ఆధ్యాత్మికతకు మీరు ఏ వాతావరణంలో నివసిస్తున్నారన్న దానితో సంబంధం లేదు. అది మీ అంతరంగంలో మీరు సృష్టించుకుంటున్న వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది.

sadhguru-wisdom-article-quotes-on-spirituality-1

ఆధ్యాత్మికత అంటే చక్కని, ప్రశాంత జీవితం అనుకోకండి, అది అగ్నిలా ప్రజ్వరిల్లడం.

sadhguru-wisdom-article-quotes-on-spirituality-2

ఆధ్యాత్మికత అంటే మీ వెర్రితనానికి కారణాలు కనుక్కోవడానికి ప్రయత్నించడం కాదు - దాన్ని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండడం.

sadhguru-wisdom-article-quotes-on-spirituality-3

ఆధ్యాత్మికత ఏదో అన్యలోక విషయం కాదు - అది మానవ అస్థిత్వ సారాంశం.

sadhguru-wisdom-article-quotes-on-spirituality-4

మీరు ఆధ్యాత్మికులు కావడానికి ఏ కొండగుహకో వెళ్ళనక్కరలేదు. మీరెక్కడున్నా, జీవితంలో మీరేమి చేస్తున్నా ఫరవాలేదు. ఆధ్యాత్మిక ప్రక్రియకు బయటి పరిస్థితులతో సంబంధంలేదు, అది మీలోనే జరిగే ప్రక్రియ.

ఆధ్యాత్మికత అంటే అమిత అత్యాశ. మీకు కావలసింది కేవలం సృష్టిలో ఒక భాగం కాదు - మీరు సృష్టి మూలాన్నే కోరుకుంటున్నారు.

ఆధ్యాత్మికత అంటే ప్రత్యేకత సంతరించుకోవడం కాదు - అది అన్నిటితో ఏకమవ్వడం.

ఆధ్యాత్మికత పేరుతో కొందరు తేలిక మార్గం ఎంచుకుంటారు - ఊహాగానాలు చేయడం.

ఏదో రకంగా ప్రతి మానవుడూ ఆధ్యాత్మీకుడే. కాకపోతే కొంతమంది గొప్పలు చెప్పుకుంటారు.

ఆధ్యాత్మికత అనేది మీ అత్యున్నత సామర్ధ్యాన్ని చేరుకోవడం గురించే.

ఆధ్యాత్మికత మానసిక ప్రక్రియో లేక సాంఘిక ప్రక్రియో కాదు - అది నూటికి నూరు శాతం అస్తిత్వ పరమైనది

ఆధ్యాత్మికత అంటే మీ జీవితాన్ని అతి తీవ్ర స్థాయికి తీసుకువెళ్లడం.

ఆధ్యాత్మికత ఒక వైకల్యం కాదు, అది జీవితాన్ని అమోఘమైన రీతిలో శక్తిమంతం చేయడం.

పదవి, అధికారాల్లో ఉన్నవారికి ఒక ఆధ్యాత్మిక అంశం అవసరం. ఎందుకంటే వారి ఆలోచన, భావాలు ఇంకా వారు చేసే పనులు ఎన్నో జీవితాలని ప్రభావితం చేస్తాయి.

మీ ఆలోచనలు, భావోద్వేగాలు కాకుండా, మీలోని జీవం అతిముఖ్యంగా మారడమే ఆధ్యాత్మిక ప్రక్రియ

ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే ఏదో ఒక రోజు స్వర్గానికి పోవడం గురించి కాదు. అది జీవితం యొక్క పూర్తి ఔన్నత్యాన్ని తెలుసుకోవడం గురించి.

ఆధ్యాత్మిక ప్రక్రియ ఓ వెనకడుగు కాదు. ఇతరులింకా వెళ్ళని చోటుకు వేసే ఒక పెద్ద ముందడుగు.

ఆధ్యాత్మిక మార్గంలో ఉండడం అంటే, మీ సమస్యకూ, శ్రేయస్సుకూ మూలం మీలోనే ఉందని అర్థం చేసుకోవడం.

ఈ సృష్టిలో ఆధ్యాత్మికము కానిదంటూ ఏదీ లేదు. అన్ని ఆధ్యాత్మికమైనవే కానీ ఇంకా తెలుసుకోబడనివి.

మీరు ఎరుకతో ఉంటే అంతా ఆధ్యాత్మికమే. మీరు ఎరుకతో లేకపోతే అంతా ప్రాపంచికమే.

మీ అశాశ్వతత్వాన్ని ఎదుర్కొన్నప్పుడే ఆధ్యాత్మిక తృష్ణ మీ మనసులో ప్రవేశిస్తుంది.

ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క ఉపయోగం మానవులను వారి అత్యున్నత సంభావ్యతకు చేర్చడం - శారీరకంగా, మానసికంగా, భావ పరంగా ఇంకా ఆధ్యాత్మికంగా.

ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే తీవ్రంగా ఉండడం. ప్రశాంతత దొరికేది మీరు స్మశానం చేరినప్పుడే.

ఆధ్యాత్మికత అనేది ఒక నైతిక శాస్త్రం కాదు. ఆధ్యాత్మికత అనేది మీరుగా ఉన్న జీవాన్ని పెంపొందించడానికి.

Editor's Note: Is your interiority not happening the way you want it? Take the first step towards taking charge of your interiority through Inner Engineering Online.