ప్రశ్న: నమస్తే, నా పేరు ధన్య రవి. నేను చాలా అరుదైన జన్యు రోగంతో పుట్టాను దాని పేరు ‘ఆస్టియో జెనిసిస్ ఇంపర్ఫెక్టా’ దానినే మామూలుగా ‘బ్రిటిల్ బోన్ డిసీజ్’ అంటారు. అంటే ఎముకలు చాలా పెళుసుగా, గాజు లాగా ఉంటాయి. నా ఒంట్లో ఉన్న ఎముకల కన్నా, నాకు ఎక్కువ ఫ్రాక్చర్స్ అయ్యాయి. ఈరోజు నా ప్రశ్న ఏమిటంటే, నాదో చిన్న కోరిక. మీరు అంగవైకల్యం గురించి ఏమన్నా చెబుతారని ఆశ. దాని మూలంగా అంగవైకల్యం ఉన్నవారిని సమాజంలోని వారు మరికాస్త బాగా అర్థం చేసుకుంటారని ఆశ.

సద్గురు: మీరు ఇక్కడ ఉండటం మా గౌరవంగా భావిస్తున్నాను. జీవం అనేక రూపాల్లో వస్తుంది, కానీ సమాజాలు వాటిని సరైనది, సరికానిది అంటూ పేర్లు పెట్టాయి. కానీ యదార్ధంగా నాలుగు అవయవాలు సరిగ్గా ఉన్నవారిని కూడా మరొకరితో పోలిస్తే ఏదో ఒక విషయంలో వారు అంగవికలురు కాదా? మంచిగానే ఉన్న మీ రెండు కాళ్లతో, మీరు ‘ఉసేన్ బోల్ట్’ తో పరిగెత్తితే, మీరు అంగవికలురు అనిపించదా?

కానీ చాలామంది, మామూలు మనుషులు, అనుకుంటున్నవారు, తమ బుర్రలు పగల గొట్టుకుంటున్నారు ప్రతిరోజూ. కానీ వారిని మామూలు మనుషులు అంటున్నారు, దానిని ఒత్తిడి, ఆందోళన, ఇంకా ఏదేదో అంటున్నారు,  కానీ వారు ఏదో కారణంగా తమ బుర్రలు పగల గొట్టుకుంటూనే ఉన్నారు.

అందుకే మనం ఎవరికీ పేర్లు పెట్టొద్దు, ఎందుకంటే జీవం అనేక విధాలుగా వస్తుంది. మీరు ఆ విషయాన్ని అర్థం చేసుకొని గౌరవించాలి, మనం చేయగలిగింది చేయాలి. ఎందుకంటే అది ఒక అద్భుతం. ఎలా అంటే ఈరోజు ఉదయం మీరు ఇడ్లీ, దోశ తింటారు. అది మీరు నడుస్తున్న మట్టిలో నుంచి వచ్చిన ఆహారమే, ఆ  ఆహారమే మీ శరీరంలో కండరాలు, ఎముకలు అయ్యాయి. అది ఎంతో సంక్లిష్టమైన ప్రక్రియ. దురదృష్టవశాత్తు దానిని మీరు మామూలుగా జరిగిపోయేదేనని అనుకున్నారు. కానీ కొన్నిసార్లు అన్నీ మనం అనుకున్న విధంగా జరగవు.

అందువల్ల మీరు మిమ్మల్ని అంగవైకల్యతో ఉన్నవారు అనుకోవద్దు. మీరు ఒక రకం, నేను ఇంకొక రకం. ఏ మనిషికీ లోపరహితమైన శరీరం గాని, మనసు గాని లేవు. నాకు ఒక రకమైన అంగవైకల్యం మీకు ఇంకో రకం. మరొకరితో పోలిస్తే  ఏదో రకంగా మనం అందరం అంగవైకల్యంతోనే ఉన్నాము.

మీకు ఎముకలు బలహీనంగా ఉండటం వల్ల విరుగుతున్నాయి అన్నారు, అది చాలా బాధాకరం, దురదృష్టం. కానీ చాలామంది, మామూలు మనుషులు అనుకుంటున్నవారు, తమ బుర్రలు పగల గొట్టుకుంటున్నారు ప్రతిరోజు. కానీ వారిని మామూలు మనుషులు అంటున్నారు, దానిని ఒత్తిడి, ఆందోళన, ఇంకా ఏదేదో అంటున్నారు, కానీ వారు తమ బుర్రలు పగల గొట్టుకుంటున్నారు. 

ఏ మనిషికీ లోపరహితమైన శరీరం గాని, మనసు గాని లేవు. నాకు ఒక రకమైన అంగవైకల్యం మీకు ఇంకో రకం. మరొకరితో పోలిస్తే  ఏదో రకంగా మనం అందరం  అంగవైకల్యంతోనే ఉన్నాము.

భౌతిక శరీరం ఒక రకమైన యంత్రం. కొన్నిసార్లు ఏదో చెడిపోతుంది. అది పుట్టినప్పుడు మామూలుగానే ఉండి, తర్వాత చెడిపోవచ్చు. ఒకోసారి గర్భంలోనే ఏదో లోపం రావచ్చు, కొన్నిసార్లు తయారీలో ఏదో జరగవచ్చు. దానికీ వ్యక్తికీ సంబంధం లేదు. అది ఎంతో సంక్లిష్టమైన ప్రక్రియ కావడం మూలంగా చెడిపోవటానికి ఎన్నో కారణాలు ఉండి ఉండవచ్చు.

కాని మీరు ఎలా జీవిస్తారన్నది, అది నిర్దేశించకూడదు. మీరు భౌతికంగా ఎలా జీవిస్తారన్నది అనేక విషయాలు నిర్దేశించవచ్చు. కానీ అంతర్గతంగా మనం ఎలా జీవిస్తామన్నది, మనం తప్ప ఇంకెవరూ నిర్దేశించకూడదు. నేను ఎలా జీవిస్తానన్నది నేను తప్ప ఇంకెవరూ నిర్దేశించరు. ఆ విధంగా ఎవరూ అంగవికలురు కాదు. 

సార్వత్రిక సమానత్వం సాధించడం

భౌతిక, మానసిక ప్రమాణాలు దాటితే జీవం అంతా ఒకే రకం. అలా అనటానికి మనం ఎంతో అర్థరహితంగా వాడుతున్న ‘ఆధ్యాత్మికం’ అనే మాట వాడాల్సి వస్తోంది. ఆధ్యాత్మికం అంటే పైకో, కిందకో చూడటం కాదు, అది లోపలికి చూసుకోవడం. అలా చూస్తూ భౌతికమైన, మానసికమైన కోణాలకు అతీతంగా మరో కోణాన్ని చూడటం. ఈ విధమైన స్థితిలో మీకు, నాకు, ఎవరిలోనూ ఏ విధమైన తేడా లేదు.

అందుకే ఆధ్యాత్మికతకి అంత ప్రాముఖ్యత వచ్చింది. మనం సమానత్వం గురించి కావాల్సినంత మాట్లాడుకోవచ్చు. కానీ మనం మన శరీరాన్ని, మనస్సునీ ముఖ్య మైనవిగా పరిగణిస్తున్నంత కాలం, అక్కడ సమానత్వం ఉండే అవకాశం లేదు. కానీ ఈ రెంటికి అతీతంగా ఉన్న మరో కోణంలో చూస్తే అక్కడ అన్నీ ఒకటే.

ఈ ఒక్క అనుభూతి మానవునిలోకి వస్తే, ఇక ఇక్కడ ఒక  గొప్ప చేర్చుకునేతత్వం వస్తుంది. అప్పుడు ఎవరు ఏ విధమైన సామర్ధ్యంతో వచ్చారు అనేది ఇక అసలు ఒక విషయం కాదు. ప్రతి జీవికి తనదైన స్థానం ఉంటుంది. కానీ ప్రస్తుతం మనం భౌతిక, మానసిక సామర్ధ్యాన్ని బట్టి మీరు ‘వీడు మామూలు వాడు, వీడు నాసిరకం’ అని పేర్లు పెడుతున్నాము. అలా చేయవద్దు. 

భౌతిక, మానసిక ప్రమాణాలు దాటితే జీవం అంతా ఒకే రకం. అలా అనటానికి మనం ఎంతో అర్థరహితంగా వాడబడుతున్న ‘ఆధ్యాత్మికం’ అనే మాట వాడాల్సి వస్తోంది.

ఒక క్యారెట్ దుంప గాని, మిడత కానీ, మీ కన్నా తక్కువ జీవం అని మీరు అనగలరా? మీరు లేకుండా అవి బతకగలవు, కానీ అవి లేకుండా మీరు బ్రతకలేరు. ప్రకృతి ఇతర ప్రాణుల కన్నా మనకు ఎక్కువ తెలివితేటలు ఉండే అవకాశాన్ని ఇచ్చింది. ఈ స్థాయికి ఎదిగినా, పనికిరాని ముతక భావాలతో ఉంటే,  ఈ ప్రపంచాన్ని శాసించే సమయం ఇదే అనుకుంటారు మీరు. కాదు, మీరు ఒక స్థాయికి ఎదిగినప్పుడు, మిగతా జీవులు తెలిసో, తెలియకో మీ వంక చూస్తుంటే, అది అందరినీ కలుపుకుని పోవాల్సిన సమయం. ఇది మరొకరిని నిర్దేశించే సమయం కాదు, ఎందుకంటే మీరు ఒకసారి అధికారం చాలాయిస్తే మిమ్మల్ని మీరు అన్నింటి నుంచీ వేరు చేసుకుంటున్నారు. 

మీ జీవ ప్రమాణాన్ని పెంచుకోండి

మనకు ఈ రకమైన ఏకత్వం రావాలంటే మానవుడు ఈ శరీరం, మనసులకు అతీతమైన అనుభూతి ఏ కొంచెమైనా తెలుసుకొని ఉండాలి. మీ శరీరం ఒక విధంగా ఉంది, నా శరీరం మరొక విధంగా ఉంది. బ్రతికున్నంతకాలం మనం వేరు, వేరు అనుకుంటాము. మనల్ని పూడ్చి పెట్టినప్పుడే అంతా అదే ‘మన్ను’ అని తెలుసుకుంటాము. నా మనసు వేరు, నీ మనసు వేరు. కానీ మనం దీనిని ఒక జీవంగా చూస్తే, నీ జీవం నా జీవం అంటూ ఏమీ లేదు అక్కడ ఉన్నది ‘జీవం’తో ఉన్న ఒక విశ్వం. కాని ఉన్న ప్రశ్న ఏమిటంటే, దానిలో నువ్వెంత జీవాన్ని అందుకున్నావు? ఉన్నది అదొక్కటే, మీ శరీర పరిమాణం కాదు, మీ బుర్ర పరిమాణం కాదు. ఎంత పెద్ద జీవం అంటే అది మీరెంత జీవాన్ని అందకున్నారన్నదే.

ప్రస్తుతం మీరు ఉన్నదానికంటే ఎక్కువ జీవితాన్ని అందుకోవాలంటే, మీరు ఈ వ్యక్తిత్వ హద్దులను తెరవాలి. మీ వ్యక్తిత్వంవల్ల మెల్ల మెల్లగా ఆ హద్దు గట్టి పడుతోంది, అది దాని గుండా ఎవరనీ లోపలికి ప్రవేశించనీయదు. మీరు ఈ హద్దులను నాశనం చేస్తే, దానిని ‘యోగా’ అంటాము. యోగా అంటే శరీరాన్ని వంచడం, తలకిందులుగా నిలబడడం కాదు.

యోగా అంటే ఐక్యత, ఐక్యత అంటే ఎరుకతో మీ వ్యక్తిత్వాన్ని కూల్చివేయడం. అప్పుడు జీవం ఎంతో ఉంటుంది, ఎవరూ ఊహించలేనంత మీది పెద్ద జీవం కాబట్టి, సహజంగానే అన్ని మీ దారిలోకి వస్తాయి.

సంపాదకుడి సూచన: మిమ్మల్ని ఏదైనా ప్రశ్న తొలిచివేస్తుందా, ఎవ్వరినీ అడగలేని ప్రశ్న మీలో మొదలైందా? ఇదే మీకున్న అవకాశం..సద్గురుని ఇక్కడ అడగండి. UnplugWithSadhguru.org.

Youth and Truth Banner Image