దీపాలు వెలిగించడంలోని విశిష్టత ఏమిటి?

విద్యుద్దీపాలు ప్రజాదరణ పొందే వరకూ ప్రపంచవ్యాప్తంగా వివిధ సంప్రదాయాలు, సంస్కృతులలో నూనె దీపాలను వాడేవారు. ఈ నూనె దీపానికి వెలుగు, అందం ఇవ్వడానికి మించిన ప్రయోజనాలు ఉన్నాయని సద్గురు చెబుతున్నారు. ఆ ప్రయోజనాలు గురించి ఈ ఆర్టికల్ చదివి మరింత తెలుసుకోండి.
 
What is Devotion - A devotee in the Linga Bhairavi
 

విద్యుద్దీపాలు ప్రజాదరణ పొందే వరకూ ప్రపంచవ్యాప్తంగా వివిధ సంప్రదాయాలు, సంస్కృతులలో నూనె దీపాలను వాడేవారు. కాని, నేడువీటి ఉపయోగం కేవలం కొన్ని గృహాలలోఅలంకరణగా, అది కూడా నేత్రానందం  కలిగించడం వరకే పరిమితం అవుతున్నది. 

నూనె దీపానికి మన పరిసరాలకు వెలుగు, అందం ఇవ్వడానికి మించిన ప్రయోజనాలు ఉన్నాయని సద్గురు చెబుతున్నారు. ఈ నూనె దీపంతో మీరు మీ గృహంలో  సానుకూల శక్తినీ, పరిసరాలనూ, వాతావరణాన్నీ ఎలా సృష్టించుకోవచ్చు అన్న విషయాల గురించి ఈ  ఆర్టికల్ చదివి తెలుసుకోండి. 


సద్గురు: మన కళ్ళు తయారుచేయబడ్డ విధానాన్నిబట్టి  మన జీవితాల్లో వెలుగుకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఒకవేళ మన కళ్ళు గుడ్ల గూబల కళ్ళలా ఉండి ఉంటే, వెలుగు మనకి అంత ముఖ్యమైనది అయి ఉండేది కాదు.

నేడు మనకు విద్యుద్దీపాలు ఉన్నాయి. కాబట్టి దీపం అవసరమేమిటి అని మీరు అనుకోవచ్చు. కానీ కొన్ని సంవత్సారాల క్రితం సంగతిని ఊహించుకోండి, ఇంటి లోపల ఒక దీపం లేకుండా ఏమీ చేయలేరు. చారిత్రాత్మకంగా దీపం ముఖ్యంగా రెండు కారణాల వలన మన గృహాలలో ఒక అంతర్భాగం అయింది. ఒకటి, అప్పుడు విద్యుద్దీపాలు లేవు. రెండు, ఇళ్ళు కలప, తాటాకు వంటి సేంద్రీయ పదార్ధాలతో నిర్మించుకునేవారు. అందువలన వారు పెద్ద పెద్ద కిటికీలను పెట్టుకోలేక పోయేవారు. సాధారణంగా, పురాతన కాలంలో ఇళ్ళలో బాగా చీకటిగా ఉండేది. నేడు కూడా పల్లెటూర్లలో పాత ఇళ్లు, మురికివాడలు చీకటిగా ఉండడం మీరు చూసారా? అందుకనే ఆ కాలంలో పగటి సమయంలో కూడా దీపం పెట్టి ఉంచేవారు, సామాన్యంగా అదే పూజా స్ధలంగా ఉండేది.

సాంప్రదాయ పరంగా సరైన వాతావరణాన్ని సృష్టించడానికి చేసే మొదటి పని ఒక దీపాన్ని వెలిగించడం. కాకపోతే నేడు మనకు ఉన్న చాలా సమస్యల వలన మనము విద్యుద్దీపాలను వెలిగిస్తున్నాము. కానీ మీలో దీపాన్ని వెలిగించే అలవాటు ఉన్నవారు కేవలం దీపం చుట్టూ ఉండడం వల్ల ఎంతో తేడా అనిపిస్తుందని గమనించి ఉంటారు. మీరు ఏ దేవుడినీ నమ్మనవసరం లేదు. చీకటిగా ఉండక పోయినా, చూడటానికి అవసరం లేకపోయినా, మీరు దీపం వెలిగిస్తే కొంత తేడా ఉంటుందని గమనించారా? ఇది ఎందుకంటే మీరు దీపం వెలిగించిన మరుక్షణం కేవలం ఆ జ్వాల మాత్రమే కాదు, ఆ జ్వాల చుట్టూ ఒక గుండ్రని కనిపించని చక్రం లాంటి శక్తి వలయం సహజంగా ఏర్పడుతుంది.

ఎక్కడ ఇలాంటి శక్తి వలయం  ఉంటుందో అక్కడ మనుషుల మధ్య అన్యోన్యత, అనుబంధాలు బాగుంటాయి. మీరు మీ జీవితంలో ఎప్పుడైనా కాంప్ ఫైర్ చుట్టూ కూర్చున్నారా? మీరు కనుక కూర్చుని ఉంటే, ఆ సమయంలో చెప్పుకునే కధల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని మీరు గమనించారా? పాతకాలంలోనే కథలు చెప్పే వాళ్ళు దీన్ని అర్ధం చేసుకున్నారు. చలి మంట చుట్టూ చెప్పుకునే కథలు చాలా బలంగా మనస్సులో నాటుకు పోతాయి. వాటిని మనం చాలా సులభంగా  గ్రహించగలుగుతాం.

మీరు ఒక దీపాన్ని వెలిగించినప్పుడు, అది దృశ్య పరంగానే కాకుండా, పూర్తి ప్రదేశాన్ని ఒక భన్నమైన శక్తితో నింపుతుందన్న అవగాహన నుండి దీపం వెలిగంచే ఆచారం వచ్చింది.

కాబట్టి మనం ఏదైనా ప్రారంభించాలనుకుంటే, లేదా ఒక నిర్దిష్టమైన వాతావరణాన్ని సృష్టించాలనుకుంటే, ఒక దీపం వెలిగిస్తాం. ఒక దీపాన్ని వెలిగించినప్పుడు, అది దృశ్య పరంగానే కాకుండా, శక్తి పరంగా కూడా పూర్తి ప్రదేశాన్ని ఒక భిన్నమైన శక్తితో నింపుతుందన్న అవగాహన నుండి ఈ ఆచారం వచ్చింది. ఒక నూనె దీపాన్ని వెలిగించటంలో కొన్ని సూచనలు ఉన్నాయి. దీపాన్ని వెలిగించటానికి కొన్ని ప్రత్యేకమైన నూనెల వినియోగం ముఖ్యం.  ప్రత్యేకించి నువ్వుల నూనె, ఆముదం లేదా నెయ్యి, ఒక అనుకూల శక్తిని వెలువరిస్తాయి. ఆ శక్తికి దాని స్వంత శక్తి క్షేత్రం ఉంటుంది.

అగ్ని పలు విధాలుగా వెలుగుకి, జీవితానికి మూలం. ప్రతీకాత్మకంగా, మనం అగ్నిని జీవితం యొక్క మూలంగా చూస్తాము. నిజానికి, మీ జీవితమే అగ్ని అని చాలా భాషలలో ప్రస్తావిస్తారు. మీలోని అగ్నే మీరు జీవించటానికి కారణం. సూర్యుడు, ఈ గ్రహం మీద జీవానికి మూలం. అతనొక ఒక అగ్ని గోళం, అవునా, కాదా? మీరు ఒక విద్యుద్దీపాన్ని వెలిగించినా, స్టవ్ మీద వంట చేసినా , మీ కారులోని ఇంటర్నల్ కంబస్చన్ ఇంజిన్‌ని స్టార్ట్ చేసినా అది అంతా కూడా అగ్నే. అవునా, కాదా? ఈ ప్రపంచంలో జీవాన్ని నడిపేది అంతా కూడా అగ్నే. కాబట్టి అగ్నిని జీవానికి మూలంగా చూస్తాము. అది దాని చుట్టూ ఒక శక్తి క్షేత్రాన్ని సృష్టించుకుంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా అది మనకు అవసరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. కాబట్టి మీరు మీ రోజుని ప్రారంభించే ముందు దీపాన్ని వెలిగిస్తున్నారు అంటే మీరు అదే నాణ్యతని, గుణాన్ని మీలోకి తీసుకురావాలనుకుంటున్నారు. అది మీ స్వంత అంతర్గత స్వభావాన్ని ప్రేరేపించే ఒక విధానం.

ప్రేమాశిస్సులతో,
సద్గురు

 

 

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1