యశోద

సద్గురు: కృష్ణుడు మొదటి నుంచీ కూడా, అంతటితో ఐక్య భావన కలిగినవాడు. ఒక పిల్లవాడిగా ఉన్నప్పుడు, తాను మన్ను తినడంలేదని చూపించడానికో - లేదా తింటున్నానని చూపించడానికో - ఎందుకైనా సరే, మొత్తానికీ తన తల్లికి నోరు తెరచి అతను చూపించినప్పుడు - అప్పుడు కూడా అతను అంతటితో ఐక్య భావన కలిగినవాడే. తను గోపికలతో నాట్యమాడినప్పుడు కూడా, అతను అంతటితో ఐక్య భావన కలిగినవాడే. అతను ఎప్పుడూ కూడా వారితో సుఖాన్ని పొందాలని ఆలోచించలేదు.

ప్రేమ అనేది ఒక శారీరక సంబంధం గురించి కాదు. ప్రేమ అనేది, భావోద్వేగాల ద్వారా, మీ హద్దులను చేధించి, భౌతికతకి అతీతంగా వెళ్ళేందుకు చేసే ఒక ప్రయత్నం.

‘రాస’ అనే పదానికి ఆంగ్లంలో సరిసమానమైన పదం ఉండి ఉండకపోవచ్చు. అదెలా అంటే “జీవితపు మాధుర్యం” వంటిది. కాబట్టి మనం అంటున్నది, జీవితపు మాధుర్యంతో ఆడిన అతనే గోవిందుడు అని. కాబట్టి ఈ సమాజాలలో, కనీసం నెలలోని నిర్దిష్ట సమయాలలో, లేదా పని అయిపోయాక సాయంత్ర వేళల్లో కొనసాగిన ఈ విరామం లేని నృత్యాలను, రాసలీల అంటారు, దానర్థం జీవితపు మాధుర్యంతో ఆడడం. మెల్లగా అది, ఎటువంటి క్రోదం లేని, ఎటువంటి కోరికా లేని, కేవలం జీవం మాత్రమె ఉన్న ప్రదేశంగా గుర్తించబడింది. జీవితపు మాధుర్యం పొంగిపొర్లింది, ఎందుకంటే అక్కడ ఎటువంటి క్రోదం గానీ, కోరిక గానీ లేదు.

కృష్ణుని జీవితంలో ఎంతో మంది స్త్రీలు ఉన్నారు, అందరికీ తనంటే వల్లమాలిన ప్రేమాభిమానాలు. మనం వాళ్ళందరి గురించీ మాట్లాడలేము, కాబట్టి మనం, తమను తాము భక్తులమని చెప్పుకోక పోయినప్పటికీ, తనకు భక్తులయిన ఓ కొద్ది అద్భుతమైన స్త్రీలను గురించి చూద్దాము. ఈ పిల్లవాడిని ఎంతగానో ప్రేమించిన తన పెంపుడు తల్లి అయిన యశోదతో మొదలుకొని వాళ్ళందరూ అతన్ని ప్రేమించే వాళ్ళే. తను కేవలం ఒక పసి బిడ్డగా ఉనప్పుడు కూడా, ఆమె ధ్యాసంతా తన వద్ద ఉన్న ఈ అందమైన బాలుడి మీదే. కానీ తను చాలా వేగంగా పెరిగాడు. అతని ఎదుగుదల అద్భుతమైనది. ఏ తల్లీ కూడా, ఆ విధమైన ఎదుగుదలకి తగినట్టుగా తన మాతృత్వాన్ని సర్దుబాటు చేసుకోలేదు, కాబట్టి అతను సుమారు ఐదు లేదా ఆరేళ్ళ వయసుకి వచ్చే సమయానికి ఆమెలో మాత్రుభావన పోయింది. ఆ తరవాత, ఆమె అతనికి నిజంగా తల్లిగా ఉండలేకపోయింది. ఆమెకి అతని పై ఉన్నది కేవలం ప్రేమ. ప్రేమ అనేది ఒక శారీరక సంబంధం గురించి కాదు. ప్రేమ అనేది, భావోద్వేగాల ద్వారా, మీ హద్దులను చేధించి, భౌతికతకి అతీతంగా వెళ్ళేందుకు చేసే ఒక ప్రయత్నం. ఏదైనా మిమ్మల్ని ముంచ్చెత్తితే, మీరు దేనితో అయినా ఘాడమైన ప్రేమలో పడితే, అప్పుడు అది కొన్ని పరిమితులను అధిగమించి, భక్తిగా మారుతుంది. కృష్ణుడు అంటేనే ఒక మూర్తీభవించిన ప్రేమ. ప్రతి ఒక్కరికీ తనంటే ప్రేమ - పురుషులకి, స్త్రీలకి, పిల్లలికి, ఆఖరికి ఆవులు కూడా, ఎందుకంటే వారు తనతో ఉండగలిగిన విధానం అదొక్కటే. కాబట్టి వాళ్ళందరూ అతని భక్తులు అయ్యారు.

కృష్ణునితో యశోదకి ఉన్న అనుబంధం, తను కూడా ఒక గోపికగా అయ్యేంతగా పెరిగింది. తను కూడా రాసలో ఒక భాగమే. తనకి రాధ నచ్చేది కాదు, ఎందుకంటే ఆమె ఈ అమ్మాయికి వేగం మరీ ఎక్కువ అనుకునేది, దానర్ధం ఏదైనా సరే. ఒక పల్లెటూరి అమ్మాయి నుండి మనం ఆశించే ప్రవర్తన రాధలో ఉండేది కాదు. తను మరీ ఎక్కువ కలుపుగోలు తనంతో ఉండేది. యశోద, తన చక్కని కొడుకుని ఈ అమ్మాయి దారి మళ్ళిస్తుందని భావించింది. కానీ కృష్ణుడు వెళ్ళిన తరువాత రాధ నిర్వహించిన రాస లో పాల్గొనకుండా ఉండలేకపోయేది.

కృష్ణుడు ఎప్పుడూ వెనక్కి వెళ్ళలేదు, కనీసం తన తల్లిని చూడడానికి కూడా. ఎన్నో సార్లు తను మధురలోని నది పక్కనే ఉన్నా, తిరిగి బృందావనానికి వెళ్ళలేదు, ఎందుకంటే వారు అతను ఒక బాదర బందీ లేని, గోవులను కాచే పిల్లాడిగానే చూసారు, ఇక తను వాళ్ళ కలని నాశనం చేయదలచుకోలేదు. అతను అక్కడికి ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్న వాడిలా అక్కడికి వెళ్ళాలనుకోలేదు. ఇప్పుడు అతను ప్రపంచంలో ధర్మాన్ని స్థాపించే పాత్ర పోషిస్తున్నందున, వారు గనుక తనని అలా చుస్తే, ఇక వాళ్ళ హృదయం బద్దలైపోయేటువంటి ఎన్నో పనులు అతను చేయాల్సివచ్చేది. వాళ్ళు ఉన్న విధంగా బాగా ఉన్నారు. కాబట్టి యశోద కూడా రాధాతో పాటూ గోపికగా అయ్యింది, ఎందుకంటే ఇక కృష్ణుడు ఆమె కొడుకు కాదు.

పూతన

సద్గురు: కృష్ణుడు పుట్టినప్పుడు, ఆ నెలలో పుట్టిన పిల్లలు అందరినీ చంపమని కంసుడి చేత పంపబడిన పూతన, నిర్దాక్షణ్యంగా ఎంతో మంది పుట్టిన పసి పిల్లలను చంపుకుంటూ వెళ్ళింది. ఒకసారి తను కృష్ణుడిని కనిపెట్టిన తరువాత, తనకున్న మాయా శక్తులతో తనని తాను ఎంతో ఆకర్షణీయమైన స్త్రీ గా రూపం మార్చుకుంది. రాజఠీవితో ఆ ఇంటిలోకి అడుగు పెట్టిగానే, అందరూ ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. ఆమె పిల్లాడిని ఎత్తుకుంటాను అని అడిగింది. పిల్లాడిని ఎత్తుకుని, నడుచుకుంటూ వెళ్లి, బయట కూర్చుంది. ఆమె తన రోమ్ములకు విషాన్ని రాసి ఉంచి, పిల్లాడికి పాలిస్తున్నట్లు నాటించబోతుంది. ఆ రోజులలో పిల్లలకు పాలుపట్టగల ఏ స్త్రీ అయినా పాలు పట్టవచ్చు, ఆమె పిల్లాడికి సొంత తల్లే అవ్వాలనేమీ లేదు. అది ఆ పిల్లాడికి ఇస్తున్న ఒక గొప్ప అర్పణగా భావింపబడేది. ఆ రోజులలో గర్భనిరోధక మార్గాలు లేవు కాబట్టి చాలా మంది యువతులు పాలు ఇవ్వగలిగే స్థితిలో ఉండేవారు. ఒకరి పిల్లలకి ఒకరు పాలు ఇవ్వడం అనేది పెద్దగా చెయ్యరాని పనేమీ కాదు.

కాబట్టి పూతన విషం పూసిన రొమ్ములతో కృష్ణున్ని చంపడానికి వచ్చింది. కానీ తను అతన్ని చూసినప్పుడు, ఆ నీలి మాయ ఆమెని పట్టుకుంది. ఆమె ఆ పిల్లవాడి వైపు ఎంతగా ఆకర్షింపబడందంటే, ఉన్నట్టుండి ఆమెలోని మాతృత్వం పెల్లుబికింది. ఇక ఆమె ఆ బిడ్డకి విషం ఇవ్వాలనుకోలేదు. ఆమె నిజంగానే తనని తాను ఆ బిడ్డకి అంకితం చేసుకోవాలనుకుంది. తనలో తాను ఇలా అనుకుంది, “నేను కంసుడి ఆదేశం ప్రకారం నిన్ను చంపడానికి వచ్చాను. నా రోమ్ములకి విషం ఉంది, కానీ నా హృదయం నువ్వు నా పాలను మాత్రమె కాక, నా ప్రాణాన్ని కూడా తీసుకోవాలని కోరుకుంటుంది. నీకు పాలివ్వగలగడం నా భాగ్యం.” కాబట్టి అమితమైన ప్రేమతో, కానీ విషం పూసిన రొమ్ముతో, ఆమె పిల్లాడికి పాలిచ్చింది. కృష్ణుడు ఆమెలోనుంచి జీవాన్ని బైటకి లాగేసాడు. ఆమె అక్కడికక్కడే తన ముఖంపై ఒక పెద్ద చిరునవ్వుతో కిందపడి చనిపోయింది. ఆమె మనుసులో ఆఖరి ఆలోచన ఏంటంటే, “నా ప్రాణం ఆ పరమాత్మ చేతనే తీయబడింది. నాకు ఇంతకంటే ఏం కావాలి?”

ప్రేమాశీస్సులతో,
సద్గురు