ప్ర: యోగ మార్గంలో పొడిబారిన కన్నులకి ఏదైనా చికిత్స ఉందా?

సద్గురు: మిమ్మల్ని ఏడిపిస్తే సరిపోతుంది! సామాన్యంగా, పొడిబారిన కన్నులు అని అన్నప్పుడు, కన్నులు పూర్తిగా పొడి అయిపోవడం కాదు – కొంత కన్నీరు తగ్గటం మూలాన అలా పొడిగా అనిపిస్తుంది! మీకు ఏదైనా శస్త్ర చికిత్స జరిగినా లేక బాగు చెయ్యలేని హాని ఏదైనా కలిగినా, కంట్లో వేసుకోవటానికి చుక్కలు ఏ మందుల షాపులోనైనా దొరుకుతాయి. అలా కాకుండా ఏ తీవ్రమైన గాయమూ లేకుండా పొడిబారిన కన్నులు ఉంటే, వేరే చికిత్సలు ఉన్నాయి.

యోగాలో కొన్ని క్రియల ద్వారా కంటి భాష్ప గ్రంధులని సక్రియాత్మకం చెయ్యవచ్చు. కానీ ఉత్తమమైన పరిష్కారానికి, బూడిద గుమ్మడి కాయ చాలా శక్తి వంతమైనది. ఈ కాయ బయటి తోలు బూడిద రంగులో ఉంటుంది. దీన్ని తుడిస్తే బూడిద లాంటి పొడి వస్తుంది. అందుకనే దీన్ని బూడిద గుమ్మడి కాయ అంటారు. దీన్ని మీరు తురిమితే, తురుముతో పాటు రసం కూడా వస్తుంది. ఈ తురుముని రసంతో సహా మూసిన కంటి మీద చిన్న ముద్దలాగా వేసి ఒక 10 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత, ఆ తురుముని తీసేసి చన్నీళ్ళతో కడుక్కోవాలి. ఇలా చేయడం కొంత ఉపసమనం ఇస్తుంది.

ప్రేమాశీస్సులతో,

సద్గురు