెల్లవారుజాము 4 గంటల వరకు నాకు నిద్రించడానికి స్థలం దొరకలేదు.నేను సికింద్రాబాద్‌లోని ఒక దుకాణం ముందర రెండు గంటలు పడుకున్నాను. ఉదయం 7 గంటలకు, నా క్రియా చేయడానికి మరొక స్థలం దొరికింది. నేను ప్రారంభించినప్పుడే, ఒక తాగుబోతు తన జేబులో ఉన్న మద్యం తాగమ,ని నన్ను బలవంతం చేయడానికి ప్రయత్నించాడు. కొంత సమయం తరువాత, నేను ఇక తట్టుకోలేక ఏడవడం ప్రారంభించాను. నేను మరొక చోటు చూసుకోడానికి మళ్ళీ లేచాను.

 మార్గంలో సహాయం దొరికినప్పుడు

నేను ఆదిలాబాద్ దాటుతున్నప్పుడు, నాకు శ్వాస తీసుకోవడం కష్టమైంది. అదృష్టవశాత్తూ, ఒక వైద్యుడు నాకు ఉచితంగా చికిత్స చేసి, ఆ రాత్రి తినటానికి నాకు బిస్కెట్లు కూడా ఇచ్చారు. ప్రజల ఔదార్యం వల్ల నా జేబులో ఎప్పుడూ బిస్కెట్లు ఉండేవి. ఒక రోజు, నేను రోజంతా కేవలం సగం బాటిల్ నీరు మాత్రమే తీసుకుని 30 కిలోమీటర్ల దూరం నడిచాను. కానీ ఆ సంవత్సరం మొత్తంలో, మూడు రోజులలో మాత్రమే నాకు ఆహారం దొరకలేదు. నాకు అవసరమైనప్పుడు, ఎవరో నాకు శాలువా లేదా స్వెట్టర్ లేదా దుప్పటి ఇచ్చారు. ప్రత్యేకించి, నన్ను ఆకలితో చూసినప్పుడల్లా ముస్లింలు నాకు ఆహారం ఇవ్వడంలో ఏంతో ఉదారంగా ఉండేవారు.

 ఆకలి వేదనతో ఉన్నప్పుడు

ఒక సారి, నేను ఆకలి బాధను చూశాను, కాని అది నేను పడ్డది కాదు. ఇది రాజస్థాన్‌లో జరిగిందని నా అభిప్రాయం. రహదారిపై నా దిశలో ఒక వ్యక్తి నడుస్తున్నాడు. అతను రోడ్డు పక్కన ఆహారం కోసం వెతుకుతున్నట్లు అనిపించింది. నా నుండి 50 మీటర్ల దూరంలో, తినడానికి ఏదో తీయటానికి అతను మోకరిల్లిపోతున్నట్లు నేను గమనించాను. ఈ ప్రదేశం దూరం నుండి చూస్తే బురదలాగా ఉంది, అతనికి అక్కడ ఏమి దొరుకుతుందని నేను ఆశ్చర్యపోయాను.

 

నేను చూడటానికి దగ్గరగా వెళ్ళాను. నేను చూసినవి నా అంతరంగాన్ని కదిలించింది. ఇప్పటికీ గుర్తు తెచుకోవడానికి నాకు వణుకు పుడుతుంది. అతను తినడానికి ఎండిన వాంతి లోని భాగాలు తీస్తున్నాడు. ఆ క్షణంలో, మిన్ను విరిగి నా మీద పడుతున్నట్లు నాకు అనిపించింది. ఏదో విధంగా, నేను తమాయించుకుని, అతన్ని పిలిచి నా బిస్కెట్లు ఇచ్చాను. అతను నాకు కృతజ్ఞతలు చెప్పే స్థితిలో లేడు; అతను అక్కడే కూర్చుని తన రెండు చేతులతో బిస్కెట్లు తినడం ప్రారంభించాడు.

 

ఆ సంవత్సరంలో కొన్ని సార్లు, నేను కూడా రోడ్డు పక్కన నుండి ఆహారాన్ని తీసుకోవలసిన పరిస్థితి వచ్చింది.. పరివ్రాజక సాధన నన్ను పారవశ్యంలో ముంచెత్త లేదు. ఆ సంవత్సరంలో నేను ఆధ్యాత్మిక ప్రవాహాలనూ అనుభవించలేదు. కానీ వాస్తవం ఏమిటంటే ఆకలి అంటే ఏంటో నాకు తెలిసి వచ్చింది. నేను ఖచ్చితంగా ఆకలితో చనిపోను.

సరిహద్దుల్లో సమస్యగా ఉన్నప్పుడు

నేను గుజరాత్‌లోని బీచ్ రోడ్ మీదుగా సోమనాథ్ ఆలయం నుండి పోర్బందర్ వరకు నడిచినప్పుడు, నన్ను ఒకసారి హైవే పెట్రోలింగ్ ఇంకా రెండుసార్లు స్థానిక గ్రామస్తులు ఆపారు, నేను పాకిస్తాన్ నుండి శరణార్థిని కాదని ధృవీకరించడానికి. నా వస్తువులన్నీ తనిఖీ చేయబడ్డాయి. ఆ తరువాత నుండి, నేను సరిహద్దు మార్గాలను తప్పించాను.

 

హిమాలయాల నుండి, నేను అమర్‌నాథ్, తరువాత నేపాల్‌లోని ఖాట్మండులోని పశుపతినాథ్ వరకు ప్రయాణించాను. పశుపతినాథ్ నుండి నేను ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లి అస్సాంలోని కామాఖ్యా దేవి ఆలయాన్ని సందర్శించాను. వీధిలో ఎప్పుడూ బీఎస్ఎఫ్ సైనికులు ఉండడంతో, నేను వెంటనే కోల్‌కతాకు తిరిగి వెళ్ళాను. ఆ తరువాత సంబల్ పూర్, కడపా, చివరకు నేను తిరిగి తమిళనాడులోకి ప్రవేశించగానే నా హృదయం ఆనందంతో పొంగిపోయింది.

మళ్ళీ సద్గురుని చూసినప్పుడు

నేను సేలం మహాసత్సంగం రోజున నా స్వస్థలమైన సేలంలో ఉన్నాను. ఇది పదకొండు నెలల సంచారం తరువాత. నేను సన్నాహాలు చూస్తూ ఆ గ్రౌండ్స్ లో ఉండిపోయాను. ఒకరు తప్ప, వేరే బ్రహ్మచారులు లేదా వాలంటీర్లు నన్ను గుర్తించలేరు. నేను ఆ గ్రౌండ్స్ విడిచి వెళ్ళాను, కాని సాయంత్రం సత్సంగ్ కోసం తిరిగి వచ్చాను. నేను క్లుప్తంగా సద్గురు దగ్గరికి వెళ్ళాను, వెంటనే జనం లోకి జారిపోయాను. అయితే, ఒక వాలంటీరు నా వెనకాలే వచ్చి నాకు పాక్ చేసి ఉన్న భోజనం ఇచ్చాడు. దీనికి కొన్ని సంవత్సరాల ముందు, నేను మా ఇంట్లో ఎన్నో సౌకర్యాలతో అదే పట్టణంలో నివసించాను. ఆ రాత్రి, అదే పట్టణంలో, నేను ఒక దుకాణం మెట్లపై పడుకున్నాను. నేను బాగా నిద్రపోయాను.

పన్నెండు సంవత్సరాల సాధన తరువాత అందిన బోనస్

జనవరి 2003 లో బ్రహ్మచారులు కొంతమందికి సన్యాసంలోకి దీక్ష ఇచ్చా రు; అయితే, నేను వారిలో ఒకడిని కాదు. ఇది కొంతకాలం నన్ను కలవరపెట్టినప్పటికీ, సద్గురుకే బాగా తెలుసు అని నేను గ్రహించాను. నా బ్రహ్మచార్య దీక్షకు దాదాపు 12 సంవత్సరాల తరువాత, డిసెంబర్ 2006 లో నేను సన్యాసంలోకి ప్రవేశించాను. మన సాంప్రదాయంలో, సాధారణంగా తదుపరి దీక్షకు ముందు12 సంవత్సరాల సాధన వేచి ఉండే కాలం. దీక్ష తరువాత, నా బంధాలు, ఎన్నో నిర్బంధాలు చాలా వరకు పడిపోయాయి. నెమ్మదిగా, ఇది ప్రమోషన్ కాదని, విలీనం కాగలిగే ప్రక్రియ అని నేను అర్థం చేసుకున్నాను. నా ఆధ్యాత్మిక జీవితంలో నేను వెనక్కి తిరగలేని స్థితికి చేరుకున్నాను.

కళాభైరవ కర్మ నిర్వహణ

నేను చిన్నతనంలో అన్నింటికీ భయపడే వాడిని. ఇప్పుడు నేను ఎల్లప్పుడూ అంత్యక్రియలకు దహనం చేసే శరీరాలతో ఉండటం విడ్డూరంగా ఉంటుంది. 2011 లో, కాలభైరవ కర్మ అనే సరళమైన పద్ధతిని సద్గురు వద్ద శిక్షణ పొందిన మొదటి బ్రహ్మచారి నేను. ఇప్పుడు ఈ ప్రక్రియ చేయటానికి అనేక ఇతర బ్రహ్మచారులు ఉన్నారు. ఈ ప్రక్రియలో ఏమి జరుగుతుందో నేను నిజంగా గ్రహించలేను, కాని నేను సద్గురు ఇచ్చిన సూచనలను అనుసరిస్తాను. ఏదేమైనా, రోజూ ఈ ప్రక్రియలో భాగం కావడం మరణం అన్న విషయాన్ని నా జీవితానికి చాలా దగ్గర చేసింది. పంచేంద్రియాలకు మించిన ఆటను నేను ఎదో ఒక రోజు నిజంగా అనుభూతి చెందుతానని భావిస్తున్నాను.

సద్గురు ఉన్నంత కాలం నేను జీవించాలనుకుంటున్నాను

జ్ఞానోదయం నా లక్ష్యం కాదు. అది సద్గురు లక్ష్యం . ఆయన ఇందులో విఫలం కారని, నాకు 500% భరోసా. నేను దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది నా చివరి జన్మ కాకూడదని నేను కోరుకుంటున్నాను . నేను ధ్యానలింగ చుట్టూ ఉండటానికి తిరిగి రావాలనుకుంటున్నాను. నా గురువు తన సూక్ష్మ శరీరంలో మరో 80 సంవత్సరాలు ఇక్కడ ఉండటానికి ఎంచుకున్నప్పుడు, నేను ఆయనతో కలిసి ఉండే అవకాశం, ఇంకా అయన పనికి నన్ను ఉపయోగించుకునే అవకాశాన్ని ఎలా వదులుకుంటాను?

స్వామీ
నిర్వచార