కృష్ణుడు - ఆయన జీవితంలోని ఇద్దరు అద్భుత స్త్రీలు!

కృష్ణుడి జీవితంలో వేరు వేరు మార్గాలలో ప్రవేశించి, ఆయనతో ప్రేమలో పడి ఆయన భక్తులుగా మారిన స్త్రీలు ఎందరో ఉన్నారు. అందులో ఇద్దరు స్త్రీలు - ఆయన తల్లి యశోద, ఆయనను చంపడానికి వచ్చిన హంతకి పూతన గురించి సద్గురు ఇక్కడ మాట్లాడుతున్నారు.
కృష్ణుడు - ఆయన జీవితంలోని ఇద్దరు అద్భుత స్త్రీలు!
 

కృష్ణుడి జీవితంలో వేరు వేరు మార్గాలలో ప్రవేశించి, ఆయనతో ప్రేమలో పడి ఆయన భక్తులుగా మారిన  స్త్రీలు ఎందరో ఉన్నారు. అందులో ఇద్దరు స్త్రీలు - ఆయన తల్లి యశోద, ఆయనను చంపడానికి వచ్చిన హంతకి పూతన గురించి సద్గురు ఇక్కడ మాట్లాడుతున్నారు.


యశోద

కృష్ణుడి జీవితంలో చాలా మంది స్రీలు ఉన్నారు, అందరికీ ఆయనంటే విపరీతమైన ప్రేమ ఉండేది. మనం అందరి గురించీ మాట్లాడలేము కాబట్టి, ఆయన భక్తులైనా ఒక ఇద్దరు అద్భుత స్త్రీల గురించి తెలుసుకుందాం. తాము భక్తులమని వారు అనుకోలేదు. వారు ఆయనను ఎంతో ప్రేమించినవారు. ఆ ఇద్దరిలో మొదటి వ్యక్తి యశోద. ఆమె అతనిని అమితంగా ప్రేమించిన  పెంపుడు తల్లి. ఆయన పసి పిల్లవాడిగా ఉన్నప్పడు కూడా, ఆమె ధ్యాసంతా ఆ అందమైన బాలుడి గురించే. కానీ ఆయన ఒక మనిషిగా చాలా తొందరగా పెరిగాడు. ఆయన పెరుగుదల అద్భుతమైనది. ఏ తల్లీ కూడా తన మాతృత్వాన్ని అంత వేగవంతమైన  పెరుగుదలకు సర్దుబాటు చేసుకోలేదు, అందుకని ఆమె మాతృత్వం అతనికి ఐదారేళ్ళు వచ్చేటప్పటికి మాయమయిపోయింది. దాని తరువాత నిజానికి ఆమె ఆయనకి ఇక ఒక తల్లిగా ఉండలేకపోయింది. ఆమె ఆయనని కేవలం  ప్రేమించింది.

కృష్ణుడితో యశోద బాంధవ్యం ఎలా పెరిగిపోయిందంటే ఆమె కూడా ఒక గోపిక అయిపొయింది.

కృష్ణుడితో యశోద బాంధవ్యం ఎలా పెరిగిపోయిందంటే ఆమె కూడా ఒక గోపిక అయిపొయింది. ఆమె కూడా రాసలీలలో భాగమయ్యింది. ఆమెకు రాధ నచ్చలేదు, ఎందుకంటే ఆమె రాధ చాలా దూకుడు పిల్ల అని అనుకుంది. ఒక పల్లె పిల్లకు ఉండవలసిన ప్రవర్తన రాధలో లేదు. ఆమె మరీ ఎక్కువ కలివిడిగా ఉండేది. యశోద ఈ అమ్మాయి తన అద్భుతమైన కొడుకుని వలలో వేసుకుంటోందని అనుకునేది, కానీ కృష్ణుడు వెళ్ళిపోయిన తరువాత రాధ నిర్వహించిన రాసలీలలో పాలు పంచుకోకుండా ఉండలేకపోయేది.

కృష్ణుడు ఆఖరికి తన తల్లిని చూడటానికి కూడా, ఎప్పుడూ వెనక్కి తిరిగి వెళ్ళలేదు. చాలా సార్లు మథురలో నదికి కేవలం ఇవతల పక్కనే ఉన్నా కూడా బృందావనానికి  వెళ్ళలేదు, ఎందుకంటే వారు ఆయనని ఒక బాదర బందీ లేని గోవులు కాచే బాలకుడిగానే చూసారు, ఆయన వారి కలను నాశనం చేయదలచుకోలేదు. తాను ఇప్పుడు మారిపోయిన విధంగా, అంటే ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నవాడిగా వారికి కనిపించదలచలేదు. బృందావనాన్ని వదిలి వచ్చేసిన తర్వాత ఆయన ప్రపంచంలో ధర్మస్థాపన బాధ్యతను చేపట్టడం వల్ల, చాల పనులు చేయవలసి వచ్చింది. ఆ పనులను చూస్తే వారి మనసులు విరిగిపోయుండేవి. వారు ఎలా ఉన్నారో అలా చాలా ఆనందంగా ఉన్నారు. అందుకే కృష్ణుడు తన తల్లి దగ్గరకి కూడా తిరిగి వెళ్ళలేదు. యశోద కూడా కృష్ణుడు ఇక తన కొడుకు కాదని అర్థం చేసుకుంది కనుక, రాధతో పాటు ఒక గోపిక అయిపొయింది.  ఆ నీలి మాయ ఆమెను కూడా మాయ చేసింది.

పూతన

ఇక రెండవ వ్యక్తి పూతన. కృష్ణుడు పుట్టినప్పుడు, ఆ నెలలో పుట్టిన పిల్లలను చంపటానికి కంసుడు పంపిన పూతన చాలా మంది పసిపిల్లల్ని నిర్దాక్షిణ్యంగా చంపివేసింది. కృష్ణుడు కనిపించిన వెంటనే, మాయతో తనను తాను ఒక అత్యంత అందమైన స్త్రీగా మార్చుకుంది. రాజఠీవితో ఆ ఇంటిలోకి అడుగు పెట్టిగానే అందరూ ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. ఆమె తాను పిల్లవాడిని ఎత్తుకుంటానని చెప్పింది. పిల్లవాడిని తీసుకుని బయటకు వచ్చి కూర్చుంది. తన రొమ్ములపై విషాన్ని రాసుకుని పిల్లవాడికి పాలు పడుతున్నట్లుగా నటించింది. ఆ రోజులలో పిల్లలకు పాలుపట్టగల ఏ స్త్రీ అయినా పాలు పట్టవచ్చు, తల్లే కానవసరం లేదు. దానిని వారు పిల్లలకి ఇచ్చే ఒక అద్భుత అర్పణగా భావించేవారు.  ఆ రోజులలో గర్భానిరోధకాలు లేవు కాబట్టి చాలా మంది యువతులు పాలు ఇవ్వగలిగే స్థితిలో ఉండేవారు. ఒకరి పిల్లలకి ఒకరు పాలు పట్టటం నిషిద్ధం కాదు.

నా రొమ్ము విషపూరితమై ఉంది, కానీ మీరు కేవలం నా పాలనే కాకుండా నా జీవాన్ని కూడా తీసుకోవాలని నా మనసు కోరుకుంటోంది.

అందుకని పూతన తన విషపూరితమైన రొమ్ముతో కృష్ణుడిని చంపటానికి వచ్చింది. కానీ అతనిని చూసిన వెంటనే ఆ నీలి మాయ ఆమెను కీ కమ్మేసింది. ఆమె పిల్లవాడి వైపు ఎంతగా ఆకర్షింపబడందంటే ఆమెలోని మాతృత్వం పెల్లుబికింది. ఆమెకు ఆ పసివాడికి ఇక విషం ఇవ్వాలని అనిపించలేదు- తనను తాను సమర్పించుకోవాలనుకుంది. “నేను ఇక్కడికి మిమ్మల్ని చంపాలన్న కంసుడి ఆజ్ఞను పాటించటానికి వచ్చాను. నా రొమ్ము విషపూరితమై ఉంది, కానీ మీరు కేవలం నా పాలనే కాకుండా నా జీవాన్ని కూడా తీసుకోవాలని నా మనసు కోరుకుంటోంది. మీకు పాలివ్వడం నా అదృష్టం.” అని తనలో తాను అనుకుంది. అత్యంత ప్రేమతో, విషపూరితమైన రొమ్ముతో పసివాడికి పాలు పట్టింది. కృష్ణుడు ఆమెలోని జీవాన్నే పీల్చేసాడు. అక్కడే, ముఖం మీద పెద్ద చిరునవ్వుతో ఆమె పడిపోయింది. “నా జీవాన్ని ఆ పరమాత్మ పీల్చేసారు, నాకు ఇంతకన్నా ఇంకేమి కావాలి!” అన్నదే ఆమె మనసులోని ఆఖరి భావన!

పేమాశీస్సులతో,
సద్గురు

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1